< నిర్గమకాండము 13 >
1 ౧ యెహోవా మోషేతో ఇలా చెప్పాడు.
여호와께서 모세에게 일러 가라사대
2 ౨ “ఇశ్రాయేలు ప్రజల్లో మొదట పుట్టిన సంతానాన్ని నాకు ప్రతిష్టించాలి. మనుషుల, పశువుల ప్రతి తొలిచూలు నాది.”
이스라엘 자손 중에 사람이나 짐승이나 무론하고 초태생은 다 거룩히 구별하여 내게 돌리라 이는 내 것이니라! 하시니라
3 ౩ అప్పుడు మోషే ప్రజలను సమకూర్చి ఇలా చెప్పాడు. “మీరు ఐగుప్తులో బానిసత్వం నుండి విడుదల పొంది బయటకు వచ్చిన ఈ రోజును జ్ఞాపకం చేసుకోండి. యెహోవా తన బలమైన చేతులు చాపి ఆ దాస్యం నుండి మిమ్మల్ని విడిపించాడు. మీరు పొంగ జేసే పిండితో చేసిన రొట్టెలు తినకూడదు.
모세가 백성에게 이르되 `너희는 애굽에서 곧 종 되었던 집에서 나온 그 날을 기념하여 유교병을 먹지 말라 여호와께서 그 손의 권능으로 너희를 그 곳에서 인도하여 내셨음이니라
4 ౪ అబీబు అనే ఈ నెలలో ఈ రోజునే మీరు బయలుదేరి వచ్చారు.
아빕월 이 날에 너희가 나왔으니
5 ౫ కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసించే పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని మన పూర్వీకులతో యెహోవా ఒప్పందం చేశాడు. ఆయన వాగ్దానం చేసినట్టు ఆ దేశానికి మీరు చేరుకున్న తరువాత ఈ ఆచారాన్ని ఈ నెలలోనే జరుపుకోవాలి.
여호와께서 너를 인도하여 가나안 사람과, 헷 사람과, 아모리 사람과, 히위 사람과, 여부스 사람의 땅 곧 네게 주시려고 네 조상들에게 맹세하신바 젖과 꿀이 흐르는 땅에 이르게 하시거든 너는 이 달에 이 예식을 지켜
6 ౬ మీరు ఏడు రోజులపాటు పొంగని పదార్థం కలపని పిండితో చేసిన రొట్టెలు తినాలి. ఏడవ రోజు యెహోవా పండగ ఆచరించాలి.
칠일 동안 무교병을 먹고 제 칠일에는 여호와께 절기를 지키라
7 ౭ ఏడు రోజులూ పొంగకుండా చేసిన రొట్టెలనే తినాలి. మీ దేశంలో ఈ హద్దు నుంచి ఆ హద్దు వరకూ పొంగే పదార్థం కలిపిన పిండి మీ దగ్గర ఉండకూడదు. పొంగేలా చేసేదేదీ మీ దగ్గర కనబడకూడదు.
칠일 동안에는 무교병을 먹고 유교병을 너희 곳에 있게 하지 말며 네 지경 안에서 누룩을 네게 보이지도 말게 하며
8 ౮ ఆ రోజు మీ పిల్లలకు ‘నేను ఐగుప్తు నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాన్ని బట్టి పొంగకుండా కాల్చిన ఈ రొట్టెలు తింటున్నాను’ అని చెప్పాలి.
너는 그 날에 네 아들에게 뵈어 이르기를 이 예식은 내가 애굽에서 나올 때에 여호와께서 나를 위하여 행하신 일을 인함이라 하고
9 ౯ యెహోవా తన బలిష్టమైన చేతితో మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించాడు. ఆయన ఉపదేశం మీ నోట ఉండేలా, ఈ ఆచారం మీ చేతులపై గుర్తుగా మీ నుదుటిపై జ్ఞాపక చిహ్నంగా ఉంటుంది.
이것으로 네 손의 기호와 네 미간의 표를 삼고 여호와의 율법으로 네 입에 있게 하라 이는 여호와께서 능하신 손으로 너를 애굽에서 인도하여 내셨음이니
10 ౧౦ అందువల్ల మీరు ప్రతి ఏటా ఈ నియమాన్ని దాని నిర్ణయకాలంలో ఆచరించాలి.
연년이 기한에 이르러 이 규례를 지킬지니라
11 ౧౧ యెహోవా మీతో మీ పూర్వికులతో వాగ్దానం చేసినట్టు కనాను దేశంలోకి నిన్ను రప్పించిన తరువాత
여호와께서 너와 네 조상에게 맹세하신대로 너를 가나안 사람의 땅에 인도하시고 그 땅을 네게 주시거든
12 ౧౨ మీకు పుట్టే ప్రతి మొదటి సంతానాన్ని, మీ పశువులకు పుట్టే ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించాలి. పశువులకు, మందలకు కలిగే తొలి మగ సంతానం యెహోవాదే.
너는 무릇 초태생과 네게 있는 생축의 초태생을 다 구별하여 여호와께 돌리라 수컷은 여호와의 것이니라
13 ౧౩ ప్రతిష్ఠించినది గాడిద పిల్ల అయితే దాని ఖరీదు చెల్లించి విడిపించి దానికి బదులు గొర్రెపిల్లను ప్రతిష్ఠించాలి. అలా విడిపించలేకపోతే దాని మెడ విరగదీయాలి. మీ కొడుకుల్లో మొదట పుట్టిన వారి నిమిత్తం ఖరీదు చెల్లించి వారిని విడిపించుకోవాలి.
나귀의 첫새끼는 다 어린 양으로 대속할 것이요 그렇게 아니하려면 그 목을 꺽을 것이며 너의 아들중 모든 장자 된 자는 다 대속할지니라
14 ౧౪ ఇకముందు మీ కొడుకులు ‘ఇలా ఎందుకు చెయ్యాలి?’ అని అడిగితే, వాళ్ళతో, ‘ఐగుప్తు బానిసత్వంలో ఉన్న మనలను తన బలమైన హస్తం కింద యెహోవా బయటికి రప్పించాడు.
장래에 네 아들이 네게 묻기를 이것이 어찜이냐? 하거든 너는 그에게 이르기를 여호와께서 그 손의 권능으로 우리를 애굽에서 곧 종이 되었던 집에서 인도하여 내실쌔
15 ౧౫ ఫరో మనలను వెళ్ళనివ్వకుండా తన మనస్సును కఠినం చేసుకున్నప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో ఉన్న మనుషుల, పశువుల మొదటి సంతానం అంతటినీ సంహరించాడు. అందుకే నేను ప్రతి తొలిచూలు మగ పిల్లలన్నిటినీ యెహోవాకు బలిగా అర్పిస్తాను. మొదట పుట్టిన నా కొడుకుల కోసం ఖరీదు చెల్లించి విడిపించుకుంటాను’ అని చెప్పాలి.
그 때에 바로가 강퍅하여 우리를 보내지 아니하매 여호와께서 애굽 나라 가운데 처음 낳은 것까지 다 죽이신고로 초태생의 수컷은 다 여호와께 희생으로 드리고 우리 장자는 다 대속하나니
16 ౧౬ యెహోవా తన బలమైన హస్తం చేత మనలను ఐగుప్తు నుండి బయటికి రప్పించాడు గనుక నీ చెయ్యి మీదా నొసటి మీదా ఆ సంఘటన జ్ఞాపక సూచనగా ఉండాలి.”
이것으로 네 손의 기호와 네 미간의 표를 삼으라 여호와께서 그 손의 권능으로 우리를 애굽에서 인도하여 내셨음이니라 할지니라'
17 ౧౭ ఫరో ఆ ప్రజలను వెళ్ళనిచ్చినప్పుడు దేవుడు వాళ్ళను ఫిలిష్తీయ దేశం నుండి దగ్గర దారి అయినప్పటికీ ఆ దారిన వాళ్ళను వెళ్లనీయలేదు. “ఈ ప్రజలు ఫిలిష్తీయులతో జరిగే యుద్ధం చూసి మనసు మార్చుకుని తిరిగి ఐగుప్తుకు వెళ్లిపోతారేమో” అనుకున్నాడు.
바로가 백성을 보낸 후에 블레셋 사람의 땅의 길은 가까울지라도 하나님이 그들을 그 길로 인도하지 아니하셨으니 이는 하나님이 말씀하시기를 이 백성이 전쟁을 보면 뉘우쳐 애굽으로 돌아갈까 하셨음이라
18 ౧౮ అందువల్ల ప్రజలను చుట్టూ తిప్పి ఎడారి మీదుగా ఎర్ర సముద్రం వైపుకు ప్రయాణం చేయించాడు. ఇశ్రాయేలు ప్రజలు తమ గోత్రాల వారీగా ఐగుప్తు నుండి వచ్చారు.
그러므로 하나님이 홍해의 광야 길로 돌려 백성을 인도하시매 이스라엘 자손이 애굽 땅에서 항오를 지어 나올 때에
19 ౧౯ మోషే యోసేపు ఆస్తికలను వెంట తీసుకు వచ్చాడు. ఎందుకంటే యోసేపు “దేవుడు మిమ్మల్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు, అప్పుడు మీరు నా ఆస్తికలను ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళండి” అని ఇశ్రాయేలు ప్రజలతో కచ్చితంగా ఒట్టు పెట్టించుకున్నాడు.
모세가 요셉의 해골을 취하였으니 이는 요셉이 이스라엘 자손으로 단단히 맹세케 하여 이르기를 '하나님이 필연 너희를 권고하시리니 너희는 나의 해골을 여기서 가지고 나가라' 하였음이었더라
20 ౨౦ వాళ్ళు సుక్కోతు నుండి ప్రయాణం చేసి ఎడారి దగ్గర ఉన్న ఏతాములో బస చేశారు.
그들이 숙곳에서 발행하여 광야 끝에 담에 장막을 치니
21 ౨౧ పగలు, రాత్రి ప్రయాణాల్లో యెహోవా వారికి తోడుగా ఉన్నాడు. పగటి వేళ స్తంభాకార మేఘంలో రాత్రి వేళ వెలుగు ఇవ్వడానికి స్తంభాకార మంటల్లో ఉండి ఆయన వారికి ముందుగా నడిచాడు.
여호와께서 그들 앞에 행하사 낮에는 구름 기둥으로 그들의 길을 인도하시고 밤에는 불기둥으로 그들에게 비취사 주야로 진행하게 하시니
22 ౨౨ దేవుడు ప్రజల కోసం ఉంచిన పగటి మేఘస్తంభాన్ని, రాత్రి వేళ వెలుగిచ్చే అగ్నిస్తంభాన్ని తొలగించకుండా ప్రయాణం కొనసాగేలా చేశాడు.
낮에는 구름 기둥, 밤에는 불기둥이 백성 앞에서 떠나지 아니하니라