< ప్రసంగి 9 >
1 ౧ నీతిమంతులు, జ్ఞానులు, వారు చేసే పనులు అన్నీ పరిశీలించి చూసి అవన్నీ దేవుని చేతిలో ఉన్నాయని నేను గ్రహించాను. ప్రేమించడం, ద్వేషించడం అనేవి మనుషుల చేతిలో లేవని, అది వారి వలన కాదనీ నేను తెలుసుకున్నాను.
Доиста све ово сложих у срце своје да бих расветлио све то, како су праведни и мудри и дела њихова у руци Божијој, а човек не зна ни љубави ни мржње од свега што је пред њим.
2 ౨ జరిగేవి అన్నీ, అందరికీ ఒకే విధంగా జరుగుతాయి. నీతిమంతులకు, దుష్టులకు, మంచివారికి, చెడ్డవారికి, పవిత్రులకు, అపవిత్రులకు, బలులర్పించే వారికి, అర్పించని వారికి, అందరికీ ఒకే విధంగా జరుగుతుంది. మంచివారికెలాగో దుర్మార్గులకూ అలాగే జరుగుతుంది. ఒట్టు పెట్టుకొనేవాడు ఎలా చనిపోతున్నాడో ఒట్టు పెట్టుకోడానికి భయపడేవాడూ అలాగే చనిపోతున్నాడు.
Све бива свима једнако: праведнику бива као безбожнику, добром и чистом као нечистом, оном који приноси жртву као оном који не приноси, како добром тако грешнику, оном који се куне као оном који се боји заклетве.
3 ౩ అందరికీ ఒకే విధంగా జరగడం అనేది సూర్యుని కింద జరిగే వాటన్నిటిలో బహు దుఃఖకరం. మనుషుల హృదయం చెడుతనంతో నిండిపోయింది. వారు బతికినంత కాలం వారి హృదయంలో మూర్ఖత్వం ఉంటుంది. ఆ తరువాత వారు చనిపోతారు. ఇది కూడా దుఃఖకరం.
А то је најгоре од свега што бива под сунцем што свима једнако бива, те је и срце људско пуно зла, и лудост им је у срцу док су живи, а потом умиру.
4 ౪ చచ్చిన సింహం కంటే బతికి ఉన్న కుక్క మేలు అన్నట్టు జీవించి ఉన్నవారితో కలిసి మెలిసి ఉండే వారికి ఇంకా ఆశ ఉంటుంది.
Јер ко ће бити изабран? У живих свих има надања; и псу живом боље је него мртвом лаву.
5 ౫ బతికి ఉన్న వారికి తాము చనిపోతామని తెలుసు. అదే చనిపోయిన వారికి ఏమీ తెలియదు. వారిని అందరూ మరచిపోయారు. వారికి ఇక లాభం ఏమీ లేదు.
Јер живи знају да ће умрети, а мртви не знају ништа нити им има плате, јер им се спомен заборавио.
6 ౬ వారి ప్రేమ, పగ, అసూయ అన్నీ గతించి పోయాయి. సూర్యుని కింద జరిగే వాటిలో ఇక దేనిలోనూ వారి పాత్ర ఉండదు.
И љубави њихове и мржње њихове и зависти њихове нестало је, и више немају дела никада ни у чему што бива под сунцем.
7 ౭ నువ్వు వెళ్లి సంతోషంగా భోజనం చెయ్యి. సంతోషంతో నీ ద్రాక్షారసం తాగు. దేవుడు కోరేది అదే.
Хајде, једи хлеб свој с радошћу, и веселог срца пиј вино своје, јер су мила Богу дела твоја.
8 ౮ ఎప్పుడూ తెల్ల బట్టలు వేసుకో. నీ తలకు బాగా నూనె రాసుకో.
Свагда нека су ти хаљине беле, и уља на глави твојој да не недостаје.
9 ౯ దేవుడు నీకు మంచి జీవితకాలం దయచేశాడు. అది నిష్ప్రయోజనమే అయినా నువ్వు ప్రేమించే నీ భార్యతో సుఖించు. నీ జీవితకాలం నిష్ప్రయోజనమే అయినా దానిలో సుఖించు. ఈ జీవితంలో నువ్వు కష్టపడిన దానంతటికీ అదే నీకు కలిగే భాగం.
Уживај живот са женом коју љубиш свега века свог таштог, који ти је дат под сунцем за све време таштине твоје, јер ти је то део у животу и од труда твог којим се трудиш под сунцем.
10 ౧౦ నిన్ను చేయమని అడిగిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చేయి. నువ్వు వెళ్ళే సమాధిలో పని గాని, ఉపాయం గాని, తెలివి గాని, జ్ఞానం గాని లేదు. (Sheol )
Све што ти дође на руку да чиниш, чини по могућности својој, јер нема рада ни мишљења ни знања ни мудрости у гробу у који идеш. (Sheol )
11 ౧౧ నేను ఇంకా ఆలోచిస్తుండగా సూర్యుని కింద జరిగేది నాకు అర్థమైంది ఏమంటే, వేగం గలవారు పరుగులో గెలవరు. బలమైన వారికి యుద్ధంలో విజయం దొరకదు. తెలివైన వారికి ఆహారం లభించదు. అవగాహన ఉన్నంత మాత్రాన ఐశ్వర్యం కలగదు. జ్ఞానవంతులకు అనుగ్రహం దొరకదు. ఇవన్నీ అదృష్టం కొద్దీ కాలవశాన అందరికీ కలుగుతున్నాయి.
Опет видех под сунцем да није до брзих трка, ни рат до храбрих, ни хлеб до мудрих, ни богатство до разумних, ни добра воља до вештих, него да све стоји до времена и згоде.
12 ౧౨ తమకాలం ఎప్పుడు వస్తుందో మనుషులకు తెలియదు. చేపలు తమకు మరణకరమైన వలలో చిక్కుకున్నట్టు, పిట్టలు వలలో పట్టుబడినట్టు, హఠాత్తుగా ఏదో ఒక చెడ్డ సమయం తమ మీదికి వచ్చినప్పుడు వారు చిక్కుకుంటారు.
Јер човек не зна време своје, него као што се рибе хватају мрежом несрећном и као што се птице хватају пруглом, тако се хватају синови човечији у зао час, кад навали на њих изненада.
13 ౧౩ ఇంకా జరుగుతున్న దాన్ని చూసినప్పుడు నేను అది జ్ఞానం అనుకున్నాను. అది నా దృష్టికి గొప్పదిగా ఉంది.
Видех и ову мудрост под сунцем, која ми се учини велика:
14 ౧౪ ఏమంటే కొద్దిమంది నివసించే ఒక చిన్న పట్టణం ఉంది. దానిమీదికి ఒక గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడించి దాని ఎదురుగా గొప్ప బురుజులు కట్టించాడు.
Беше мален град и у њему мало људи; и дође на њ велик цар, и опколи га и начини око њега велике опкопе.
15 ౧౫ అయితే అందులో ఉండే ఒక బీదవాడు తన తెలివితో ఆ పట్టణాన్ని కాపాడాడు. అయినా ఎవరూ అతణ్ణి జ్ఞాపకం ఉంచుకోలేదు.
А нађе се у њему сиромах човек мудар, који избави град мудрошћу својом, а нико се не сећаше тог сиромаха човека.
16 ౧౬ కాబట్టి నేనిలా అనుకున్నాను “బలం కంటే తెలివి శ్రేష్ఠమేగాని బీదవారి తెలివిని, వారి మాటలను ఎవరూ లెక్కచేయరు.”
Тада ја рекох: Боља је мудрост него снага, ако се и не мараше за мудрост оног сиромаха и речи се његове не слушаху.
17 ౧౭ మూర్ఖులను పాలించేవాడి కేకలకంటే మెల్లగా వినిపించే జ్ఞానుల మాటలు మంచివి.
Речи мудрих људи ваља с миром слушати више него вику оног који заповеда међу лудима.
18 ౧౮ యుద్ధాయుధాల కంటే తెలివి మంచిది. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపుతాడు.
Боља је мудрост него оружје убојито; али један грешник квари многа добра.