< నిర్గమకాండము 19 >

1 ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన మూడవ నెల మొదటి రోజున సీనాయి ఎడారి ప్రాంతానికి వచ్చారు.
以色列子民離開埃及國後,第三個月初一那一天,到了西乃曠野。
2 వాళ్ళు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి ఎడారికి వచ్చి అక్కడ పర్వతం ఎదుట ఎడారిలో విడిది చేశారు.
他們從勒非丁起程,來到西乃曠野,就在曠野中安了營;以色列人在那坐山前安了營。
3 మోషే యెహోవా సన్నిధి ఉన్న కొండపైకి ఎక్కి వెళ్ళాడు. యెహోవా ఆ కొండపై నుండి అతణ్ణి పిలిచాడు. యెహోవా మోషేతో “నువ్వు యాకోబు సంతతితో మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు.
梅瑟上到天主前,上主從山上召喚他說:你要這樣告訴亞各伯家,訓示以色列子民說:
4 ‘నేను ఐగుప్తీయులకు ఏమి జరిగించానో, గరుడ పక్షి రెక్కల మీద మోసినట్టు మిమ్మల్ని నా దగ్గరికి ఎలా చేర్చుకొన్నానో మీరు చూశారు.
你們親自見了我怎樣對待了埃及人,怎樣好似鷹將你們背在翅膀上,將你們帶出來歸屬我。
5 ఇప్పుడు మీరు నా మాట శ్రద్ధగా విని, నా ఒడంబడిక ప్రకారం నడుచుకుంటే అన్ని దేశ ప్రజల్లో నాకు విశేషమైన ఆస్తిగా ఉంటారు. భూమి అంతా నాదే గదా.
現在你們若真聽我的話,遵守我的盟約,你們在萬民中將成為我的特殊產業。的確,普世全屬於我,
6 మీరు యాజక రాజ్యంగా పవిత్రప్రజగా ఉంటారు.’ నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాల్సిన మాటలు ఇవే” అన్నాడు.
但你們為我應成為司祭的國家,聖潔的國民。你應將這話訓示以色列子民。」
7 మోషే కొండ దిగి వచ్చి ప్రజల పెద్దలను పిలిపించాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారికి తెలియజేశాడు.
梅瑟就去召集百姓的長老,將上主吩咐他的那一切話,都在他們前說明了。
8 అందుకు ప్రజలంతా “యెహోవా చెప్పినదంతా మేము చేస్తాం” అని ముక్తకంఠంతో జవాబిచ్చారు. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజలు చెప్పిన మాటలను యెహోవాకు తెలియజేశాడు.
眾百姓一致回答說:「凡上主所吩咐的,我們全要作。」梅瑟遂將百姓的答覆轉達於上主。
9 యెహోవా మోషేతో “ఇదిగో నేను కారుమబ్బులో నీ దగ్గరికి వస్తున్నాను. నేను నీతో మాట్లాడుతూ ఉండగా ప్రజలు విని ఎప్పటికీ నీ మీద నమ్మకం ఉంచుతారు” అన్నాడు. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పాడు.
上主向梅瑟說:「我要在濃雲中降到你前,叫百姓聽見我與你談話,使他們永遠信服你。」梅瑟遂向上主呈報了百姓的答覆。結約的準備
10 ౧౦ అప్పుడు యెహోవా మోషేతో “నీవు ప్రజల దగ్గరికి వెళ్లి ఈ రోజూ రేపూ వాళ్ళను పవిత్రపరచు. నా రాక కోసం వాళ్ళు సిద్ధం చెయ్యి. వాళ్ళు తమ బట్టలు ఉతుక్కుని
上主向梅瑟說:「你到百姓那裏,叫他們今天明天聖潔自己,洗淨自己的衣服。
11 ౧౧ మూడవ రోజుకల్లా సిద్ధంగా ఉండాలి. మూడవ రోజు యెహోవా అనే నేను ప్రజలందరి కళ్ళెదుట సీనాయి కొండ పైకి దిగివస్తాను.
第三天都準備妥當,因為第三天,少主要在百姓觀望之下降到西乃山上。
12 ౧౨ నువ్వు కొండ చుట్టూ హద్దు ఏర్పాటు చెయ్యి. ప్రజలతో, ‘మీరు ఈ కొండ ఎక్కకూడదు. దాని అంచును కూడా ముట్టుకోకూడదు. జాగ్రత్త. ఈ కొండను ముట్టుకున్న ప్రతివాడూ మరణశిక్షకు లోనవుతాడు.
你要給百姓在山周圍劃定界限說:應小心,不可上山,也不可觸摸山腳;凡觸摸那山的,應處死刑。
13 ౧౩ ఎవ్వరూ తమ చేతులతో ముట్టుకున్న వాణ్ణి తాకకూడదు. రాళ్ళతో గానీ బాణాలతో గానీ కచ్చితంగా అతణ్ణి చంపెయ్యాలి. మనిషైనా జంతువైనా మరణ శిక్ష విధించాల్సిందే. సుదీర్ఘమైన బూర శబ్దం వినినప్పుడు వాళ్ళు కొండ పాదానికి చేరుకోవాలి’ అని చెప్పు” అన్నాడు.
誰也不可用手觸摸那人,而應用石頭砸死或用箭射死;不論是獸是人,都不得生存;號角響起的時候,他們才可上山。」
14 ౧౪ అప్పుడు మోషే కొండ దిగి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలను పవిత్ర పరిచాడు. ప్రజలు తమ బట్టలు ఉతుక్కున్నారు.
梅瑟下山來到百姓那裏,叫他們聖潔自己,洗淨自己的衣服。
15 ౧౫ అప్పుడు మోషే “మూడవ రోజుకల్లా సిద్ధంగా ఉండండి. మీ భార్యల దగ్గరికి వెళ్లొద్దు.” అని చెప్పాడు.
他向百姓說:「到第三天應準備妥當,不可接近女人。」天主顯現
16 ౧౬ మూడవ రోజు తెల్లవారగానే ఆ కొండ మీద దట్టమైన మేఘాలు కమ్మి ఉరుములు, మెరుపులు వచ్చాయి. భీకరమైన బూర శబ్దం వినిపించినప్పుడు శిబిరంలోని ప్రజలంతా భయంతో వణకిపోయారు.
到了第三天早晨,山上雷電交作,濃雲密布,角聲齊鳴,此時在營中的百姓都戰戰兢兢。
17 ౧౭ దేవుణ్ణి ఎదుర్కొనడానికి మోషే శిబిరంలో నుండి ప్రజలను బయటకు రప్పించాడు. ప్రజలంతా కొండ పాదం దగ్గర నిలబడ్డారు.
梅瑟叫百姓從營中出來迎接天主,他們都站在山下。
18 ౧౮ మండుతున్న మంటలతో యెహోవా సీనాయి కొండపైకి దిగి వచ్చాడు. ఆ కొండ అంతా పొగ కమ్మింది. అది కొలిమి పొగలాగా పైకి లేస్తూ ఉంది. ఆ కొండంతా తీవ్రంగా కంపించింది.
此時西乃全山冒煙,因為上主在火中降到山上;冒出的煙像火窯的煙,全山猛烈振動。
19 ౧౯ ఆ బూర శబ్దం మరింత పెరుగుతూ ఉండగా మోషే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఉరుములాంటి కంఠ స్వరంతో అతనికి జవాబిస్తున్నాడు.
角生越響越高;梅瑟遂開始說話,天住藉雷霆答覆他。
20 ౨౦ యెహోవా సీనాయి కొండ శిఖరం మీదికి దిగి వచ్చాడు. కొండ శిఖరం మీదికి రమ్మని మోషేను పిలిచినప్పుడు మోషే ఎక్కి వెళ్ళాడు.
上主降到西乃山頂上,召梅瑟上到山頂;梅瑟就上去了。
21 ౨౧ అప్పుడు యెహోవా మోషేతో “ఈ ప్రజలు యెహోవాను చూద్దామని హద్దు మీరి వచ్చి వారిలో చాలా మంది నశించిపోకుండేలా నువ్వు కొండ దిగి వెళ్లి వాళ్లను కచ్చితంగా హెచ్చరించు.
上主向梅瑟說:「下去通告百姓:不可闖到上主面前觀看,免得許多人死亡。
22 ౨౨ ఇంకా నన్ను సమీపించే యాజకులు సిద్ధపడి నేను వారిని చంపకుండేలా తమను తాము పవిత్ర పరుచుకోవాలని చెప్పు” అన్నాడు.
連那些接近上主的司祭們,也應聖潔自己,免得上主擊殺他們。」
23 ౨౩ అందుకు మోషే యెహోవాతో “ప్రజలు సీనాయి కొండ ఎక్కలేరు. నువ్వు కొండకు హద్దులు ఏర్పాటు చేసి దాన్ని పవిత్రంగా ఉంచాలని మాకు కచ్చితంగా ఆజ్ఞాపించావు గదా” అన్నాడు.
梅瑟答覆上主說:「百姓不能上西乃山,因你自己曾通告我們說:要在山的四周劃定界限,也宣佈這山是不可侵犯的。」
24 ౨౪ అప్పుడు యెహోవా “నువ్వు కిందకు దిగి వెళ్లు. నువ్వు అహరోనును వెంటబెట్టుకుని తిరిగి రావాలి. అయితే యెహోవా వారి మీద పడకుండా ఉండేలా యాజకులు, ప్రజలు హద్దు మీరి ఆయన దగ్గరికి ఎక్కి రాకూడదు” అని చెప్పాడు.
上主向他說:「下去,你同亞郎一起上來,但司祭和百姓不可闖到上主前,免得我擊殺他們。」
25 ౨౫ మోషే ప్రజల దగ్గరికి వెళ్లి ఆ మాట వాళ్ళతో చెప్పాడు.
梅瑟便下到百姓那裏,通知了他們。

< నిర్గమకాండము 19 >