< నిర్గమకాండము 2 >

1 లేవి వంశానికి చెందిన ఒక వ్యక్తి వెళ్లి లేవి స్త్రీలలో ఒకామెను పెళ్లి చేసుకున్నాడు.
A neko od plemena Levijeva otide i oženi se kæerju Levijevom.
2 ఆమె గర్భం ధరించి ఒక కొడుకును కన్నది. వాడు ఎంతో అందంగా ఉండడం వల్ల అతణ్ణి మూడు నెలల పాటు దాచిపెట్టింది.
I ona zatrudnje i rodi sina; i videæi ga lijepa krijaše ga tri mjeseca.
3 ఇక అతణ్ణి దాచి ఉంచలేక జమ్ముతో ఒక పెట్టె చేయించి, దానికి జిగురు, కీలు పూసి, అందులో ఆ పిల్లవాణ్ణి పెట్టి, నది ఒడ్డున జమ్ము గడ్డిలో ఉంచింది.
A kad ga ne može više kriti, uze kovèežiæ od site, i obli ga smolom i paklinom, i metnu dijete u nj, i odnese ga u trsku kraj rijeke.
4 పిల్లవాడికి ఏమైనా జరుగుతుందేమోనని వాడి అక్క దూరంగా నిలబడి చూస్తూ ఉంది.
A sestra njegova stade podalje da vidi šta æe biti od njega.
5 ఫరో చక్రవర్తి కూతురు స్నానం చేయడానికి నది దగ్గరికి వచ్చింది. ఆమె దాసీలు నది ఒడ్డున విహరిస్తూ ఉన్నారు. ఆమె రెల్లు గడ్డిలో ఉన్న ఆ పెట్టెను చూసి, తన దాసిని పంపి దాన్ని తెప్పించింది.
A kæi Faraonova doðe da se kupa u rijeci, i djevojke njezine hodahu kraj rijeke; i ona ugleda kovèežiæ u trsci, i posla dvorkinju svoju te ga izvadi.
6 పెట్టె తెరిచినప్పుడు ఏడుస్తూ ఉన్న పిల్లవాడు కనిపించాడు. ఆమె వాడిపై జాలిపడింది. “వీడు హెబ్రీయుల పిల్లవాడు” అంది.
A kad otvori, vidje dijete, i gle, dijete plakaše; i sažali joj se, i reèe: to je Jevrejsko dijete.
7 అప్పుడు దూరంగా నిలబడి ఉన్న పిల్లవాడి అక్క వచ్చి ఫరో కూతురితో “నీ కోసం ఈ పిల్లవాణ్ణి పెంచడానికి నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక ఆయాని తీసుకు రమ్మంటారా?” అని అడిగింది.
Tada reèe sestra njegova kæeri Faraonovoj: hoæeš li da idem da ti dozovem dojkinju Jevrejku, da ti doji dijete?
8 ఫరో కూతురు “వెళ్లి తీసుకు రా” అంది. ఆ బాలిక వెళ్లి ఆ బిడ్డ తల్లిని తీసుకు వచ్చింది.
A kæi Faraonova reèe joj: idi. I otide djevojèica, i dozva mater djetinju.
9 ఫరో కూతురు ఆమెతో “ఈ పిల్లవాణ్ణి తీసుకు పోయి నా కోసం పాలిచ్చి పెంచు. నేను నీకు జీతం ఇస్తాను” అని చెప్పింది. ఆమె పిల్లవాణ్ణి తీసుకు పోయి పాలిచ్చి పెంచింది.
I kæi Faraonova reèe joj: uzmi ovo dijete, i odoj mi ga, a ja æu ti platiti. I uze žena dijete i odoji ga.
10 ౧౦ ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత ఆమె అతణ్ణి ఫరో కూతురి దగ్గరికి తీసుకు వచ్చింది. అతడు ఆమెకు కొడుకు అయ్యాడు. ఆమె “నీళ్ళలో నుండి నేను ఇతన్ని బయటకు తీశాను, కాబట్టి ఇతని పేరు మోషే” అని చెప్పింది.
A kad dijete odraste, odvede ga ka kæeri Faraonovoj, a ona ga posini; i nadjede mu ime Mojsije govoreæi: jer ga iz vode izvadih.
11 ౧౧ మోషే పెద్దవాడైన తరువాత తన ప్రజల దగ్గరికి వెళ్ళాడు. వారు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు చూశాడు. ఆ సమయంలో తన సొంత జాతి వాడైన హెబ్రీయుల్లో ఒకణ్ణి ఒక ఐగుప్తీయుడు కొట్టడం చూశాడు.
I kad Mojsije bijaše velik, izide k braæi svojoj, i gledaše nevolju njihovu. I vidje gdje nekakav Misirac bije èovjeka Jevrejina izmeðu braæe njegove.
12 ౧౨ అటూ ఇటూ చూసి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఆ ఐగుప్తీయుణ్ణి కొట్టి చంపి ఇసుకలో పాతిపెట్టాడు.
I obazrev se i tamo i amo, kad vidje da nema nikoga, ubi Misirca, i zakopa ga u pijesak.
13 ౧౩ తరువాతి రోజు మోషే అటుగా వెళ్తుంటే అక్కడ ఇద్దరు హెబ్రీయులు గొడవ పడుతున్నారు.
I sjutradan izide opet, a to se dva Jevrejina svaðahu, i reèe onomu koji èinjaše krivo: zašto biješ bližnjega svojega?
14 ౧౪ అప్పుడు మోషే తప్పు చేసిన వ్యక్తితో “నువ్వెందుకు నీ సోదరుణ్ణి కొడుతున్నావు?” అని అడిగాడు. అందుకు అతడు “మా మీద నిన్ను అధికారిగా, తీర్పు తీర్చేవాడిగా ఎవరు నియమించారు? నువ్వు ఆ ఐగుప్తీయుణ్ణి చంపినట్టు నన్ను కూడా చంపుదామనుకుంటున్నావా?” అన్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిపోయిందని మోషే భయపడ్డాడు.
A on reèe: ko je tebe postavio knezom i sudijom nad nama? hoæeš li da me ubiješ kao što si ubio Misirca? Tada se Mojsije uplaši i reèe: zaista se doznalo.
15 ౧౫ ఆ సంగతి విన్న ఫరో మోషేను చంపించాలని చూశాడు. మోషే ఫరో దగ్గరనుండి నుండి మిద్యాను దేశానికి పారిపోయాడు. అక్కడ ఒక బావి దగ్గర కూర్చున్నాడు.
I Faraon èuv za to tražaše da pogubi Mojsija. Ali Mojsije pobježe od Faraona i doðe u zemlju Madijamsku, i sjede kod jednoga studenca.
16 ౧౬ మిద్యాను దేశంలో ఉన్న యాజకునికి ఏడుగురు కూతుళ్ళు. వాళ్ళు తమ తండ్రి మందలకు నీళ్లు తోడి నీళ్ళ తొట్టెలు నింపుతున్నారు.
A sveštenik Madijamski imaše sedam kæeri, i one doðoše i stadoše zahvatati vodu i naljevati u pojila da napoje stado oca svojega.
17 ౧౭ అప్పుడు వేరే మంద కాపరులు వచ్చి వాళ్ళను అక్కడి నుండి తోలివేశారు. మోషే లేచి ఆ అమ్మాయిలకు సహాయం చేసి, వాళ్ళ మందకు నీళ్లు తోడిపెట్టాడు.
A doðoše pastiri, i otjeraše ih; a Mojsije usta i odbrani ih, i napoji im stado.
18 ౧౮ వాళ్ళు తిరిగి తమ ఇంటికి తిరిగి వచ్చాక వారి తండ్రి రగూయేలు “మీరు ఇంత త్వరగా ఎలా వచ్చారు?” అని అడిగాడు.
I one se vratiše k ocu svojemu Raguilu; a on reèe: što se danas tako brzo vratiste?
19 ౧౯ అందుకు వాళ్ళు “ఒక ఐగుప్తీయుడు మంద కాపరుల చేతిలో నుండి మమ్మల్ని కాపాడి, నీళ్లు తోడి మన మందకు పోశాడు” అన్నారు.
A one rekoše: jedan Misirac odbrani nas od pastira, i nali nam i napoji stado.
20 ౨౦ అతడు తన కూతుళ్ళతో “అతడు ఏడీ? ఎందుకు విడిచిపెట్టి వచ్చారు? అతణ్ణి భోజనానికి పిలుచుకు రండి” అని చెప్పాడు.
A on reèe kæerima svojim: pa gdje je? zašto ostaviste toga èovjeka? zovite ga da jede.
21 ౨౧ మోషే ఆ కుటుంబంతో కలిసి నివసించడానికి అంగీకరించాడు. రగూయేలు తన కూతురు సిప్పోరాను మోషేకిచ్చి పెళ్లి చేశాడు.
I Mojsije se skloni da živi kod onoga èovjeka, i on dade Mojsiju kæer svoju Seforu.
22 ౨౨ వాళ్లకు ఒక కొడుకు పుట్టాడు. అప్పుడు మోషే “నేను పరాయి దేశంలో పరాయి వ్యక్తిగా ఉన్నాను” అనుకుని తన కొడుక్కి “గెర్షోము” అని పేరు పెట్టాడు.
I ona rodi sina, i on mu nadjede ime Girsam, jer sam, reèe, došljak u zemlji tuðoj.
23 ౨౩ ఈ విధంగా చాలా రోజులు గడచిపోయిన తరువాత ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇంకా బానిసత్వంలోనే ఉండి, నిట్టూర్పులు విడుస్తూ మొర పెడుతూ ఉన్నారు. తమ వెట్టిచాకిరీ మూలంగా వారు పెట్టిన మొరలు దేవుని సన్నిధికి చేరాయి.
A poslije mnogo vremena umrije car Misirski; i uzdisahu od nevolje sinovi Izrailjevi i vikahu; i vika njihova radi nevolje doðe do Boga.
24 ౨౪ దేవుడు వారి నిట్టూర్పులు, మూలుగులు విన్నాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు.
I Bog èu uzdisanje njihovo, i opomenu se Bog zavjeta svojega s Avramom, s Isakom i s Jakovom.
25 ౨౫ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూశాడు, వారిని పట్టించుకున్నాడు.
I pogleda Bog na sinove Izrailjeve, i vidje ih.

< నిర్గమకాండము 2 >