< ఎఫెసీయులకు 3 >
1 ౧ ఈ కారణం చేత యూదేతర విశ్వాసులైన మీకోసం క్రీస్తు యేసు ఖైదీనైన పౌలు అనే నేను ప్రార్థిస్తున్నాను.
Dlatego ja Paweł jestem więźniem Chrystusa Jezusa za was pogan;
2 ౨ మీ విషయంలో దేవుడు నాకు అనుగ్రహించిన కృపను గూర్చి మీరు వినే వుంటారు.
Jeźliście tylko słyszeli o udzieleniu łaski Bożej, która mi jest dana dla was,
3 ౩ అదేమంటే దర్శనం ద్వారా నాకు క్రీస్తు మర్మం వెల్లడైంది. దీని గురించి మీకు కూడా తెలిసిన సంగతి ఇంతకు ముందు క్లుప్తంగా రాశాను.
Iż mi Bóg przez objawienie oznajmił tajemnicę, (jakom wam przedtem krótko napisał,
4 ౪ మీరు దాన్ని చదివితే ఆ క్రీస్తు మర్మం విషయంలో నేను పొందిన పరిజ్ఞానం గ్రహించగలరు.
Skąd czytając możecie obaczyć wiadomość moję w tajemnicy Chrystusowej).
5 ౫ ఈ మర్మం ఇప్పుడు ఆత్మ ద్వారా దేవుని పరిశుద్ధులైన అపొస్తలులకూ ప్రవక్తలకూ వెల్లడైనట్టుగా పూర్వకాలాల్లోని మనుషులకు తెలియలేదు.
Która inszych wieków nie była znajoma synom ludzkim, jako teraz objawiona jest świętym Apostołom jego i prorokom przez Ducha;
6 ౬ ఈ మర్మం ఏమిటంటే, సువార్త ద్వారా యూదులతో పాటు యూదేతరులు కూడా క్రీస్తు యేసులో సమాన వారసులు, ఒకే శరీరంలోని అవయవాలు, వాగ్దానంలో పాలిభాగస్తులు అనేదే.
To jest, iż poganie są spółdziedzicami i spólnem ciałem, i spółuczestnikami obietnicy jego w Chrystusie przez Ewangieliję.
7 ౭ నేను ఆ సువార్తకు సేవకుడినయ్యాను. దేవుని శక్తిని బట్టి ఆయన కృప వల్లనే ఇది సాధ్యమైంది.
Której stałem się sługą według daru łaski Bożej, która mi jest dana według skutku mocy jego.
8 ౮ పరిశుద్ధులందరిలో అత్యల్పుణ్ణి అయినా మన ఊహకందని క్రీస్తు ఐశ్వర్యాన్ని యూదేతరులకు ప్రకటించడానికీ,
Mnie mówię, najmniejszemu ze wszystkich świętych dana jest ta łaska, abym między poganami opowiadał te niedościgłe bogactwa Chrystusowe.
9 ౯ సర్వ సృష్టికర్త అయిన దేవునిలో అనాది నుండీ దాగి ఉన్న ఆ మర్మాన్ని అందరికీ వెల్లడిపరచడానికీ దేవుడు ఆ కృపను నాకు అనుగ్రహించాడు. (aiōn )
A iżbym objaśnił wszystkim, jaka by była społeczność onej tajemnicy zakrytej od wieków w Bogu, który wszystko stworzył przez Jezusa Chrystusa; (aiōn )
10 ౧౦ తన బహుముఖ జ్ఞానం సంఘం ద్వారా వాయుమండలంలోని ప్రధానులూ అధికారులూ తెలుసుకోవాలని దేవుని ఉద్దేశం.
Aby teraz przez zbór wiadoma była księstwom i mocom na niebiesiech nader rozliczna mądrość Boża.
11 ౧౧ అది మన ప్రభువైన క్రీస్తు యేసులో చేసిన ఆయన నిత్య సంకల్పం. (aiōn )
Według postanowienia wiecznego, które uczynił w Chrystusie Jezusie, Panu naszym, (aiōn )
12 ౧౨ క్రీస్తుపై మన విశ్వాసం చేత ఆయనను బట్టి మనకి ధైర్యం, దేవుని సన్నిధిలోకి ప్రవేశించే నిబ్బరం కలిగింది.
W którym mamy bezpieczność i przystęp z ufnością przez wiarę jego,
13 ౧౩ కాబట్టి మీ నిమిత్తం నాకు కలిగిన హింసలు చూసి మీరు అధైర్యపడవద్దని చెబుతున్నాను. ఇవి మీకు మహిమ కారకాలుగా ఉంటాయి.
Przetoż proszę, abyście nie słabieli dla ucisków moich za was, co jest chwałą waszą.
14 ౧౪ ఈ కారణం వలన పరలోకంలో,
Dlatego skłaniam kolana swoje przed Ojcem Pana naszego Jezusa Chrystusa,
15 ౧౫ భూమి మీదా ఉన్న ప్రతి కుటుంబం ఎవరిని బట్టి తన కుటుంబం అని పేరు పొందిందో ఆ తండ్రి ముందు నేను మోకాళ్ళూని ప్రార్థిస్తున్నాను.
Z którego się wszelka rodzina na niebie i na ziemi nazywa;
16 ౧౬ ఆయన మీలో ఉన్న తన ఆత్మ ద్వారా తన మహిమైశ్వర్యాన్ని బట్టి శక్తితో మిమ్మల్ని బలపరచడం అనే వరం ఇవ్వాలి.
Aby wam dał według bogactwa chwały swej, żebyście byli mocą utwierdzeni przez Ducha jego w wewnętrznym człowieku;
17 ౧౭ క్రీస్తు మీ హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసించాలి. మీరు ఆయన ప్రేమలో వేరు పారి స్థిరంగా ఉండాలి. ఇదే నా ప్రార్థన
Aby Chrystus przez wiarę mieszkał w sercach waszych;
18 ౧౮ పరిశుద్ధులందరితో కలిసి దాని పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో పూర్తిగా గ్రహించగలగాలనీ
Żebyście w miłości wkorzenieni i ugruntowani będąc, mogli doścignąć ze wszystkimi świętymi, która jest szerokość i długość, i głębokość, i wysokość;
19 ౧౯ జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోడానికి తగిన శక్తి పొందాలనీ నా ప్రార్థన.
I poznać miłość Chrystusową przewyższającą wszelką znajomość, abyście napełnieni byli wszelaką zupełnością Bożą.
20 ౨౦ మనలో పని చేసే తన శక్తి ప్రకారం మనం అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే ఎంతో ఎక్కువగా చేయ శక్తి గల దేవునికి,
A temu, który może nade wszystko uczynić daleko obficiej niżeli prosimy albo myślimy, według onej mocy, która skuteczna jest w nas;
21 ౨౧ సంఘంలో క్రీస్తు యేసులో తరతరాలకూ నిరంతరం మహిమ కలుగు గాక. ఆమేన్. (aiōn )
Temu niech będzie chwała w kościele przez Chrystusa Jezusa po wszystkie czasy na wieki wieków. Amen. (aiōn )