< నిర్గమకాండము 26 >

1 “నీవు పది తెరలతో ఒక మందిరాన్ని కట్టాలి. సన్న నారతో, నీల ధూమ్ర రక్త వర్ణాలు కలిపి పేనిన ఉన్నితో కెరూబు ఆధార నమూనాగా వాటిని చెయ్యాలి. అది నేర్పుగల కళాకారుని పనిగా ఉండాలి.
“फिर पवित्र स्थान के लिए कुशल कारीगरों द्वारा दस पर्दे बनाना, जो बंटी हुई मलमल और नीले, बैंगनी और लाल रंग के कपड़ों से बने हों और उस पर कढ़ाई के काम किए हुए करूबों के चित्र हों.
2 ప్రతి తెర పొడవు 28 మూరలు. వెడల్పు నాలుగు మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత.
हर पर्दे की लंबाई बारह मीटर साठ सेंटीमीटर और चौड़ाई एक मीटर अस्सी सेंटीमीटर हो. हर पर्दा एक ही नाप का हो.
3 ఐదు తెరలను ఒక దానితో ఒకటి కలిపి కుట్టాలి. మిగిలిన ఐదు తెరలను కూడా ఒక దానితో ఒకటి కలిపి కుట్టాలి.
पांच पर्दों को एक साथ जोड़ना और इसी प्रकार दूसरे पांच पर्दे भी एक साथ जुड़े.
4 తెరల కూర్పు చివర మొదటి తెర అంచుకి నీలినూలుతో ఉచ్చులు చేయాలి. రెండవ కూర్పులోని బయటి తెర చివర కూడా అలానే చేయాలి.
फिर पहले पांच पर्दे के किनारी पर तथा इसी तरह दूसरी पांच पर्दे के किनारी पर भी नीले रंग का फंदा बनाना.
5 ఒక తెరలో ఏభై ఉచ్చులు చేసి, అవి ఒకదానికొకటి తగులుకునేలా ఆ రెండవ కూర్పులోని తెర అంచులో ఏభై ఉచ్చులు చేయాలి.
एक पर्दे में पचास फंदे और दूसरे में भी पचास फंदे. वे फंदे एक दूसरे के सामने बनाना.
6 ఏభై బంగారు గుండీలను చేసి ఆ గుండీలతో ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్చాలి. అది అంతా ఒకటే మందిరంగా రూపొందుతుంది.
फिर, सोने के पचास अंकुड़े बनवाना. और उन अंकुड़ों से दोनों पर्दों को मिलाना, जिससे पवित्र स्थान मिलकर एक हो जाए.
7 మందిరం పైకప్పుగా మేకవెంట్రుకలతో తెరలు చెయ్యాలి. అలా పదకొండు తెరలు చెయ్యాలి.
“फिर बकरे के रोमों से ग्यारह पर्दे बनवाना जो पवित्र स्थान के ऊपर का हिस्सा है.
8 ప్రతి తెర పొడవు ముప్ఫై మూరలు, వెడల్పు నాలుగు మూరలు, అలా పదకొండు తెరల కొలత ఒక్కటే.
हर पर्दे की लंबाई साढ़े तेरह मीटर और चौड़ाई एक मीटर अस्सी सेंटीमीटर हो. ग्यारहों पर्दे एक ही नाप के हों.
9 ఐదు తెరలను ఒకటిగా, ఆరు తెరలను ఒకటిగా ఒక దానికొకటి కూర్చాలి. ఆరవ తెరను గుడారం ఎదుటి భాగాన మడత పెట్టాలి.
उन पर्दों में पांच को जोड़कर एक पर्दा बनवाना. और बाकी छः पर्दों को जोड़कर एक और पर्दा बनवाना. छठे पर्दे को तंबू के सामने मोड़ देना.
10 ౧౦ తెరల కూర్పుకు బయటున్న తెర అంచున ఏభై ఉచ్చులను, రెండవ కూర్పులోపల తెర అంచున ఏభై ఉచ్చులను చెయ్యాలి.
और दोनों अलग-अलग पर्दों की एक-एक किनारी पर पचास-पचास फंदे लगाना.
11 ౧౧ ఏభై యిత్తడి గుండీలు చేసి ఒకటే గుడారమయ్యేలా ఆ గుండీలను ఆ ఉచ్చులకు తగిలించి కూర్చాలి.
फिर कांसे के पचास अंकुड़े बनवाना. उन अंकुड़ों में फंदे लगवाना और तंबू के दोनों तरफ इस प्रकार जोड़ना कि वे एक बन जाए.
12 ౧౨ ఆ తెరల్లో మిగిలిన వేలాడే భాగం అంటే మిగిలిన సగం తెర మందిరం వెనక భాగంలో వ్రేలాడుతూ ఉండాలి.
पर्दों का जो भाग बचा है, उसका आधा भाग पवित्र स्थान के पीछे लटका देना
13 ౧౩ గుడారపు తెరల పొడవులో మిగిలినది ఈ వైపు ఒక మూర, ఆ వైపు ఒక మూర మందిరం పైకప్పుగా ఈ వైపు, ఆ వైపు వేలాడాలి.
और पर्दों की लंबाई में बचा हुआ भाग पवित्र स्थान के दोनों तरफ ढकने के लिए पैंतालीस-पैंतालीस सेंटीमीटर दोनों ओर लटका हुआ छोड़ देना.
14 ౧౪ ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పై కప్పును చేసి, దాన్ని సీలు జంతువు తోళ్లతో కప్పాలి.
तंबू के लिए लाल रंग से रंगी हुई भेडों की खाल का एक ओढ़ना बनवाना और फिर उसके ऊपर लगाने के लिए सूस के चमड़े का एक और ओढ़ना बनवाना.
15 ౧౫ మందిరానికి తుమ్మ చెక్కతో నిలువు పలకలు చెయ్యాలి.
“फिर पवित्र स्थान को खड़ा करने के लिए बबूल की लकड़ी के तख्ते बनवाना.
16 ౧౬ పలక పొడవు పది మూరలు, వెడల్పు మూరెడున్నర ఉండాలి.
हर तख्ते की लंबाई साढ़े चार मीटर और चौड़ाई साढ़े सड़सठ सेंटीमीटर की हो.
17 ౧౭ ప్రతి పలకలో ఒకదానిలో ఒకటి కూర్చునే విధంగా రెండు కుసులు ఉండాలి. ఆ విధంగా మందిరం పలకలన్నిటికీ చెక్కాలి.
तख्ते को जोड़ने के लिए दो समानांतर चूल्हे हों. पवित्र स्थान के सब तख्ते इसी तरह बनवाना.
18 ౧౮ నీవు మందిరానికి పలకలు చేసేటప్పుడు ఇరవై పలకలు కుడి వైపున, అంటే దక్షిణ దిక్కున చెయ్యాలి.
पवित्र स्थान के लिए बीस तख्ते दक्षिण की ओर बनवाना.
19 ౧౯ ఒక్కొక్క పలక కింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను, అంటే ఆ ఇరవై పలకల కింద నలభై వెండి దిమ్మలను చెయ్యాలి.
उनके नीचे चांदी की चालीस कुर्सियां बनवाना जो तख्तों के नीचे रखी जायेंगी. हर तख्ते के नीचे उसकी दो चूलों के लिए दो कुर्सियां बनवाना.
20 ౨౦ మందిరం రెండవ వైపు అంటే ఉత్తర దిక్కున
और इसी प्रकार उत्तर की ओर भी बीस तख्ते बनवाना.
21 ౨౧ ఒక్కొక్క పలక కింద రెండు దిమ్మలు చొప్పున ఇరవై పలకలకు నలభై వెండి దిమ్మలు ఉండాలి.
और चांदी की चालीस कुर्सियां, हर एक तख्ते के नीचे दो कुर्सियां बनवाना.
22 ౨౨ పడమర వైపు అంటే మందిరం వెనక వైపు ఆరు పలకలు చెయ్యాలి.
पवित्र स्थान के पीछे पश्चिम की ओर छः तख्ते बनवाना.
23 ౨౩ ఆ వెనక వైపు మందిరం మూలలకు రెండు పలకలు చెయ్యాలి.
और पीछे के भाग के कोनों के लिए दो तख्ते बनवाना.
24 ౨౪ అవి అడుగున దేనికదేగా ఉండాలి గానీ పై భాగంలో మాత్రం ఒకే రింగులో కూర్చుని ఉండాలి. ఆ విధంగా ఆ రెంటికీ ఉండాలి.
कोने के दोनों तख्ते एक साथ जोड़ देना चाहिए. तले में दोनों तख्तों की खूंटियां चांदी के एक ही आधार में लगेंगी और दोनों भाग ऊपर से जुड़े हों, और नीचे का भाग अलग हो.
25 ౨౫ పలకలు ఎనిమిది. వాటి వెండి దిమ్మలు పదహారు. ఒక్కొక్క పలక కింద రెండు దిమ్మలుండాలి.
इस प्रकार आठ तख्ते बनवाना, जिनके नीचे चांदी की सोलह कुर्सियां हों, हर तख्ते के नीचे दो कुर्सियां हों.
26 ౨౬ తుమ్మచెక్కతో అడ్డ కర్రలు చెయ్యాలి. మందిరం ఒక వైపు పలకలకు ఐదు అడ్డ కర్రలు,
“फिर बबूल की लकड़ी की छड़ें बनवाना. अर्थात् पवित्र स्थान की एक तरफ के तख्तों के लिए पांच छड़ें हों,
27 ౨౭ మందిరం రెండవ వైపు పలకలకు ఐదు అడ్డ కర్రలు, పడమటి వైపున మందిరం పలకలకు ఐదు అడ్డ కర్రలు ఉండాలి.
और तथा पवित्र स्थान की दूसरी तरफ के तख्तों के लिए पांच कड़े तथा पवित्र स्थान के पश्चिमी दिशा के तख्ते के लिए पांच कड़े बनवाना.
28 ౨౮ ఆ పలకల మధ్య ఉండే అడ్డ కర్ర ఈ చివరి నుండి ఆ చివరి వరకూ ఉండాలి.
तख्ते के एक तरफ से दूसरी तरफ जाने के लिए तख्ते के बीच में कड़े बनवाना.
29 ౨౯ ఆ పలకలకు బంగారు రేకు పొదిగించాలి. వాటి అడ్డ కర్రలుండే వాటి రింగులను బంగారంతో చేసి అడ్డ కర్రలకు కూడా బంగారు రేకు పొదిగించాలి.
तख्तों के ऊपर सोना लगवाना और कड़े में भी सोना लगवाना. लकड़े की डंड़ियों को भी सोना लगवाना.
30 ౩౦ కొండ మీద నీకు చూపించిన దాని నమూనా ప్రకారం మందిరాన్ని నిలబెట్టాలి.
“इसी प्रकार पवित्र स्थान को बनाना, जैसे तुमको पर्वत पर दिखाया गया था.
31 ౩౧ నీవు నీల ధూమ్ర రక్త వర్ణాల సన్న నారతో నేసిన ఒక అడ్డ తెరను చెయ్యాలి. అది కళాకారుని నైపుణ్యంతో కెరూబు ఆధార నమూనాగా చెయ్యాలి.
“फिर नीले, बैंगनी और लाल रंग के कपड़ों से और बंटी हुई मलमल से एक बीच वाला पर्दा बनवाना, जिस पर कढ़ाई के काम द्वारा करूबों के रूप बने हुए हों.
32 ౩౨ తుమ్మచెక్కతో చేసి బంగారు రేకు పొదిగిన నాలుగు స్తంభాలపై దాన్ని వెయ్యాలి. దాని కొక్కేలు బంగారువి. వాటి దిమ్మలు వెండివి.
बबूल की लकड़ी के चार खंभे बनवाना और उनके ऊपर सोना लगाना. इन खंभों पर पर्दों के लिए सोने की कड़ियां और चांदी की चार कुर्सियां बनवाना.
33 ౩౩ ఆ అడ్డతెరను ఆ కొక్కేల కింద తగిలించి సాక్ష్యపు మందసం అడ్డ తెర లోపలికి తేవాలి. ఆ అడ్డతెర పరిశుద్ధస్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తుంది.
बीचवाले पर्दे को अंकुड़ियों के नीचे लटकाकर उसकी आड़ में साक्षी पत्र का संदूक अंदर रखना. बीचवाले पर्दे के एक तरफ पवित्र स्थान तथा दूसरी तरफ परम पवित्र स्थान होगा.
34 ౩౪ అతి పరిశుద్ధ స్థలం లో సాక్ష్యపు మందసం మీద ప్రాయశ్చిత్త మూతను ఉంచాలి.
परम पवित्र स्थान में साक्षी पत्र के संदूक के ऊपर करुणासन को रखना.
35 ౩౫ అడ్డతెర బయట బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణం వైపున ఉన్న మందిరం ఉత్తర దిక్కున దీప వృక్షాన్ని ఉంచాలి.
पर्दे के बाहर पवित्र स्थान के उत्तरी भाग में मेज़ रखना और उसके दक्षिण की ओर मेज़ के सामने दीया रखना.
36 ౩౬ నీల ధూమ్ర రక్త వర్ణాలతో పేనిన సన్న నారతో కళాకారుని నైపుణ్యంతో చేసిన తెరను గుడారపు ద్వారం కోసం చెయ్యాలి.
“तंबू के द्वार के लिए नीले, बैंगनी और लाल रंग के कपड़ों का तथा बंटी हुई बारीक़ सनी वाले कपड़ो की कढ़ाई का काम किया हुआ एक पर्दा बनवाना.
37 ౩౭ ఆ తెరకు ఐదు స్తంభాలను తుమ్మ చెక్కతో చేసి వాటికి బంగారు రేకు పొదిగించాలి. వాటి కొక్కేలు బంగారువి. వాటికి ఐదు ఇత్తడి దిమ్మలు పోత పోయాలి.”
इस पर्दे को लटकाने के लिए बबूल की लकड़ी के सोने से मढ़े हुए पांच खंभे बनवाना. उनकी कुण्डियां सोने की हों और उनके लिए कांसे की पांच कुर्सियां बनवाना.

< నిర్గమకాండము 26 >