< ప్రసంగి 4 >
1 ౧ ఆ తరవాత సూర్యుని కింద జరుగుతున్న వివిధ రకాల అన్యాయాలను గురించి నేను ఆలోచించాను. బాధలు పడేవారు కన్నీరు కారుస్తున్నారు. వారికి ఆదరణ లేదు. వారిని అణచి వేసే వారు బలవంతులు కాబట్టి వారిని ఆదరించేవారెవరూ లేరు.
Bio, mehwɛ mihuu nhyɛso a ɛrekɔ so wɔ owia yi ase: Mihuu wɔn a wɔredi wɔn nya no nusu na wonni ɔwerɛkyekyefo biara; tumi no wɔ wɔn nhyɛsofo no nsam na wonni ɔwerɛkyekyefo biara.
2 ౨ కాబట్టి ఇప్పుడు జీవిస్తున్న వారి కంటే గతించిపోయిన వారే ధన్యులు అనుకున్నాను.
Na mekae se: Awufo a wɔawuwu dedaw no, ani gye sen ateasefo; wɔn a wɔda so wɔ nkwa mu no.
3 ౩ ఇంకా పుట్టని వారు సూర్యుని కింద జరుగుతున్న ఈ అక్రమాలను చూడలేదు కాబట్టి ఈ ఇద్దరి కంటే వారు ఇంకా ధన్యులు అనుకున్నాను.
Na nea oye sen baanu yi ne nea onnya mmae, nea onnya nhuu bɔne a wɔyɛ wɔ owia yi ase.
4 ౪ కష్టంతో, నైపుణ్యంగా చేసే ప్రతి పనీ వేరొకరి అసూయకి కారణం అవుతున్నదని నేను చూశాను. ఇది కూడా నిష్ప్రయోజనంగా, ఒకడు గాలిని పట్టుకోడానికి చేసే ప్రయత్నంలాగా ఉంది.
Na mihuu sɛ adwumayɛ mu ɔbrɛ ne nea onipa tumi yɛ nyinaa nnyinaso ne sɛ nʼani bere ne yɔnko. Eyi nso yɛ ahuhude, mmirika a wotu taa mframa.
5 ౫ బుద్ధిహీనుడు పని చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోవడం వల్ల తనను తనే నాశనం చేసుకుంటున్నాడు.
Ɔkwasea bobɔw ne nsa gu ne ho na ɔsɛe ne ho.
6 ౬ రెండు చేతులతో కష్టం, గాలి కోసం ప్రయత్నాలు చేసేకంటే ఒక చేతిలో నెమ్మది కలిగి ఉండడం మంచిది.
Nsammua baako a asomdwoe wɔ mu ye sen nsammua abien a ɔbrɛ bata ho; ɛte sɛ nea wotaa mframa.
7 ౭ నేను ఆలోచిస్తున్నపుడు సూర్యుని కింద నిష్ప్రయోజనమైంది ఇంకొకటి కనిపించింది.
Afei nso mihuu biribi a ɛnka hwee wɔ owia yi ase:
8 ౮ ఒకడు ఒంటరిగా ఉన్నాడు. అతనికి జతగాడు గాని, కొడుకు గాని, సోదరుడు గాని లేడు. అయినా అతడు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు. ఐశ్వర్యం అతనికి తృప్తి కలిగించదు. సుఖమనేది లేకుండా ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నాను అనుకుంటాడు. ఇది కూడా ఆవిరిలాగా నిష్ప్రయోజనం, విచారకరం.
Na ɔbarima bi wɔ hɔ a ɔyɛ ankonam; onni ɔbabarima anaa onuabarima. Nʼadwumaden amma nʼawie da, nanso nʼani ansɔ nʼahonya. Obisaa ne ho se, “Na hena na merebrɛ ama no, na adɛn nti na mede anigye kame me kra?” Eyi nso yɛ ahuhude, ɛyɛ ɔhaw kwa.
9 ౯ ఇద్దరు కష్టపడితే ఇద్దరికీ మంచి జరుగుతుంది. కాబట్టి ఒంటరిగా కంటే ఇద్దరు కలిసి ఉండడం మంచిది.
Baanu ye sen ɔbaakofo, efisɛ wonya wɔn brɛ so mfaso a ɛsɔ ani:
10 ౧౦ ఒకడు కింద పడినా మరొకడు లేపుతాడు. అయితే ఒక్కడే ఉంటే అతడు పడినప్పుడు లేపేవాడు లేనందువలన అతనికి కష్టమే మిగులుతుంది.
Sɛ ɔbaako hwe ase a ne yɔnko betumi aboa no. Nanso onipa a ɔhwe ase a onni ɔboafo no, yɛ mmɔbɔ.
11 ౧౧ ఇద్దరు కలిసి పండుకొంటే వారికి వెచ్చగా ఉంటుంది. ఒక్కడే ఉంటే వీలు కాదు కదా!
Bio, sɛ baanu da bɔ mu a wɔka wɔn ho hyew. Na ɛbɛyɛ dɛn na ankonam bɛka ne ho hyew?
12 ౧౨ ఒంటరిగా ఉన్నవాణ్ణి పడదోయడం తేలిక. అయితే ఇద్దరు కలిసి ఉంటే తమపై దాడిని ఎదుర్కోగలరు. మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు గదా?
Ɔbaakofo de, wobetumi aka no ahyɛ nanso baanu tumi pere wɔn ti. Hama a wɔawɔ no mmɛsa no, wontumi ntetew mu ntɛm.
13 ౧౩ మంచి హెచ్చరికలు వినడానికి ఇష్టం లేని మూర్ఖుడైన ముసలి రాజుకంటే జ్ఞానవంతుడైన ఒక చిన్న పిల్లవాడు శ్రేష్ఠుడు.
Ɔbabun nyansafo a odi hia ye sen ɔhene akwakoraa a ɔyɛ ɔkwasea na ontie kɔkɔbɔ bio.
14 ౧౪ అలాంటివాడు తన దేశంలో బీదవాడుగా పుట్టినా, చెరసాలలో ఉన్నా రాజుగా పట్టాభిషేకం పొందుతాడు.
Ebia na ɔbabun no fi afiase na obedii ade anaasɛ wɔwoo no too ohia mu wɔ adehye abusua mu.
15 ౧౫ సూర్యుని కింద జీవిస్తూ తిరిగే వారంతా చనిపోయిన రాజుకు బదులు రాజైన ఆ చిన్నవాని పక్షం వహిస్తారని నేను గ్రహించాను.
Mihuu sɛ wɔn a wɔtenaa ase na wɔnantew owia yi ase nyinaa dii ɔbabun no akyi, nea odii ɔhene no ade no.
16 ౧౬ ప్రతి ఒక్కరూ అతనికి విధేయత చూపడానికి వస్తారు. అయితే ఆ తరవాత వారిలో అనేకమంది అతనిపై ఇష్టం చూపరు. నిజానికి ఇది కూడా నిష్ప్రయోజనమే, ఒకడు గాలిని పట్టుకోడానికి ప్రయత్నించినట్టే.
Nnipadɔm a wontumi nkan wɔn dii nʼakyi. Nanso nkyirimma no ani annye ne ho. Eyi nso yɛ ahuhude, ɛte sɛ wotaa mframa.