< ఎస్తేరు 2 >
1 ౧ ఈ విషయాలు జరిగి అహష్వేరోషు రాజు కోపం చల్లారిన తరవాత అతడు వష్తిని గురించీ ఆమె చేసిన పని గురించీ ఆలోచించాడు. ఆమెకు వ్యతిరేకంగా తాను చేసిన తీర్పును గురించి కూడా ఆలోచించాడు.
Later on, after all this had happened, King Xerxes' anger subsided and he thought about Vashti and what she'd done, and the decree issued against her.
2 ౨ రాజు కొలువులో ఉండే యువకులు ఇలా అన్నారు. “రాజు కోసం అందమైన కన్యలను వెదకాలి.
His advisors suggested to him, “Why not order a search to find beautiful young virgins for Your Majesty?
3 ౩ లావణ్యవతులైన కన్యలను సమకూర్చడం కోసం రాజు తన పరిపాలన కింద ఉన్న సంస్థానాలన్నిటిలో అధికారులను నియమించాలి. అలా తీసుకు వచ్చిన కన్యలను షూషను రాజభవనంలోని రాణివాసం పర్యవేక్షకుడు హేగే ఆధీనంలో ఉంచాలి. అతడు వారికి సౌందర్య సాధనాలను ఇవ్వాలి.
Your Majesty should put officers in charge in each province of his empire to gather all the beautiful young women and bring them to the king's harem at the fortress of Susa. They should placed under the supervision of Hegai, the king's eunuch in charge of the women, and they should be given beauty treatments.
4 ౪ ఆ కన్యల్లో ఎవరు రాజుకు నచ్చుతారో ఆమె వష్తికి బదులుగా రాణి అవుతుంది.” ఈ మాట రాజుకు నచ్చింది. అతడు అ విధంగా చేశాడు.
The young woman the king finds most attractive can become queen in place of Vashti.” The king thought this was a good idea, so he acted upon it.
5 ౫ షూషను కోటలో బెన్యామీను గోత్రం వాడైన కీషుకు పుట్టిన షిమీ కొడుకు, యాయీరు వంశికుడు అయిన మొర్దెకై అనే ఒక యూదుడుండేవాడు.
There was a Jewish man living in the fortress of Susa named Mordecai, son of Jair, son of Shimei, son of Kish, a Benjamite
6 ౬ బబులోను రాజు నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను బందీగా కొనిపోయినప్పుడు ఇతడు యెకోన్యాతో బాటు యెరూషలేము నుండి చెరకు వచ్చిన వాడు.
who was among those taken prisoner with King Jehoiachin of Judah and carried into exile from Jerusalem by King Nebuchadnezzar of Babylon.
7 ౭ అతడు తన బాబాయి కూతురు ఎస్తేరు అనే మారు పేరు గల హదస్సా అనే అమ్మాయిని చేరదీసి పెంచుకున్నాడు. ఆమెకు తల్లిదండ్రులు లేరు. ఆమె సౌందర్యవతి. చూడ చక్కని ముఖవర్చస్సు గలది. ఆమె తలిదండ్రులు చనిపోయాక మొర్దెకై ఆమెను తన సొంత కూతురుగా చూసుకోసాగాడు.
He had brought up Hadassah (or Esther), his uncle's daughter, because she had no father or mother. The young woman had a beautiful figure and was very attractive. After her father and mother died, Mordecai had adopted her as his own daughter.
8 ౮ రాజ శాసనం, ఆజ్ఞ ప్రకటించడం అయిన తరువాత చాలామంది కన్యలను తెచ్చి షూషను కోటలో ఉంచారు. వారినందరినీ హేగే పర్యవేక్షణలో ఉంచారు. ఎస్తేరును కూడా అంతఃపురానికి తెచ్చి స్త్రీల సంరక్షణ చూసుకునే హేగే వశంలో ఉంచారు.
When the king's order and decree had been announced, many young women were brought to the fortress of Susa under the supervision of Hegai. Esther was also taken to the king's palace and placed under the care of Hegai, who was in charge of the women.
9 ౯ ఆ యువతి అంటే అతనికి చాలా ఇష్టం కలిగింది. అందువలన అతడు ఆమె పైన దయ చూపించాడు. అతడు ఆమెకు సౌందర్య సాధనాలను, భోజనపదార్ధాలను ఏర్పరచాడు. రాజుగారి దివాణంలో నుంచి ఏడుగురు ఆడపిల్లలను ఆమెకు చెలికత్తెలుగా ఏర్పాటు చేశాడు. ఆమెను, ఆమె చెలికత్తెలను రాణివాసంలో అతి శ్రేష్ఠమైన స్థలం లో ఉంచాడు.
Esther caught his eye and he treated her favorably. He quickly arranged beauty treatments and special food for her. He also provided her with seven specially-chosen maids from the king's palace, and moved her and her maids to the best location in the harem.
10 ౧౦ తన బంధువులెవరో తన జాతి ఏమిటో ఆమె ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే అలా తెలపవద్దని మొర్దెకై ఆమెకు ఆజ్ఞాపించాడు.
Esther had not let anyone know her nationality or who her family was, because Mordecai had ordered her not to.
11 ౧౧ ఎస్తేరు యోగక్షేమాలు కనుక్కోవడానికీ ఆమెకేమి జరుగుతున్నదో తెలుసుకుంటూ ఉండడానికీ మొర్దెకై అంతఃపురం ఆవరణం బయట అనుదినం తిరుగులాడుతూ ఉండేవాడు.
Each day Mordecai spent time walking around in front of the courtyard of the harem so he could find out how Esther was doing and what was happening to her.
12 ౧౨ ఆరు నెలల పాటు గోపరస తైలంతో, ఆరు నెలల పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో, మొత్తం పన్నెండు నెలలు సౌందర్య పోషణ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి అనేది ఆ స్త్రీలకు నియమించిన విధి. అప్పుడు రాజు దగ్గరికి పోయే వంతు ఒక్కొక్క అమ్మాయికీ వస్తుంది.
Before it was the turn of a young woman to go to King Xerxes, she had to complete twelve months of beauty treatments for women that were required: six months with oil of myrrh, and six with perfumed oils and ointments.
13 ౧౩ రాణివాసం నుండి రాజు మందిరానికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు ఒక్కొక్క అమ్మాయికి ఆమె ఏది కోరుకుంటే అది ఇస్తారు.
When it was time for the young woman to go to the king, she was given whatever she asked for to take with her from the harem to the king's palace.
14 ౧౪ సాయంత్రం వేళ ఆమె లోపలికి వెళ్లి మరునాడు ఉదయం రెండవ రాణివాసానికి తిరిగి వచ్చేది. అదంతా రాజు ఉంపుడుగత్తెల బాగోగులు చూసే షయష్గజు అనే రాజోద్యోగి పర్యవేక్షణలో ఉండేది. రాజుకు ఆమె బాగా నచ్చి అతడు ఆమెను పిలిపించుకుంటే తప్ప ఆమె రాజు దగ్గరికి ఇక వెళ్లకూడదు.
In the evening she would go, and in the morning she would return to a different harem under the supervision of Shaashgaz, who was the king's eunuch in charge of the concubines. She would not go back to be with the king again unless he was particularly attracted to her and called for her by name.
15 ౧౫ మొర్దెకై తన స్వంత కూతురుగా చూసుకుంటున్న అతని బాబాయి అబీహాయిలు కూతురు అయిన ఎస్తేరుకు రాజు దగ్గరికి వెళ్ళడానికి వంతు వచ్చింది. స్త్రీల పర్యవేక్షకుడైన రాజోద్యోగి హేగే నిర్ణయించిన అలంకారం తప్ప ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె అంటే ఇష్టం కలిగింది.
(Esther was the daughter of Abihail, Mordecai's uncle. Mordecai had adopted her as his own daughter.) When it was Esther's turn to go to the king, she didn't ask for anything to take with her except what Hegai advised. (He was the king's eunuch in charge of the women.) Esther was looked on with admiration by everybody.
16 ౧౬ ఆ విధంగా అహష్వేరోషు రాజు పరిపాలనలో ఏడో సంవత్సరం టెబేతు అనే పదో నెలలో ఎస్తేరు రాజ మందిరంలో అతని దగ్గరికి పోయింది.
Esther was taken to King Xerxes into his royal palace, in the tenth month, the month of Tebeth, in the seventh year of his reign.
17 ౧౭ స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ఎక్కువగా ప్రేమించాడు. కన్యలందరి కంటే అతనికి ఎస్తేరు అంటే ఇష్టం, ఆకాంక్ష కలిగాయి. అతడు రాజ్యకిరీటాన్ని ఆమె తల మీద ఉంచి ఆమెను వష్తికి బదులుగా రాణిగా నియమించాడు.
The king loved Esther more than all the other women. He treated her more favorably and with greater kindness than all of the other virgins. So he placed the royal crown on her head and made her queen instead of Vashti.
18 ౧౮ అప్పుడు రాజు తన అధికారులందరికి, సేవకులందరికి ఎస్తేరు విషయమై గొప్పవిందు చేయించాడు. సంస్థానాలన్నిటిలో సెలవు ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించాడు.
The king gave a great feast for all his officials and administrators—Esther's feast. He also declared it a holiday throughout the provinces and distributed generous gifts.
19 ౧౯ రెండవసారి కన్యలను సమకూర్చినప్పుడు మొర్దెకై రాజు భవనం ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు.
Even though there had been a second gathering of virgins, and Mordecai had been given a position by the king,
20 ౨౦ ఎస్తేరు మొర్దెకై పోషణలో ఉన్న కాలంలో చేసినట్టే ఇప్పుడు కూడా అతని మాటకు లోబడుతూ ఉంది. అందువలన మొర్దెకై తనకు ఆజ్ఞాపించినట్టే ఎస్తేరు తన జాతి ఏమిటో తన వంశమేమిటో ఎవరికీ చెప్పలేదు.
Esther still did not let anyone know about her family or her nationality, as Mordecai had ordered her. She followed Mordecai's instructions just as she did when he brought her up.
21 ౨౧ ఆ రోజుల్లో మొర్దెకై రాజ భవన ద్వారం దగ్గర కూర్చుని ఉన్న సమయంలో రాజుగారి కొలువులో ఉన్న ఇద్దరు నపుంసకులు బిగ్తాను, తెరెషు అనే ద్వారపాలకులు అహష్వేరోషు రాజుపై కోపంతో అతనిని చంపాలని కుట్ర పన్నారు.
At that time, as Mordecai was doing his work at the palace gate, Bigthan and Teresh, two eunuchs who guarded the entrance to the king's rooms, became furious with King Xerxes and looked for a way to assassinate him.
22 ౨౨ ఈ సంగతి మొర్దెకైకి తెలిసి అతడు దాన్ని ఎస్తేరురాణితో చెప్పాడు. ఎస్తేరు మొర్దెకై పేరున దాన్ని రాజుకు తెలియజేసింది.
Mordecai found out about the plot and reported it to Queen Esther. Esther in turn told the king on Mordecai's behalf.
23 ౨౩ ఈ సంగతిని గూర్చి విచారణ జరిపినప్పుడు అది నిజమని తేలింది. అందువల్ల వారిద్దరినీ ఒక చెట్టుకు ఉరి తీశారు. రాజు సమక్షంలో ఈ వివరం రాజ్య వృత్తాంత గ్రంథంలో రాశారు.
When the plot was investigated and found to be true, both men were impaled on poles. This was recorded in the official Book of Records by order of the king.