< నిర్గమకాండము 24 >
1 ౧ యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలు ప్రజల పెద్దల్లో 70 మంది యెహోవా దగ్గరికి ఎక్కి వచ్చి దూరాన సాగిలపడండి.
He also said to Moses: “Ascend to the Lord, you and Aaron, Nadab and Abihu, and seventy elders out of Israel, and adore from a distance.
2 ౨ మోషే ఒక్కడు మాత్రమే యెహోవాను సమీపించాలి. మిగిలినవారు ఆయన సమీపానికి అతనితో కలసి ఎక్కి రాకూడదు.”
And only Moses will ascend to the Lord, and these shall not approach. Neither shall the people ascend with him.”
3 ౩ మోషే వచ్చి యెహోవా మాటలను, కట్టుబాట్లను ప్రజలకు వివరించాడు. ప్రజలంతా “యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేస్తాం” అని ముక్త కంఠంతో జవాబిచ్చారు.
Therefore, Moses went and explained to the people all the words of the Lord, as well as the judgments. And all the people responded with one voice: “We will do all the words of the Lord, which he has spoken.”
4 ౪ మోషే యెహోవా చెప్పిన మాటలన్నిటినీ రాశాడు. అతడు ఉదయాన్నే లేచి ఆ కొండ పాదం దగ్గర బలిపీఠం కట్టాడు. ఇశ్రాయేలు ప్రజల పన్నెండు గోత్రాల ప్రకారం పన్నెండు స్తంభాలు నిలిపాడు.
Then Moses wrote all the words of the Lord. And rising up in the morning, he built an altar at the base of the mountain, with twelve titles according to the twelve tribes of Israel.
5 ౫ తరవాత ఇశ్రాయేలు ప్రజల్లో కొందరు యువకులను పంపినప్పుడు వాళ్ళు వెళ్లి హోమ బలులు అర్పించి యెహోవాకు సమాధానబలులగా కోడెలను వధించారు.
And he sent youths from the sons of Israel, and they offered holocausts, and they immolated calves as peace-offerings to the Lord.
6 ౬ అప్పుడు మోషే వాటి రక్తంలో సగం పళ్ళెంలో పోశాడు. మిగతా సగం బలిపీఠం మీద కుమ్మరించాడు.
And so Moses took one half part of the blood, and he put it into bowls. Then the remaining part he poured over the altar.
7 ౭ తరువాత అతడు నిబంధన గ్రంథం చేతబట్టుకుని ప్రజలకు వినిపించాడు. ప్రజలంతా “యెహోవా చెప్పినవన్నీ చేస్తూ ఆయనకు విధేయులుగా ఉంటాం” అన్నారు.
And taking up the book of the covenant, he read it in the hearing of the people, who said: “All that the Lord has spoken, we will do, and we will be obedient.”
8 ౮ మోషే అప్పుడు రక్తం తీసుకుని ప్రజల మీద చిలకరించాడు. “ఇది నిబంధన రక్తం. ఇదిగో ఈ విషయాలన్నిటి ప్రకారం యెహోవా మీతో చేసిన నిబంధన ఇదే” అని చెప్పాడు.
In truth, taking up the blood, he sprinkled it on the people, and he said, “This is the blood of the covenant, which the Lord has formed with you concerning all these words.”
9 ౯ ఆ తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలు ప్రజల పెద్దలు 70 మంది కొంతవరకూ కొండ ఎక్కి వెళ్ళారు.
And Moses and Aaron, Nadab and Abihu, and seventy of the elders of Israel ascended.
10 ౧౦ అక్కడ వారికి ఇశ్రాయేలీయుల దేవుని ప్రత్యక్షత కలిగింది. ఆయన పాదాల కింద మెరిసిపోతున్న నీలాలు అలికినట్టున్న వేదిక ఉంది. అది ఆకాశమంత నిర్మలంగా ఉంది.
And they saw the God of Israel. And under his feet was something like a work of sapphire stone, or like the sky, when it is serene.
11 ౧౧ ఆయన ఇశ్రాయేలు ప్రజల పెద్దలకు ఎలాంటి హాని కలిగించలేదు. అక్కడ వాళ్ళు దేవుని దర్శనం చేసుకుని అన్న పానాలు పుచ్చుకున్నారు.
Neither did he lay his hand upon those of the sons of Israel who were at a distance. And they saw God, and they ate and drank.
12 ౧౨ అప్పుడు యెహోవా మోషేతో “నువ్వు కొండ ఎక్కి నా దగ్గరికి వచ్చి అక్కడ ఉండు. నేను రాతి పలకలపై రాసిన ఆజ్ఞలనూ, ధర్మశాస్త్రాన్నీ నీకు ఇస్తాను. నువ్వు వాటిని ప్రజలకు బోధించాలి.”
Then the Lord said to Moses: “Ascend to me on the mountain, and be there. And I will give to you tablets of stone, and the law and the commandments that I have written. So may you teach them.”
13 ౧౩ మోషే తన సహాయకుడు యెహోషువను తీసుకుని దేవుని పర్వతం ఎక్కాడు.
Moses rose up, with Joshua his minister. And Moses, ascending on the mountain of God,
14 ౧౪ మోషే ఇశ్రాయేలు పెద్దలతో “మేము తిరిగి మీ దగ్గరికి వచ్చేంత వరకూ ఇక్కడే ఉండండి. ఇక్కడ అహరోను, హూరు మీతోనే ఉన్నారు. మీలో ఏవైనా తగాదాలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి పరిష్కరించుకోండి” అని చెప్పి దేవుని కొండ ఎక్కాడు.
said to the elders: “Wait here, until we return to you. You have Aaron and Hur with you. If any question arises, you shall refer it to them.”
15 ౧౫ మోషే కొండ ఎక్కినప్పుడు దేవుని మేఘం ఆ కొండంతా కమ్మివేసింది.
And when Moses had ascended, a cloud covered the mountain.
16 ౧౬ యెహోవా మహిమా ప్రకాశం సీనాయి కొండపై కమ్ముకుంది. ఆరు రోజులపాటు మేఘం కమ్ముకుని ఉంది. ఏడవ రోజున ఆయన ఆ మేఘంలో నుండి మోషేను పిలిచాడు.
And the glory of the Lord dwelt upon Sinai, covering it with a cloud for six days. And on the seventh day, he called to him from the middle of the mist.
17 ౧౭ యెహోవా మహిమా ప్రకాశం ఆ కొండ శిఖరంపై దహించే మంటల్లాగా ఇశ్రాయేలు ప్రజలకు కనబడింది.
Now the appearance of the glory of the Lord was like a burning fire over the summit of the mountain in the sight of the sons of Israel.
18 ౧౮ అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ ఎక్కాడు. మోషే ఆ కొండ మీద నలభై పగళ్ళూ, నలభై రాత్రులూ ఉండిపోయాడు.
And Moses, entering into the midst of the cloud, ascended the mountain. And he was there for forty days and forty nights.