< నిర్గమకాండము 17 >

1 యెహోవా మాట ప్రకారం ఇశ్రాయేలు ప్రజల సమూహమంతా సీను ఎడారి ప్రాంతం నుండి ప్రయాణం చేసి రెఫీదీములో దిగారు. అక్కడ ప్రజలు తాగడానికి నీళ్ళు లేవు.
Gbogbo ìjọ ènìyàn Israẹli si gbéra láti jáde kúrò láti aginjù Sini wọ́n ń lọ láti ibi kan de ibi kan gẹ́gẹ́ bí Olúwa ti pàṣẹ. Wọ́n pàgọ́ sí Refidimu, ṣùgbọ́n kò sí omi fún àwọn ènìyàn láti mú.
2 దానికి వాళ్ళు మోషే పై నింద మోపుతూ “మాకు తాగడానికి నీళ్లియ్యి” అన్నారు. అప్పుడు మోషే “మీరు నాతో ఎందుకు పోట్లాడుతున్నారు? యెహోవాను ఎందుకు శోధిస్తున్నారు?” అన్నాడు.
Àwọn ènìyàn sì sọ̀ fún Mose, wọ́n wí pé, “Fún wa ni omi mu.” Mose dá wọn lóhùn wí pé, “Èéṣe ti ẹ̀yin fi ń bá mi jà? Èéṣe ti ẹ̀yin fi ń dán Olúwa wò?”
3 ప్రజలు దాహంతో మోషే మీద సణుగుతూ “ఇదేంటి? మమ్మల్ని, మా పిల్లలను, మా పశువులను దాహంతో చంపడానికి ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకువచ్చావా?” అన్నారు.
Ṣùgbọ́n òǹgbẹ ń gbẹ àwọn ènìyàn, wọ́n sì ń kùn sí Mose, wọ́n wí pé, “Èéṣe tí ìwọ fi mú wa jáde kúrò ní Ejibiti láti mú kí òǹgbẹ pa àwa, àwọn ọmọ wa àti ohun ọ̀sìn wa ku fún òǹgbẹ.”
4 అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టాడు. “ఈ ప్రజలను నేనేం చెయ్యాలి? కొంచెం సేపట్లో వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపుతారేమో” అన్నాడు.
Nígbà náà ni Mose gbé ohùn rẹ̀ sókè sí Olúwa pé, “Kí ni kí èmi kí ó ṣe fún àwọn ènìyàn yìí? Wọ́n múra tan láti sọ mi ni òkúta.”
5 అప్పుడు యెహోవా “ప్రజల పెద్దల్లో కొందరిని వెంటబెట్టుకుని నువ్వు నదిని కొట్టిన నీ కర్రను చేతబట్టుకుని ప్రజలకు ఎదురుగా వెళ్లి నిలబడు.
Olúwa sì dá Mose lóhùn pé, “Máa lọ síwájú àwọn ènìyàn, mú nínú àwọn àgbàgbà Israẹli pẹ̀lú rẹ, mú ọ̀pá tí ìwọ fi lu odò Naili lọ́wọ́ kí ó sì máa lọ.
6 నేను అక్కడ హోరేబులోని బండ మీద నీకు ఎదురుగా నిలబడతాను. నువ్వు ఆ బండను కర్రతో కొట్టు. అప్పుడు ప్రజలు తాగడానికి ఆ బండలో నుంచి నీళ్లు బయటకు వస్తాయి” అని మోషేతో చెప్పాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దల కళ్ళెదుట ఆ విధంగా చేశాడు.
Èmi yóò dúró ni ibẹ̀ dè ọ ni orí àpáta ni Horebu. Ìwọ ó sì lu àpáta, omi yóò sì jáde nínú rẹ̀ fún àwọn ènìyàn láti mu.” Mose sì ṣe bẹ́ẹ̀ ni iwájú àwọn àgbàgbà Israẹli.
7 అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలు చేసిన గొడవనుబట్టి, వారు “యెహోవా మన మధ్య ఉన్నాడా, లేడా?” అని యెహోవాను శోధించడాన్నిబట్టి ఆ స్థలానికి “మస్సా” అనీ “మెరీబా” అనీ పేర్లు పెట్టాడు.
Ó sì sọ orúkọ ibẹ̀ ni Massa àti Meriba, nítorí àwọn ọmọ Israẹli sọ̀, wọ́n sì dán Olúwa wò, wọ́n wí pé, “Ǹjẹ́ Olúwa ń bẹ láàrín wa tàbí kò sí?”
8 తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధానికి సిద్ధమయ్యారు.
Àwọn ara Amaleki jáde, wọ́n sì dìde ogun sí àwọn ọmọ Israẹli ni Refidimu.
9 మోషే యెహోషువతో “మన కోసం కొంతమందిని సిద్ధం చేసి బయలుదేరి అమాలేకీయులతో యుద్ధం చెయ్యి. నేను రేపు దేవుని కర్ర చేత్తో పట్టుకుని ఆ కొండ శిఖరంపై నిలబడతాను” అన్నాడు.
Mose sì sọ fún Joṣua pé, “Yàn lára àwọn ọkùnrin fún wa, kí wọn ó sì jáde lọ bá àwọn ará Amaleki jà. Ní ọ̀la, èmi yóò dúró ni orí òkè pẹ̀lú ọ̀pá Ọlọ́run ní ọwọ́ mi.”
10 ౧౦ యెహోషువ మోషే తనతో చెప్పినట్టు అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళాడు. మోషే, అహరోను, హూరు ఆ కొండ శిఖరం ఎక్కారు.
Joṣua ṣe bí Mose ti wí fún un, ó sì bá àwọn ará Amaleki jagun; nígbà tí Mose, Aaroni àti Huri lọ sí orí òkè náà.
11 ౧౧ మోషే తన చెయ్యి పైకెత్తి ఉంచినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు, మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలవ సాగారు.
Níwọ́n ìgbà tí Mose bá gbé apá rẹ̀ sókè, Israẹli n borí ṣùgbọ́n nígbà tí ó bá sì rẹ apá rẹ̀ sílẹ̀, Amaleki a sì borí.
12 ౧౨ మోషే చేతులు బరువెక్కినప్పుడు అహరోను, హూరు ఒక రాయి తెచ్చి మోషేను దానిపై కూర్చోబెట్టారు. అహరోను, హూరు ఇద్దరూ మోషేకు అటు ఇటు ఆనుకుని నిలబడి సూర్యుడు అస్తమించేదాకా అతని చేతులు ఎత్తి పట్టుకున్నారు.
Ṣùgbọ́n apá ń ro Mose, wọ́n mú òkúta, wọ́n sì fi sí abẹ́ rẹ̀, ó sì jókòó lé òkúta náà; Aaroni àti Huri sì mu ní apá rẹ̀, ọ̀kan ní apá ọ̀tún àti èkejì ni apá òsì; apá rẹ̀ méjèèjì sì dúró gangan títí di ìgbà ti oòrùn wọ.
13 ౧౩ ఆ విధంగా యెహోషువ కత్తి బలంతో అమాలేకు రాజును, అతని సైన్యాన్ని ఓడించాడు.
Joṣua sì fi ojú idà ṣẹ́gun àwọn ará Amaleki.
14 ౧౪ అప్పుడు యెహోవా మోషేతో “చిరకాలం జ్ఞాపకం ఉండేలా పుస్తకంలో ఈ విషయం రాసి అది యెహోషువకు వినిపించు. నేను అమాలేకీయులను ఆకాశం కింద నామరూపాలు లేకుండా పూర్తిగా తుడిచి పెట్టేస్తాను” అన్నాడు.
Olúwa sì sọ fun Mose pé. “Kọ èyí sì inú ìwé fún ìrántí, kí o sì sọ fún Joṣua pẹ̀lú; nítorí èmi yóò pa ìrántí Amaleki run pátápátá kúrò lábẹ́ ọ̀run.”
15 ౧౫ తరువాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి “యెహోవా నిస్సీ” అని పేరు పెట్టాడు.
Mose sì tẹ́ pẹpẹ kan, ó sì sọ orúkọ pẹpẹ náà ní Olúwa ni Àsíá mi.
16 ౧౬ అమాలేకీయులు యెహోవా సింహాసనానికి వ్యతిరేకంగా చెయ్యి ఎత్తారు గనక “యెహోవాకు అమాలేకీయులతో తరతరాలకు వైరం ఉంటుంది అని యెహోవా శపథం చేశాడు” అన్నాడు కాబట్టి అతడు ఇలా చేశాడు.
Ó wí pé, “A gbé ọwọ́ sókè sí ìtẹ́ Olúwa. Olúwa yóò bá Amaleki jagun láti ìran dé ìran.”

< నిర్గమకాండము 17 >