< ఎస్తేరు 3 >

1 ఈ విషయాలు జరిగాక అహష్వేరోషు రాజు హమ్మెదాతా కొడుకు, అగగు వంశం వాడు అయిన హామానుకు పదోన్నతి కలిగించి, అతని అధికార హోదాను తన దగ్గరున్న అధిపతులందరికంటే ఎక్కువగా చేశాడు.
这事以后,亚哈随鲁王抬举亚甲族哈米大他的儿子哈曼,使他高升,叫他的爵位超过与他同事的一切臣宰。
2 కాబట్టి రాజ భవన ద్వారం దగ్గర ఉండే రాజోద్యోగులంతా రాజాజ్ఞ ప్రకారం మోకాళ్లూని హామానుకు నమస్కరించారు. మొర్దెకై మాత్రం అలా వంగలేదు, సాష్టాంగ పడలేదు.
在朝门的一切臣仆都跪拜哈曼,因为王如此吩咐;惟独末底改不跪不拜。
3 రాజు భవన ద్వారం దగ్గర ఉండేవారంతా అతనితో “నువ్వు రాజాజ్ఞ పాటించవేమిటి?” అని అడిగేవారు.
在朝门的臣仆问末底改说:“你为何违背王的命令呢?”
4 వారు పదే పదే అలా అడిగినా అతడు వారి మాట చెవిని బెట్టలేదు. తాను యూదుడిననీ ఆ కారణంగా తాను ఆ పని చేయలేననీ అతడు వారితో చెప్పాడు. అందుకని అతడు ఆ మాటపై నిలిచి ఉంటాడో లేదో చూద్దాం అని వారు హామానుకు ఈ విషయం తెలియజేశారు.
他们天天劝他,他还是不听,他们就告诉哈曼,要看末底改的事站得住站不住,因他已经告诉他们自己是犹大人。
5 మొర్దెకై తన ముందు మోకరించక పోవడం, వంగి నమస్కరించక పోవడం చూసి హామాను మండిపడ్డాడు.
哈曼见末底改不跪不拜,他就怒气填胸。
6 అతడు, మొర్దెకై జాతి ప్రజలు ఎవరో తెలుసుకుని “మొర్దెకైని మాత్రమే చంపితే అందులో గొప్పతనం ఏముంది?” అనుకున్నాడు. ఎందుకంటే అహష్వేరోషు రాజ్యమంతటా ఉన్న మొర్దెకై జాతి ప్రజలైన యూదులనందరినీ తుడిచి పెట్టేయాలని అతడు అనుకున్నాడు.
他们已将末底改的本族告诉哈曼;他以为下手害末底改一人是小事,就要灭绝亚哈随鲁王通国所有的犹大人,就是末底改的本族。
7 రాజైన అహష్వేరోషు పరిపాలన పన్నెండో సంవత్సరంలో నీసాను అనే మొదటి నెలలో వారు హామాను ఎదుట “పూరు” అంటే చీటిని రోజు రోజుకీ నెల నెలకీ వేశారు. చివరికి అదారు అనే పన్నెండో నెల ఎంపిక అయింది.
亚哈随鲁王十二年正月,就是尼散月,人在哈曼面前,按日日月月掣普珥,就是掣签,要定何月何日为吉,择定了十二月,就是亚达月。
8 అప్పుడు హామాను అహష్వేరోషుతో ఇలా చెప్పాడు. “మీ రాజ్య సంస్థానాలన్నింటిలో ఒక జాతి ప్రజలు అక్కడక్కడా నివసిస్తున్నారు. వారి చట్టాలు ఇతర ప్రజల చట్టాలకు వ్యతిరేకం. వారు రాజాజ్ఞలు పాటించరు. కాబట్టి వారిని ఉండనివ్వడం రాజుకు శ్రేయస్కరం కాదు.
哈曼对亚哈随鲁王说:“有一种民散居在王国各省的民中;他们的律例与万民的律例不同,也不守王的律例,所以容留他们与王无益。
9 రాజుకు అంగీకారమైతే వారిని వధించడానికి ఆజ్ఞ ఇవ్వండి. నేను ఈ రాచకార్యాన్ని జరిగించే వారికి ఇరవై వేల మణుగుల వెండిని తూచి రాజు గారి ఖజానాలో ఉంచుతాను.”
王若以为美,请下旨意灭绝他们;我就捐一万他连得银子交给掌管国帑的人,纳入王的府库。”
10 ౧౦ రాజు తన రాజముద్రిక తీసి దాన్ని హమ్మెదాతా కొడుకు, అగగు వంశీకుడు అయిన హామానుకు ఇచ్చాడు. ఇతడు యూదులకు శత్రువు.
于是王从自己手上摘下戒指给犹大人的仇敌—亚甲族哈米大他的儿子哈曼。
11 ౧౧ “ఆ వెండి నీకు, నీ వారికీ ఇచ్చే ఏర్పాటు చేస్తాను. దానితో నువ్వు ఏది అనుకుంటే అది చెయ్యి” అన్నాడు.
王对哈曼说:“这银子仍赐给你,这民也交给你,你可以随意待他们。”
12 ౧౨ మొదటి నెల పదమూడో రోజున రాజుగారి లేఖికులను పిలిపించారు. హామాను ఆజ్ఞాపించిన ప్రకారం, రాజు నియమించిన సంస్థానాల అధికారులకు, వివిధ సంస్థానాల పాలకులకు, వివిధ ప్రజల అధికారులకు, ప్రజలందరిపై ఉన్న కార్యనిర్వాహక అధిపతులకు వారి వారి లిపి ప్రకారం, వివిధ ప్రజల భాషల్లో రాసి పంపాలని ఆజ్ఞ అయింది. రాజైన అహష్వేరోషు పేరట ఆ లేఖికులు తాకీదులు రాశారు. వాటిపై రాజముద్ర వేశారు.
正月十三日,就召了王的书记来,照着哈曼一切所吩咐的,用各省的文字、各族的方言,奉亚哈随鲁王的名写旨意,传与总督和各省的省长,并各族的首领;又用王的戒指盖印,
13 ౧౩ అదారు అనే పన్నెండో నెల పదమూడో రోజున యువత మొదలుకుని వృద్ధుల వరకూ, పిల్లలు, స్త్రీలు అనే తేడా లేకుండా యూదులందరినీ ఒక్క రోజే చంపి సమూల నాశనం చేసి వారి సొమ్ము కొల్లగొట్టాలని ఆజ్ఞ రాసి ఉన్న రాజపత్రాలను అంచెల వారీగా వార్తాహరులు రాజ్య సంస్థానాలన్నిటికీ తీసుకు పోయారు.
交给驿卒传到王的各省,吩咐将犹大人,无论老少妇女孩子,在一日之间,十二月,就是亚达月十三日,全然剪除,杀戮灭绝,并夺他们的财为掠物。
14 ౧౪ ఆ రోజు కోసం అందరూ సిద్ధంగా ఉండాలని తెలిపే ఆ ఆజ్ఞ తాలూకు ప్రతులు అన్ని సంస్థానాల ప్రజలందరికీ అందజేశారు.
抄录这旨意,颁行各省,宣告各族,使他们预备等候那日。
15 ౧౫ వార్తాహరులు రాజాజ్ఞను చేరవేయడానికి చురుకుగా బయలుదేరి వెళ్లారు. ఈ ఆజ్ఞ షూషను కోటలో కూడా ప్రకటించారు. రాజు, హామాను విందుకు కూర్చున్నారు. షూషను పట్టణం అంతా గందరగోళంగా ఉంది.
驿卒奉王命急忙起行,旨意也传遍书珊城。王同哈曼坐下饮酒,书珊城的民却都慌乱。

< ఎస్తేరు 3 >