< నిర్గమకాండము 22 >
1 ౧ “ఎవరైనా ఒకడు ఎద్దును గానీ, గొర్రెను గానీ దొంగిలించి వాటిని అమ్మినా, లేదా చంపినా ఒక ఎద్దుకు బదులు ఐదు ఎద్దులు, ఒక గొర్రెకు బదులు నాలుగు గొర్రెలు చెల్లించాలి.
Ако някой открадне вол или овца та го заколи или го продаде, то да плати пет вола за вола и четири овци за овцата.
2 ౨ ఎవరైనా దొంగతనం చేస్తూ దొరికిపోతే వాణ్ణి చనిపోయేలా కొట్టినప్పుడు కొట్టిన వాళ్ళ మీద నేరం ఉండదు.
(Ако се завари крадецът когато подкопава, и го ударят та умре, няма да се пролее кръв за него.
3 ౩ సూర్యుడు ఉదయించిన తరువాత దొంగతనానికి వచ్చిన వాణ్ణి కొట్టిన వ్యక్తి పై హత్యానేరం ఉంటుంది. దొంగిలించిన సొత్తు తిరిగి చెల్లించాలి. దొంగ దగ్గర చెల్లించడానికి ఏమీ లేకపోతే వాడు దొంగతనం చేశాడు కాబట్టి వాణ్ణి బానిసగా అమ్మివేయాలి.
Но ако слънцето е било изгряло над него, тогава ще се пролее кръв за него). Крадецът трябва непременно да плати; но ако няма с какво, то да се продаде той за откраднатото.
4 ౪ దొంగిలించిన ఎద్దు గానీ, గాడిద గానీ, గొర్రె గానీ ఏదైనా సరే, ప్రాణంతో దొరికితే వాడు దానికి రెండు రెట్లు చెల్లించాలి.
И ако откраднатото, било вол, осел, или овца, се намери живо в ръката му, ще плати двойно.
5 ౫ ఒకడు తన పశువును మేత మేయడానికి తన పొలం లోకి గానీ, ద్రాక్ష తోటలోకి గానీ వదిలినప్పుడు అది వేరొక వ్యక్తి పొలంలో మేస్తే ఆ పొలం యజమానికి తన పంటలో, ద్రాక్షతోటలో శ్రేష్ఠమైనది తిరిగి చెల్లించాలి.
Ако някой направи да се изяде нива или лозе, като развърже животното си и то се напасе в чужда нива, ще плати от най доброто произведение на нивата си и от най-добрия плод на лозето си.
6 ౬ నిప్పు రాజుకుని ముళ్ళకంపలు అంటుకోవడం వల్ల వేరొకరి పంట కుప్పలైనా, పొలంలో పైరులైనా, పొలమైనా తగలబడి పోతే నిప్పు అంటించిన వాడు జరిగిన నష్టాన్ని పూడ్చాలి.
Ако избухне огън и запали тръни, така че изгорят копни или непожънати класове, или ниви, то който е запалил огъня непременно ще плати.
7 ౭ ఒక వ్యక్తి సొమ్మును గానీ, సామాన్లు గానీ జాగ్రత్త చెయ్యమని తన పొరుగు వాడికి అప్పగించినప్పుడు ఆ వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగినట్టయితే ఆ దొంగ దొరికిన పక్షంలో వాడు దానికి రెండు రెట్లు చెల్లించాలి.
Ако някой даде на ближния си пари или някакви вещи да ги пази, и те бъдат откраднати от къщата на човека, то, ако се намери крадецът той ще плати двойно,
8 ౮ ఒకవేళ ఆ దొంగ దొరకని పక్షంలో ఆ ఇంటి యజమాని తన పొరుగువాడి వస్తువులు తీసుకున్నాడో లేదో పరిష్కారం చేసుకోవడానికి న్యాయాధికారుల దగ్గరికి రావాలి.
Но ако не се намери крадецът, тогава стопънинът на къщата ще се заведе пред съдиите, за да се издири дали е турил ръка върху имота на ближния си.
9 ౯ ఎద్దులు, గాడిదలు, గొర్రెలు, దుస్తులు వంటి ప్రతి విధమైన వాటి అపహరణ గూర్చిన ఆజ్ఞ ఇదే. పోగొట్టుకున్నవాడు వాటిని చూసి, అవి నావి అని వాదించినప్పుడు ఆ విషయంలో పరిష్కారం కోసం న్యాయాధికారుల దగ్గరికి రావాలి. న్యాయాధిపతి ఎవరి మీద నేరం రుజువు చేస్తాడో వాడు తన పొరుగువాడికి రెండు రెట్లు చెల్లించాలి.
За всякакъв вид престъпление, - относно вол, осел, овца, дреха, или какво да било загубено нещо, за което би казал някой, че е негово, - делото между двамата ще дойде пред съдиите: и когото осъдят съдиите, той ще плати двойно на ближния си.
10 ౧౦ ఒకడు గాడిద, ఎద్దు, గొర్రె, మరి ఏ జంతువునైనా కాపాడమని తన పొరుగు వాడికి అప్పగించినప్పుడు, అది చనిపోయినా, గాయపడినా, లేదా ఎవరూ చూడకుండా ఎవరైనా వాటిని తోలుకు పోయినా,
Ако някой даде на ближния си осел, или вол, или овца, или какво да било животно да го пази, и то умре, или се нарани, или бъде откарано, без да види някой,
11 ౧౧ అ వ్యక్తి తన పొరుగువాడి సొమ్మును తాను దొంగిలించలేదని యెహోవా నామం పేరట ప్రమాణం చెయ్యాలి. ఆ ప్రమాణం వారిద్దరి మధ్యనే ఉండాలి. ఆస్తి స్వంత దారుడు దానికి సమ్మతించాలి. జరిగిన నష్టపరిహారం చెల్లించనక్కర లేదు.
то между двамата оня ще се закълне в Господа, че не е турил ръката си върху имота на ближния си, и стопанинът му ще приеме това свидетелство, а другият няма да плаща.
12 ౧౨ ఒకవేళ అది నిజంగా అతని దగ్గర నుండి ఎవరైనా దొంగిలిస్తే అతడు స్వంత దారుడికి పరిహారం చెల్లించాలి.
Но ако животното бъде откраднато от него, ще плати на стопанина му.
13 ౧౩ లేదా ఒకవేళ మృగాలు దాన్ని చీల్చివేస్తే రుజువు కోసం దాన్ని తీసుకురావాలి. అలా చనిపోయినప్పుడు దాని నష్టం చెల్లించనక్కర లేదు.
Обаче ако бъде разкъсано от звяр, нека го донесе за свидетелство; за разкъсаното няма да плаща.
14 ౧౪ ఒక వ్యక్తి తన పొరుగువాని దగ్గర ఏదైనా బదులు తీసుకుంటే, దాని యజమాని దాని దగ్గర లేనప్పుడు దానికి హాని కలిగినా, లేదా అది చనిపోయినా ఆ నష్టాన్ని తప్పకుండా పూరించాలి.
Ако заеме някой от ближния си животно, и то се нарани или умре в отсъствието на стопанина му, непременно ще го заплати.
15 ౧౫ దాని యజమాని దానితో ఉన్నట్టయితే దాని నష్టం చెల్లించనక్కర లేదు. ఒకవేళ అది కిరాయికి తెచ్చినదైతే దాని కిరాయి డబ్బు యజమానికి చెల్లించాలి.
Но ако стопанинът му е с него, няма да плаща. ако е било наето с пари, ще отиде за наема си.
16 ౧౬ ఒకడు పెళ్లి నిర్ణయం కాని ఒక కన్యను లోబరచుకుని ఆమెతో తన వాంఛ తీర్చుకుంటే ఆమె కోసం కట్నం ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకోవాలి.
Ако някой излъсти несгодена девица и легне с нея, непременно ще даде вено за нея и ще я вземе за жена.
17 ౧౭ ఒకవేళ ఆమె తండ్రి ఆమెను అతనికిచ్చేందుకు నిరాకరిస్తే వాడు కన్యల కట్నం ప్రకారం సొమ్ము చెల్లించాలి.
Но ако баща й съвсем откаже да му я даде, то ще плати в пари според веното на девиците.
18 ౧౮ మంత్రగత్తెను బతకనివ్వకూడదు.
Магьосница жена да не оставиш.
19 ౧౯ జంతువులతో సంపర్కం చేసే ప్రతి ఒక్కరికీ మరణశిక్ష విధించాలి.
Всеки скотоложник непременно да се умъртви.
20 ౨౦ యెహోవాకు మాత్రమే బలులు అర్పించాలి, వేరొక దేవునికి బలి అర్పించే వాడు శాపానికి గురౌతాడు.
Който жертвува на кой да бил бог, освен само на Господа, ще се обрече на изтребление.
21 ౨౧ పరాయి దేశస్థులను పీడించకూడదు. మీరు ఐగుప్తు దేశంలో పరాయివాళ్ళుగా ఉన్నారు గదా.
Чужденец да не онеправдаваш, нито да го угнетяваш; защото и вие бяхте чужденци в Египетската земя.
22 ౨౨ విధవరాళ్ళను, తల్లి తండ్రులు లేని పిల్లలను బాధపెట్టకూడదు.
Да не угнетявате вдовица или сираче.
23 ౨౩ వాళ్ళను ఏ కారణంతోనైనా నీవు బాధ పెడితే వాళ్ళు పెట్టే మొర నాకు వినబడుతుంది. నేను వాళ్ళ మొరను తప్పకుండా ఆలకిస్తాను.
Защото ако ги угнетявате някак, и те извикат към Мене, непременно ще послушам вика им,
24 ౨౪ నా కోపాగ్ని రగులుకొంటుంది. నా కత్తివేటుతో నిన్ను హతం చేస్తాను. మీ భార్యలు విధవరాళ్ళు అవుతారు. మీ పిల్లలు దిక్కులేని వాళ్ళవుతారు.
и гневът Ми ще падне, и ще ви избия с нож; и вашите жени ще бъдат вдовици и вашите чада сирачета.
25 ౨౫ నా ప్రజల్లో మీ దగ్గర ఉండే ఒక పేదవాడికి అప్పుగా సొమ్ము ఇచ్చినప్పుడు వారి పట్ల కఠినంగా ప్రవర్తించ కూడదు. వాళ్ళ దగ్గర వడ్డీ వసూలు చేయకూడదు.
Ако дадеш в заем пари на някой свой беден съсед между Моите люде, да не постъпваш с него като заемодател, нито да му налагаш лихва.
26 ౨౬ మీరు ఒకవేళ ఎప్పుడైనా మీ పొరుగువాడి దుస్తులు తాకట్టు పెట్టుకుంటే సూర్యుడు అస్తమించే సమయానికి వాటిని వాళ్లకు తిరిగి అప్పగించాలి.
Ако вземеш в залог дрехата на ближния си, до захождане на слънцето да му я върнеш;
27 ౨౭ వాళ్ళు ఏమి కప్పుకుని పండుకుంటారు? వాళ్ళ దేహాలు కప్పుకొనే దుస్తులు అవే కదా. వాళ్ళు నాకు మొర పెట్టినప్పుడు నేను వింటాను. నేను దయగల వాణ్ణి.
защото това е едничката му завивка, това е дрехата за кожата му; с какво ще спи? и като викне към Мене, Аз ще чуя, защото съм милостив.
28 ౨౮ నువ్వు దేవుణ్ణి దూషించకూడదు. నీ ప్రజల అధికారుల్లో ఎవరినీ శపించ కూడదు.
Да не хулиш съдиите, нито да кълнеш началник на людете си.
29 ౨౯ నీ మొదటి కోత అర్పణలు ఇవ్వడంలో ప్రథమ ఫలాలు ఇవ్వడంలో ఆలస్యం చేయకూడదు. నీ కొడుకుల్లో మొదటివాణ్ణి నాకు ప్రతిష్టించాలి.
Да не забравиш да принесеш първака на гумното си и на жлеба си. Първородния между синовете си ще дадеш на Мене.
30 ౩౦ అదే విధంగా నీ ఎద్దులు, గొర్రెలు అర్పించాలి. మీరు ప్రతిష్ఠించినవి మొదటి ఏడు రోజులు తమ తల్లి దగ్గర ఉన్న తరువాత ఎనిమిదవ రోజు నాకు ప్రతిష్ఠించాలి.
Така ще постъпиш и с говедото си и с овцата си; седем дена ще остане малкото с майка си, а на седмия ден ще го дадеш на Мене.
31 ౩౧ మీరు నాకు ప్రత్యేకంగా ఉన్న వాళ్ళు గనుక పొలాల్లో మృగాలు చీల్చిన జంతు మాంసం తినకూడదు. దాన్ని కుక్కలకు పారవెయ్యాలి.”
Бъдете Ми свети човеци; затова не яжте месо разкъсано от зверове на полето; хвърлете го на кучетата.