< నిర్గమకాండము 15 >

1 అప్పుడు మోషే, ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను ఇలా కీర్తించారు. “యెహోవాను గురించి పాడతాను. ఆయన శత్రువు గుర్రాన్నీ, రౌతునూ, సముద్రంలో ముంచి వేశాడు. గొప్ప విజయం సాధించాడు.
آنگاه موسی و بنی‌اسرائیل در ستایش خداوند این سرود را خواندند: «خداوند را می‌سراییم که شکوهمندانه پیروز شده است، او اسبها و سوارانشان را به دریا افکنده است.
2 యెహోవాయే నా బలం, నా గానం, నా రక్షణకర్త. ఆయన నా దేవుడు, ఆయనను స్తుతిస్తాను. ఆయన నా పూర్వీకుల దేవుడు, ఆయనను ఘనపరుస్తాను.
خداوند قوت و سرود من است، و نجات من گردیده. او خدای من است، پس او را سپاس خواهم گفت. او خدای نیاکان من است، پس او را برمی‌افرازم.
3 యెహోవా యుద్ధశూరుడు, ఆయన పేరు యెహోవా.
او جنگاور است و نامش خداوند می‌باشد.
4 ఆయన ఫరో రథాలను, సైన్యాన్ని సముద్రంలో ముంచివేశాడు. సైన్యాధిపతుల్లో ప్రముఖులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు.
خداوند، لشکر و ارابه‌های فرعون را به دریا سرنگون کرد. مبارزان برگزیدهٔ مصر در دریای سرخ غرق شدند.
5 రాళ్లవలె వాళ్ళు నడి సముద్రం అడుక్కి చేరుకున్నారు.
آبهای دریا آنها را پوشاندند، و آنها مانند سنگ به اعماق آب فرو رفتند.
6 యెహోవా, నీ కుడి చెయ్యి బలిష్ఠమైనది. యెహోవా, నీ కుడిచెయ్యి శత్రువుని అణిచి వేస్తుంది.
«دست راست تو ای خداوند، قدرت عظیمی دارد. به نیروی دستت، دشمنانت را در هم کوبیدی.
7 నీకు విరోధంగా నీపై లేచేవాళ్లను నీ మహిమా ప్రకాశంతో అణచి వేస్తావు. నీ కోపాగ్ని రగిలినప్పుడు వాళ్ళు చెత్తలాగా కాలిపోతారు.
با عظمت شکوهت دشمنان را نابود ساختی، آتش خشم تو، ایشان را همچون کاه سوزانید.
8 నీ ముక్కుపుటాల నుండి వెలువడిన పెనుగాలికి నీళ్లు కుప్పగా నిలబడిపోయాయి. ప్రవాహాలు గోడలాగా నిలబడి పోయాయి. సముద్రం లోతుల్లో నీళ్ళు గడ్డకట్టిపోయాయి.
تو بر دریا دمیدی و آن را شکافتی، آبها مانند دیوار ایستادند و عمق دریا خشک گردید.
9 ‘వాళ్ళను తరిమి నా కత్తి దూసి నాశనం చేసి దోచుకున్న సొమ్ముతో నా కోరిక తీర్చుకుంటాను’ అని శత్రువు అనుకున్నాడు.
«دشمن گفت:”آنها را تعقیب کرده، می‌گیرم و با شمشیرم هلاک می‌کنم، ثروتشان را تقسیم کرده، هر چه بخواهم برای خود برمی‌دارم.“
10 ౧౦ నువ్వు నీ గాలి విసిరి లోతైన నీళ్ళలో సీసం లాగా వాళ్ళను మునిగి పోయేలా చేశావు.
اما تو ای خداوند، چون بر دریا دمیدی موجها یکباره آنها را پوشانید، همگی مثل سرب در دریای خروشان غرق شدند.
11 ౧౧ పూజింపదగ్గ వాళ్ళలో యెహోవాలాంటివాడు ఎవడు? పవిత్రత వైభవంలో నీ వంటి వాడెవడు? స్తుతికీర్తనలతో ఘనపరచదగిన వాడు, అద్భుతాలు చేసే నీవంటి వాడెవడు?
«کیست مانند تو ای خداوند در میان خدایان؟ کیست مثل تو عظیم در قدوسیت؟ کیست که مانند تو بتواند کارهای مهیب و عجیب انجام دهد؟
12 ౧౨ నీ కుడి చెయ్యి చాపినప్పుడు వాళ్ళను భూమి మింగివేసింది.
چون دست راست خود را دراز کردی، زمین، دشمنان ما را بلعید.
13 ౧౩ నీ కనికరం వల్ల ఈ ప్రజలను విడిపించి నీ శక్తి ద్వారా నీ సన్నిధికి తీసుకువచ్చావు.
«قوم خود را که بازخرید نموده‌ای با رحمت خود رهبری خواهی فرمود. تو آنها را با قدرت خود به سرزمین مقدّست هدایت خواهی کرد.
14 ౧౪ ఈ సంగతి ఇతర ప్రజలకు తెలుస్తుంది. వాళ్ళు భయపడతారు. అది ఫిలిష్తీయులకు భయం కలిగిస్తుంది.
قومها وقتی این را بشنوند مضطرب خواهند شد، ساکنان فلسطین از ترس خواهند لرزید،
15 ౧౫ ఎదోము అధిపతులు భయపడతారు. మోయాబులో బలిష్ఠులు వణికిపోతారు. కనానులో నివసించే వారు భయంతో నీరసించి పోతారు,
امیران ادوم وحشت خواهند کرد، بزرگان موآب خواهند لرزید. وحشت، مردم کنعان را فرو خواهد گرفت.
16 ౧౬ భయ భీతులు వారిని ఆవరిస్తాయి. యెహోవా, నీ ప్రజలు అవతలి తీరం చేరే వరకూ నీ హస్తబలం చేత శత్రువులు రాళ్ళ వలే కదలకుండా నిలిచిపోతారు.
ترس و دلهره بر ایشان غلبه خواهد کرد. ای خداوند از قدرت تو، آنها چون سنگ، خاموش خواهند ایستاد، تا قوم تو که آنها را خریده‌ای از کنار ایشان بگذرند.
17 ౧౭ నువ్వు నీ ప్రజలకు స్థిర నివాసంగా ఏర్పాటు చేసిన వారసత్వ పర్వతానికి తెస్తావు. అక్కడ వారిని నాటుతావు. యెహోవా, నీ చేతులు నిర్మించిన మందిరానికి వారిని తెస్తావు.
ای خداوند، تو ایشان را به کوه مقدّس خود بیاور و در همان جایی که برای سکونت خود انتخاب کرده‌ای و خانهٔ خود را در آن ساخته‌ای، ساکن ساز.
18 ౧౮ యెహోవా, శాశ్వతంగా రాజ్యం చేస్తాడు.”
خداوندا، تو تا ابد سلطنت خواهی کرد.»
19 ౧౯ ఫరో గుర్రాలు, రథాలు, రౌతులు సముద్రంలోకి అడుగుపెట్టగానే యెహోవా వాళ్ళ మీదికి సముద్రపు నీళ్ళు పొంగిపొరలేలా చేశాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచారు.
وقتی اسبهای فرعون با ارابه‌ها و سوارانش به دنبال اسرائیلی‌ها وارد دریا شدند، خداوند آب دریا را به سمت ایشان برگردانید، اما اسرائیلی‌ها از میان دریا به خشکی رسیدند.
20 ౨౦ అహరోను సోదరి, ప్రవక్త్రి మిర్యాము తంబుర వాయిస్తూ బయలుదేరింది. స్త్రీలంతా తంబురలు వాయిస్తూ, నాట్యం చేస్తూ ఆమెను వెంబడించారు.
پس از خواندن این سرود، مریم نبیه، خواهر هارون دف به دست گرفت و به رقصیدن پرداخت و زنان دیگر نیز به دنبال وی چنین کردند،
21 ౨౧ మిర్యాము వాళ్ళతో కలిసి ఈ విధంగా పాడింది.
و مریم این سرود را خطاب به ایشان خواند: «خداوند را بسرایید که شکوهمندانه پیروز شده است، او اسبها و سوارانشان را به دریا افکنده است.»
22 ౨౨ మోషే నాయకత్వంలో ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తరువాత మూడు రోజులు ప్రయాణించి షూరు ఎడారి ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ వాళ్ళకు తాగడానికి నీళ్లు దొరకలేదు. తరువాత మారాకు చేరుకున్నారు.
موسی قوم اسرائیل را از دریای سرخ حرکت داد و به طرف صحرای شور هدایت کرد. ولی در آن صحرا پس از سه روز راهپیمایی، قطره‌ای آب نیافتند.
23 ౨౩ మారాలో ఉన్న నీళ్ళు చేదుగా ఉన్నాయి కనుక ఆ నీళ్లు తాగలేకపోయారు. అందువల్ల దానికి మారా అనే పేరు వచ్చింది.
سپس آنها به ماره رسیدند، ولی از آب آنجا نیز نتوانستند بنوشند، چون تلخ بود. (از این جهت آن مکان را ماره یعنی «تلخ» نامیدند.)
24 ౨౪ ప్రజలు మోషే మీద సణుగుతూ “మేమేమీ తాగాలి?” అన్నారు.
پس مردم غرغرکنان به موسی گفتند: «ما تشنه‌ایم؛ چه بنوشیم؟»
25 ౨౫ మోషే యెహోవాను వేడుకున్నాడు. అప్పుడు యెహోవా మోషేకు ఒక చెట్టును చూపించాడు. దాన్ని ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు తియ్యగా మారిపోయాయి. అక్కడ ఆయన వాళ్లకు ఒక కట్టుబాటును, శాసనాన్ని విధించాడు,
موسی نزد خداوند دعا کرد و خداوند چوبی به او نشان داد و فرمود: «این چوب را در آب ماره بینداز تا آن را شیرین کند.» موسی چنین کرد و آب، شیرین شد. در ماره، خداوند دستورهایی به قوم اسرائیل داد تا اطاعت آنها را آزمایش کرده باشد.
26 ౨౬ “మీరు మీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా విని ఆయన దృష్టిలో న్యాయం జరిగించి, ఆయన ఆజ్ఞలకు విధేయత కనపరచి వాటి ప్రకారం నడుచుకుంటే ఐగుప్తు వాళ్ళకు కలిగించిన ఎలాంటి జబ్బూ మీకు రానియ్యను. యెహోవా అనే నేనే మిమ్మల్ని బాగుచేసేవాణ్ణి.”
او فرمود: «اگر دستورها و احکام مرا که خداوند، خدای شما هستم اطاعت کنید و آنچه را که در نظر من پسندیده است بجا آورید، از تمام بیماریهایی که مصری‌ها را بدان دچار ساختم در امان خواهید ماند، زیرا من، خداوند، شفا دهندهٔ شما هستم.»
27 ౨౭ తరువాత వాళ్ళు ఏలీముకు చేరుకున్నారు. అక్కడ పన్నెండు నీటి ఊటలు, డెబ్భై ఈత చెట్లు ఉన్నాయి. నీళ్ళు ఉన్న ఆ ప్రాంతంలో వాళ్ళు విడిది చేశారు.
سپس بنی‌اسرائیل به ایلیم آمدند. در آنجا دوازده چشمه و هفتاد درخت خرما بود؛ پس در کنار چشمه‌ها اردو زدند.

< నిర్గమకాండము 15 >