< ప్రసంగి 8 >

1 జ్ఞానులంటే ఎవరు? జీవితంలో జరిగేవి ఏమిటి, ఎలా అనే విషయాలు ఎరిగినవారు. మనుషుల జ్ఞానం వారి ముఖానికి తేజస్సు నిస్తుంది. దాని వలన వారి కఠినత్వం మారుతుంది.
Ho är som en vis? Och ho kan det uttyda? Menniskones vishet upplyser hennes ansigte; men den der oförvägen är, honom hatar man.
2 నువ్వు దేవుని ఎదుట ఒట్టు పెట్టుకున్నట్టుగా రాజు ఆజ్ఞలకు లోబడి నడుచుకో.
Jag håller Konungens ord, och Guds ed.
3 రాజు సన్నిధి నుండి హడావుడిగా బయటికి వెళ్లకు. అతడు అనుకున్న దానంతటినీ జరిగించగలడు కాబట్టి చెడు కార్యాల్లో పాలు పుచ్చుకోకు.
Var icke för hastig till att gå ifrå hans ansigte, och blif icke i en ond sak; ty han gör hvad honom lyster.
4 రాజుల ఆజ్ఞ అధికారంతో కూడినది. “నువ్వు చేసేది ఏమిటి?” అని రాజును అడిగే వాడెవడు?
I Konungens ord är magt, och ho kan säga till honom: Hvad gör du?
5 రాజుకు లోబడేవాడికి ఏ కీడూ జరగదు. ఏది ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో జ్ఞానుల హృదయాలకు తెలుసు.
Den der budet håller, han skall intet ondt försöka; men ens vis mans hjerta vet tid och sätt.
6 ప్రతి దానికీ ఒక స్పందన, ఒక సమయం నియామకమై ఉంది. అలా లేకపోతే మనుష్యులకు జరిగే కీడు అధికమైపోతుంది.
Ty hvart och ett anslag hafver sin tid och sätt; ty menniskones olycka är mycken med henne.
7 జరగబోయేది మనుషులకి తెలియదు. రాబోయే దాని గురించి ఎవరు చెప్పగలరు?
Ty hon vet icke hvad varit hafver; och ho kan säga henne, hvad varda skall?
8 ఊపిరి విడవకుండా ఆపుచేయగల అధికారం ఎవరికీ లేదు. తన చావు రోజుపై ఎవరికీ అధికారం లేదు. యుద్దం జరిగే సమయంలో ఎవరికీ విడుదల దొరకదు. దుష్టత్వం దాన్ని వెంబడించే వారిని తప్పించలేదు.
En menniska hafver icke magt öfver andan, till att förmena andan; och hafver icke magt i dödsens tid, och varder icke lös gifven i stridene; och ett ogudaktigt väsende hjelper den ogudaktiga intet.
9 సూర్యుని కింద జరిగే ప్రతి పని గురించి నేను తీవ్రంగా ఆలోచించినప్పుడు ఇదంతా నాకు తెలిసింది. ఒకడు మరొకడిపై ఉన్న అధికారంతో వాడికి కీడు జరిగిస్తాడు.
Allt det hafver jag sett, och gaf mitt hjerta till all verk, som ske under solene; en menniska råder understundom öfver den andra, sig till skada.
10 ౧౦ దుష్టులను సక్రమంగా పాతిపెట్టడం, పరిశుద్ధ స్థలం నుండి తీసుకుపోవడం, వారు ఎక్కడ చెడ్డ పనులు చేశారో అదే పట్టణస్థులు వారిని పొగడడం నేను చూశాను. ఇది కూడా నిష్ప్రయోజనమే.
Och der såg jag ogudaktiga, som begrafne voro; som gångit och vandrat hade i heligt rum, och voro förgätne i staden, att de så gjort hade; det är ock fåfängelighet.
11 ౧౧ చెడు పనికి తగిన శిక్ష వెంటనే కలగకపోవడం చూసి మనుషులు భయం లేకుండా చెడ్డ పనులు చేస్తారు.
Efter det icke straxt går domen öfver onda gerningar, varder menniskones hjerta fullt till att göra ondt.
12 ౧౨ ఒక దుర్మార్గుడు వంద సార్లు పాపం చేసి దీర్ఘకాలం జీవించినా, దేవునిలో భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని గౌరవించేవారు క్షేమంగా ఉంటారని నాకు తెలుసు.
Om en syndare hundrade resor illa gör, och dock länge lefver, så vet jag likväl, att dem varder väl gångande, som Gud frukta, de som hans ansigte frukta.
13 ౧౩ దుర్మార్గులు దేవుని సన్నిధికి భయపడరు కాబట్టి వారికి క్షేమం ఉండదు. వారి జీవితకాలం అశాశ్వతమైన నీడలాగా ఉంటుంది.
Ty dem ogudaktiga varder icke väl gångandes, och såsom en skugge skola de icke länge lefva, som icke Gud frukta.
14 ౧౪ సూర్యుని కింద మరొక నిష్ప్రయోజనమైంది జరుగుతూ ఉంది. అదేమంటే భక్తిహీనులకు జరిగినట్టు నీతిమంతుల్లో కొందరికీ నీతిమంతులకు జరిగినట్టు భక్తిహీనుల్లో కొందరికీ జరుగుతున్నది. ఇది కూడా నిష్ప్రయోజనమే అని నేను అనుకున్నాను.
Det är en fåfängelighet, som sker uppå jordene. Någre äro rättfärdige, och dem går, såsom de hade de ogudaktigas gerningar gjort; och någre äro ogudaktige, och dem går, såsom de hade de rättfärdigas gerningar gjort. Jag sade: Det är ock fåfängelighet.
15 ౧౫ అన్నపానాలు పుచ్చుకుని సంతోషించడం కంటే మనుషులకు మంచి విషయమేమీ లేదు. మనిషి పని చేసి కష్టపడాలని దేవుడు వారికి నియమించిన అతని జీవిత కాలమంతా వారికి తోడుగా ఉండేది వారి సంతోషమే.
Derföre prisade jag glädjena, att menniskan intet bättre hafver under solene, än äta och dricka, och vara glad; och sådant får hon af sitt arbete i sine lifsdagar, som Gud henne gifver under solene.
16 ౧౬ జ్ఞానాన్ని అభ్యసించడానికీ మనుషులు దివారాత్రులు నిద్ర లేకుండా చేసే వ్యాపారాలను పరిశీలించి చూశాను.
Jag gaf mitt hjerta till att veta vishet, och till att skåda den vedermödo, som på jordene sker; att ock en hvarken dag eller natt får sömn i sin ögon.
17 ౧౭ దేవుని పనులన్నిటినీ నేను గమనించాను. సూర్యుని కింద జరిగే సంగతులను మనుషులు ఎంత ప్రయత్నించినా గ్రహించలేరనీ, దాన్ని తెలుసుకోవాలని చివరికి జ్ఞానులు పూనుకున్నప్పటికీ వారు సైతం గ్రహించలేరనీ నేను తెలుసుకున్నాను.
Och jag såg all Guds verk; ty en menniska kan icke finna det verk, som under solene sker; och ju mer menniskan arbetar till att söka, ju mindre finner hon. Om hon än säger: Jag är vis, och vet det, så kan hon dock icke finnat.

< ప్రసంగి 8 >