< ఎఫెసీయులకు 1 >
1 ౧ ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు, క్రీస్తు యేసులో విశ్వాసముంచిన వారికి దేవుని సంకల్పం ప్రకారం క్రీస్తు యేసు అపొస్తలుడు పౌలు రాస్తున్న విషయాలు.
这封信来自按照上帝旨意成为基督耶稣使徒的保罗,写给以弗所的基督徒以及相信基督耶稣之人。
2 ౨ మన తండ్రి అయిన దేవుని నుండీ యేసు క్రీస్తు ప్రభువు నుండీ మీకు కృప, శాంతి సమాధానాలు కలుగు గాక.
愿你们获得来自我们父亲上帝以及主耶稣基督的恩惠与平安。
3 ౩ మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. ఆయన పరలోక విషయాల్లో సమస్త ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో క్రీస్తులో మనలను దీవించాడు.
赞美上帝,即我们主耶稣基督之父,他通过基督将天堂世界中的灵性善意赐予我们,
4 ౪ క్రీస్తులో మనలను సృష్టికి ముందే దేవుడు ఎన్నుకున్నాడు. మనం ఆయన దృష్టిలో పరిశుద్ధులంగా నిందారహితులంగా ఉండేలా ఆయన మనలను ఎన్నుకున్నాడు.
他在创世前拣选我们与他同在,让我们可以在爱中成为神圣,在他面前没有过错。
5 ౫ యేసు క్రీస్తు ద్వారా మనలను తన సొంత కుమారులుగా స్వీకరించడానికి దేవుడు తన ప్రేమతో ముందుగానే నిర్ణయించుకున్నాడు. అలా చేయడం ఆయనకు ఎంతో ఆనందం. ఆయన ఆశించింది అదే.
他事先决定收养我们作为他的孩子,通过耶稣基督将我们带到他身边。他很高兴这样做,因为这就是他希望做的。
6 ౬ తన దివ్యకృపను బట్టి స్తుతి పొందాలని దేవుడు దాన్ని తన ప్రియ కుమారుడి ద్వారా మనకు ఉచితంగా ప్రసాదించాడు.
因此我们赞美他的荣耀恩典,他通过其爱子如此仁慈地赐给我们。
7 ౭ దేవుని అపార కృప వల్లనే, ఆయన ప్రియ పుత్రుడు యేసు రక్తం ద్వారా మనకు విమోచన, పాప క్షమాపణ కలిగింది.
我们通过他的血获得救赎,通过他慷慨提供给我们的无价恩典
8 ౮ ఈ కృపను సమస్త జ్ఞాన వివేకాలతో ఆయన మనకు విస్తారంగా అందించాడు.
以及所有的智慧和理解,赦免了我们的罪。
9 ౯ ఆయన క్రీస్తు ద్వారా తన ఇష్ట పూర్తిగా ప్రదర్శించిన పథకం తాలూకు రహస్య సత్యాన్ని మనకు తెలియజేశాడు.
他向我们显示了他之前隐藏的意志,他愿意在恰当的时间实行他的计划,
10 ౧౦ కాలం సంపూర్ణమైనప్పుడు పరలోకంలోనూ, భూమి మీదా ఉన్న సమస్తాన్నీ క్రీస్తులో ఏకంగా సమకూర్చాలని దేవుడు తనలో తాను నిర్ణయించుకున్నాడు.
以基督聚集所有人,包括天上的人和地上的人。
11 ౧౧ క్రీస్తును ముందుగా నమ్మిన మనం తన మహిమకు కీర్తి కలగజేయాలని,
通过他——我们被提前拣选出来。制定这计划之人,是根据上帝的意愿完成一切工作,
12 ౧౨ దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పాన్ని బట్టి మనలను ఎన్నుకుని, మనకు వారసత్వం ఏర్పరచాడు. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం ప్రకారం అన్ని కార్యాలనూ జరిగిస్తున్నాడు.
这样做的目的,是为了让我们这些最先对基督翘首以盼之人,能够赞美他的荣耀。
13 ౧౩ మీరు కూడా సత్య వాక్యాన్ని అంటే రక్షణ సువార్తను విని, క్రీస్తులో విశ్వాసముంచారు. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ ద్వారా మీమీద ముద్ర పడింది.
通过他——你还听到了真理之语,这是你们获得拯救的福音。通过他——因为你信任他,你就被烙上了圣灵承诺的印记,
14 ౧౪ దేవుని మహిమకు కీర్తి కలగడానికి ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలిగే వరకూ ఆత్మ మన వారసత్వానికి హామీగా ఉన్నాడు.
这是我们得到的第一笔继承,上帝在拿走那些为了自己——也为了我们保存完好的一切时, 会将这遗产交给我们,我们会赞美他,颂扬他的荣耀!
15 ౧౫ ఈ కారణం చేత ప్రభువైన యేసులో మీ విశ్వాసం గురించీ పరిశుద్ధులందరి పట్ల మీరు చూపిస్తున్న ప్రేమను గురించీ నేను విన్నప్పటి నుంచి,
我听说过你们对主耶稣的信任,以及你们对所有基督徒的爱,这就是原因。
16 ౧౬ మీ విషయంలో మానకుండా నా ప్రార్థనల్లో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను.
我从未停止为你感谢上帝,在我的祈祷中记住你。
17 ౧౭ మన ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు, మహిమ గల తండ్రి, తనను తెలుసుకోడానికి మీకు తెలివిగల ఆత్మనూ, తన జ్ఞాన ప్రత్యక్షతగల మనసునూ ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.
我祈求我主耶稣基督的上帝,荣耀的父,赐给你们智慧的灵,让你们看到并认识他真实的样子。
18 ౧౮ మీ మనోనేత్రాలు వెలిగి, మన పిలుపు గురించిన నిరీక్షణ ఎలాంటిదో, పరిశుద్ధుల్లో ఆయన మహిమగల వారసత్వం ఎంత ఐశ్వర్యవంతమో మీరు గ్రహించాలని నా ప్రార్థన.
愿你的心获得启迪,这样就能明白他召唤你们去拥有的希望——他承诺将这这些荣耀富有,交给他的神圣子民作为遗产。
19 ౧౯ తనను నమ్ముకున్న మనలో తన అపరిమిత ప్రభావం ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలని నా ప్రార్థన.
愿你们也理解上帝在让基督
20 ౨౦ దేవుడు ఈ శక్తితో క్రీస్తును తిరిగి బ్రతికించి పరలోకంలో తన కుడి పక్కన కూర్చోబెట్టుకున్నాడు.
死而复生所展现的惊人能力。上帝在天上将基督安置在他的右手边,
21 ౨౧ సర్వాధిపత్యం, అధికారం, ప్రభావం, ప్రభుత్వం కంటే ఈ యుగంలోగానీ రాబోయే యుగంలోగానీ పేరు గాంచిన ప్రతి నామం కంటే కూడా ఎంతో పైగా ఆయనను హెచ్చించాడు. (aiōn )
其地位远高于任何统治者、权威或领袖,或任何拥有头衔的领导者——不仅在现世,在来世也是如此。 (aiōn )
22 ౨౨ దేవుడు సమస్తాన్నీ క్రీస్తు పాదాల కింద ఉంచి, సంఘంలోని అన్నిటి మీదా ఆయనను తలగా నియమించాడు.
上帝让万物服从于基督,授予他作为在教会中掌管一切的责任,
23 ౨౩ ఈ సంఘం ఆయన శరీరం, అంతటినీ అన్ని విధాలుగా నింపుతున్న ఆయన సంపూర్ణత.
教会就是基督的身体,是基督为带来一切并实现圆满。