< నిర్గమకాండము 16 >
1 ౧ తరువాత ఇశ్రాయేలు ప్రజలంతా ఏలీము నుండి బయలుదేరి వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన రెండవ నెల పదిహేనోరోజున ఏలీముకు సీనాయికి మధ్య ఉన్న సీను ఎడారి ప్రాంతానికి వచ్చారు.
Så brøt de op fra Elim, og den femtende dag i den annen måned efterat de hadde draget ut av Egyptens land, kom hele Israels barns menighet til ørkenen Sin, som ligger mellem Elim og Sinai.
2 ౨ అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ మోషే, అహరోనుల మీద సణుగుకున్నారు.
Og hele Israels barns menighet knurret mot Moses og Aron i ørkenen.
3 ౩ ప్రజలు వారితో “మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాంసం వండుకుని కుండల దగ్గర కూర్చుని తృప్తిగా భోజనం చేసేవాళ్ళం. ఆ సమయంలోనే యెహోవా చేతిలో మేము చనిపోయి ఉన్నట్టయితే బాగుండేది. మేమంతా ఆకలితో చనిపోవడం కోసం ఇక్కడికి తీసుకు వచ్చారు” అన్నారు.
Og Israels barn sa til dem: Å, om vi var død for Herrens hånd i Egyptens land da vi satt ved kjøttgrytene, og da vi åt brød til vi blev mette! For I har ført oss hit ut i ørkenen for å la hele denne store folkeskare dø av hunger.
4 ౪ యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నేను ఆకాశం నుండి మీ కోసం ఆహారం కురిపిస్తాను. ప్రతిరోజూ ప్రజలు వెళ్లి ఆనాటికి సరిపడేటంత ఆహారం సమకూర్చుకోవాలి. వాళ్ళు నా ఉపదేశం ప్రకారం నడుచుకుంటున్నారో లేదో నేను పరిశీలిస్తాను.
Da sa Herren til Moses: Se, jeg vil la regne ned brød fra himmelen til eder, og folket skal gå ut og sanke for hver dag det de trenger; således vil jeg prøve dem, om de vil følge min lov eller ikke.
5 ౫ ఆరవ రోజున వాళ్ళు మిగతా అన్ని రోజుల కంటే రెండింతలు సేకరించుకుని తెచ్చుకున్నది వండుకోవాలి.”
Og på den sjette dag skal de lage til det som de har hatt med hjem, og det skal være dobbelt så meget som det de ellers sanker for hver dag.
6 ౬ మోషే, అహరోనులు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా అన్నారు. “మీరు మా మీద ఎందుకు సణుక్కుంటారు? మేము ఎంతటి వాళ్ళం? యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన విన్నాడు.
Og Moses og Aron sa til alle Israels barn: Iaften skal I kjenne at det er Herren som har ført eder ut av Egyptens land,
7 ౭ ఐగుప్తు దేశం నుండి యెహోవాయే మిమ్మల్ని బయటికి రప్పించాడని సాయంత్రం నాటికి మీరు తెలుసుకుంటారు. రేపు ఉదయానికి మీరు యెహోవా మహిమా ప్రభావం చూస్తారు.”
og imorgen skal I få se Herrens herlighet, fordi han har hørt hvorledes I knurrer mot ham; for hvad er vi, at I knurrer mot oss?
8 ౮ మోషే వాళ్ళతో “మీరు సాయంత్రం తినడానికి మాంసం, ఉదయాన సరిపడినంత ఆహారం యెహోవా మీకు ఇస్తున్నప్పుడు మీరు ఇది తెలుసుకుంటారు. మీరు ఆయన మీద సణుక్కోవడం ఆయన విన్నాడు. మీరు సణుక్కోవడం యెహోవా మీదే, మా మీద కాదు. మాపై సణుక్కోవడానికి మేమెంతటివాళ్ళం?” అన్నాడు.
Så sa Moses: I skal få se det når Herren iaften gir eder kjøtt å ete og imorgen brød, så I blir mette; for Herren har hørt hvorledes I knurrer og murrer mot ham; for hvad er vel vi? Det er ikke mot oss I knurrer, men mot Herren.
9 ౯ మోషే అహరోనులతో యెహోవా “ప్రజల సర్వ సమాజంతో ఇలా చెప్పు, ఆయన మీ సణుగులు విన్నాడు. సర్వ సమాజం అంతా యెహోవా సన్నిధికి రండి.”
Og Moses sa til Aron: Si til hele Israels barns menighet: Kom frem for Herrens åsyn; for han har hørt hvorledes I knurrer.
10 ౧౦ అహరోను ఇశ్రాయేలు సమాజమంతటితో మాట్లాడుతున్న సమయంలోనే ప్రజలు ఎడారి వైపు చూశారు. అప్పుడు మేఘంలో యెహోవా మహిమ వాళ్లకు కనిపించింది.
Da så Aron talte til hele Israels barns menighet, vendte de sig mot ørkenen, og se, Herrens herlighet åpenbarte sig i skyen.
11 ౧౧ అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “నేను ఇశ్రాయేలు ప్రజల సణుగులు విన్నాను.
Og Herren talte til Moses og sa:
12 ౧౨ వాళ్ళతో ఇలా చెప్పు. సాయంత్రం పూట మీరు మాంసం తింటారు, ఉదయం పూట తృప్తిగా ఆహారం తింటారు. అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.”
Jeg har hørt hvorledes Israels barn knurrer; tal til dem og si: Imellem de to aftenstunder skal I få kjøtt å ete, og imorgen skal I mettes med brød, og I skal kjenne at jeg er Herren eders Gud.
13 ౧౩ అలాగే జరిగింది. సాయంకాలం అయినప్పుడు పూరేడు పిట్టలు వచ్చి శిబిరం అంతా కమ్ముకున్నాయి. ఉదయమయ్యాక శిబిరం అంతా మంచు పడి ఉంది.
Da det nu blev aften, kom det vaktler og dekket leiren, og om morgenen var det et lag av dugg rundt omkring leiren.
14 ౧౪ నేలపై మంచు ఇంకిపోయాక నేలమీద సన్నని కణాలు పొరలుగా ఎడారి భూమి మీద కనబడ్డాయి.
Og da duggen gikk bort, se, da lå det utover ørkenen noget fint, kornet, fint som rim på jorden.
15 ౧౫ ఇశ్రాయేలీయులు దాన్ని చూసి, అది ఏమిటో తెలియక “ఇదేంటి?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
Da Israels barn så det, sa de til hverandre: Hvad er det? for de visste ikke hvad det var. Da sa Moses til dem: Det er det brød Herren har gitt eder å ete.
16 ౧౬ మోషే వాళ్ళతో “ఇది తినడానికి యెహోవా మీకిచ్చిన ఆహారం. యెహోవా ఏమి చెబుతున్నాడంటే, ప్రతి ఒక్కరూ తమకు అవసరమైనంత మేరకు సేకరించుకోవాలి. తమ గుడారంలో ఉన్న వాళ్ళ కోసం ప్రతి ఒక్కరికీ ఒక ఓమెరు చొప్పున తీసుకోవాలి.”
Således har Herren befalt: Sank av det efter som enhver trenger, en omer til manns efter tallet på eders husfolk; enhver skal ta for dem som er i hans telt.
17 ౧౭ ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా చేశారు. అయితే కొందరు ఎక్కువగా, కొందరు తక్కువగా కూర్చుకున్నారు.
Og Israels barn gjorde således, og de sanket, den ene meget, den andre lite.
18 ౧౮ వాళ్ళు కొలత ప్రకారం చూసినప్పుడు ఎక్కువగా తీసుకొన్న వారికి ఏమీ మిగల్లేదు, తక్కువ తీసుకొన్నవారికి ఏమీ తక్కువ కాలేదు. ప్రతి ఒక్కరూ తమ అవసరం మేరకు తమ ఇంటి వాళ్ళ భోజనానికి సరిపడినంత సమకూర్చుకున్నారు.
Og da de målte det med omeren, hadde den som hadde sanket meget, intet tilovers, og den som hadde sanket lite, fattedes intet; enhver hadde sanket efter som han trengte.
19 ౧౯ అప్పుడు మోషే “ఉదయమయ్యే దాకా ఎవ్వరూ దీన్లో ఏమీ మిగుల్చుకోకూడదు” అని వాళ్ళతో చెప్పాడు.
Og Moses sa til dem: Ingen skal levne noget av det til om morgenen.
20 ౨౦ అయితే కొందరు మోషే మాట వినకుండా తెల్లవారే దాకా దానిలో కొంచెం మిగుల్చుకున్నారు. మోషే వారిపై కోపగించుకున్నాడు. అది పురుగు పట్టి దుర్వాసన కొట్టింది.
Men de lød ikke Moses, for nogen levnet noget av det til om morgenen; da vokste det makk i det, og det luktet ille. Og Moses blev vred på dem.
21 ౨౧ కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఉదయమూ తమ ఇంటివారి కోసం ఏ రోజుకు సరిపడినది ఆ రోజు సేకరించుకున్నారు. ఎండ ఎక్కువైనప్పుడు అది కరిగిపోయింది.
Siden sanket de det hver morgen efter som enhver trengte; men når solen brente hett, smeltet det.
22 ౨౨ ఆరవ రోజున వాళ్ళు ఒక్కొక్కరు రెండు లీటర్లకు రెట్టింపు లెక్క చొప్పున నాలుగు లీటర్లు సేకరించారు. ప్రజల అధికారులు వచ్చి ఆ విషయం మోషేకు చెప్పారు.
På den sjette dag sanket de dobbelt så meget brød, to omer for hver; og alle menighetens høvdinger kom og meldte det til Moses.
23 ౨౩ అందుకు మోషే “యెహోవా చెప్పిన మాట ఇదే. రేపు వివేచనాపూర్వక విశ్రాంతి దినం. అది యెహోవాకు గౌరవార్థం ఆచరించ వలసిన పవిత్ర విశ్రాంతి దినం. మీరు వండుకోవలసింది వండుకోండి, ఉడికించుకోవలసింది ఉడికించుకోండి. తినగా మిగిలినది రేపటికి ఉంచుకోండి.”
Da sa han til dem: Det er det Herren har sagt. Imorgen er det sabbat, hellig sabbat for Herren; bak nu det I vil bake, og kok det I vil koke, men alt det som blir tilovers, skal I legge til side og gjemme til imorgen!
24 ౨౪ మోషే ఆజ్ఞాపించిన ప్రకారం వాళ్ళు తెల్లవారే వరకూ దాన్ని ఉంచుకున్నారు. అది దుర్వాసన వేయలేదు, దానికి పురుగు పట్టలేదు.
Så lot de det ligge til om morgenen, således som Moses hadde befalt; og det luktet ikke, heller ikke var det makk i det.
25 ౨౫ అప్పడు మోషే “ఈ రోజు దాన్ని తినండి, ఈ రోజు యెహోవాకు విశ్రాంతి దినం, నేడు అది బయట మైదానంలో దొరకదు.
Da sa Moses: Et det idag. For idag er det sabbat for Herren; idag finner I ikke noget på marken.
26 ౨౬ మీరు ఆరు రోజులే దాన్ని సమకూర్చుకోవాలి. విశ్రాంతి దినమైన ఏడవ రోజున అది దొరకదు” అని చెప్పాడు.
I seks dager skal I sanke det; men på den syvende dag er det sabbat, da skal det ikke være å finne.
27 ౨౭ ఆ విధంగానే జరిగింది. ప్రజల్లో కొందరు ఏడవ రోజున దాన్ని ఏరుకోవడానికి వెళ్ళారు గానీ వాళ్లకు ఏమీ దొరకలేదు.
Allikevel gikk nogen av folket ut den syvende dag for å sanke; men de fant intet.
28 ౨౮ అందుచేత యెహోవా మోషేతో ఇలా అన్నాడు “మీరు ఎంతకాలం నా ఆజ్ఞలను, ఉపదేశాన్ని అనుసరించి నడుచుకోకుండా ఉంటారు?
Da sa Herren til Moses: Hvor lenge vil I være gjenstridige og ikke holde mine bud og mine lover?
29 ౨౯ వినండి, యెహోవా ఈ విశ్రాంతి దినాన్ని తప్పకుండా ఆచరించాలని సెలవిచ్చాడు. కనుక ఆరవ రోజున రెండు రోజులకు సరిపడే ఆహారం మీకు ఇస్తున్నాడు. ఏడవ రోజున ప్రతి ఒక్కరూ తమ స్థలాల్లోనే ఉండిపోవాలి.”
Kom i hu at Herren har gitt eder sabbaten; derfor gir han eder på den sjette dag brød for to dager; bli hjemme enhver hos sig, ingen gå hjemmefra på den syvende dag!
30 ౩౦ అందువలన ఏడవ రోజున ప్రజలు విశ్రాంతి తీసుకున్నారు.
Så hvilte folket på den syvende dag.
31 ౩౧ ఇశ్రాయేలీయులు ఆ పదార్థానికి “మన్నా” అని పేరు పెట్టారు. అది తెల్లగా ధనియాల వలే ఉంది. దాని రుచి తేనెతో కలిపిన పిండి వంటకం లాగా ఉంది.
Og israelittene kalte det manna; det lignet korianderfrø, det var hvitt, og det smakte som honningkake.
32 ౩౨ మోషే ఇలా చెప్పాడు “యెహోవా ఏమి చెబుతున్నాడంటే, ఈ మన్నాను ఒక ఓమెరు పట్టే పాత్రలో నింపండి. నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఎడారిలో తినడానికి మీకిచ్చిన ఈ ఆహారాన్ని మీ తరతరాల కోసం మీ వంశాల కోసం వాళ్ళు దగ్గర ఉంచుకోవాలి.”
Og Moses sa: Således har Herren befalt: Fyll en omer av det og gjem det for eders efterkommere, så de kan se det brød jeg gav eder å ete i ørkenen da jeg førte eder ut av Egyptens land.
33 ౩౩ అప్పుడు మోషే అహరోనుతో “నువ్వు ఒక గిన్నె తీసుకుని, దాన్ని ఒక ఓమెరు మన్నాతో నింపి, మీ తరతరాల సంతతి కోసం యెహోవా సన్నిధిలో ఉంచు” అని చెప్పాడు.
Så sa Moses til Aron: Ta en krukke og legg i den en full omer manna, og sett den ned for Herrens åsyn til å gjemmes for eders efterkommere!
34 ౩౪ యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేశాడు. ఆది భద్రంగా ఉండేలా శాసనాలు ఉంచే స్థలం ఎదుట ఉంచాడు.
Som Herren hadde befalt Moses, således satte Aron den ned foran vidnesbyrdet til å gjemmes.
35 ౩౫ తాము చేరుకోవలసిన కనాను దేశపు సరిహద్దుల వరకూ నలభై సంవత్సరాల వాళ్ళ ప్రయాణంలో మన్నా తింటూ వచ్చారు.
Og Israels barn åt manna i firti år, inntil de kom til bygget land; de åt manna helt til de kom til grensen av Kana'ans land.
36 ౩౬ ఓమెరు అంటే ఏఫాలో పదవ వంతు.
En omer er tiendedelen av en efa.