< ప్రసంగి 5 >
1 ౧ నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. తాము చేసే పనులు దుర్మార్గమైనవని తెలుసుకోకుండా బుద్ధిహీనుల్లాగా బలులు అర్పించడం కంటే దానికి దగ్గరగా వెళ్లి మాటలు వినడం మంచిది.
Khi người vào nhà Ðức Chúa Trời, hãy giữ chừng chơn mình. Thà lại gần mà nghe, hơn là dâng của tế lễ kẻ ngu muội; vì nó không hiểu biết mình làm ác.
2 ౨ దేవుని సన్నిధిలో అనాలోచితంగా మాట్లాడడానికి త్వరపడక నీ నోటిని కాచుకో. దేవుడు ఆకాశంలో ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కాబట్టి నీ మాటలు తక్కువగా ఉండాలి.
Chớ vội mở miệng ra, và lòng ngươi chớ lật đật nói lời trước mặt Ðức Chúa Trời; vì Ðức Chúa Trời ở trên trời, còn ngươi ở dưới đất. Vậy nên ngươi khá ít lời.
3 ౩ విస్తారమైన పనులు, చింతల వలన చెడ్డ కలలు వస్తాయి. ఎక్కువ మాటలు పలికేవాడు ఎక్కువ మూర్ఖంగా పలుకుతాడు.
Hễ nhiều sự lo lắng ắt sanh ra chiêm bao; còn nhiều lời thì sanh ra sự ngu dại.
4 ౪ నీవు దేవునికి మొక్కుబడి చేసుకుంటే దాన్ని త్వరగా చెల్లించు. మూర్ఖుల విషయంలో ఆయన సంతోషించడు.
Khi ngươi khấn hứa sự gì với Ðức Chúa Trời, chớ chậm mà hoàn nguyện; vì Ngài chẳng vui thích kẻ dại: vậy, khá trả điều gì ngươi hứa.
5 ౫ నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించు. మొక్కుకుని చెల్లించకపోవడం కంటే అసలు మొక్కుకోకపోవడం మంచిది.
Thà đừng khấn hứa, hơn là khấn hứa mà lại không trả.
6 ౬ నీ శరీరం పాపంలో పడేలా చేసేటంతగా నీ నోటిని మాట్లాడనీయకు. “ఆ మొక్కుబడి పొరపాటుగా చేశాను” అని యాజకునితో చెప్పవద్దు. నీ మాటలతో దేవునికి కోపం తెప్పించి ఎందుకు నష్టపోతావు?
Ðừng cho miệng ngươi làm cho xác thịt mình phạm tội, và chớ nói trước mặt sứ giả của Ðức Chúa Trời rằng ấy là lầm lỗi. Sao làm cho Ðức Chúa Trời nổi giận vì lời nói ngươi, và Ngài làm hư công việc của tay ngươi?
7 ౭ ఎక్కువ కలలతో, మాటలతో ప్రయోజనం లేదు. నీ వరకూ నువ్వు దేవునిలో భయభక్తులు కలిగి ఉండు.
Ðâu có chiêm bao vô số và nhiều lời quá, đó cũng có sự hư không nhiều; song ngươi hãy kính sợ Ðức Chúa Trời.
8 ౮ ఒక రాజ్యంలో బీదవారిని బాధించడం, ధర్మాన్ని, న్యాయాన్ని బలవంతంగా అణచివేయడం నీకు కనిపిస్తే ఆశ్చర్యపోవద్దు. అధికారంలో ఉన్నవారికంటే ఎక్కువ అధికారం గలవారున్నారు. వారందరి పైన ఇంకా ఎక్కువ అధికారం గలవాడు ఉన్నాడు.
Khi ngươi thấy trong xứ có kẻ nghèo bị hà hiếp, hoặc thấy sự phạm đến lẽ chánh trực, sự trái phép công bình, thì chớ lấy làm lạ; vì có kẻ cao hơn kẻ cao vẫn coi chừng, lại còn có Ðấng cao hơn nữa.
9 ౯ ఏ దేశంలో రాజు భూమి గురించి శ్రద్ధ వహిస్తాడో ఆ దేశానికి అన్ని విషయాల్లో మంచి జరుగుతుంది.
Song một vua hay cày cấy ruộng, ấy vẫn ích lợi cho xứ mọi bề.
10 ౧౦ డబ్బు కోరుకునే వాడికి ఆ డబ్బుతో తృప్తి కలగదు. ఐశ్వర్యం కోరుకునేవాడు ఇంకా ఎక్కువ ఆస్తిని కోరుకుంటాడు. ఇది కూడా నిష్ప్రయోజనమే.
Kẻ tham tiền bạc chẳng hề chán lắc tiền bạc; kẻ ham của cải chẳng hề chán về hoa lợi. Ðiều đó cũng là sự hư không.
11 ౧౧ ఆస్తి ఎక్కువైతే దాన్ని దోచుకునే వారు కూడా ఎక్కువవుతారు. కేవలం కళ్ళతో చూడడం తప్ప ఆస్తిపరుడికి తన ఆస్తి వలన ప్రయోజనం ఏముంది?
Hễ của cải thêm nhiều chừng nào, kẻ ăn cũng thêm nhiều chừng nấy. Chủ của cải được ích gì hơn là xem thấy nó trước mặt chăng?
12 ౧౨ కష్టజీవులు కొంచెమే తినినా హాయిగా నిద్ర పోతారు. అయితే ఐశ్వర్యవంతులు తమ ధనసమృధ్థి వలన నిద్రపోలేరు.
Giấc ngủ của người làm việc là ngon, mặc dầu người ăn ít hay nhiều; nhưng sự chán lắc làm cho người giàu không ngủ được.
13 ౧౩ సూర్యుని కింద మనస్సుకు బాధ కలిగించేది ఒకటి చూశాను. అదేమంటే ఆస్తిపరుడు తన ఆస్తిని దాచుకోవడం అతనికే నష్టం తెచ్చిపెడుతుంది.
Có một tai nạn dữ mà ta đã thấy dưới mặt trời: ấy là của cải mà người chủ dành chứa lại, trở làm hại cho mình,
14 ౧౪ అతడు దురదృష్టవశాత్తూ తన ఆస్తిని పోగొట్టుకుంటే అతని కొడుకు చేతిలో ఏమీ లేనివాడు అవుతాడు.
hoặc vì cớ tai họa gì, cả của cải nầy phải mất hết; nếu người chủ sanh một con trai, thì để lại cho nó hai tay không.
15 ౧౫ వాడు ఏ విధంగా తల్లి గర్భం నుండి వచ్చాడో ఆ విధంగానే, దిగంబరిగా వెళ్ళిపోతాడు. తాను పని చేసి సంపాదించినా దేనినీ చేతపట్టుకుని పోలేడు.
Mình lọt ra khỏi lòng mẹ trần truồng thể nào, ắt sẽ trở về thể ấy, và về các huê lợi của sự lao khổ mình, chẳng có vậy gì tay mình đem theo được.
16 ౧౬ ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోతాడు. గాలిని పట్టుకోడానికి ప్రయత్నించడం వలన లాభమేమిటి?
Ðiều nầy cũng là một tai nạn lớn: người ra đời thể nào, ắt phải trở về thể ấy. Vậy, chịu lao khổ đặng theo luồng gió thổi, có ích lợi gì chăng?
17 ౧౭ ఇది కూడా మనస్సుకు బాధ కలిగించేదే. తన జీవితమంతా అతడు చీకటిలో భోజనం చేస్తాడు. అతడు రోగంతో, ఆగ్రహంతో నిస్పృహలో గడుపుతాడు.
Lại trọn đời mình ăn trong sự tối tăm, phải nhiều sự buồn rầu đau đớn và phiền não.
18 ౧౮ నేను చూసిన దానిలో కోరదగినది, మంచిది ఏంటంటే, ఒకడు దేవుడు తనకు నియమించిన జీవితమంతా తన కష్టార్జితంతో అన్నపానాలు తీసుకుంటూ, క్షేమంగా బతకడమే. అదే దేవుడు వాడికి నియమించింది.
Kìa, ta đã nhìn thấy rằng ăn, uống, và hưởng phải của sự lao khổ mình làm ở dưới mặt trời trọn trong những ngày mà Ðức Chúa Trời ban cho, ấy thật là tốt và hay; vì đó là kỷ phần mình.
19 ౧౯ అంతే గాక దేవుడు ఒకడికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దానిలో తన వంతు అనుభవించడానికి, అన్నపానాలు పుచ్చుకోడానికి, తన కష్టార్జితంలో సంతోషించడానికి వీలు కలిగిస్తే అది దేవుని దీవెన అని భావించాలి.
Hễ Ðức Chúa Trời ban cho người nào giàu có, của cải, làm cho người có thế ăn lấy, nhận lãnh kỷ phần, và vui vẻ trong công lao của mình, ấy là một sự ban cho của Ðức Chúa Trời;
20 ౨౦ అతడు చేసే పనిలో దేవుడు అతనికి సంతోషం కలిగిస్తాడు కాబట్టి అతడు తన జీవితంలోని రోజులను పదే పదే జ్ఞాపకం చేసుకోడు.
nhân người sẽ ít nhớ những ngày của đời mình; vì Ðức Chúa Trời ứng đáp người bằng sự vui mừng trong lòng người.