1౧“నీవు పది తెరలతో ఒక మందిరాన్ని కట్టాలి. సన్న నారతో, నీల ధూమ్ర రక్త వర్ణాలు కలిపి పేనిన ఉన్నితో కెరూబు ఆధార నమూనాగా వాటిని చెయ్యాలి. అది నేర్పుగల కళాకారుని పనిగా ఉండాలి.
This chapter is missing in the source text.
2౨ప్రతి తెర పొడవు 28 మూరలు. వెడల్పు నాలుగు మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత.
3౩ఐదు తెరలను ఒక దానితో ఒకటి కలిపి కుట్టాలి. మిగిలిన ఐదు తెరలను కూడా ఒక దానితో ఒకటి కలిపి కుట్టాలి.
4౪తెరల కూర్పు చివర మొదటి తెర అంచుకి నీలినూలుతో ఉచ్చులు చేయాలి. రెండవ కూర్పులోని బయటి తెర చివర కూడా అలానే చేయాలి.
5౫ఒక తెరలో ఏభై ఉచ్చులు చేసి, అవి ఒకదానికొకటి తగులుకునేలా ఆ రెండవ కూర్పులోని తెర అంచులో ఏభై ఉచ్చులు చేయాలి.
6౬ఏభై బంగారు గుండీలను చేసి ఆ గుండీలతో ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్చాలి. అది అంతా ఒకటే మందిరంగా రూపొందుతుంది.
7౭మందిరం పైకప్పుగా మేకవెంట్రుకలతో తెరలు చెయ్యాలి. అలా పదకొండు తెరలు చెయ్యాలి.
8౮ప్రతి తెర పొడవు ముప్ఫై మూరలు, వెడల్పు నాలుగు మూరలు, అలా పదకొండు తెరల కొలత ఒక్కటే.
9౯ఐదు తెరలను ఒకటిగా, ఆరు తెరలను ఒకటిగా ఒక దానికొకటి కూర్చాలి. ఆరవ తెరను గుడారం ఎదుటి భాగాన మడత పెట్టాలి.
10౧౦తెరల కూర్పుకు బయటున్న తెర అంచున ఏభై ఉచ్చులను, రెండవ కూర్పులోపల తెర అంచున ఏభై ఉచ్చులను చెయ్యాలి.
11౧౧ఏభై యిత్తడి గుండీలు చేసి ఒకటే గుడారమయ్యేలా ఆ గుండీలను ఆ ఉచ్చులకు తగిలించి కూర్చాలి.
12౧౨ఆ తెరల్లో మిగిలిన వేలాడే భాగం అంటే మిగిలిన సగం తెర మందిరం వెనక భాగంలో వ్రేలాడుతూ ఉండాలి.
13౧౩గుడారపు తెరల పొడవులో మిగిలినది ఈ వైపు ఒక మూర, ఆ వైపు ఒక మూర మందిరం పైకప్పుగా ఈ వైపు, ఆ వైపు వేలాడాలి.
14౧౪ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పై కప్పును చేసి, దాన్ని సీలు జంతువు తోళ్లతో కప్పాలి.