< నిర్గమకాండము 3 >
1 ౧ మోషే మిద్యానులో యాజకుడైన తన మామ యిత్రో మందను మేపుతున్నాడు. ఆ మందను అరణ్యం అవతలి వైపుకు తోలుకుంటూ దేవుని పర్వతం హోరేబుకు వచ్చాడు.
Musa bolsa ⱪeynatisi Midiyanning kaⱨini Yǝtroning ⱪoy padisini baⱪatti. U ⱪoylarni baxlap qɵlning ǝng qetigǝ Hudaning teƣi, yǝni Ⱨorǝb teƣining baƣriƣa kǝldi.
2 ౨ అక్కడ ఒక పొద మధ్య నుండి అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. మోషే చూస్తూ ఉండగా అగ్నిలో ఆ పొద మండుతూ ఉంది గానీ పొద కాలిపోవడం లేదు.
Xu yǝrdǝ bir azƣanliⱪtin ɵrlǝp qiⱪiwatⱪan ot yalⱪuni iqidin Pǝrwǝrdigarning Pǝrixtisi uningƣa kɵründi. Mana, azƣanliⱪ otta kɵyüwatⱪan bolsimu, lekin azƣan ɵzi kɵyüp kǝtmigǝnidi.
3 ౩ అప్పుడు మోషే ఆ పొద ఎందుకు కాలిపోవడం లేదో, ఆ వింత ఏమిటో ఆ వైపుకు వెళ్లి చూద్దాం అనుకున్నాడు.
Musa: — Mǝn berip, bu ajayip mǝnzirini kɵrüp baⱪay; azƣanliⱪ nemixⱪa kɵyüp kǝtmǝydiƣandu? — dǝp oylidi.
4 ౪ దాన్ని చూద్దామని అతడు ఆ వైపుకు రావడం యెహోవా చూశాడు. ఆ పొద మధ్య నుండి దేవుడు “మోషే, మోషే” అని అతణ్ణి పిలిచాడు. అప్పుడు అతడు “చిత్తం ప్రభూ” అన్నాడు.
Pǝrwǝrdigar uning buni kɵrgili yoldin qǝtnǝp [azƣanliⱪⱪa] kǝlginini kɵrdi; Huda azƣanliⱪ iqidin uni: — Musa! Musa! — dǝp qaⱪirdi. U: Mana mǝn! — dǝp jawab bǝrdi.
5 ౫ అందుకు ఆయన “దగ్గరికి రావద్దు. నీ కాళ్ళకున్న చెప్పులు తీసెయ్యి. నువ్వు నిలబడి ఉన్న ప్రదేశం పవిత్రమైనది” అన్నాడు.
U uningƣa: — Bu yǝrgǝ yeⱪin kǝlmǝ; putliringdin kǝxingni salƣin; qünki sǝn turƣan bu yǝr muⱪǝddǝs jaydur.
6 ౬ ఆయన ఇంకా “నేను నీ పూర్వికులు అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి” అని చెప్పగా మోషే తన ముఖం కప్పుకుని దేవుని వైపు చూసేందుకు భయపడ్డాడు.
Mǝn atangning Hudasi, Ibraⱨimning Hudasi, Isⱨaⱪning Hudasi wǝ Yaⱪupning Hudasidurmǝn, — dedi. Buni anglap Musa Hudaƣa ⱪaraxtin ⱪorⱪup, yüzini etiwaldi.
7 ౭ యెహోవా ఇలా చెప్పాడు. “ఐగుప్తులో ఉంటున్న నా ప్రజలు పడుతున్న బాధలు నాకు తెలుసు. కఠినమైన పనులు చేయిస్తూ వారిని బాధపెడుతున్న వారిని బట్టి వారు పెడుతున్న మొర నేను విన్నాను. వారి దుఃఖం నాకు తెలుసు.
Pǝrwǝrdigar uningƣa mundaⱪ dedi: — Bǝrⱨǝⱪ, Mǝn Misirda turuwatⱪan ⱪowmimning tartiwatⱪan azab-oⱪubǝtlirini kɵrdum, nazarǝtqilǝrning ularni [harlawatⱪanliⱪidin] ⱪilƣan pǝryadini anglidim; qünki Mǝn ularning dǝrdlirini bilimǝn.
8 ౮ కనుక ఐగుప్తీయుల చేతిలో నుండి నా ప్రజలను విడిపించి, ఆ దేశం నుండి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు యెబూసీయులు నివసిస్తున్న చాలా సారవంతమైన, విశాలమైన మంచి దేశానికి వారిని నడిపించడానికి నేను దిగి వచ్చాను.
Xunga Mǝn ularni misirliⱪlarning ⱪolidin ⱪutⱪuzup, xu zemindin qiⱪirip, yahxi ⱨǝm kǝng bir zeminƣa, süt bilǝn ⱨǝsǝl eⱪip turidiƣan bir zeminƣa, yǝni Ⱪanaaniy, Ⱨittiy, Amoriy, Pǝrizziy, Ⱨiwiylar wǝ Yǝbusiylarning yurtiƣa elip berixⱪa qüxtüm.
9 ౯ నిజంగా ఇశ్రాయేలు ప్రజల మొర నేను విన్నాను. ఐగుప్తీయులు వారి పట్ల జరిగిస్తున్న హింసాకాండను చూశాను.
Mana ǝmdi Israillarning nalǝ-pǝryadi Manga yǝtti, misirliⱪlarning ularƣa ⱪandaⱪ zulum ⱪilƣanliⱪinimu kɵrdüm.
10 ౧౦ నువ్వు సిద్ధపడు. నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను. నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించాలి.”
Əmdi sǝn kǝl, Mǝn seni hǝlⱪim Israillarni Misirdin elip qiⱪirix üqün Pirǝwnning aldiƣa ǝwǝtimǝn, — dedi.
11 ౧౧ అప్పుడు మోషే దేవునితో “ఫరో దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించడానికి నేను ఏపాటి వాణ్ణి?” అని అన్నాడు.
Lekin Musa Hudaƣa: — Mǝn kim idim, Pirǝwnning aldiƣa berip Israillarni Misirdin qiⱪiraliƣudǝk? — dedi.
12 ౧౨ దేవుడు “నువ్వు ఆ ప్రజలను ఐగుప్తు నుండి తీసుకు వచ్చిన తరువాత మీరు ఈ కొండపై దేవుణ్ణి ఆరాధిస్తారు. కచ్చితంగా నేను నీకు తోడుగా ఉంటాను. నేను నిన్ను పంపించాను అని చెప్పడానికి ఇదే సూచన” అన్నాడు.
U jawab berip: — Bǝrⱨǝⱪ, Mǝn sǝn bilǝn billǝ bolimǝn; sǝn ⱪowmni Misirdin elip qiⱪⱪandin keyin bu taƣda Hudaƣa ibadǝt ⱪilisilǝr; bu ix mana ɵzünggǝ Mening seni ǝwǝtkinimning ispat-bǝlgisi bolidu, — dedi.
13 ౧౩ మోషే “నేను ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్లి వారితో మీ పూర్వీకుల దేవుడు మీ దగ్గరికి నన్ను పంపించాడని చెప్పినప్పుడు వారు ‘ఆయన పేరేమిటి?’ అని అడిగితే వారితో నేనేం చెప్పాలి?” అని దేవుణ్ణి అడిగాడు.
Xuning bilǝn Musa Hudaƣa: — Mǝn Israillarning ⱪexiƣa berip ularƣa: «Ata-bowiliringlarning Hudasi meni ⱪexinglarƣa ǝwǝtti» desǝm, ular mǝndin: «Uning nami nemǝ?» — dǝp sorisa, ularƣa nemǝ dǝp jawab berimǝn? — dedi.
14 ౧౪ అందుకు దేవుడు “నేను శాశ్వతంగా ఉన్నవాణ్ణి, అనే పేరు గల వాణ్ణి. ఉన్నవాడు అనే ఆయన నన్ను మీ దగ్గరికి పంపించాడు, అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు” అని మోషేతో చెప్పాడు.
Huda Musaƣa: — Mǝn «Əzǝldin bar Bolƣuqi»durmǝn — dedi. Andin U: — Berip, Israillarƣa: ««Əzǝldin bar Bolƣuqi» meni ⱪexinglarƣa ǝwǝtti» dǝp eytⱪin, dedi.
15 ౧౫ దేవుడు మోషేతో ఇంకా “మీ పూర్వీకుల దేవుడు యెహోవా, అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు యెహోవా మీ దగ్గరికి నన్ను పంపించాడు అని నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాలి. చిరకాలం నిలిచి ఉండే, తరతరాలకు జ్ఞాపకముండే నా పేరు ఇదే.
Huda Musaƣa yǝnǝ: — Israillarƣa: — «Ata-bowiliringlarning Hudasi, Ibraⱨimning Hudasi, Isⱨaⱪning Hudasi wǝ Yaⱪupning Hudasi bolƣan «Yaⱨwǝⱨ» meni ⱪexinglarƣa ǝwǝtti; U: [Yaⱨwǝⱨ degǝn] bu nam ǝbǝdgiqǝ Mening namim bolidu, dǝwrdin-dǝwrgiqǝ Mǝn xu nam bilǝn ǝskǝ elinimǝn, dǝydu» — degin.
16 ౧౬ నువ్వు వెళ్లి ఇశ్రాయేలు పెద్దలను సమకూర్చి ‘మీ పూర్వీకుల దేవుడు యెహోవా, అంటే అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు కనబడి ఇలా చెప్పాడు, నేను ఐగుప్తులో మీకు జరుగుతున్నదంతా చూశాను.
— Berip, Israilning aⱪsaⱪallirini yiƣip ularƣa: — «Ata-bowiliringlarning Hudasi, yǝni Ibraⱨim, Isⱨaⱪ wǝ Yaⱪupning Hudasi bolƣan Pǝrwǝrdigar manga kɵrünüp: — Mǝn silǝrni yoⱪlap kǝldim, Misirda silǝrgǝ ⱪandaⱪ muamilǝ ⱪiliniwatⱪanliⱪini kɵrdüm;
17 ౧౭ ఐగుప్తులో మీరు పడుతున్న బాధల నుండి విడిపించి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసిస్తున్న పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకువస్తాను’ అని చెప్పాడని వారితో చెప్పు.
xuning üqün sɵzüm xudurki, Mǝn silǝrni Misirning zulumidin qiⱪirip, Ⱪanaaniylar, Ⱨittiylar, Amoriylar, Pǝrizziylǝr, Ⱨiwiylar wǝ Yǝbusiylarning zemini, yǝni süt bilǝn ⱨǝsǝl eⱪip turidiƣan zeminƣa elip barimǝn, dedi, — degin, dedi.
18 ౧౮ వాళ్ళు నీ మాట వింటారు గనక నువ్వూ, ఇశ్రాయేలు ప్రజల పెద్దలూ ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్లి, అతనితో, హెబ్రీయుల దేవుడు యెహోవా మాకు ప్రత్యక్షమయ్యాడు, మేము అడవిలోకి మూడు రోజుల ప్రయాణమంత దూరం ప్రయాణించి మా దేవుడు యెహోవాకు బలులు అర్పిస్తాం, మాకు అనుమతి ఇవ్వు, అని అతనితో చెప్పాలి.
— Xuning bilǝn ular sening sɵzünggǝ ⱪulaⱪ salidiƣan bolidu. U waⱪitta sǝn, ɵzüng wǝ Israilning aⱪsaⱪalliri bilǝn birgǝ Misir padixaⱨining aldiƣa berip, uningƣa: «Ibraniylarning Hudasi Pǝrwǝrdigar biz bilǝn kɵrüxti. Əmdi sizdin ɵtünimizki, bizgǝ üq künlük yolni besip, qɵlgǝ berip, Hudayimiz Pǝrwǝrdigarƣa ⱪurbanliⱪ ⱪilixⱪa ijazǝt bǝrgǝysiz» — dǝnglar.
19 ౧౯ ఐగుప్తు రాజు తన గొప్ప సైన్యంతో మిమ్మల్ని అడ్డగించి వెళ్ళనీయకుండా చేస్తాడని నాకు తెలుసు.
Lekin Misir padixaⱨining ⱨǝtta ⱪudrǝtlik bir ⱪolning astida turupmu, silǝrni yǝnila ⱪoyup bǝrmǝydiƣinini bilimǝn.
20 ౨౦ అయితే నేను నా చెయ్యి చాపి ఐగుప్తు దేశంలో నేను చేయాలనుకున్న నా అద్భుత కార్యాలను చూపించి అతడి ప్రయత్నాలను భంగపరుస్తాను. ఆ తరువాత అతడు మిమ్మల్ని వెళ్ళనిస్తాడు.
Xunga ⱪolumni uzitip, misirliⱪlarni Mǝn ɵz zemini iqidǝ kɵrsǝtmǝkqi bolƣan ⱨǝrhil karamǝt-mɵjizilirim bilǝn urimǝn; andin [Pirǝwn] silǝrni ⱪoyup beridu.
21 ౨౧ మీరు ఐగుప్తును విడిచి వెళ్ళే సమయంలో ఖాళీ చేతులతో వెళ్ళరు. ఎందుకంటే ప్రజల పట్ల ఐగుప్తు వారికి మంచి మనస్సు కలిగేలా చేస్తాను.
Bu ⱪowmni misirliⱪlarning aldida iltipat tapturimǝn wǝ xuning bilǝn xundaⱪ boliduki, silǝr xu yǝrdin qiⱪⱪininglarda, ⱪuruⱪ ⱪol qiⱪmaysilǝr.
22 ౨౨ ప్రతి స్త్రీ తన దగ్గర ఉన్న స్త్రీని, తన యజమానురాలిని వెండి, బంగారు నగలు, దుస్తులు ఇమ్మని అడగాలి. వాటిని తీసుకుని మీ కొడుకులకు, కూతుళ్ళకు ధరింపజేయాలి. ఈ విధంగా మీరు ఐగుప్తు దేశ ప్రజలను కొల్లగొడతారు” అన్నాడు.
Bǝlki ⱨǝrbir ayal kixi ɵz ⱪoxnisidin wǝ ɵz ɵyidǝ olturuxluⱪ yat ayaldin kümüx zinnǝt buyumliri, altun zinnǝt buyumliri wǝ kiyim-keqǝklǝrni tǝlǝp ⱪilidu. Bu nǝrsilǝrni oƣul-ⱪizliringlarƣa taⱪaysilǝr, kiydürisilǝr; xu tǝriⱪidǝ misirliⱪlardin olja alƣan bolisilǝr, — dedi.