< ఎఫెసీయులకు 5 >

1 కాబట్టి మీరు దేవుని పిల్లల్లాగా ఆయనను పోలి జీవించండి.
ಅತೋ ಯೂಯಂ ಪ್ರಿಯಬಾಲಕಾ ಇವೇಶ್ವರಸ್ಯಾನುಕಾರಿಣೋ ಭವತ,
2 క్రీస్తు మనలను ప్రేమించి మనకోసం దేవునికి పరిమళమైన అర్పణగా, తనను తానే బలిగా అప్పగించుకున్నాడు. అలాంటి ప్రేమనే మీరూ కలిగి ఉండండి.
ಖ್ರೀಷ್ಟ ಇವ ಪ್ರೇಮಾಚಾರಂ ಕುರುತ ಚ, ಯತಃ ಸೋಽಸ್ಮಾಸು ಪ್ರೇಮ ಕೃತವಾನ್ ಅಸ್ಮಾಕಂ ವಿನಿಮಯೇನ ಚಾತ್ಮನಿವೇದನಂ ಕೃತ್ವಾ ಗ್ರಾಹ್ಯಸುಗನ್ಧಾರ್ಥಕಮ್ ಉಪಹಾರಂ ಬಲಿಞ್ಚೇಶ್ವರಾಚ ದತ್ತವಾನ್|
3 మీలో వ్యభిచారం, అపవిత్రత, అసూయ, ఇవేవీ ఉండకూడదు. కనీసం మీరు వాటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగిన ప్రవర్తన.
ಕಿನ್ತು ವೇಶ್ಯಾಗಮನಂ ಸರ್ವ್ವವಿಧಾಶೌಚಕ್ರಿಯಾ ಲೋಭಶ್ಚೈತೇಷಾಮ್ ಉಚ್ಚಾರಣಮಪಿ ಯುಷ್ಮಾಕಂ ಮಧ್ಯೇ ನ ಭವತು, ಏತದೇವ ಪವಿತ್ರಲೋಕಾನಾಮ್ ಉಚಿತಂ|
4 కృతజ్ఞత మాటలే మీ నోటి వెంట రావాలిగానీ అసభ్యమైన మాటలు, మూర్ఖపు మాటలు, రెండు అర్థాలతో కూడిన మాటలు మీరు పలక కూడదు. ఇవి మీకు తగినవి కావు.
ಅಪರಂ ಕುತ್ಸಿತಾಲಾಪಃ ಪ್ರಲಾಪಃ ಶ್ಲೇಷೋಕ್ತಿಶ್ಚ ನ ಭವತು ಯತ ಏತಾನ್ಯನುಚಿತಾನಿ ಕಿನ್ತ್ವೀಶ್ವರಸ್ಯ ಧನ್ಯವಾದೋ ಭವತು|
5 మీకు తెలుసు. వ్యభిచారులూ అపవిత్రులూ అత్యాశపరులూ క్రీస్తుకూ, దేవునికీ చెందిన రాజ్యానికి అర్హులు కారు. అత్యాశాపరులు విగ్రహారాధికులతో సమానం.
ವೇಶ್ಯಾಗಾಮ್ಯಶೌಚಾಚಾರೀ ದೇವಪೂಜಕ ಇವ ಗಣ್ಯೋ ಲೋಭೀ ಚೈತೇಷಾಂ ಕೋಷಿ ಖ್ರೀಷ್ಟಸ್ಯ ರಾಜ್ಯೇಽರ್ಥತ ಈಶ್ವರಸ್ಯ ರಾಜ್ಯೇ ಕಮಪ್ಯಧಿಕಾರಂ ನ ಪ್ರಾಪ್ಸ್ಯತೀತಿ ಯುಷ್ಮಾಭಿಃ ಸಮ್ಯಕ್ ಜ್ಞಾಯತಾಂ|
6 పనికిమాలిన మాటలు పలికేవారి వల్ల మోసపోకండి. అలాటి వాటివల్ల అవిధేయుల పైకి దేవుని ఉగ్రత వస్తుంది.
ಅನರ್ಥಕವಾಕ್ಯೇನ ಕೋಽಪಿ ಯುಷ್ಮಾನ್ ನ ವಞ್ಚಯತು ಯತಸ್ತಾದೃಗಾಚಾರಹೇತೋರನಾಜ್ಞಾಗ್ರಾಹಿಷು ಲೋಕೇಷ್ವೀಶ್ವರಸ್ಯ ಕೋಪೋ ವರ್ತ್ತತೇ|
7 కాబట్టి వారికి దూరంగా ఉండండి.
ತಸ್ಮಾದ್ ಯೂಯಂ ತೈಃ ಸಹಭಾಗಿನೋ ನ ಭವತ|
8 గత కాలంలో మీరు చీకటియై ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభువులో వెలుగుగా ఉన్నారు. వెలుగు సంబంధుల్లాగా నడుచుకోండి.
ಪೂರ್ವ್ವಂ ಯೂಯಮ್ ಅನ್ಧಕಾರಸ್ವರೂಪಾ ಆಧ್ವಂ ಕಿನ್ತ್ವಿದಾನೀಂ ಪ್ರಭುನಾ ದೀಪ್ತಿಸ್ವರೂಪಾ ಭವಥ ತಸ್ಮಾದ್ ದೀಪ್ತೇಃ ಸನ್ತಾನಾ ಇವ ಸಮಾಚರತ|
9 ఎందుకంటే వెలుగు ఫలం మంచితనం, నీతి, సత్యం.
ದೀಪ್ತೇ ರ್ಯತ್ ಫಲಂ ತತ್ ಸರ್ವ್ವವಿಧಹಿತೈಷಿತಾಯಾಂ ಧರ್ಮ್ಮೇ ಸತ್ಯಾಲಾಪೇ ಚ ಪ್ರಕಾಶತೇ|
10 ౧౦ కాబట్టి ప్రభువుకు ఇష్టమైనదేదో చూపుతూ,
ಪ್ರಭವೇ ಯದ್ ರೋಚತೇ ತತ್ ಪರೀಕ್ಷಧ್ವಂ|
11 ౧౧ పనికిమాలిన చీకటి పనుల్లో పాల్గొనక, వాటిని ఖండించండి.
ಯೂಯಂ ತಿಮಿರಸ್ಯ ವಿಫಲಕರ್ಮ್ಮಣಾಮ್ ಅಂಶಿನೋ ನ ಭೂತ್ವಾ ತೇಷಾಂ ದೋಷಿತ್ವಂ ಪ್ರಕಾಶಯತ|
12 ౧౨ ఎందుకంటే వారు రహస్యంగా జరిగించే ఆ పనులను గురించి మాటలాడడం కూడా చాలా అవమానకరం.
ಯತಸ್ತೇ ಲೋಕಾ ರಹಮಿ ಯದ್ ಯದ್ ಆಚರನ್ತಿ ತದುಚ್ಚಾರಣಮ್ ಅಪಿ ಲಜ್ಜಾಜನಕಂ|
13 ౧౩ ప్రతి పనీ వెలుగు చేత బట్టబయలు అవుతుంది. వెలుగు ప్రతిచోటా ప్రకాశిస్తూనే ఉంటుంది కదా?
ಯತೋ ದೀಪ್ತ್ಯಾ ಯದ್ ಯತ್ ಪ್ರಕಾಶ್ಯತೇ ತತ್ ತಯಾ ಚಕಾಸ್ಯತೇ ಯಚ್ಚ ಚಕಾಸ್ತಿ ತದ್ ದೀಪ್ತಿಸ್ವರೂಪಂ ಭವತಿ|
14 ౧౪ బట్టబయలైన ప్రతిదీ వెలుగే. అందుకే, నిద్రిస్తున్న నువ్వు మేలుకో. చనిపోయిన వారిలో నుండి లే. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు, అని రాసి ఉంది.
ಏತತ್ಕಾರಣಾದ್ ಉಕ್ತಮ್ ಆಸ್ತೇ, "ಹೇ ನಿದ್ರಿತ ಪ್ರಬುಧ್ಯಸ್ವ ಮೃತೇಭ್ಯಶ್ಚೋತ್ಥಿತಿಂ ಕುರು| ತತ್ಕೃತೇ ಸೂರ್ಯ್ಯವತ್ ಖ್ರೀಷ್ಟಃ ಸ್ವಯಂ ತ್ವಾಂ ದ್ಯೋತಯಿಷ್ಯತಿ| "
15 ౧౫ బుద్ధిహీనుల్లా కాక వివేకంగా జీవించడానికి జాగ్రత్త పడండి.
ಅತಃ ಸಾವಧಾನಾ ಭವತ, ಅಜ್ಞಾನಾ ಇವ ಮಾಚರತ ಕಿನ್ತು ಜ್ಞಾನಿನ ಇವ ಸತರ್ಕಮ್ ಆಚರತ|
16 ౧౬ సమయం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే రోజులు చెడ్డవి.
ಸಮಯಂ ಬಹುಮೂಲ್ಯಂ ಗಣಯಧ್ವಂ ಯತಃ ಕಾಲಾ ಅಭದ್ರಾಃ|
17 ౧౭ అందుకే మీరు మూర్ఖంగా ఉండక ప్రభువు సంకల్పమేమిటో తెలుసుకోండి.
ತಸ್ಮಾದ್ ಯೂಯಮ್ ಅಜ್ಞಾನಾ ನ ಭವತ ಕಿನ್ತು ಪ್ರಭೋರಭಿಮತಂ ಕಿಂ ತದವಗತಾ ಭವತ|
18 ౧౮ మద్యం సేవించి మత్తులో మునిగిపోకండి. అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది. అయితే పరిశుద్ధాత్మతో నిండి ఉండండి.
ಸರ್ವ್ವನಾಶಜನಕೇನ ಸುರಾಪಾನೇನ ಮತ್ತಾ ಮಾ ಭವತ ಕಿನ್ತ್ವಾತ್ಮನಾ ಪೂರ್ಯ್ಯಧ್ವಂ|
19 ౧౯ కీర్తనలతో సంగీతాలతో ఆత్మసంబంధమైన పాటలతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ప్రభువును గూర్చి మీ హృదయాల్లో పాడుతూ కీర్తించండి.
ಅಪರಂ ಗೀತೈ ರ್ಗಾನೈಃ ಪಾರಮಾರ್ಥಿಕಕೀರ್ತ್ತನೈಶ್ಚ ಪರಸ್ಪರಮ್ ಆಲಪನ್ತೋ ಮನಸಾ ಸಾರ್ದ್ಧಂ ಪ್ರಭುಮ್ ಉದ್ದಿಶ್ಯ ಗಾಯತ ವಾದಯತ ಚ|
20 ౨౦ ప్రభు యేసు క్రీస్తు నామంలో అన్నిటిని గురించీ తండ్రి అయిన దేవునికి అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి.
ಸರ್ವ್ವದಾ ಸರ್ವ್ವವಿಷಯೇಽಸ್ಮತ್ಪ್ರಭೋ ಯೀಶೋಃ ಖ್ರೀಷ್ಟಸ್ಯ ನಾಮ್ನಾ ತಾತಮ್ ಈಶ್ವರಂ ಧನ್ಯಂ ವದತ|
21 ౨౧ క్రీస్తుపై ఉన్న భక్తి కొద్దీ ఒకరికొకరు లోబడి ఉండండి.
ಯೂಯಮ್ ಈಶ್ವರಾದ್ ಭೀತಾಃ ಸನ್ತ ಅನ್ಯೇಽಪರೇಷಾಂ ವಶೀಭೂತಾ ಭವತ|
22 ౨౨ స్త్రీలు ప్రభువుకు లోబడినట్టే తమ భర్తలకు లోబడాలి.
ಹೇ ಯೋಷಿತಃ, ಯೂಯಂ ಯಥಾ ಪ್ರಭೋಸ್ತಥಾ ಸ್ವಸ್ವಸ್ವಾಮಿನೋ ವಶಙ್ಗತಾ ಭವತ|
23 ౨౩ క్రీస్తు సంఘానికి ఏ విధంగా తలగా ఉన్నాడో అలాగే భర్త తన భార్యకు తలగా ఉన్నాడు. క్రీస్తే సంఘమనే శరీరానికి రక్షకుడు.
ಯತಃ ಖ್ರೀಷ್ಟೋ ಯದ್ವತ್ ಸಮಿತೇ ರ್ಮೂರ್ದ್ಧಾ ಶರೀರಸ್ಯ ತ್ರಾತಾ ಚ ಭವತಿ ತದ್ವತ್ ಸ್ವಾಮೀ ಯೋಷಿತೋ ಮೂರ್ದ್ಧಾ|
24 ౨౪ సంఘం క్రీస్తుకు లోబడిన విధంగానే భార్యలు కూడా ప్రతి విషయంలో తమ భర్తలకు లోబడాలి.
ಅತಃ ಸಮಿತಿ ರ್ಯದ್ವತ್ ಖ್ರೀಷ್ಟಸ್ಯ ವಶೀಭೂತಾ ತದ್ವದ್ ಯೋಷಿದ್ಭಿರಪಿ ಸ್ವಸ್ವಸ್ವಾಮಿನೋ ವಶತಾ ಸ್ವೀಕರ್ತ್ತವ್ಯಾ|
25 ౨౫ పురుషులారా, మీరు కూడా సంఘాన్ని క్రీస్తు ప్రేమించిన విధంగానే మీ భార్యలను ప్రేమించాలి.
ಅಪರಞ್ಚ ಹೇ ಪುರುಷಾಃ, ಯೂಯಂ ಖ್ರೀಷ್ಟ ಇವ ಸ್ವಸ್ವಯೋಷಿತ್ಸು ಪ್ರೀಯಧ್ವಂ|
26 ౨౬ సంఘాన్ని వాక్యమనే నీటి స్నానంతో శుద్ధిచేసి, పవిత్రపరచడానికి,
ಸ ಖ್ರೀಷ್ಟೋಽಪಿ ಸಮಿತೌ ಪ್ರೀತವಾನ್ ತಸ್ಯಾಃ ಕೃತೇ ಚ ಸ್ವಪ್ರಾಣಾನ್ ತ್ಯಕ್ತವಾನ್ ಯತಃ ಸ ವಾಕ್ಯೇ ಜಲಮಜ್ಜನೇನ ತಾಂ ಪರಿಷ್ಕೃತ್ಯ ಪಾವಯಿತುಮ್
27 ౨౭ దాన్ని కళంకంగానీ, మడతలుగానీ అలాటిది మరేదీ లేకుండా పవిత్రంగా నిర్దోషంగా మహిమగలదిగా తన ఎదుట నిలబెట్టుకోవాలని, దానికోసం తనను తాను సమర్పించుకున్నాడు.
ಅಪರಂ ತಿಲಕವಲ್ಯಾದಿವಿಹೀನಾಂ ಪವಿತ್ರಾಂ ನಿಷ್ಕಲಙ್ಕಾಞ್ಚ ತಾಂ ಸಮಿತಿಂ ತೇಜಸ್ವಿನೀಂ ಕೃತ್ವಾ ಸ್ವಹಸ್ತೇ ಸಮರ್ಪಯಿತುಞ್ಚಾಭಿಲಷಿತವಾನ್|
28 ౨౮ అలాగే పురుషులకు కూడా తమ సొంత శరీరాల్లాగానే తమ భార్యలను ప్రేమించవలసిన బాధ్యత ఉంది. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొన్నట్టే.
ತಸ್ಮಾತ್ ಸ್ವತನುವತ್ ಸ್ವಯೋಷಿತಿ ಪ್ರೇಮಕರಣಂ ಪುರುಷಸ್ಯೋಚಿತಂ, ಯೇನ ಸ್ವಯೋಷಿತಿ ಪ್ರೇಮ ಕ್ರಿಯತೇ ತೇನಾತ್ಮಪ್ರೇಮ ಕ್ರಿಯತೇ|
29 ౨౯ ఎవడూ తన శరీరాన్ని ద్వేషించడు, ప్రతి ఒక్కడూ దాన్ని పోషించి సంరక్షించుకుంటాడు.
ಕೋಽಪಿ ಕದಾಪಿ ನ ಸ್ವಕೀಯಾಂ ತನುಮ್ ಋತೀಯಿತವಾನ್ ಕಿನ್ತು ಸರ್ವ್ವೇ ತಾಂ ವಿಭ್ರತಿ ಪುಷ್ಣನ್ತಿ ಚ| ಖ್ರೀಷ್ಟೋಽಪಿ ಸಮಿತಿಂ ಪ್ರತಿ ತದೇವ ಕರೋತಿ,
30 ౩౦ మనం సంఘమనే క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నాం కాబట్టి క్రీస్తు కూడా తన సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు.
ಯತೋ ವಯಂ ತಸ್ಯ ಶರೀರಸ್ಯಾಙ್ಗಾನಿ ಮಾಂಸಾಸ್ಥೀನಿ ಚ ಭವಾಮಃ|
31 ౩౧ “ఇందువలన పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఒక్క శరీరమవుతారు”
ಏತದರ್ಥಂ ಮಾನವಃ ಸ್ವಮಾತಾಪಿತರೋ ಪರಿತ್ಯಜ್ಯ ಸ್ವಭಾರ್ಯ್ಯಾಯಾಮ್ ಆಸಂಕ್ಷ್ಯತಿ ತೌ ದ್ವೌ ಜನಾವೇಕಾಙ್ಗೌ ಭವಿಷ್ಯತಃ|
32 ౩౨ ఈ మాటల అర్థం గ్రహించడం కష్టం. అయితే నేను క్రీస్తును గూర్చీ సంఘం గూర్చీ చెబుతున్నాను.
ಏತನ್ನಿಗೂಢವಾಕ್ಯಂ ಗುರುತರಂ ಮಯಾ ಚ ಖ್ರೀಷ್ಟಸಮಿತೀ ಅಧಿ ತದ್ ಉಚ್ಯತೇ|
33 ౩౩ చివరిగా నేను చెప్పేది, మీలో ప్రతి పురుషుడూ తనను తాను ఎంత ప్రేమించుకుంటాడో అంతగా తన భార్యను ప్రేమించాలి. అలాగే భార్య తన భర్తను గౌరవించాలి.
ಅತಏವ ಯುಷ್ಮಾಕಮ್ ಏಕೈಕೋ ಜನ ಆತ್ಮವತ್ ಸ್ವಯೋಷಿತಿ ಪ್ರೀಯತಾಂ ಭಾರ್ಯ್ಯಾಪಿ ಸ್ವಾಮಿನಂ ಸಮಾದರ್ತ್ತುಂ ಯತತಾಂ|

< ఎఫెసీయులకు 5 >