< నిర్గమకాండము 17 >
1 ౧ యెహోవా మాట ప్రకారం ఇశ్రాయేలు ప్రజల సమూహమంతా సీను ఎడారి ప్రాంతం నుండి ప్రయాణం చేసి రెఫీదీములో దిగారు. అక్కడ ప్రజలు తాగడానికి నీళ్ళు లేవు.
Inhlangano yonke yabantwana bakoIsrayeli yasuka enkangala yeSini, ngamalombolombo abo, ngokomlayo weNkosi, bamisa inkamba eRefidimi; kodwa kwakungelamanzi okuthi abantu banathe.
2 ౨ దానికి వాళ్ళు మోషే పై నింద మోపుతూ “మాకు తాగడానికి నీళ్లియ్యి” అన్నారు. అప్పుడు మోషే “మీరు నాతో ఎందుకు పోట్లాడుతున్నారు? యెహోవాను ఎందుకు శోధిస్తున్నారు?” అన్నాడు.
Ngakho abantu bamsola uMozisi bathi: Sinike amanzi, sinathe. UMozisi wasesithi kubo: Lingisolelani? Liyilingelani iNkosi?
3 ౩ ప్రజలు దాహంతో మోషే మీద సణుగుతూ “ఇదేంటి? మమ్మల్ని, మా పిల్లలను, మా పశువులను దాహంతో చంపడానికి ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకువచ్చావా?” అన్నారు.
Abantu basebesomela amanzi lapho, abantu bangunguna kuMozisi bathi: Wasenyuselani eGibhithe ukuze usibulale thina labantwana bethu lezifuyo zethu ngokoma?
4 ౪ అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టాడు. “ఈ ప్రజలను నేనేం చెయ్యాలి? కొంచెం సేపట్లో వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపుతారేమో” అన్నాడు.
UMozisi wasekhala eNkosini esithi: Ngizakwenzani kulababantu? Sekukancane ukuthi bangikhande ngamatshe.
5 ౫ అప్పుడు యెహోవా “ప్రజల పెద్దల్లో కొందరిని వెంటబెట్టుకుని నువ్వు నదిని కొట్టిన నీ కర్రను చేతబట్టుకుని ప్రజలకు ఎదురుగా వెళ్లి నిలబడు.
INkosi yasisithi kuMozisi: Dlula phambi kwabantu, uthathe kanye lawe kubadala bakoIsrayeli, lentonga yakho owatshaya umfula ngayo, ithathe ngesandla sakho, uhambe.
6 ౬ నేను అక్కడ హోరేబులోని బండ మీద నీకు ఎదురుగా నిలబడతాను. నువ్వు ఆ బండను కర్రతో కొట్టు. అప్పుడు ప్రజలు తాగడానికి ఆ బండలో నుంచి నీళ్లు బయటకు వస్తాయి” అని మోషేతో చెప్పాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దల కళ్ళెదుట ఆ విధంగా చేశాడు.
Khangela, ngizakuma lapho phambi kwakho phezu kwedwala eHorebe; njalo uzatshaya idwala, kuphume-ke kulo amanzi ukuze abantu banathe. UMozisi wasesenza njalo phambi kwamehlo abadala bakoIsrayeli.
7 ౭ అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలు చేసిన గొడవనుబట్టి, వారు “యెహోవా మన మధ్య ఉన్నాడా, లేడా?” అని యెహోవాను శోధించడాన్నిబట్టి ఆ స్థలానికి “మస్సా” అనీ “మెరీబా” అనీ పేర్లు పెట్టాడు.
Wasebiza ibizo lendawo ngokuthi yiMasa lokuthi yiMeriba ngenxa yokusola kwabantwana bakoIsrayeli langenxa yokuyilinga kwabo iNkosi besithi: INkosi iphakathi kwethu yini loba hatshi?
8 ౮ తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధానికి సిద్ధమయ్యారు.
Kwasekufika uAmaleki, walwa loIsrayeli eRefidimi.
9 ౯ మోషే యెహోషువతో “మన కోసం కొంతమందిని సిద్ధం చేసి బయలుదేరి అమాలేకీయులతో యుద్ధం చెయ్యి. నేను రేపు దేవుని కర్ర చేత్తో పట్టుకుని ఆ కొండ శిఖరంపై నిలబడతాను” అన్నాడు.
UMozisi wasesithi kuJoshuwa: Sikhethele amadoda, uphume uyekulwa loAmaleki; kusasa ngizakuma engqongeni yoqaqa, lentonga kaNkulunkulu izakuba sesandleni sami.
10 ౧౦ యెహోషువ మోషే తనతో చెప్పినట్టు అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళాడు. మోషే, అహరోను, హూరు ఆ కొండ శిఖరం ఎక్కారు.
UJoshuwa wasesenza njengokutsho kukaMozisi kuye, walwa loAmaleki. OMozisi, uAroni loHuri basebesenyukela engqongeni yoqaqa.
11 ౧౧ మోషే తన చెయ్యి పైకెత్తి ఉంచినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు, మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలవ సాగారు.
Kwasekusithi lapho uMozisi ephakamisa isandla sakhe, uIsrayeli waba lamandla; kodwa lapho wehlisa isandla sakhe, uAmaleki waba lamandla.
12 ౧౨ మోషే చేతులు బరువెక్కినప్పుడు అహరోను, హూరు ఒక రాయి తెచ్చి మోషేను దానిపై కూర్చోబెట్టారు. అహరోను, హూరు ఇద్దరూ మోషేకు అటు ఇటు ఆనుకుని నిలబడి సూర్యుడు అస్తమించేదాకా అతని చేతులు ఎత్తి పట్టుకున్నారు.
Kodwa izandla zikaMozisi zaba nzima, ngakho bathatha ilitshe, balibeka ngaphansi kwakhe, ukuthi ahlale kulo. OAroni loHuri basebesekela izandla zakhe, omunye engapha lomunye engale, ukuze izandla zakhe ziqine lize litshone ilanga.
13 ౧౩ ఆ విధంగా యెహోషువ కత్తి బలంతో అమాలేకు రాజును, అతని సైన్యాన్ని ఓడించాడు.
UJoshuwa wasemchitha uAmaleki labantu bakhe ngobukhali benkemba.
14 ౧౪ అప్పుడు యెహోవా మోషేతో “చిరకాలం జ్ఞాపకం ఉండేలా పుస్తకంలో ఈ విషయం రాసి అది యెహోషువకు వినిపించు. నేను అమాలేకీయులను ఆకాశం కింద నామరూపాలు లేకుండా పూర్తిగా తుడిచి పెట్టేస్తాను” అన్నాడు.
INkosi yasisithi kuMozisi: Bhala lokhu egwalweni kube yisikhumbuzo, ukubeke ezindlebeni zikaJoshuwa ukuthi ngokwesula ngizakwesula ukukhunjulwa kukaAmaleki ngaphansi kwamazulu.
15 ౧౫ తరువాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి “యెహోవా నిస్సీ” అని పేరు పెట్టాడు.
UMozisi wasesakha ilathi, wabiza ibizo lalo ngokuthi: UJehova-nisi;
16 ౧౬ అమాలేకీయులు యెహోవా సింహాసనానికి వ్యతిరేకంగా చెయ్యి ఎత్తారు గనక “యెహోవాకు అమాలేకీయులతో తరతరాలకు వైరం ఉంటుంది అని యెహోవా శపథం చేశాడు” అన్నాడు కాబట్టి అతడు ఇలా చేశాడు.
wathi: Ngoba isandla sisesihlahleni sobukhosi seNkosi, iNkosi izakuba lempi imelene loAmaleki kusukela kusizukulwana kusiya kusizukulwana.