< ఎఫెసీయులకు 6 >

1 పిల్లలారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు లోబడండి. ఇది మంచిది.
Децо! Слушајте своје родитеље у Господу: јер је ово право.
2 “నీకు మేలు కలిగేలా నీ తండ్రిని తల్లిని గౌరవించు. అది నీకు దీర్ఘాయువును కలిగిస్తుంది.” ఇది వాగ్దానంతో కలిసి ఉన్న మొదటి ఆజ్ఞ.
Поштуј оца свог и матер: ово је прва заповест с обећањем:
3
Да ти благо буде, и да живиш дуго на земљи.
4 తండ్రులారా, మీ పిల్లలకు కోపం పుట్టించవద్దు. వారిని ప్రభువు క్రమశిక్షణలో, బోధలో పెంచండి.
И ви очеви! Не раздражујте децу своју, него их гајите у науци и у страху Господњем.
5 సేవకులారా, భయంతో వణకుతో, క్రీస్తుకు లోబడినట్టు, ఈ లోకంలో మీ యజమానులకు హృదయపూర్వకంగా లోబడండి.
Слуге! Слушајте господаре своје по телу, са страхом и дрхтањем, у простоти срца свог, као и Христа;
6 మనుషులను సంతోషపెట్టేవారు చేసినట్టు పైపైన కాక, క్రీస్తు దాసులుగా దేవుని సంకల్పాన్ని హృదయపూర్వకంగా జరిగిస్తూ,
Не само пред очима радећи као људима да угађате, него као слуге Христове, творећи вољу Божију од срца.
7 ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవచేయండి.
Драговољно служите, као Господу а не као људима,
8 దాసుడైనా, స్వతంత్రుడైనా, మీలో ప్రతివాడూ తాను చేసిన మంచి పనికి ప్రభువు వలన ప్రతిఫలం పొందుతాడని మీకు తెలుసు.
Знајући да сваки што учини добро оно ће и примити од Господа, био роб или слободњак.
9 యజమానులారా, మీరూ మీ దాసుల పట్ల అలాగే ప్రవర్తించండి. మీకూ మీ దాసులకూ ఒక్కడే యజమాని పరలోకంలో ఉన్నాడనీ, ఆయన పక్షపాతం లేని వాడనీ గ్రహించి, వారిని బెదిరించడం మానండి.
И ви господари, тако чините њима остављајући претње, знајући да је и вама самим и њима Господар на небесима, и Он не гледа ко је ко.
10 ౧౦ చివరిగా, ప్రభువు మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి.
А даље, браћо моја, јачајте у Господу и у сили јачине Његове.
11 ౧౧ మీరు సాతాను కుతంత్రాలను ఎదుర్కోడానికి శక్తి పొందడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.
Обуците се у све оружје Божије, да бисте се могли одржати против лукавства ђаволског:
12 ౧౨ ఎందుకంటే మన పోరాటం మానవమాత్రులతో కాదు. నేటి చీకటి సంబంధమైన లోకనాథులతో, ప్రధానులతో, అధికారులతో, ఆకాశమండలంలోని దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం. (aiōn g165)
Јер наш рат није с крвљу и с телом, него с поглаварима и властима, и с управитељима таме овог света, с духовима пакости испод неба. (aiōn g165)
13 ౧౩ అందుచేత మీరు ఈ ఆపద కాలంలో వారిని ఎదిరించి, శక్తివంతులుగా నిలబడగలిగేలా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.
Тога ради узмите све оружје Божије, да бисте се могли бранити у зли дан, и свршивши све одржати се.
14 ౧౪ మీ నడుముకి సత్యం అనే దట్టీ, నీతి అనే కవచం,
Станите дакле опасавши бедра своја истином и обукавши се у оклоп правде,
15 ౧౫ పాదాలకు శాంతి సువార్త కోసం సంసిద్ధత అనే చెప్పులు ధరించండి.
И обувши ноге у приправу јеванђеља мира;
16 ౧౬ వాటితోబాటు శత్రువు విసిరే అగ్ని బాణాలను అడ్డుకోడానికి తోడ్పడే విశ్వాసం అనే డాలు పట్టుకోండి.
А сврх свега узмите штит вере о који ћете моћи погасити све распаљене стреле нечастивог;
17 ౧౭ ఇంకా రక్షణ అనే శిరస్త్రాణం, దేవుని వాక్కు అనే ఆత్మఖడ్గం ధరించుకోండి.
И кацигу спасења узмите, и мач духовни који је реч Божија.
18 ౧౮ ఆత్మలో అన్ని సమయాల్లో అన్ని రకాల ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తూ ఉండండి. అందుకోసం పూర్తి పట్టుదలతో విశ్వాసులందరి కోసమూ విజ్ఞాపనలు చేస్తూ మెలకువగా ఉండండి.
И сваком молитвом и мољењем молите се Богу духом без престанка, и уз то стражите са сваким трпљењем и молитвом за све свете,
19 ౧౯ సువార్త రహస్యాన్ని ధైర్యంగా తెలియజేసేలా, నేను మాట్లాడనారంభించినప్పుడు దేవుడు తన వాక్యాన్ని నాకందివ్వాలని నా కోసం కూడా ప్రార్థించండి.
И за мене, да ми се да реч кад отворим уста своја, да обзнаним са слободом тајну јеванђеља,
20 ౨౦ సంకెళ్ళలో ఉన్న నేను ఈ సువార్త నిమిత్తమైన రాయబారిని. నేను ఈ సువార్తను ఎలాంటి ధైర్యంతో ప్రకటించాలో అలాంటి ధైర్యంతో ప్రకటించాలి గదా.
За које сам посланик у оковима, да у Њему говорим слободно, као што ми се пристоји.
21 ౨౧ నా ప్రియ సోదరుడు తుకికు ప్రభువులో నమ్మకమైన సేవకుడు. అతని ద్వారా నేను ఎలా ఉన్నానో, ఏమి చేస్తున్నానో మీకు తెలుస్తుంది.
А да и ви знате како сам ја и шта радим, све ће вам казати Тихик, љубазни брат и верни слуга у Господу,
22 ౨౨ మా సంగతులు మీరు తెలుసుకోడానికీ, మీ హృదయాలను ప్రోత్సహించడానికీ అతణ్ణి మీ దగ్గరికి పంపాను.
Ког послах к вама за то исто да знате како смо ми, и да утеши срца ваша.
23 ౨౩ తండ్రియైన దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తు శాంతినీ విశ్వాసంతో కూడిన ప్రేమను సోదరులకు అనుగ్రహించు గాక
Мир браћи и љубав с вером од Бога Оца и Господа Исуса Христа.
24 ౨౪ మన ప్రభు యేసు క్రీస్తుపై నిత్య ప్రేమను కనపరిచే వారికందరికీ కృప తోడై ఉండుగాక.
Благодат са свима који љубе Господа нашег Исуса Христа једнако. Амин.

< ఎఫెసీయులకు 6 >