< ఎఫెసీయులకు 3 >

1 ఈ కారణం చేత యూదేతర విశ్వాసులైన మీకోసం క్రీస్తు యేసు ఖైదీనైన పౌలు అనే నేను ప్రార్థిస్తున్నాను.
Bu nedenledir ki, ben Pavlus siz uluslar uğruna Mesih İsa'nın tutuklusu oldum.
2 మీ విషయంలో దేవుడు నాకు అనుగ్రహించిన కృపను గూర్చి మీరు వినే వుంటారు.
Tanrı'nın bana bağışladığı lütfu size ulaştırmakla görevlendirildiğimi duymuşsunuzdur.
3 అదేమంటే దర్శనం ద్వారా నాకు క్రీస్తు మర్మం వెల్లడైంది. దీని గురించి మీకు కూడా తెలిసిన సంగతి ఇంతకు ముందు క్లుప్తంగా రాశాను.
Yukarıda kısaca değindiğim gibi Tanrı, sır olan tasarısını bana vahiy yoluyla bildirdi.
4 మీరు దాన్ని చదివితే ఆ క్రీస్తు మర్మం విషయంలో నేను పొందిన పరిజ్ఞానం గ్రహించగలరు.
Bu mektubu okuduğunuzda Mesih sırrını nasıl kavradığımı anlayabilirsiniz.
5 ఈ మర్మం ఇప్పుడు ఆత్మ ద్వారా దేవుని పరిశుద్ధులైన అపొస్తలులకూ ప్రవక్తలకూ వెల్లడైనట్టుగా పూర్వకాలాల్లోని మనుషులకు తెలియలేదు.
Bu sır önceki kuşaklara açıkça bildirilmemişti. Şimdiyse Mesih'in kutsal elçilerine ve peygamberlerine Ruh aracılığıyla açıklanmış bulunuyor.
6 ఈ మర్మం ఏమిటంటే, సువార్త ద్వారా యూదులతో పాటు యూదేతరులు కూడా క్రీస్తు యేసులో సమాన వారసులు, ఒకే శరీరంలోని అవయవాలు, వాగ్దానంలో పాలిభాగస్తులు అనేదే.
Şöyle ki, öteki uluslar da mirasa ortaktır, aynı bedenin üyeleridir ve Müjde aracılığıyla Mesih İsa'da vaade ortaktır.
7 నేను ఆ సువార్తకు సేవకుడినయ్యాను. దేవుని శక్తిని బట్టి ఆయన కృప వల్లనే ఇది సాధ్యమైంది.
Tanrı'nın etkin gücüyle bana verilen lütuf armağanı uyarınca bu Müjde'yi yaymakla görevlendirildim.
8 పరిశుద్ధులందరిలో అత్యల్పుణ్ణి అయినా మన ఊహకందని క్రీస్తు ఐశ్వర్యాన్ని యూదేతరులకు ప్రకటించడానికీ,
Bütün kutsalların en değersiziydim. Yine de Mesih'in akıl ermez zenginliğini uluslara müjdeleme,
9 సర్వ సృష్టికర్త అయిన దేవునిలో అనాది నుండీ దాగి ఉన్న ఆ మర్మాన్ని అందరికీ వెల్లడిపరచడానికీ దేవుడు ఆ కృపను నాకు అనుగ్రహించాడు. (aiōn g165)
ve her şeyi yaratan Tanrı'da öncesizlikten beri gizli tutulan sırrın nasıl düzenlendiğini bütün insanlara açıklama ayrıcalığı bana verildi. (aiōn g165)
10 ౧౦ తన బహుముఖ జ్ఞానం సంఘం ద్వారా వాయుమండలంలోని ప్రధానులూ అధికారులూ తెలుసుకోవాలని దేవుని ఉద్దేశం.
Öyle ki, Tanrı'nın çok yönlü bilgeliği, kilise aracılığıyla göksel yerlerdeki yönetimlere ve hükümranlıklara şimdiki dönemde bildirilsin.
11 ౧౧ అది మన ప్రభువైన క్రీస్తు యేసులో చేసిన ఆయన నిత్య సంకల్పం. (aiōn g165)
Bu, Tanrı'nın başlangıçtan beri tasarladığı ve Rabbimiz Mesih İsa'da yerine getirdiği amaca uygundu. (aiōn g165)
12 ౧౨ క్రీస్తుపై మన విశ్వాసం చేత ఆయనను బట్టి మనకి ధైర్యం, దేవుని సన్నిధిలోకి ప్రవేశించే నిబ్బరం కలిగింది.
Mesih'te ve Mesih'e olan imanımızla Tanrı'ya cesaret ve güvenle yaklaşabiliriz.
13 ౧౩ కాబట్టి మీ నిమిత్తం నాకు కలిగిన హింసలు చూసి మీరు అధైర్యపడవద్దని చెబుతున్నాను. ఇవి మీకు మహిమ కారకాలుగా ఉంటాయి.
Bu nedenle, uğrunuza çektiğim sıkıntılar karşısında yılmamanızı rica ediyorum. Bunlar size yücelik kazandırır.
14 ౧౪ ఈ కారణం వలన పరలోకంలో,
Bunun için, yerde ve gökte her ailenin adını kendisinden aldığı Baba'nın önünde diz çökerim.
15 ౧౫ భూమి మీదా ఉన్న ప్రతి కుటుంబం ఎవరిని బట్టి తన కుటుంబం అని పేరు పొందిందో ఆ తండ్రి ముందు నేను మోకాళ్ళూని ప్రార్థిస్తున్నాను.
16 ౧౬ ఆయన మీలో ఉన్న తన ఆత్మ ద్వారా తన మహిమైశ్వర్యాన్ని బట్టి శక్తితో మిమ్మల్ని బలపరచడం అనే వరం ఇవ్వాలి.
Baba'nın kendi yüceliğinin zenginliği uyarınca Ruhu'yla sizi iç varlığınızda kudretle güçlendirmesini ve Mesih'in iman yoluyla yüreklerinizde yaşamasını dilerim. Öyle ki, Tanrı'nın bütün doluluğuyla dolmanız için, sevgide köklenmiş ve temellenmiş olarak bütün kutsallarla birlikte Mesih'in sevgisinin ne denli geniş ve uzun, yüksek ve derin olduğunu anlamaya, bilgiyi çok aşan bu sevgiyi kavramaya gücünüz yetsin.
17 ౧౭ క్రీస్తు మీ హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసించాలి. మీరు ఆయన ప్రేమలో వేరు పారి స్థిరంగా ఉండాలి. ఇదే నా ప్రార్థన
18 ౧౮ పరిశుద్ధులందరితో కలిసి దాని పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో పూర్తిగా గ్రహించగలగాలనీ
19 ౧౯ జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోడానికి తగిన శక్తి పొందాలనీ నా ప్రార్థన.
20 ౨౦ మనలో పని చేసే తన శక్తి ప్రకారం మనం అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే ఎంతో ఎక్కువగా చేయ శక్తి గల దేవునికి,
Tanrı, bizde etkin olan kudretiyle, dilediğimiz ya da düşündüğümüz her şeyden çok daha fazlasını yapabilecek güçtedir.
21 ౨౧ సంఘంలో క్రీస్తు యేసులో తరతరాలకూ నిరంతరం మహిమ కలుగు గాక. ఆమేన్‌. (aiōn g165)
Kilisede ve Mesih İsa'da bütün kuşaklar boyunca sonsuzlara dek O'na yücelik olsun! Amin. (aiōn g165)

< ఎఫెసీయులకు 3 >