< నిర్గమకాండము 23 >

1 పుకార్లు పుట్టించకూడదు. అన్యాయ సాక్ష్యం చెప్పడానికి దుష్టులతో చేతులు కలప కూడదు.
לֹא תִשָּׂא שֵׁמַע שָׁוְא אַל־תָּשֶׁת יָֽדְךָ עִם־רָשָׁע לִהְיֹת עֵד חָמָֽס׃
2 దుష్టకార్యాలు జరిగించే గుంపులతో కలిసి ఉండ కూడదు. న్యాయాన్ని తారుమారు చేసే గుంపుతో చేరి న్యాయం విషయంలో అబద్ద సాక్ష్యం చెప్ప కూడదు.
לֹֽא־תִהְיֶה אַחֲרֵֽי־רַבִּים לְרָעֹת וְלֹא־תַעֲנֶה עַל־רִב לִנְטֹת אַחֲרֵי רַבִּים לְהַטֹּֽת׃
3 ఒక పేదవాడు న్యాయం కోసం పోరాడుతుంటే అతని పట్ల పక్షపాతంగా వ్యవహరించకూడదు.
וְדָל לֹא תֶהְדַּר בְּרִיבֽוֹ׃
4 నీ శత్రువుకు చెందిన ఎద్దు గానీ, గాడిద గానీ తప్పిపోతే అది నీకు కనబడినప్పుడు నువ్వు తప్పకుండా దాన్ని తోలుకు వచ్చి అతనికి అప్పగించాలి.
כִּי תִפְגַּע שׁוֹר אֹֽיִבְךָ אוֹ חֲמֹרוֹ תֹּעֶה הָשֵׁב תְּשִׁיבֶנּוּ לֽוֹ׃
5 నీ విరోధి గాడిద బరువు క్రింద పడిపోయి ఉండడం నువ్వు చూస్తే దాని పక్కనుండి దాటిపోకుండా వెంటనే వెళ్లి అతడితో కలసి ఆ గాడిదను విడిపించాలి.
כִּֽי־תִרְאֶה חֲמוֹר שֹׂנַאֲךָ רֹבֵץ תַּחַת מַשָּׂאוֹ וְחָדַלְתָּ מֵעֲזֹב לוֹ עָזֹב תַּעֲזֹב עִמּֽוֹ׃
6 దరిద్రునికి న్యాయం చేసే విషయంలో అన్యాయంగా తీర్పు తీర్చకూడదు
לֹא תַטֶּה מִשְׁפַּט אֶבְיֹנְךָ בְּרִיבֽוֹ׃
7 అబద్ధానికి దూరంగా ఉండు. నీతిమంతుణ్ణి, దోషం లేనివాణ్ణి చంపకూడదు. అలాంటి చెడ్డ పనులు చేసేవాణ్ణి నేను దోషం లేనివాడిగా చూడను.
מִדְּבַר־שֶׁקֶר תִּרְחָק וְנָקִי וְצַדִּיק אַֽל־תַּהֲרֹג כִּי לֹא־אַצְדִּיק רָשָֽׁע׃
8 లంచాలు తీసుకోవద్దు. చూపు ఉన్నవాణ్ణి లంచం గుడ్డివాడిగా చేస్తుంది. నీతిమంతుల మాటలకు అపార్థాలు పుట్టిస్తుంది.
וְשֹׁחַד לֹא תִקָּח כִּי הַשֹּׁחַד יְעַוֵּר פִּקְחִים וִֽיסַלֵּף דִּבְרֵי צַדִּיקִֽים׃
9 విదేశీయులను ఇబ్బందుల పాలు చేయకూడదు. మీరు ఐగుప్తు దేశంలో విదేశీయులుగా ఉన్నారు కదా. వాళ్ళ మనస్సు ఎలా ఉంటుందో మీకు తెలుసు.
וְגֵר לֹא תִלְחָץ וְאַתֶּם יְדַעְתֶּם אֶת־נֶפֶשׁ הַגֵּר כִּֽי־גֵרִים הֱיִיתֶם בְּאֶרֶץ מִצְרָֽיִם׃
10 ౧౦ ఆరు సంవత్సరాల పాటు నీ భూమిని దున్ని దాని పంట సమకూర్చుకోవాలి.
וְשֵׁשׁ שָׁנִים תִּזְרַע אֶת־אַרְצֶךָ וְאָסַפְתָּ אֶת־תְּבוּאָתָֽהּ׃
11 ౧౧ ఏడవ సంవత్సరం నీ భూమిని బీడుగా వదిలి పెట్టాలి. అప్పుడు మిగిలి ఉన్న పంటను నీ ప్రజల్లోని పేదవారు తీసుకున్న తరువాత మిగిలినది అడవి జంతువులు తినవచ్చు. మీకు చెందిన ద్రాక్ష, ఒలీవ తోటల విషయంలో కూడా ఈ విధంగానే చెయ్యాలి.
וְהַשְּׁבִיעִת תִּשְׁמְטֶנָּה וּנְטַשְׁתָּהּ וְאָֽכְלוּ אֶבְיֹנֵי עַמֶּךָ וְיִתְרָם תֹּאכַל חַיַּת הַשָּׂדֶה כֵּֽן־תַּעֲשֶׂה לְכַרְמְךָ לְזֵיתֶֽךָ׃
12 ౧౨ ఆరు రోజులు నీ పనులు చేసిన తరువాత ఏడవ రోజున నీ ఎద్దులు, గాడిదలు, దాసీ కొడుకులూ, విదేశీయులూ సేద దీర్చుకొనేలా విశ్రాంతి తీసుకోవాలి.
שֵׁשֶׁת יָמִים תַּעֲשֶׂה מַעֲשֶׂיךָ וּבַיּוֹם הַשְּׁבִיעִי תִּשְׁבֹּת לְמַעַן יָנוּחַ שֽׁוֹרְךָ וַחֲמֹרֶךָ וְיִנָּפֵשׁ בֶּן־אֲמָתְךָ וְהַגֵּֽר׃
13 ౧౩ నేను మీతో చెప్పే సంగతులన్నీ జాగ్రత్తగా వినాలి. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోటి వెంట రానియ్యకూడదు.
וּבְכֹל אֲשֶׁר־אָמַרְתִּי אֲלֵיכֶם תִּשָּׁמֵרוּ וְשֵׁם אֱלֹהִים אֲחֵרִים לֹא תַזְכִּירוּ לֹא יִשָּׁמַע עַל־פִּֽיךָ׃
14 ౧౪ సంవత్సరంలో మూడుసార్లు నాకు ఉత్సవం జరిగించాలి.
שָׁלֹשׁ רְגָלִים תָּחֹג לִי בַּשָּׁנָֽה׃
15 ౧౫ పొంగ జేసే పదార్థం లేని రొట్టెల పండగ ఆచరించాలి. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం ఐగుప్తు నుండి మీరు బయలుదేరి వచ్చిన ఆబీబు నెలలో నియమిత సమయంలో ఏడు రోజుల పాటు పొంగ జేసే పదార్థం లేని రొట్టెలు తినాలి. నా సన్నిధానంలో ఒక్కడు కూడా ఖాళీ చేతులతో నిలబడకూడదు.
אֶת־חַג הַמַּצּוֹת תִּשְׁמֹר שִׁבְעַת יָמִים תֹּאכַל מַצּוֹת כַּֽאֲשֶׁר צִוִּיתִךָ לְמוֹעֵד חֹדֶשׁ הָֽאָבִיב כִּי־בוֹ יָצָאתָ מִמִּצְרָיִם וְלֹא־יֵרָאוּ פָנַי רֵיקָֽם׃
16 ౧౬ మీ పొలాల్లో పండిన తొలి పంటల కోత సమయంలో పండగ ఆచరించాలి. సంవత్సరం చివరలో పొలాల నుండి నీ వ్యవసాయ ఫలాలన్నీ సమకూర్చుకుని జనమంతా సమావేశమై పండగ ఆచరించాలి.
וְחַג הַקָּצִיר בִּכּוּרֵי מַעֲשֶׂיךָ אֲשֶׁר תִּזְרַע בַּשָּׂדֶה וְחַג הָֽאָסִף בְּצֵאת הַשָּׁנָה בְּאׇסְפְּךָ אֶֽת־מַעֲשֶׂיךָ מִן־הַשָּׂדֶֽה׃
17 ౧౭ సంవత్సరంలో మూడు సార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిలో సమకూడాలి.
שָׁלֹשׁ פְּעָמִים בַּשָּׁנָה יֵרָאֶה כׇּל־זְכוּרְךָ אֶל־פְּנֵי הָאָדֹן ׀ יְהֹוָֽה׃
18 ౧౮ నాకు అర్పించే బలుల రక్తంలో పొంగజేసే పదార్థమేమీ ఉండకూడదు. నా పండగలో అర్పించిన కొవ్వు ఉదయం దాకా నిలవ ఉండకూడదు.
לֹֽא־תִזְבַּח עַל־חָמֵץ דַּם־זִבְחִי וְלֹֽא־יָלִין חֵֽלֶב־חַגִּי עַד־בֹּֽקֶר׃
19 ౧౯ నీ భూమిలో పండే వాటిలో ప్రథమ ఫలాలు యెహోవా దేవుని మందిరానికి తీసుకురావాలి. మేకపిల్ల మాంసం దాని తల్లిపాలలో కలిపి ఉడకబెట్ట కూడదు.
רֵאשִׁית בִּכּוּרֵי אַדְמָתְךָ תָּבִיא בֵּית יְהֹוָה אֱלֹהֶיךָ לֹֽא־תְבַשֵּׁל גְּדִי בַּחֲלֵב אִמּֽוֹ׃
20 ౨౦ నేను సిద్ధపరచిన దేశానికి మీరు క్షేమంగా చేరుకోవడానికి మార్గంలో మిమ్మల్ని కాపాడుతూ మీకు ముందుగా వెళ్ళడానికి ఒక దూతను పంపిస్తున్నాను.
הִנֵּה אָנֹכִי שֹׁלֵחַ מַלְאָךְ לְפָנֶיךָ לִשְׁמׇרְךָ בַּדָּרֶךְ וְלַהֲבִיאֲךָ אֶל־הַמָּקוֹם אֲשֶׁר הֲכִנֹֽתִי׃
21 ౨౧ ఆయన సన్నిధిలో ఉండి ఆయన మాట జాగ్రత్తగా వినండి. ఆయనకు కోపం వచ్చే పనులు చేయకూడదు. మీరు ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఆయన క్షమించడు. ఎందుకంటే ఆయనకు నా పేరు పెట్టాను.
הִשָּׁמֶר מִפָּנָיו וּשְׁמַע בְּקֹלוֹ אַל־תַּמֵּר בּוֹ כִּי לֹא יִשָּׂא לְפִשְׁעֲכֶם כִּי שְׁמִי בְּקִרְבּֽוֹ׃
22 ౨౨ మీరు ఆయనకు లోబడి ఆయన మాటలు జాగ్రత్తగా వింటూ ఉంటే నేను మీ శత్రువులకు శత్రువుగా, మీ విరోధులకు విరోధిగా ఉంటాను.
כִּי אִם־שָׁמוֹעַ תִּשְׁמַע בְּקֹלוֹ וְעָשִׂיתָ כֹּל אֲשֶׁר אֲדַבֵּר וְאָֽיַבְתִּי אֶת־אֹיְבֶיךָ וְצַרְתִּי אֶת־צֹרְרֶֽיךָ׃
23 ౨౩ ఎలాగంటే నా దూత మీకు ముందుగా వెళ్తాడు. అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసిస్తున్న దేశానికి మిమ్మల్ని నడిపిస్తాడు. నేను వాళ్ళను హతం చేస్తాను.
כִּֽי־יֵלֵךְ מַלְאָכִי לְפָנֶיךָ וֶהֱבִֽיאֲךָ אֶל־הָֽאֱמֹרִי וְהַחִתִּי וְהַפְּרִזִּי וְהַֽכְּנַעֲנִי הַחִוִּי וְהַיְבוּסִי וְהִכְחַדְתִּֽיו׃
24 ౨౪ మీరు వారి దేవుళ్ళ ఎదుట సాష్టాంగపడ కూడదు, వారికి మొక్క కూడదు. వాళ్ళు చేసే పనులు చేయ కూడదు. వాళ్ళ విగ్రహాలను తుత్తునియలు చేసి వాటిని పూర్తిగా నాశనం చెయ్యాలి.
לֹֽא־תִשְׁתַּחֲוֶה לֵאלֹֽהֵיהֶם וְלֹא תׇֽעׇבְדֵם וְלֹא תַעֲשֶׂה כְּמַֽעֲשֵׂיהֶם כִּי הָרֵס תְּהָרְסֵם וְשַׁבֵּר תְּשַׁבֵּר מַצֵּבֹתֵיהֶֽם׃
25 ౨౫ మీరు మీ దేవుడైన యెహోవానే ఆరాధించి సేవించాలి. అప్పుడు నువ్వు తినే ఆహారం మీదా, తాగే నీళ్ళ మీదా ఆయన దీవెనలు ఉంటాయి. ఎలాంటి రోగాలూ మీకు సంక్రమించవు.
וַעֲבַדְתֶּם אֵת יְהֹוָה אֱלֹֽהֵיכֶם וּבֵרַךְ אֶֽת־לַחְמְךָ וְאֶת־מֵימֶיךָ וַהֲסִרֹתִי מַחֲלָה מִקִּרְבֶּֽךָ׃
26 ౨౬ మీ దేశంలో గర్భస్రావాలు ఉండవు. సంతాన సాఫల్యత లేని వాళ్ళు మీ దేశంలో ఉండరు. మీరు జీవించే రోజుల లెక్క పూర్తి చేస్తాను.
לֹא תִהְיֶה מְשַׁכֵּלָה וַעֲקָרָה בְּאַרְצֶךָ אֶת־מִסְפַּר יָמֶיךָ אֲמַלֵּֽא׃
27 ౨౭ నా పేరును బట్టి ఇతరులు మీకు భయపడేలా చేస్తాను. మీ ప్రయాణంలో మీరు దాటుతున్న సమస్త దేశ ప్రజలను ఓడించి నీ శత్రువులు నీ ఎదుట నుండి పారిపోయేలా చేస్తాను.
אֶת־אֵֽימָתִי אֲשַׁלַּח לְפָנֶיךָ וְהַמֹּתִי אֶת־כׇּל־הָעָם אֲשֶׁר תָּבֹא בָּהֶם וְנָתַתִּי אֶת־כׇּל־אֹיְבֶיךָ אֵלֶיךָ עֹֽרֶף׃
28 ౨౮ మీకు ముందుగా పెద్ద పెద్ద కందిరీగలను పంపిస్తాను. అవి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను మీ ఎదుట నుండి వెళ్ళగొడతాయి.
וְשָׁלַחְתִּי אֶת־הַצִּרְעָה לְפָנֶיךָ וְגֵרְשָׁה אֶת־הַחִוִּי אֶת־הַֽכְּנַעֲנִי וְאֶת־הַחִתִּי מִלְּפָנֶֽיךָ׃
29 ౨౯ అయితే ఒక్క సంవత్సరంలోనే వాళ్ళను వెళ్లగొట్టను. ఎందుకంటే దేశం పాడైపోతుంది. క్రూరమృగాలు విస్తరించి మీకు ప్రమాదకరంగా మారతాయి.
לֹא אֲגָרְשֶׁנּוּ מִפָּנֶיךָ בְּשָׁנָה אֶחָת פֶּן־תִּהְיֶה הָאָרֶץ שְׁמָמָה וְרַבָּה עָלֶיךָ חַיַּת הַשָּׂדֶֽה׃
30 ౩౦ మీరు వృద్ధి చెంది ఆ దేశాన్ని స్వాధీనం చేసుకునే దాకా వాళ్ళను కొంచెం కొంచెంగా మీ ఎదుట నుండి వెళ్ళగొడతాను.
מְעַט מְעַט אֲגָרְשֶׁנּוּ מִפָּנֶיךָ עַד אֲשֶׁר תִּפְרֶה וְנָחַלְתָּ אֶת־הָאָֽרֶץ׃
31 ౩౧ ఎర్ర సముద్రం నుంచి ఫిలిష్తీయుల సముద్రం దాకా, ఎడారి నుంచి నది దాకా మీకు సరిహద్దులు నియమిస్తాను. ఆ దేశ నివాసులను మీ చేతికి అప్పగిస్తాను. మీరు మీ ఎదుట నుండి వాళ్ళను వెళ్లగొడతారు.
וְשַׁתִּי אֶת־גְּבֻלְךָ מִיַּם־סוּף וְעַד־יָם פְּלִשְׁתִּים וּמִמִּדְבָּר עַד־הַנָּהָר כִּי ׀ אֶתֵּן בְּיֶדְכֶם אֵת יֹשְׁבֵי הָאָרֶץ וְגֵרַשְׁתָּמוֹ מִפָּנֶֽיךָ׃
32 ౩౨ మీరు వాళ్ళతో గానీ, వాళ్ళ దేవుళ్ళతో గానీ ఎలాంటి ఒప్పందాలూ చేసుకోకూడదు.
לֹֽא־תִכְרֹת לָהֶם וְלֵאלֹֽהֵיהֶם בְּרִֽית׃
33 ౩౩ వాళ్ళు మీ దేశంలో నివసించకూడదు. వాళ్ళను ఉండనిస్తే వాళ్ళు మీ చేత నాకు విరోధంగా పాపం చేయిస్తారు. వాళ్ళ దేవుళ్ళను పూజిస్తే అది మీకు ఉరిగా పరిణమిస్తుంది.
לֹא יֵשְׁבוּ בְּאַרְצְךָ פֶּן־יַחֲטִיאוּ אֹתְךָ לִי כִּי תַעֲבֹד אֶת־אֱלֹהֵיהֶם כִּֽי־יִהְיֶה לְךָ לְמוֹקֵֽשׁ׃

< నిర్గమకాండము 23 >