< నిర్గమకాండము 19 >
1 ౧ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన మూడవ నెల మొదటి రోజున సీనాయి ఎడారి ప్రాంతానికి వచ్చారు.
W trzecim miesiącu od wyjścia synów Izraela z ziemi Egiptu, w tym samym dniu, przyszli na pustynię Synaj.
2 ౨ వాళ్ళు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి ఎడారికి వచ్చి అక్కడ పర్వతం ఎదుట ఎడారిలో విడిది చేశారు.
Bo wyruszyli z Refidim i po przybyciu na pustynię Synaj rozbili obóz na pustyni; tam Izrael obozował naprzeciw góry.
3 ౩ మోషే యెహోవా సన్నిధి ఉన్న కొండపైకి ఎక్కి వెళ్ళాడు. యెహోవా ఆ కొండపై నుండి అతణ్ణి పిలిచాడు. యెహోవా మోషేతో “నువ్వు యాకోబు సంతతితో మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు.
A Mojżesz wstąpił do Boga i PAN zawołał do niego z góry: Tak powiesz domowi Jakuba i oznajmisz synom Izraela:
4 ౪ ‘నేను ఐగుప్తీయులకు ఏమి జరిగించానో, గరుడ పక్షి రెక్కల మీద మోసినట్టు మిమ్మల్ని నా దగ్గరికి ఎలా చేర్చుకొన్నానో మీరు చూశారు.
Widzieliście, co uczyniłem Egipcjanom i jak niosłem was na skrzydłach orłów, i przyprowadziłem was do siebie.
5 ౫ ఇప్పుడు మీరు నా మాట శ్రద్ధగా విని, నా ఒడంబడిక ప్రకారం నడుచుకుంటే అన్ని దేశ ప్రజల్లో నాకు విశేషమైన ఆస్తిగా ఉంటారు. భూమి అంతా నాదే గదా.
Dlatego teraz, jeśli posłuchacie mego głosu i będziecie przestrzegać mojego przymierza, będziecie moją szczególną własnością ponad wszystkie narody, bo do mnie należy cała ziemia.
6 ౬ మీరు యాజక రాజ్యంగా పవిత్రప్రజగా ఉంటారు.’ నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాల్సిన మాటలు ఇవే” అన్నాడు.
A wy będziecie mi królestwem kapłanów i narodem świętym. To są słowa, które będziesz mówić do synów Izraela.
7 ౭ మోషే కొండ దిగి వచ్చి ప్రజల పెద్దలను పిలిపించాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారికి తెలియజేశాడు.
Wtedy Mojżesz przyszedł i zwołał starszych ludu, i wyłożył im wszystkie te słowa, które mu PAN nakazał.
8 ౮ అందుకు ప్రజలంతా “యెహోవా చెప్పినదంతా మేము చేస్తాం” అని ముక్తకంఠంతో జవాబిచ్చారు. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజలు చెప్పిన మాటలను యెహోవాకు తెలియజేశాడు.
Cały lud odpowiedział wspólnie: Uczynimy wszystko, co PAN powiedział. I Mojżesz zaniósł słowa ludu do PANA.
9 ౯ యెహోవా మోషేతో “ఇదిగో నేను కారుమబ్బులో నీ దగ్గరికి వస్తున్నాను. నేను నీతో మాట్లాడుతూ ఉండగా ప్రజలు విని ఎప్పటికీ నీ మీద నమ్మకం ఉంచుతారు” అన్నాడు. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పాడు.
PAN powiedział do Mojżesza: Oto przyjdę do ciebie w gęstym obłoku, aby lud słyszał, gdy będę z tobą rozmawiał, i uwierzył ci na zawsze. A Mojżesz przekazał PANU słowa ludu.
10 ౧౦ అప్పుడు యెహోవా మోషేతో “నీవు ప్రజల దగ్గరికి వెళ్లి ఈ రోజూ రేపూ వాళ్ళను పవిత్రపరచు. నా రాక కోసం వాళ్ళు సిద్ధం చెయ్యి. వాళ్ళు తమ బట్టలు ఉతుక్కుని
PAN zaś mówił do Mojżesza: Idź do ludu i uświęć ich dziś i jutro, i niech wypiorą swoje szaty.
11 ౧౧ మూడవ రోజుకల్లా సిద్ధంగా ఉండాలి. మూడవ రోజు యెహోవా అనే నేను ప్రజలందరి కళ్ళెదుట సీనాయి కొండ పైకి దిగివస్తాను.
Niech będą gotowi na trzeci dzień. Trzeciego dnia bowiem PAN zstąpi na oczach całego ludu na górę Synaj.
12 ౧౨ నువ్వు కొండ చుట్టూ హద్దు ఏర్పాటు చెయ్యి. ప్రజలతో, ‘మీరు ఈ కొండ ఎక్కకూడదు. దాని అంచును కూడా ముట్టుకోకూడదు. జాగ్రత్త. ఈ కొండను ముట్టుకున్న ప్రతివాడూ మరణశిక్షకు లోనవుతాడు.
I wyznaczysz ludowi granice dokoła, mówiąc: Strzeżcie się, abyście nie wstępowali na górę ani nie dotykali jej podnóża. Każdy, kto dotknie góry, poniesie śmierć.
13 ౧౩ ఎవ్వరూ తమ చేతులతో ముట్టుకున్న వాణ్ణి తాకకూడదు. రాళ్ళతో గానీ బాణాలతో గానీ కచ్చితంగా అతణ్ణి చంపెయ్యాలి. మనిషైనా జంతువైనా మరణ శిక్ష విధించాల్సిందే. సుదీర్ఘమైన బూర శబ్దం వినినప్పుడు వాళ్ళు కొండ పాదానికి చేరుకోవాలి’ అని చెప్పు” అన్నాడు.
Nie dotknie go ręka, ale ukamienują [go] albo przeszyją strzałami; czy to zwierzę, czy człowiek, nie będzie żyć. Gdy przeciągle będą trąbić, niech podejdą do góry.
14 ౧౪ అప్పుడు మోషే కొండ దిగి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలను పవిత్ర పరిచాడు. ప్రజలు తమ బట్టలు ఉతుక్కున్నారు.
Mojżesz zstąpił więc z góry do ludu i uświęcił lud, a oni uprali swoje szaty.
15 ౧౫ అప్పుడు మోషే “మూడవ రోజుకల్లా సిద్ధంగా ఉండండి. మీ భార్యల దగ్గరికి వెళ్లొద్దు.” అని చెప్పాడు.
I mówił do ludu: Bądźcie gotowi na trzeci dzień, nie zbliżajcie się do żon.
16 ౧౬ మూడవ రోజు తెల్లవారగానే ఆ కొండ మీద దట్టమైన మేఘాలు కమ్మి ఉరుములు, మెరుపులు వచ్చాయి. భీకరమైన బూర శబ్దం వినిపించినప్పుడు శిబిరంలోని ప్రజలంతా భయంతో వణకిపోయారు.
Trzeciego dnia o poranku pojawiły się grzmoty i błyskawice, i gęsty obłok nad górą, i bardzo potężny głos trąby, tak że cały lud, który był w obozie, zadrżał.
17 ౧౭ దేవుణ్ణి ఎదుర్కొనడానికి మోషే శిబిరంలో నుండి ప్రజలను బయటకు రప్పించాడు. ప్రజలంతా కొండ పాదం దగ్గర నిలబడ్డారు.
I Mojżesz wyprowadził lud z obozu na spotkanie z Bogiem, i stanęli u stóp góry.
18 ౧౮ మండుతున్న మంటలతో యెహోవా సీనాయి కొండపైకి దిగి వచ్చాడు. ఆ కొండ అంతా పొగ కమ్మింది. అది కొలిమి పొగలాగా పైకి లేస్తూ ఉంది. ఆ కొండంతా తీవ్రంగా కంపించింది.
A góra Synaj cała dymiła, gdyż PAN zstąpił na nią w ogniu. Dym unosił się z niej jak dym z pieca i cała góra bardzo się trzęsła.
19 ౧౯ ఆ బూర శబ్దం మరింత పెరుగుతూ ఉండగా మోషే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఉరుములాంటి కంఠ స్వరంతో అతనికి జవాబిస్తున్నాడు.
A gdy głos trąby się przeciągał i coraz bardziej się rozlegał, Mojżesz mówił, a Bóg odpowiadał mu głosem.
20 ౨౦ యెహోవా సీనాయి కొండ శిఖరం మీదికి దిగి వచ్చాడు. కొండ శిఖరం మీదికి రమ్మని మోషేను పిలిచినప్పుడు మోషే ఎక్కి వెళ్ళాడు.
I PAN zstąpił na górę Synaj, na szczyt góry. Wtedy PAN wezwał Mojżesza na szczyt góry i Mojżesz [tam] wstąpił.
21 ౨౧ అప్పుడు యెహోవా మోషేతో “ఈ ప్రజలు యెహోవాను చూద్దామని హద్దు మీరి వచ్చి వారిలో చాలా మంది నశించిపోకుండేలా నువ్వు కొండ దిగి వెళ్లి వాళ్లను కచ్చితంగా హెచ్చరించు.
Potem PAN powiedział do Mojżesza: Zejdź, przestrzeż lud, by nie przekroczył granicy, aby zobaczyć PANA, i aby wielu z nich nie zginęło.
22 ౨౨ ఇంకా నన్ను సమీపించే యాజకులు సిద్ధపడి నేను వారిని చంపకుండేలా తమను తాము పవిత్ర పరుచుకోవాలని చెప్పు” అన్నాడు.
Nawet kapłani, którzy zbliżają się do PANA, niech się uświęcą, by ich PAN nie wytracił.
23 ౨౩ అందుకు మోషే యెహోవాతో “ప్రజలు సీనాయి కొండ ఎక్కలేరు. నువ్వు కొండకు హద్దులు ఏర్పాటు చేసి దాన్ని పవిత్రంగా ఉంచాలని మాకు కచ్చితంగా ఆజ్ఞాపించావు గదా” అన్నాడు.
I Mojżesz powiedział do PANA: Lud nie może wejść na górę Synaj, ponieważ ty nas przestrzegłeś, mówiąc: Wyznacz granice wokół góry i uświęć ją.
24 ౨౪ అప్పుడు యెహోవా “నువ్వు కిందకు దిగి వెళ్లు. నువ్వు అహరోనును వెంటబెట్టుకుని తిరిగి రావాలి. అయితే యెహోవా వారి మీద పడకుండా ఉండేలా యాజకులు, ప్రజలు హద్దు మీరి ఆయన దగ్గరికి ఎక్కి రాకూడదు” అని చెప్పాడు.
PAN powiedział do niego: Idź, zejdź, a [potem] wstąpisz ty i Aaron z tobą. Lecz kapłani i lud niech nie przekraczają [granicy], by wstąpić do PANA, aby ich nie wytracił.
25 ౨౫ మోషే ప్రజల దగ్గరికి వెళ్లి ఆ మాట వాళ్ళతో చెప్పాడు.
Mojżesz zszedł więc do ludu i powiedział im to.