< ఎస్తేరు 10 >
1 ౧ రాజైన అహష్వేరోషు తన రాజ్యం మీదా సముద్ర తీర ప్రాంతాల మీదా పన్ను విధించాడు.
Le roi Assuérus imposa un tribut au pays et aux îles de la mer.
2 ౨ అతని బలప్రభావాల మూలంగా కలిగిన విజయాల గురించీ, రాజు మొర్దెకైని గొప్ప పదవుల్లో ఉంచిన కారణంగా మొర్దెకై ఎంత ఘనత పొందాడో ఆ విషయాల గురించీ మాదీయుల, పారసీకుల రాజ్య సమాచార గ్రంథంలో రాశారు.
Tous les faits concernant sa puissance et ses exploits, et les détails sur la grandeur à laquelle le roi éleva Mardochée, ne sont-ils pas écrits dans le livre des Chroniques des rois des Mèdes et des Perses?
3 ౩ యూదుడైన మొర్దెకై అహష్వేరోషు రాజు తరువాతి స్థానంలో ఉన్నాడు. అతడు యూదుల్లో గొప్పవాడుగా తన జాతి వారి మధ్య ప్రఖ్యాతి గాంచిన వాడయ్యాడు. అతడు తన ప్రజల క్షేమాన్ని పట్టించుకొంటూ తనవారందరితో శాంతిపూర్వకంగా మాట్లాడుతూ ఉండేవాడు.
Car le Juif Mardochée était le premier après le roi Assuérus; considéré parmi les Juifs et aimé de la multitude de ses frères, il rechercha le bien de son peuple et parla pour le bonheur de toute sa race.