< నిర్గమకాండము 30 >

1 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “ధూపం వేయడానికి తుమ్మకర్రతో మందసాన్ని తయారు చెయ్యాలి.
Још начини олтар кадиони, од дрвета ситима начини га.
2 దాని పొడవు ఒక మూర, వెడల్పు ఒక మూర, ఎత్తు రెండు మూరలు ఉండాలి. అది చదరంగా ఉండాలి. దాని కొమ్ములు దానితో ఏకాండంగా ఉండాలి.
Дужина нека му буде лакат, и ширина лакат, четвороугласт да буде, и два лакта висок; из њега нека му излазе рогови.
3 దాని లోపల, బయటా నాలుగు పక్కలా స్వచ్ఛమైన బంగారం రేకు పొదిగించాలి. దాని అంచును బంగారంతో అలంకరించాలి.
И покуј га чистим златом, озго са страна унаоколо, и рогове његове; и начини му венац златан унаоколо.
4 దానికి బంగారంతో నాలుగు గుండ్రని కొంకీలు తగిలించి, ఒక వైపు రెండు కమ్మీలు, ముందు భాగంలో రెండు గుండ్రని కమ్మీలు ఉండేలా దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించాలి.
И начини му по два биочуга златна испод венца на два угла његова с обе стране, и кроз њих ћеш провући полуге да се може носити.
5 తుమ్మకర్రతో మందసాన్ని మోసే కర్రలు సిద్ధం చేసి వాటికి బంగారం రేకులు పొదిగించాలి.
А полуге начини од дрвета ситима, и окуј их у злато.
6 వేదికను శాసనాల పెట్టెకు ముందు ఉన్న తెర బయట, శాసనాలపై ప్రాయశ్చిత్త స్థానం ఎదురుగా ఉంచాలి. అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను.
И метни га пред завес који виси пред ковчегом од сведочанства према заклопцу који је над сведочанством, где ћу се с тобом састајати.
7 అహరోను ఆ వేదికపై పరిమళ ద్రవ్యాల ధూపం వెయ్యాలి. అతడు ప్రతిరోజూ ఉదయం దీపాలను సర్దే సమయంలో దాని మీద ధూపం వెయ్యాలి.
И нека кади на њему Арон кадом мирисним; свако јутро нека кади кад спреми жишке.
8 అలాగే సాయంత్రాలు అహరోను దీపాలు వెలిగించే సమయంలో కూడా వేదికపై ధూపం వెయ్యాలి. యెహోవా సన్నిధిలో మీ తరతరాలకూ నిత్యంగా ఆ ధూపం ఉండాలి.
И кад запали Арон жишке увече, нека кади; нека буде кад свагдашњи пред Господом од колена до колена вашег.
9 దాని మీద నిషిద్ధమైన వేరే ధూపాలు వెయ్యకూడదు. హోమాన్ని గానీ, నైవేద్య ద్రవ్యాలను గానీ అర్పించకూడదు. పానార్పణలు అర్పించ కూడదు.
Не приносите на њему кад туђи нити жртву паљеницу нити принос; ни налив не лијте на њему.
10 ౧౦ అహరోను ఆ వేదిక కొమ్ముల మీద సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్తం చెయ్యాలి. పాప పరిహారార్థబలి రక్తంతో దాని కొమ్ముల కోసం ప్రాయశ్చిత్తం చెయ్యాలి. మీ తరతరాలకూ సంవత్సరానికి ఒకసారి అతడు వేదిక కోసం ప్రాయశ్చిత్తం చెయ్యాలి. అది యెహోవాకు అతి పవిత్రమైనదిగా ఉంటుంది.”
Само очишћење нека чини над роговима његовим Арон једном у години; крвљу од жртве за грех у дан очишћења једном у години чиниће очишћења на њему од кољена до кољена вашег; јер је то светиња над светињама Господу.
11 ౧౧ యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు,
Још рече Господ Мојсију говорећи:
12 ౧౨ “నువ్వు ఇశ్రాయేలు ప్రజల సంఖ్య లెక్కబెట్టాలి. వాళ్ళను లెక్కించే సమయానికి తమపై ఎలాంటి కీడు రాకుండా ప్రతి ఒక్కరూ తమ ప్రాణం కోసం విడుదల పరిహార ధనం యెహోవాకు చెల్లించాలి.
Кад станеш бројати синове Израиљеве, између оних који иду у број сваки нека даде откуп за живот свој Господу, кад их станеш бројати, да не би дошло на њих какво зло кад их станеш бројати.
13 ౧౩ జాబితాలో నమోదు అయిన ప్రతివాడూ అర తులం వెండి చెల్లించాలి. పవిత్ర స్థలం లెక్క చొప్పున పూర్తి బరువు ఇవ్వాలి. యెహోవాకు అర్పణగా దాన్ని చెల్లించాలి.
А нека да сваки који иде у број пола сикла, по сиклу светом (а тај је сикал двадесет новчића); пола сикла биће прилог Господу.
14 ౧౪ ఇరవై సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్ళంతా జన సంఖ్యలో నమోదు కావాలి. జన సంఖ్యలో చేర్చే ప్రతి ఒక్కరూ యెహోవాకు అర్పణ చెల్లించాలి.
Ко год иде у бој, од двадесет година и више, нека да прилог Господу.
15 ౧౫ విడుదల పరిహార ధనంగా యెహోవాకు మీరు చెల్లించే అర్పణ ధనవంతుడైనా, పేదవాడైనా సమానంగా ఉండాలి. ఇద్దరూ అర తులం చొప్పున చెల్లించాలి.
Богати да не да више а сиромах да не да мање од по сикла, кад дају прилог Господу на очишћење душа ваших.
16 ౧౬ ఇశ్రాయేలు ప్రజలు విడుదల పరిహార ధనంగా చెల్లించిన వెండిని సన్నిధి గుడారం సేవ కోసం ఉపయోగించాలి. అది ప్రాయశ్చిత్త పరిహారంగా ప్రజల పక్షంగా యెహోవా సన్నిధానంలో ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకార్ధంగా ఉంటుంది.”
И узевши новце за очишћење од синова Израиљевих остави их за потребу у шатору од састанка, и биће синовима Израиљевим спомен пред Господом за очишћење душа ваших.
17 ౧౭ యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు. “నువ్వు ఇత్తడితో ఒక గంగాళం సిద్ధం చేసి ఇత్తడి పీటపై ఉంచాలి.
Још рече Господ Мојсију говорећи:
18 ౧౮ సన్నిధి గుడారానికి, బలిపీఠానికి మధ్యలో ఆ గంగాళం ఉంచి దాన్ని నీళ్లతో నింపాలి.
Начини и умиваоницу од бронзе и подножје јој од бронзе за умивање; и метни је између шатора од састанка и олтара, и налиј у њу воде.
19 ౧౯ ఆ నీళ్లతో అహరోను, అతని కొడుకులు తమ కాళ్ళు, చేతులు కడుక్కోవాలి.
Да из ње пере Арон и синови његови руке своје и ноге своје.
20 ౨౦ వాళ్ళు సన్నిధి గుడారం లోపలికి వెళ్ళే సమయంలో చనిపోకుండా ఉండేలా నీళ్ళతో తమను శుభ్రం చేసుకోవాలి. సేవ చేయడానికి బలిపీఠం సమీపించి యెహోవాకు హోమం అర్పించే ముందు వారు నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. అలా చెయ్యని పక్షంలో చనిపోతారు.
Кад иду у шатор од састанка, нека се умивају водом, да не изгину, или кад приступају к олтару да служе и да пале жртву огњену Господу.
21 ౨౧ వాళ్ళు చనిపోకుండా ఉండేలా తమ కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. ఇది వారికి, అంటే అహరోనుకి, అతని సంతానానికి, తరతరాలకు నిలిచి ఉండే చట్టం.”
Тада нека перу руке своје и ноге своје да не изгину. То нека им буде уредба вечна Арону и семену његовом од колена до колена.
22 ౨౨ యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు,
Још рече Господ Мојсију говорећи:
23 ౨౩ “నువ్వు సుగంధ ద్రవ్యాల్లో ముఖ్యమైన వాటిని తీసుకుని అభిషేకం చెయ్యాలి. పవిత్ర స్థలానికి సంబంధించిన కొలతల ప్రకారం స్వచ్ఛమైన గోపరసం 500 షెకెల్, సుగంధం గల దాల్చిన చెక్క సగం అంటే 250 షెకెల్,
Узми мириса најбољих: смирне најчистије пет стотина сикала и цимета мирисавог пола толико, двеста педесет, и иђирота такође двеста педесет,
24 ౨౪ నిమ్మగడ్డి నూనె 250 షెకెల్, లవంగిపట్ట 500 షెకెల్, మూడు పాళ్ళు ఒలీవ నూనె తీసుకోవాలి.
И касије пет стотина мером светом, и уља маслиновог један ин.
25 ౨౫ పరిమళ ద్రవ్యాలు మిళితం చేసే నిపుణుడైన పనివాడి చేత పరిమళ ద్రవ్యం సిద్ధపరచాలి. అది యెహోవాకు ప్రతిష్ఠి అభిషేక తైలం అవుతుంది.
И од тога начини уље за свето помазање, уље најбоље вештином апотекарском; то да буде уље светог помазања.
26 ౨౬ ఆ తైలంతో నువ్వు సన్నిధి గుడారాన్ని అభిషేకించాలి. దానితోపాటు సాక్ష్యపు గుడారాన్ని,
И њим помажи шатор од састанка и ковчег од сведочанства,
27 ౨౭ సన్నిధి బల్లను, దాని సామగ్రిని, దీపస్తంభాన్ని, దాని సామగ్రిని,
И сто и све справе његове, и свећњак и справе његове, и олтар кадиони,
28 ౨౮ హోమ బలిపీఠాన్ని, దాని సామగ్రిని, గంగాళాన్ని, దాని పీటను అభిషేకించాలి.
И олтар на коме се приноси жртва паљеница, и све справе његове, и умиваоницу и подножје њено.
29 ౨౯ అవన్నీ అతి పవిత్రమైనవిగా ఉండేలా వాటిని పవిత్రపరచాలి. వాటికి తగిలే ప్రతి వస్తువూ పవిత్రం అవుతుంది.
Тако ћеш их осветити, те ће бити светиња над светињом, и шта их се год дотакне биће свето.
30 ౩౦ అహరోను, అతని కొడుకులు నాకు యాజకులై నాకు సేవ చేసేలా వాళ్ళను అభిషేకించి ప్రతిష్ఠించాలి.
Помажи и Арона и синове његове, и осветићеш их да ми буду свештеници.
31 ౩౧ నీవు ఇశ్రాయేలు ప్రజలతో, ‘ఇది మీ తరతరాలకు నాకు పవిత్ర అభిషేక తైలంగా ఉండాలి.
А синовима Израиљевим кажи и реци: Ово нека ми буде уље светог помазања од колена до колена вашег.
32 ౩౨ దాన్ని యాజకులు కాని వాళ్ళ మీద పోయకూడదు. దాని పాళ్ళ ప్రకారం అలాంటి వేరే దాన్ని చెయ్యకూడదు. అది పవిత్రమైనది. దాన్ని మీరు పవిత్రంగా ఎంచాలి.
Тело човечје нека се не маже њим, нити правите такво уље какво је оно; свето је, нека вам буде свето.
33 ౩౩ దాని వంటి దాన్ని కలిపే వాణ్ణి గానీ, యాజకుడు కాని వారిపై దాన్ని చల్లే వాణ్ణి గానీ తన ప్రజల్లో లేకుండా చెయ్యాలి’ అని చెప్పు.”
Ако ли би ко начинио тако уље или намазао њим другог, истребиће се из народа свог.
34 ౩౪ యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు “నువ్వు జటామాంసి, గోపిచందనం, గంధం, సాంబ్రాణి సమపాళ్ళలో తీసుకుని వాటితో పరిమళ ద్రవ్యాలను, ధూపద్రవ్యం సిద్ధపరచాలి.
И рече Господ Мојсију: Узми мириса, стакте, ониха и халвана мирисавог, и тамјана чистог, колико једног толико другог.
35 ౩౫ పరిమళ ద్రవ్యాల నిపుణుడైన పనివాడు దాన్ని కలపాలి. దానికి ఉప్పు కలపాలి. ఆ ధూప మిబాధం స్వచ్ఛమైనదిగా, పవిత్రంగా ఉంటుంది.
И од тога начини кад, састављен вештином апотекарском, чист и свет.
36 ౩౬ దానిలో కొంచెం పొడి తీసి నేను నిన్ను కలుసుకొనే సన్నిధి గుడారంలో శాసనాల మందసం ఎదుట ఉంచాలి. మీరు దాన్ని పరిశుద్ధమైనదిగా భావించాలి.
И истуцавши га наситно, метаћеш га пред сведочанством у шатору од састанка, где ћу се састајати с тобом; то нека вам буде светиња над светињама.
37 ౩౭ నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యాల వంటి ధూపాలను మీ కోసం కలుపుకోకూడదు. అది కేవలం యెహోవాకు ప్రత్యేకమైనది అని భావించాలి.
А такав кад какав начиниш немојте себи правити; то нека ти је светиња за Господа.
38 ౩౮ దాని వాసన చూద్దామని అలాంటి దాన్ని తయారు చేసేవాణ్ణి ప్రజల్లో లేకుండా చెయ్యాలి.”
Ако ли би ко начинио такав да га мирише, истребиће се из народа свог.

< నిర్గమకాండము 30 >