< ఎస్తేరు 8 >

1 ఆ రోజు అహష్వేరోషు రాజు యూదుల శత్రువు హామాను ఇంటిని ఎస్తేరు రాణికి ఇచ్చేశాడు. మొర్దెకైతో తన బంధుత్వం గురించి ఎస్తేరు రాజుకు తెలియజేసింది.
Того дня цар Ахашверо́ш віддав цариці Есте́рі дім Га́мана, нена́висника юдеїв, а Мордеха́й став перед цареве обличчя, бо Есте́р виявила, хто́ він для неї.
2 అతడు రాజు సన్నిధికి వచ్చినప్పుడు రాజు హామాను చేతిలోనుండి తీసుకున్న తన ఉంగరాన్ని మొర్దెకైకి ఇచ్చాడు. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటిపై అధికారిగా ఉంచింది.
І зняв цар свого пе́рсня, що забрав від Га́мана, та й дав його Мордеха́єві, а Есте́р настановила Мордехая над Гамановим домом.
3 ఎస్తేరు రాజు పాదాలపై పడి విన్నపం చేస్తూ “అగగు వంశీకుడు హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధంగా తలపెట్టిన కార్యాన్ని రద్దు చేయండి” అని కన్నీటితో అతణ్ణి వేడుకుంది.
І Есте́р далі говорила перед обличчям царя. І впала вона перед його ногами, і плакала та блага́ла його відвернути лихо аґаґ'янина Гамана та за́думи його, які заду́мував був на юдеїв.
4 రాజు తన బంగారు రాజ దండాన్ని ఎస్తేరు వైపు చాపాడు.
І простягнув цар до Есте́ри золоте бе́рло, а Есте́р устала й стала перед царе́вим обличчям,
5 ఎస్తేరు రాజు ముందు నిలబడి “రాజైన మీకు అంగీకారం అయితే, మీ అనుగ్రహం నాపై ఉంటే, ఈ సంగతి మీకు సమంజసంగా అనిపిస్తే, నేనంటే మీకు ఇష్టమైతే, హమ్మెదాతా కొడుకు, అగగు వంశీకుడు అయిన హామాను రాయించిన శాసనాలు అమలు కాకుండా వాటి రద్దుకు ఆజ్ఞ ఇవ్వండి.
та й сказала: „Якщо це цареві вго́дне, й якщо знайшла́ я ласку перед обличчям його, і вгодна ця річ перед царевим обличчям та вгодна я в оча́х його, нехай буде написано, щоб були́ пове́рнені ті листи́ за́думів аґаґ'янина Гамана, Гаммедатового сина, що написав був повигу́блювати юдеїв, які є в царевих окру́гах.
6 నా స్వజనం మీదికి రాబోతున్న కీడును, నా వంశ నాశనాన్ని చూసి నేనెలా సహించ గలను” అని మనవి చేసింది.
Бо як я могла б дивитися на лихо, що спітка́є наро́д мій, і як я могла б дивитися на заги́біль ро́ду свого́?“
7 అహష్వేరోషు రాజు రాణి అయిన ఎస్తేరుకు, మొర్దెకైకి ఇలా చెప్పాడు. “హామాను ఇంటిని ఎస్తేరుకు ఇచ్చాను. అతడు యూదులను హతమార్చడానికి ప్రయత్నించినందు వల్ల అతడు ఉరికొయ్య మీద వేలాడి చనిపోయాడు.
І сказав цар Ахашверо́ш до цариці Есте́ри та до юде́янина Мордеха́я: „Ось я дав Есте́рі дім Гамана, а його повісили на ши́бениці за те, що простя́г був руку свою на юдеїв.
8 అయితే రాజు పేరున రాసి రాజ ముద్రిక వేసిన శాసనాన్ని మానవ మాత్రుడెవరూ మార్చలేడు. కాబట్టి మీకిష్టమైనట్టు మీరు రాజునైన నా పేర యూదులకు అనుకూలంగా వేరొక శాసనం రాయించి రాజ ముద్రికతో ముద్రించండి.”
А ви пишіть до юдеїв, як добре в ваших оча́х, в імені царя́, і припеча́тайте царськи́м пе́рснем, бо листа́, що був написаний в імені царя та був припеча́таний царськи́м пе́рснем, не можна відмінити“.
9 సీవాను అనే మూడో నెలలో ఇరవై మూడో రోజున రాజుగారి లేఖికులను పిలిచారు. మొర్దెకై ఆజ్ఞాపించినట్టు యూదులకు, ఇండియా నుండి ఇతియోపియా వరకూ విస్తరించిన 127 సంస్థానాల్లోని అధిపతులకు, అధికారులకు, వివిధ సంస్థానాలకు వాటి లిపిలో, వాటి భాషల్లో శాసనాలు రాశారు.
І були покли́кані царські́ писарі́ того ча́су, місяця третього, — він місяць сіван, двадцять і третього дня в ньому, і було написане все, як наказав був Мордеха́й, до юдеїв, і до сатра́пів, і намісників, і зверхників округ, що від Году й аж до Кушу, — сто й двадцять і сім окру́г, і до кожної окру́ги письмо́м її, і до кожного народу мовою його, та до юдеїв їхнім письмо́м та їхньою мовою.
10 ౧౦ మొర్దెకై అహష్వేరోషు పేర శాసనాలు రాయించి రాజముద్రికతో ముద్రించాడు. గుర్రాలపై, అంటే రాచకార్యాలకు వినియోగించే మేలు జాతి అశ్వాలపై అంచెలుగా ప్రయాణించే వార్తాహరులతో ఆ శాసనాలను పంపించాడు.
І понапи́сував він листи́ в імені царя Ахашвероша, і поприпеча́тував пе́рснем царськи́м, і послав через гінці́в на ко́нях, які їздять на держа́вних ко́нях, ко́нях баски́х,
11 ౧౧ “రాజైన అహష్వేరోషు సంస్థానాలన్నిటిలో ఒక్క రోజునే అంటే అదారు అనే పన్నెండో నెల పదమూడో తేదీన అన్ని పట్టణాల్లో నివసించే యూదులు సమకూడాలి. తమ ప్రాణాలు కాపాడుకొనేందుకు అన్ని చోట్లా తమకు విరోధులైన వారి సైనికులందరిని, బాలలను, స్త్రీలను కూడా, హతం చేసి, సర్వనాశనం చెయ్యాలి.
що цар дав право юдеям, які живуть у кожному місті, зібратися й стати за своє життя, ви́губити, забити та погубити всяке ві́йсько наро́ду та окру́ги, що нена́видять їх, дітей та жінок, а здо́бич по них — розграбува́ти,
12 ౧౨ వారి సొత్తు అంతటినీ కొల్లగొట్టాలి, అని రాజు యూదులకు ఆజ్ఞాపించాడు” అని దానిలో రాశారు.
одно́го дня по всіх окру́гах царя Ахашвероша, — тринадцятого дня дванадцятого місяця, — він місяць ада́р.
13 ౧౩ ఈ శాసనాల ప్రతులు రాయించి అన్ని సంస్థానాల ప్రజానీకానికి పంపించాలని, యూదులు తమ శత్రువులపై పగ తీర్చుకొనేందుకు ఒకానొక రోజున సిద్ధంగా ఉండాలనీ ఆజ్ఞ జారీ అయింది.
Відпис цього листа́ щоб був ви́даний, як зако́н, у кожній окрузі, по́сланий був відкри́тий для всіх наро́дів, і щоб юдеї були гото́ві на той день помсти́тися на своїх ворогах.
14 ౧౪ రాచ కార్యాల కోసం వినియోగించే మేలుజాతి అశ్వాలపై అంచె వార్తాహరులు రాజాజ్ఞ పొంది అతివేగంగా బయలుదేరారు. ఆ తాకీదును షూషను కోటలో కూడా ఇచ్చారు.
Гінці́, що поїхали ве́рхи на швидки́х конях, вийшли, приспі́шені та пі́гнані царськи́м словом. А цей нака́з був да́ний у за́мку Су́зи.
15 ౧౫ అప్పుడు మొర్దెకై నేరేడు, తెలుపు వర్ణాలు గల రాజవస్త్రం, పెద్ద స్వర్ణ కిరీటం, శ్రేష్ఠమైన నారతో చేసిన ఊదా రంగు బట్టలు ధరించి రాజు సముఖం నుండి బయలుదేరాడు. ఈ కారణంగా షూషను నగరంలో సంబరం కలిగింది.
А Мордехай вийшов з-перед царе́вого обличчя в царські́й одежі, блакитній та білій, а на ньому велика золота корона та віссо́нний і пурпу́ровий заві́й. І місто Су́зи раділо та тішилося!
16 ౧౬ యూదులకు క్షేమం, సంతోషం, ఘనత కలిగాయి.
Юдеям було тоді світло, і радість, і веселість, і честь!
17 ౧౭ రాజు చేసిన తీర్మానం, అతని చట్టం అందిన ప్రతి సంస్థానంలో ప్రతి పట్టణంలో యూదులకు ఆనందం, సంతోషం కలిగాయి. వారంతా పండగ చేసుకున్నారు. అందరికీ యూదులంటే భయం వేసింది. కాబట్టి చాలామంది యూదులయ్యారు.
І в кожній окру́зі та в кожному місті, куди досяга́є слово царя та зако́н його, була́ юдеям радість та веселість, бе́нкет та свято! І багато-хто з наро́дів кра́ю стали юде́ями, бо на них напав страх перед юде́ями.

< ఎస్తేరు 8 >