< నిర్గమకాండము 28 >
1 ౧ “నాకు యాజకత్వం చేయడానికి నీ సోదరుడు అహరోనును అతని కొడుకులు నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయుల్లో నుండి నీ దగ్గరికి పిలిపించు.
“Con hãy tấn phong cho A-rôn, anh con, và các con trai A-rôn—Na-đáp, A-bi-hu, Ê-lê-a-sa, Y-tha-ma làm chức thầy tế lễ để họ phụng thờ Ta.
2 ౨ అతనికి గౌరవం, వైభవం కలిగేలా నీ సోదరుడు అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రాలు కుట్టించాలి.
Hãy may lễ phục thánh thật trang trọng và đẹp cho A-rôn.
3 ౩ అహరోను నాకు యాజక సేవ జరిగించేలా నీవు అతణ్ణి ప్రత్యేక పరచడం కోసం అతని దుస్తులు కుట్టించాలి. నేను జ్ఞానాత్మతో నింపిన నిపుణులు అందరికీ ఆజ్ఞ జారీ చెయ్యి.
Hãy truyền cho tất cả những người có tài năng, những người mà Ta đã ban ơn khôn ngoan, may áo lễ cho A-rôn, để biệt riêng người cho chức vụ thánh.
4 ౪ వారు కుట్టవలసిన దుస్తులు ఇవి. వక్ష పతకం, ఏఫోదు, నిలువుటంగీ, రంగు దారాలతో కుట్టిన చొక్కా, తల పాగా, నడికట్టు. అతడు నాకు యాజకుడై యుండేలా వారు నీ సోదరుడు అహరోనుకు, అతని కుమారులకు ప్రతిష్ఠిత దుస్తులు కుట్టించాలి.
Bộ áo lễ này gồm có bảng đeo ngực, ê-phót, áo dài, áo lót ngắn tay có kẻ ô vuông, khăn đội đầu và dây thắt lưng. Họ cũng sẽ may áo lễ cho anh con A-rôn, và các con trai người mặc khi họ thi hành chức vụ tế lễ cho Ta.
5 ౫ కళాకారులు బంగారు, నీల, ధూమ్ర, రక్త వర్ణాలు గల నూలును సన్ననారను దీనికి ఉపయోగించాలి.
Họ sẽ dùng vải gai mịn, chỉ kim tuyến, chỉ xanh, tím, và đỏ.”
6 ౬ బంగారం నీల ధూమ్ర రక్త వర్ణాల ఏఫోదును పేనిన సన్న నారతో కళాకారుని నైపుణ్యంతో చెయ్యాలి.
“Thợ thủ công phải may Ê-phót bằng vải gai mịn, thêu kim tuyến chỉ xanh, tím, và đỏ, một cách tinh vi khéo léo.
7 ౭ రెండు భుజాలకు సరిపడేలా రెండు పై అంచుల్లో కూర్చిన పట్టీలు దానికి ఉండాలి.
Ê-phót gồm hai vạt, nối liền nhau bằng hai cầu vai.
8 ౮ ఏఫోదుపై ధరించడానికి పనితనంతో చేసిన నడికట్టు ఏకాండంగా ఉండి, బంగారంతో, నీల, ధూమ్ర, రక్త వర్ణాల నూలుతో, పేనిన సన్ననారతో కుట్టాలి.
Dây để thắt ê-phót cũng được may bằng vải gai mịn, thêu bằng các loại chỉ dùng để thêu ê-phót.
9 ౯ నీవు రెండు లేత పచ్చలను తీసుకుని వాటి మీద ఇశ్రాయేలీయుల పేర్లను అంటే వారి పుట్టుక క్రమం చొప్పున
Lấy hai viên bạch ngọc khắc tên của các con trai Ít-ra-ên trên đó,
10 ౧౦ ఒక రత్నం మీద ఆరు పేర్లు, రెండవ రత్నం మీద తక్కిన ఆరు పేర్లను చెక్కించాలి.
mỗi viên khắc sáu tên, theo thứ tự ngày sinh.
11 ౧౧ ముద్ర మీద చెక్కిన పనిలాగా ఆ రెండు రత్నాలపై ఇశ్రాయేలీయుల పేర్లు చెక్కి బంగారు కుదురుల్లో వాటిని పొదగాలి.
Khắc các tên này theo lối khắc con dấu, rồi đem nhận hai viên bạch ngọc vào hai khung vàng.
12 ౧౨ అప్పుడు ఇశ్రాయేలీయులకు స్మారక సూచకమైన ఆ రెండు రత్నాలను ఏఫోదు భుజాలపై నిలపాలి. ఆ విధంగా అహరోను తన రెండు భుజాలపై యెహోవా సన్నిధిలో జ్ఞాపక సూచనగా ఆ పేర్లను ధరిస్తాడు.
Gắn hai viên ngọc này trên hai vai ê-phót để làm ngọc tưởng niệm các con Ít-ra-ên. A-rôn sẽ mang tên của những người này để làm kỷ niệm trước mặt Chúa Hằng Hữu.
13 ౧౩ బంగారు కుదురులను తయారు చెయ్యాలి.
Làm hai sợi dây chuyền bằng vàng ròng xoắn hình trôn ốc,
14 ౧౪ మేలిమి బంగారంతో రెండు అల్లిక గొలుసులను చెయ్యాలి. ఆ అల్లిక పనికి అల్లిన గొలుసులను తగిలించాలి.
đem nối vào các khung vàng trên vai ê-phót.”
15 ౧౫ కళాకారుని నైపుణ్యంతో న్యాయనిర్ణయ పతకాన్ని చెయ్యాలి. ఏఫోదు పని లాగా దాన్ని చెయ్యాలి. బంగారంతో, నీల ధూమ్ర రక్త వర్ణాల నూలుతో పేనిన సన్ననారతో దాన్ని చెయ్యాలి.
“Bảng đeo ngực ‘Công Lý’ cũng được làm bằng vải gai mịn thêu kim tuyến và chỉ xanh, tím, và đỏ một cách tinh vi khéo léo, như cách làm ê-phót vậy.
16 ౧౬ నలుచదరంగా ఉన్న ఆ పతకాన్ని మడత పెట్టాలి. దాని పొడవు జానెడు, వెడల్పు జానెడు ఉండాలి.
Bảng này hình vuông, mỗi cạnh một gang tay, may bằng hai lớp vải.
17 ౧౭ దానిలో నాలుగు వరసల్లో రత్నాలుండేలా రత్నాల కుదుర్లు చెయ్యాలి. మొదటి వరస మాణిక్యం, గోమేధికం, మరకతం.
Gắn bốn hàng ngọc trên bảng. Hàng thứ nhất gồm: Hồng mã não, hoàng ngọc, và ngọc lục bảo.
18 ౧౮ రెండో వరస పద్మరాగం, నీలం, వజ్రం.
Hàng thứ hai gồm: Bích ngọc, lam ngọc, và kim cương.
19 ౧౯ మూడవది గారుత్మతం, యష్మురాయి, ఇంద్రనీలం.
Hàng thứ ba gồm: Ngọc phong tín, ngọc mã não, và ngọc thạch anh tím.
20 ౨౦ నాలుగవ వరస గరుడ పచ్చ, సులిమాని రాయి, సూర్యకాంతం. వాటిని బంగారు కుదురుల్లో పొదగాలి.
Hàng thứ tư gồm: Lục ngọc thạch, bạch ngọc, và vân ngọc. Các ngọc này đều được nhận vào khung vàng.
21 ౨౧ ఆ రత్నాలపై ఇశ్రాయేలీయుల పేర్ల ప్రకారం పన్నెండు పేర్లు ఉండాలి. ముద్ర మీద చెక్కినట్టు వారిలో ఒక్కొక్క పేరు చొప్పున పన్నెండు గోత్రాల పేర్లు ఉండాలి.
Vậy, mười hai viên ngọc tượng trưng cho mười hai đại tộc Ít-ra-ên. Tên của các đại tộc được khắc trên ngọc theo lối khắc con dấu.
22 ౨౨ ఆ పతకాన్ని అల్లిక పనిగా పేనిన గొలుసులతో మేలిమి బంగారంతో చెయ్యాలి.
Hãy làm hai sợi dây chuyền bằng vàng ròng xoắn hình trôn ốc.
23 ౨౩ పతకానికి రెండు బంగారు రింగులు చేసి
Cũng làm hai khoen vàng, gắn vào hai góc của bảng đeo ngực.
24 ౨౪ ఆ రెండు రింగులను పతకపు రెండు కొసలకు అల్లిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలించాలి.
Mỗi dây chuyền có một đầu nối với hai khoen vàng này
25 ౨౫ అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు కుదురులకు తగిలించి ఏఫోదు ముందు వైపు భుజాలపై కట్టాలి.
và một đầu nối với góc ngoài của hai khung vàng có nhận hai viên bạch ngọc trên vai ê-phót.
26 ౨౬ నీవు బంగారంతో రెండు రింగులు చేసి ఏఫోదు ముందు భాగంలో పతకం లోపలి అంచున దాని రెండు కొసలకు వాటిని తగిలించాలి.
Làm thêm bốn khoen vàng, hai khoen gắn ở góc trong, bên dưới của bảng đeo ngực.
27 ౨౭ నీవు రెండు బంగారు రింగులు చేసి ఏఫోదు నమూనా ప్రకారం చేసిన నడికట్టుపై దాని ముందు వైపు కింది భాగంలో ఏఫోదు రెండు భుజాలకు వాటిని తగిలించాలి.
Hai khoen gắn ở phía trước, phần dưới của hai cầu vai ê-phót, gần chỗ nối với vạt trước, bên trên thắt lưng.
28 ౨౮ అప్పుడు పతకం ఏఫోదు నమూనా ప్రకారం చేసిన నడికట్టుకు పైగా ఉండేలా బిగించాలి. అది ఏఫోదునుండి విడిపోకుండా ఉండేలా వారు దాని రింగులను నీలి దారంతో కట్టాలి.
Dùng dây màu xanh buộc bảng đeo ngực vào ê-phót tại các khoen vàng vừa kể, để cho bảng đeo ngực sẽ không rời khỏi ê-phót.
29 ౨౯ ఆ విధంగా అహరోను పరిశుద్ధ స్థలం లోకి వెళ్ళినప్పుడల్లా అతడు తన రొమ్ము మీద న్యాయనిర్ణయ పతకంలోని ఇశ్రాయేలీయుల పేర్లను నిత్యం యెహోవా సన్నిధిలో జ్ఞాపకార్థంగా ధరించాలి.
Như vậy, khi vào Nơi Thánh, A-rôn sẽ mang trước ngực tên các đại tộc Ít-ra-ên (trên bảng đeo ngực ‘Công Lý’), để làm một kỷ niệm thường xuyên trước mặt Chúa Hằng Hữu.
30 ౩౦ నీవు ఈ న్యాయనిర్ణయ పతకంలో ఊరీము తుమ్మీము అనే వాటిని ఉంచాలి. అహరోను యెహోవా సన్నిధికి వెళ్లినప్పుడల్లా అవి అతని రొమ్ముపై ఉంటాయి. అతడు యెహోవా సన్నిధిలో తన రొమ్ముపై ఇశ్రాయేలీయుల న్యాయనిర్ణయాలను నిత్యం భరిస్తాడు.
Phải gắn U-rim và Thu-mim vào bảng đeo ngực, để A-rôn đeo trước ngực mình mỗi khi vào Nơi Thánh, trước mặt Chúa Hằng Hữu. Vậy, A-rôn sẽ luôn luôn mang công lý cho người Ít-ra-ên mỗi khi vào cầu hỏi Chúa Hằng Hữu.”
31 ౩౧ ఏఫోదు నిలువుటంగీని కేవలం నీలిరంగు దారంతోనే కుట్టాలి.
“May áo khoác ngoài ê-phót bằng vải xanh.
32 ౩౨ దాని మధ్య భాగంలో తల దూర్చడానికి రంధ్రం ఉండాలి. అది చినిగి పోకుండా మెడ కవచం లాగా దాని రంధ్రం చుట్టూ నేతపని గోటు ఉండాలి.
Giữa áo có một lỗ để tròng đầu vào như cổ của áo giáp, phải viền cổ kỹ càng cho khỏi xơ, rách.
33 ౩౩ దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్త వర్ణాల దానిమ్మ కాయ ఆకారాలను, వాటి మధ్యలో బంగారు గంటలను నిలువు టంగీ చుట్టూ తగిలించాలి.
Dùng chỉ xanh, tím, đỏ thắt trái lựu
34 ౩౪ ఒక్కొక్క బంగారు గంట, దానిమ్మకాయ ఆ నిలువుటంగీ కింది అంచున చుట్టూరా ఉండాలి.
kết dọc theo gấu áo, xen kẽ với chuông vàng.
35 ౩౫ సేవ చేసేటప్పుడు అహరోను దాని ధరించాలి. అతడు యెహోవా సన్నిధిలో పరిశుద్ధస్థలం లోకి ప్రవేశించేటప్పుడు అతడు చావకుండేలా వాటి చప్పుడు వినబడుతూ ఉండాలి.
A-rôn sẽ mặc áo đó mỗi khi vào Nơi Thánh phục vụ Chúa Hằng Hữu. Tiếng chuông vàng sẽ khua khi người ra vào trước mặt Chúa Hằng Hữu. Nếu không, người sẽ chết.
36 ౩౬ నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కినట్టు దానిపై ‘యెహోవాకు పరిశుద్ధం’ అనే మాట చెక్కాలి.
Làm một thẻ bằng vàng ròng và khắc trên thẻ theo lối khắc con dấu như sau: ‘Thánh cho Chúa Hằng Hữu.’
37 ౩౭ పాగాపై ఉండేలా నీలి దారంతో దాన్ని కట్టాలి. అది పాగా ముందు వైపు ఉండాలి.
Dùng dây màu xanh buộc thẻ trước khăn đội đầu của A-rôn.
38 ౩౮ ఇశ్రాయేలీయులు అర్పించే పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో వాటిలో ఇమిడి ఉన్న దోషాలను అహరోను భరించేలా అది అహరోను నుదిటిపై ఉండాలి. వారికి యెహోవా సన్నిధిలో ఆమోదం ఉండేలా అది నిత్యం అతని నుదుటిపై ఉండాలి.
Vậy, A-rôn sẽ luôn luôn mang thẻ ngay trước trán mình, và như thế người sẽ mang lấy trên mình những tội của người Ít-ra-ên khi họ dâng lễ vật để chuộc lỗi. Lễ vật được nhận, tội được tha, khi A-rôn mang thẻ trên trán lúc người ở trước mặt Chúa Hằng Hữu.
39 ౩౯ సన్న నారతో చొక్కాయిని బుట్టాపనిగా చెయ్యాలి. సన్న నారతో పాగాను నేయాలి. నడికట్టును కూడా బుట్టాపనిగా చెయ్యాలి.
Dệt một áo lót ngắn tay bằng chỉ gai mịn, có kẻ ô vuông. Cũng làm một khăn đội đầu bằng vải gai mịn và một dây thắt lưng thêu.
40 ౪౦ నీవు అహరోను కుమారులకు చొక్కాలు కుట్టించాలి. వారికి నడికట్లు తయారు చెయ్యాలి. వారి ఘనత, వైభవాలు కలిగేలా వారికీ టోపీలు చెయ్యాలి.
Cũng may cho các con trai A-rôn áo dài, dây thắt lưng và khăn đội đầu cho trang trọng, lịch sự.
41 ౪౧ నీవు నీ సోదరుడు అహరోనుకు, అతని కుమారులకు వాటిని తొడిగించాలి. వారు నాకు యాజకులయ్యేలా వారికి అభిషేకం చేసి, వారిని ప్రతిష్ఠించి పవిత్రపరచాలి.
Sau khi lấy các bộ áo đó mặc cho A-rôn và các con trai người, con phải làm lễ xức dầu, tấn phong chức tế lễ thánh cho họ để họ phục vụ Ta.
42 ౪౨ వారి నగ్నతను కప్పుకొనేందుకు నీవు వారికి నారతో చేసిన లోదుస్తులు కుట్టించాలి.
Cũng nhớ may quần lót bằng vải gai để họ mặc sát vào người từ bụng đến đùi.
43 ౪౩ వారు ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశించేటప్పుడు గానీ పరిశుద్ధస్థలం లో సేవ చేయడానికి బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పుడు గానీ వారు దోషులై చావకుండేలా అహరోను, అతని కుమారులు వాటిని ధరించాలి. ఇది అతనికి, అతని తరువాత అతని సంతానానికి ఎప్పటికీ నిలిచి ఉండే శాసనం.”
A-rôn và các con trai người phải mặc quần này mỗi khi vào Đền Tạm hoặc đến gần bàn thờ trong Nơi Thánh; nếu không, họ sẽ mang tội và chết. Đây là một quy lệ áp dụng cho A-rôn và con cháu người mãi mãi.”