< నిర్గమకాండము 25 >

1 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు.
耶和华晓谕摩西说:
2 “నాకు ప్రతిష్ఠార్పణ తీసుకు రావాలని ఇశ్రాయేలీయులతో చెప్పు. మనసారా అర్పించే ప్రతి వాడి దగ్గరా దాన్ని తీసుకోవాలి.
“你告诉以色列人当为我送礼物来;凡甘心乐意的,你们就可以收下归我。
3 మీరు వారి దగ్గర తీసుకోవలసిన అర్పణలు ఇవి. బంగారం, వెండి, ఇత్తడి.
所要收的礼物:就是金、银、铜,
4 నీలం, ఊదా రక్త వర్ణాల ఉన్ని, సన్నని నార బట్టలు, మేక వెంట్రుకలు.
蓝色、紫色、朱红色线,细麻,山羊毛,
5 ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సీలు జంతువు చర్మం, తుమ్మ చెక్క.
染红的公羊皮,海狗皮,皂荚木,
6 మందిరంలో దీపాల కోసం నూనె, అభిషేక తైలం కోసం, పరిమళ ధూపం కోసం సుగంధ ద్రవ్యాలు,
点灯的油并做膏油和香的香料,
7 ఏఫోదు కోసం, వక్ష పతకం కోసం గోమేధికాలు, ఇతర రత్నాలు.
红玛瑙与别样的宝石,可以镶嵌在以弗得和胸牌上。
8 నేను వారి మధ్య నివసించేలా వారు నాకు పరిశుద్ధస్థలాన్ని నిర్మించాలి.
又当为我造圣所,使我可以住在他们中间。
9 నేను నీకు చూపించే విధంగా మందిరం స్వరూపాన్ని దాని ఉపకరణాలను చెయ్యాలి.
制造帐幕和其中的一切器具都要照我所指示你的样式。”
10 ౧౦ వారు తుమ్మకర్రతో ఒక మందసం చెయ్యాలి. దాని పొడవు రెండు మూరలున్నర, దాని వెడల్పు మూరెడున్నర, దాని ఎత్తు మూరెడున్నర
“要用皂荚木做一柜,长二肘半,宽一肘半,高一肘半。
11 ౧౧ దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగించాలి. లోపలా బయటా దానికి బంగారు రేకు పొదిగించాలి. దాని మీద బంగారు అంచు కట్టాలి.
要里外包上精金,四围镶上金牙边。
12 ౧౨ దానికి నాలుగు బంగారు రింగులు పోత పోసి, ఒక వైపు రెండు, మరొక వైపు రెండు రింగులు ఉండేలా దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించాలి.
也要铸四个金环,安在柜的四脚上;这边两环,那边两环。
13 ౧౩ తుమ్మ చెక్కతో మోతకర్రలు చేసి వాటికి బంగారు రేకు పొదిగించి
要用皂荚木做两根杠,用金包裹。
14 ౧౪ వాటితో ఆ మందసాన్ని మోయడానికి అంచులకు ఉన్న రింగుల్లో ఆ మోతకర్రలను దూర్చాలి.
要把杠穿在柜旁的环内,以便抬柜。
15 ౧౫ ఆ మోతకర్రలు ఆ మందసం రింగుల్లోనే ఉండాలి. వాటిని రింగుల్లోనుండి తీయకూడదు.
这杠要常在柜的环内,不可抽出来。
16 ౧౬ ఆ మందసంలో నేను నీకివ్వబోయే శాసనాలను ఉంచాలి.
必将我所要赐给你的法版放在柜里。
17 ౧౭ నీవు మేలిమి బంగారంతో ప్రాయశ్చిత్త స్థానమైన మూతను చెయ్యాలి. దాని పొడవు రెండు మూరలున్నర. దాని వెడల్పు మూరెడున్నర.
要用精金做施恩座,长二肘半,宽一肘半。
18 ౧౮ సాగగొట్టిన బంగారంతో రెండు బంగారు కెరూబు రూపాలను చెయ్యాలి. ప్రాయశ్చిత్త మూత రెండు అంచులతో వాటిని ఏకాండంగా చెయ్యాలి.
要用金子锤出两个基路伯来,安在施恩座的两头。
19 ౧౯ ఈ కొనలో ఒక కెరూబును ఆ కొనలో ఒక కెరూబును చెయ్యాలి. ప్రాయశ్చిత్త మూతపై దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండంగా చెయ్యాలి.
这头做一个基路伯,那头做一个基路伯,二基路伯要接连一块,在施恩座的两头。
20 ౨౦ ఆ కెరూబులు రెక్కలు పైకి విచ్చుకుని ప్రాయశ్చిత్త మూతను తమ రెక్కలతో కప్పుతూ ఉండాలి. వాటి ముఖాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండాలి. ఆ కెరూబుల ముఖాలు ప్రాయశ్చిత్త మూత వైపుకి తిరిగి ఉండాలి.
二基路伯要高张翅膀,遮掩施恩座。基路伯要脸对脸,朝着施恩座。
21 ౨౧ నీవు ఆ మూతను మందసం మీద ఉంచాలి. నేను నీకిచ్చే శాసనాలను ఆ మందసంలో ఉంచాలి.
要将施恩座安在柜的上边,又将我所要赐给你的法版放在柜里。
22 ౨౨ అక్కడ నేను నిన్ను కలుసుకుని ప్రాయశ్చిత్త మూత మీద నుండి, శాసనాలున్న మందసం మీద ఉన్న రెండు కెరూబుల మధ్య నుండి, ఇశ్రాయేలీయుల కోసం ఇచ్చే ఆజ్ఞలన్నిటినీ నీకు తెలియజేస్తాను.
我要在那里与你相会,又要从法柜施恩座上二基路伯中间,和你说我所要吩咐你传给以色列人的一切事。”
23 ౨౩ నీవు తుమ్మచెక్కతో ఒక బల్ల చేయాలి. దాని పొడవు రెండు మూరలు. వెడల్పు ఒక మూర. దాని ఎత్తు మూరెడున్నర.
“要用皂荚木做一张桌子,长二肘,宽一肘,高一肘半。
24 ౨౪ మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి బంగారు అంచును చేయించాలి.
要包上精金,四围镶上金牙边。
25 ౨౫ దానికి చుట్టూ బెత్తెడు చట్రం చేసి దానిపై చుట్టూ బంగారు అంచు పెట్టాలి.
桌子的四围各做一掌宽的横梁,横梁上镶着金牙边。
26 ౨౬ దానికి నాలుగు బంగారు రింగులు చేసి దాని నాలుగు కాళ్లకి ఉండే నాలుగు మూలల్లో ఆ రింగులను తగిలించాలి.
要做四个金环,安在桌子的四角上,就是桌子四脚上的四角。
27 ౨౭ బల్లను మోయడానికి చేసిన మోతకర్రలు రింగులకు, చట్రానికి దగ్గరగా ఉండాలి.
安环子的地方要挨近横梁,可以穿杠抬桌子。
28 ౨౮ ఆ మోతకర్రలను తుమ్మచెక్కతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగించాలి. వాటితో బల్లను మోస్తారు.
要用皂荚木做两根杠,用金包裹,以便抬桌子。
29 ౨౯ నీవు దాని పళ్ళేలను, గరిటెలను, గిన్నెలను, పానీయార్పణం కోసం పాత్రలను చేయాలి. మేలిమి బంగారంతో వాటిని చేయాలి.
要做桌子上的盘子、调羹,并奠酒的爵和瓶;这都要用精金制作。
30 ౩౦ నిత్యం నా సన్నిధిలో సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచాలి.
又要在桌子上,在我面前,常摆陈设饼。”
31 ౩౧ నీవు మేలిమి బంగారంతో దీపవృక్షాన్ని చేయాలి. సాగగొట్టిన బంగారంతో ఈ దీపవృక్షాన్ని చేయాలి. దాని కాండాన్ని, కొమ్మలను సాగగొట్టిన బంగారంతోనే చెయ్యాలి. దాని కలశాలు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండంగా ఉండాలి.
“要用精金做一个灯台。灯台的座和干与杯、球、花,都要接连一块锤出来。
32 ౩౨ దీప వృక్షం ఒక వైపు నుండి మూడు కొమ్మలు, రెండవ వైపు నుండి మూడు కొమ్మలు, అంటే దాని పార్శ్వాల నుండి ఆరుకొమ్మలు మొలవాలి.
灯台两旁要杈出六个枝子:这旁三个,那旁三个。
33 ౩౩ ఒక కొమ్మలో బాదం మొగ్గ, పువ్వు రూపాలు ఉన్న మూడు కలశాలు, రెండవ కొమ్మలో బాదం మొగ్గ, పువ్వురూపాలు ఉన్న మూడు కలశాలు, ఈ విధంగా దీపవృక్షం నుండి మొలిచిన కొమ్మల్లో ఉండాలి.
这旁每枝上有三个杯,形状像杏花,有球,有花;那旁每枝上也有三个杯,形状像杏花,有球,有花。从灯台杈出来的六个枝子都是如此。
34 ౩౪ దీపవృక్ష కాండంలో బాదం పువ్వు రూపంలో ఉన్న నాలుగు కలశాలు, వాటి మొగ్గలు, వాటి పువ్వులు ఉండాలి.
灯台上有四个杯,形状像杏花,有球,有花。
35 ౩౫ దీపవృక్ష కాండం నుండి నిగిడే ఆరుకొమ్మలకు దాని రెండేసి కొమ్మల కింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండాలి.
灯台每两个枝子以下有球与枝子接连一块。灯台出的六个枝子都是如此。
36 ౩౬ వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏకాండంగా ఉండాలి. అదంతా ఏకాండంగా సాగగొట్టిన మేలిమి బంగారంతో చెయ్యాలి.
球和枝子要接连一块,都是一块精金锤出来的。
37 ౩౭ నీవు దానికి ఏడు దీపాలు చేయాలి. దాని ఎదుటి భాగానికి వెలుగు ప్రసరించేలా దాని దీపాలు వెలిగించాలి.
要做灯台的七个灯盏。祭司要点这灯,使灯光对照。
38 ౩౮ దాని పట్టుకారును, పటకారు పళ్ళేన్ని మేలిమి బంగారంతో చెయ్యాలి.
灯台的蜡剪和蜡花盘也是要精金的。
39 ౩౯ ఆ ఉపకరణాలన్నిటిని 30 కిలోల మేలిమి బంగారంతో చెయ్యాలి.
做灯台和这一切的器具要用精金一他连得。
40 ౪౦ కొండ మీద నీకు చూపించిన వాటి నమూనా ప్రకారం వాటిని చేయడానికి జాగ్రత్త పడు.”
要谨慎做这些物件,都要照着在山上指示你的样式。”

< నిర్గమకాండము 25 >