< నిర్గమకాండము 10 >
1 ౧ యెహోవా మోషేతో “ఫరో దగ్గరికి తిరిగి వెళ్ళు. నేను చేసిన అద్భుత కార్యాలను వాళ్ళ మధ్య కనపరచాలని నేను అతడి గుండె, అతని సేవకుల గుండెలు బండబారిపోయేలా చేశాను.
And YHWH says to Moses, “Go to Pharaoh, for I have declared his heart hard, and the heart of his servants, so that I set these signs of Mine in their midst,
2 ౨ నేను ఐగుప్తీయుల పట్ల వ్యవహరించిన విధానాన్ని, యెహోవాను నేనేనని మీరు తెలుసుకొనేలా నేను చేస్తున్న అద్భుత కార్యాలను నువ్వు నీ కొడుకులకూ, మనవలకూ తెలియజేయాలి” అని చెప్పాడు.
and so that you recount in the ears of your son, and of your son’s son, that which I have done in Egypt, and My signs which I have set among them, and you have known that I [am] YHWH.”
3 ౩ మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్లి అతనితో ఇలా చెప్పారు. “హెబ్రీయుల దేవుడు యెహోవా చెబుతున్నది ఏమిటంటే, ఎంతకాలం వరకూ నా మాట వినకుండా ఉంటావు? నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.
And Moses comes in—Aaron also—to Pharaoh, and they say to him, “Thus said YHWH, God of the Hebrews: Until when have you refused to be humbled at My presence? Send My people away, and they serve Me,
4 ౪ నువ్వు నా ప్రజలను వెళ్ళనివ్వని పక్షంలో రేపు నేను నీ దేశం మీదికి మిడతలను రప్పిస్తాను.
for if you are refusing to send My people away, behold, tomorrow I am bringing in the locust into your border,
5 ౫ నేల కనపడనంతగా అవి భూమిని కప్పివేస్తాయి. మీ దేశంలో మిగిలిన దాన్ని అంటే వడగండ్ల దెబ్బ నుండి తప్పించుకున్నదాన్ని, అంటే పొలాల్లో మొలకెత్తిన ప్రతి మొక్కనూ అవి తినేస్తాయి.
and it has covered the eye of the land, and none is able to see the land, and it has eaten the remnant of that which is escaped, which is left to you from the hail, and it has eaten every tree which is springing out of the field for you;
6 ౬ మీ గృహాలూ మీ సేవకుల గృహాలూ ఐగుప్తీయుల ఇళ్ళన్నీ వాటితో నిండిపోతాయి. మీ తండ్రులు, పూర్వికులు ఈ దేశంలో ఉన్నప్పటి నుండి ఈనాటి వరకూ ఇలాంటి వాటిని చూసి ఉండలేదు” అని చెప్పి ఫరో దగ్గర నుండి వెళ్ళిపోయారు.
and they have filled your houses, and the houses of all your servants, and the houses of all the Egyptians, which neither your fathers nor your father’s fathers have seen, since the day of their being on the ground to this day.” And he turns and goes out from Pharaoh.
7 ౭ అప్పుడు ఫరో సేవకులు ఫరోతో “ఎంతకాలం వరకూ ఈ మనిషి మనలను ఇబ్బందులకు గురిచేస్తాడు? వాళ్ళ దేవుడు యెహోవాను ఆరాధించడానికి ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వు. మన ఐగుప్తు దేశం పాడైపోతున్నదని నీకింకా తెలియడం లేదా?” అన్నారు.
And the servants of Pharaoh say to him, “Until when does this [one] become a snare to us? Send the men away, and they serve their God YHWH; do you not yet know that Egypt has perished?”
8 ౮ కాబట్టి మోషే అహరోనులను ఫరో దగ్గరికి తీసుకు వచ్చారు. ఫరో “మీరు వెళ్లి మీ దేవుడు యెహోవాను ఆరాధించుకోండి. ఈ పని కోసం ఎవరెవరు వెళ్తారు?” అని అడిగాడు.
And Moses is brought back—Aaron also—to Pharaoh, and he says to them, “Go, serve your God YHWH, but who—who [are] those going?”
9 ౯ అందుకు మోషే “మేము యెహోవాకు మహోత్సవం జరిపించాలి. కాబట్టి మా కొడుకులను, కూతుళ్ళను, మందలను, పశువులను వెంటబెట్టుకుని మా పిల్లలతో, పెద్దలతో కలసి వెళ్తాం” అని బదులిచ్చాడు.
And Moses says, “With our young ones, and with our aged ones, we go, with our sons, and with our daughters, with our flock, and our herd, we go, for we have a festival to YHWH.”
10 ౧౦ అందుకు ఫరో “యెహోవా మీకు కావలిగా ఉంటాడా? నేను మిమ్మల్ని మీ పిల్లలతో సహా వెళ్ళనిస్తానా? చూడండి, మీలో దురుద్దేశం ఉంది.
And he says to them, “Be it so, YHWH [is] with you when I send you and your infants away; see—for evil [is] before your faces.
11 ౧౧ కాబట్టి పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాకు ఉత్సవం జరుపుకోండి. మీరు కోరుకున్నది అదే గదా” అన్నాడు. తరువాత వాళ్ళను ఫరో ఎదుట నుండి వెళ్ళగొట్టారు.
Not so! Go now, you who [are] men, and serve YHWH, for that you are seeking”; and [one] casts them out from the presence of Pharaoh.
12 ౧౨ అప్పుడు యెహోవా మోషేతో “మిడతల దండు వచ్చేలా ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపు. అవి ఐగుప్తు మీదకి వచ్చి ఈ దేశంలో ఉన్న పంటలన్నిటినీ అంటే వడగళ్ళ ద్వారా పాడవని పంటలన్నిటినీ తినివేస్తాయి” అని చెప్పాడు.
And YHWH says to Moses, “Stretch out your hand against the land of Egypt for the locust, and it goes up against the land of Egypt, and eats every herb of the land—all that the hail has left.”
13 ౧౩ మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపాడు. యెహోవా ఆ పగలూ, రాత్రీ ఆ దేశం మీద తూర్పు గాలి వీచేలా చేశాడు. తెల్లవారేసరికి తూర్పు గాలికి ఎగిరే మిడతలు దండుగా వచ్చిపడ్డాయి.
And Moses stretches out his rod against the land of Egypt, and YHWH has led an east wind over the land all that day, and all the night; the morning has been, and the east wind has lifted up the locust.
14 ౧౪ తీవ్రంగా హాని కలిగించే ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదికీ వచ్చి ఐగుప్తు దేశంలోని అన్ని సరిహద్దుల్లో నిలిచి భూమి మొత్తాన్నీ కప్పివేశాయి. అంతకు ముందెప్పుడూ ఇలాంటి మిడతలు లేవు, ఇకముందు కూడా ఉండబోవు.
And the locust goes up against all the land of Egypt, and rests in all the border of Egypt—very grievous: before it there has not been such a locust as it, and after it there is none such;
15 ౧౫ ఆ దేశమంతా చీకటి కమ్మింది. ఆ దేశంలో కూరగాయలన్నిటినీ వడగళ్ళు పాడు చేయని పంటలన్నిటినీ చెట్లనూ ఫలాలనూ అవి తినివేశాయి. ఐగుప్తు దేశమంతా చెట్లు గానీ పొలాల పంటలు గానీ పచ్చగా ఉండేది ఏదీ మిగలలేదు.
and it covers the eye of all the land, and the land is darkened; and it eats every herb of the land, and all the fruit of the trees which the hail has left, and there has not been left any green thing in the trees, or in the herb of the field, in all the land of Egypt.
16 ౧౬ కాబట్టి ఫరో మోషే అహరోనులను వెంటనే పిలిపించాడు. “నేను మీ పట్లా మీ దేవుడు యెహోవా పట్లా తప్పిదం చేశాను.
And Pharaoh hurries to call for Moses and for Aaron and says, “I have sinned against your God YHWH, and against you,
17 ౧౭ దయచేసి ఈ ఒక్కసారి మాత్రం నా తప్పు క్షమించండి. ఈ చావును తెచ్చే విపత్తును మాత్రం నా మీద నుండి తప్పించమని మీ దేవుడైన యెహోవాను వేడుకోండి” అన్నాడు.
and now, please bear with my sin, only this time, and make supplication to your God YHWH, that He may turn aside from off me only this death.”
18 ౧౮ మోషే ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్ళి యెహోవాకు ప్రార్ధించాడు.
And he goes out from Pharaoh, and makes supplication to YHWH,
19 ౧౯ అప్పుడు యెహోవా, గాలిని తిప్పి శక్తివంతమైన పడమటి గాలి విసిరేలా చేశాడు. ఆ గాలి తీవ్రతకు మిడతలు కొట్టుకుపోయి ఎర్ర సముద్రంలో పడిపోయాయి. ఐగుప్తు దేశమంతటిలో ఒక్క మిడత కూడా మిగలలేదు.
and YHWH turns a very strong sea wind, and it lifts up the locust, and blows it into the Red Sea—there has not been left one locust in all the border of Egypt;
20 ౨౦ అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేయడం వల్ల అతడు ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనియ్యలేదు.
and YHWH strengthens the heart of Pharaoh, and he has not sent the sons of Israel away.
21 ౨౧ అప్పుడు యెహోవా మోషేతో “ఆకాశం వైపు నీ చెయ్యి చాపు. ఐగుప్తు దేశమంతా కటిక చీకటి కమ్ముకుంటుంది” అని చెప్పాడు.
And YHWH says to Moses, “Stretch out your hand toward the heavens, and there is darkness over the land of Egypt, and the darkness is felt.”
22 ౨౨ మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతా మూడు రోజులపాటు గాఢాంధకారం కమ్ముకుంది.
And Moses stretches out his hand toward the heavens, and there is darkness—thick darkness in all the land of Egypt [for] three days;
23 ౨౩ ఆ మూడు రోజులు ఒకరికి ఒకరు కనబడలేదు. తామున్న చోటు నుండి ఎవ్వరూ లేచి కదలలేకపోయారు. అయితే ఇశ్రాయేలు ప్రజలందరి ఇళ్ళలో వెలుగు ఉంది.
they have not seen one another, and none has risen from his place [for] three days; but there has been light for all the sons of Israel in their dwellings.
24 ౨౪ ఫరో మోషేను పిలిపించాడు. “మీరు వెళ్లి యెహోవాను ఆరాధించండి. అయితే మీ మందలూ, పశువులూ మాత్రం ఇక్కడే ఉండాలి. మీ బిడ్డలు మాత్రం మీతో వెళ్ళవచ్చు” అన్నాడు.
And Pharaoh calls to Moses and says, “Go, serve YHWH, only your flock and your herd are stayed, your infants also go with you”;
25 ౨౫ అందుకు మోషే “మేము మా దేవుడైన యెహోవాకు అర్పించవలసిన హోమ బలి అర్పణల కోసం నువ్వు మా పశువుల మందలను ఇవ్వ వలసి ఉంటుంది.
and Moses says, “You also give sacrifices and burnt-offerings in our hand, and we have prepared for our God YHWH;
26 ౨౬ మా పశువులు, మందలు మాతో కూడా రావాలి. మా పశువుల కాలి గిట్ట కూడా విడిచిపెట్టం. మేము వేటిని యెహోవాకు బలి అర్పించాలో అక్కడికి చేరే వరకూ మాకు తెలియదు. మా దేవుడైన యెహోవాను ఆరాధించే సమయంలో మా మందల్లోనుంచే వాటిని తీసుకోవాలి” అని చెప్పాడు.
and also our livestock go with us—there is not left a hoof, for we take from it to serve our God YHWH; and we do not know how we serve YHWH until our going there.”
27 ౨౭ అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేయడం వల్ల అతడు వారిని వెళ్ళనియ్యలేదు.
And YHWH strengthens the heart of Pharaoh, and he has not been willing to send them away;
28 ౨౮ అప్పుడు ఫరో “బయటకు వెళ్ళు, జాగ్రత్త సుమా. ఇకపై నాకు కనిపించకు. నువ్వు నాకు ఎదురు పడిన రోజున తప్పకుండా చస్తావు” అన్నాడు.
and Pharaoh says to him, “Go from me, take heed to yourself, do not add to see my face, for in the day you see my face you die”;
29 ౨౯ అందుకు మోషే “సరే నువ్వే అన్నావు గదా, ఇకపై నీ ముఖం చూడను” అన్నాడు.
and Moses says, “You have spoken correctly, I do not add to see your face anymore.”