< ప్రసంగి 3 >
1 ౧ ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికీ ప్రతి ఉద్దేశానికీ ఒక సమయం ఉంది.
天が下の萬の事には期あり 萬の事務には時あり
2 ౨ పుట్టడానికీ, చనిపోడానికీ నాటడానికీ, నాటిన దాన్ని పెరకడానికీ
生るるに時あり死るに時あり 植るに時あり植たる者を抜に時あり
3 ౩ చంపడానికీ, స్వస్థపరచడానికీ కూలదోయడానికీ, కట్టడానికీ
殺すに時あり醫すに時あり 毀つに時あり建るに時あり
4 ౪ ఏడవడానికీ, నవ్వడానికీ, దుఃఖించడానికీ, నాట్యం చేయడానికీ
泣に時あり笑ふに時あり 悲むに時あり躍るに時あり
5 ౫ రాళ్లను పారవేయడానికీ, వాటిని పోగు చేయడానికీ ఎదుటి వారిని కౌగలించుకోడానికీ, మానడానికీ
石を擲つに時あり石を斂むるに時あり 懐くに時あり懐くことをせざるに時あり
6 ౬ వస్తువులను వెదకడానికీ, పోగొట్టుకోడానికీ దాచుకోడానికీ, పారవేయడానికీ
得に時あり失ふに時あり 保つに時あり棄るに時あり
7 ౭ వస్త్రాలను చింపడానికీ, కుట్టడానికీ మౌనం వహించడానికీ, మాటలాడడానికీ
裂に時あり縫に時あり 黙すに時あり語るに時あり
8 ౮ ప్రేమించడానికీ, ద్వేషించడానికీ యుద్ధం చేయడానికీ, సంధి చేసుకోడానికీ ఇలా ప్రతిదానికీ ఒక సమయం ఉంది.
愛しむに時あり惡むに時あり 戦ふに時あり和ぐに時あり
9 ౯ కష్టపడి పని చేసిన వారికి దాని వలన వచ్చిన లాభమేముంది?
働く者はその労して爲ところよりして何の益を得んや
10 ౧౦ మానవులు చేయడానికి దేవుడు వారికి ఇచ్చిన పని ఏమిటో నేను చూశాను.
我神が世の人にさづけて身をこれに労せしめたまふところの事作を視たり
11 ౧౧ దేవుడు ప్రతి దానినీ దాని కాలానికి సరిపడినట్టుగా చేశాడు. ఆయన నిత్యమైన జ్ఞానాన్ని మానవుల హృదయాల్లో ఉంచాడు. దేవుని కార్యాలను మొదటి నుండి చివరి వరకూ పూర్తిగా గ్రహించడానికి అది చాలదు.
神の爲したまふところは皆その時に適ひて美麗しかり 神はまた人の心に永遠をおもふの思念を授けたまへり 然れば人は神のなしたまふ作爲を始より終まで知明むることを得ざるなり
12 ౧౨ కాబట్టి మానవులకు బతికినంత కాలం సంతోషంగా, మంచి జరిగిస్తూ ఉండడం కంటే శ్రేష్ఠమైనదేదీ లేదని నేను గ్రహించాను.
我知る人の中にはその世にある時に快樂をなし善をおこなふより外に善事はあらず
13 ౧౩ ప్రతి ఒక్కరూ అన్నపానాలు పుచ్చుకుంటూ తన కష్టార్జితాన్ని అనుభవించడం దేవుడిచ్చే బహుమానమే అని కూడా గ్రహించాను.
また人はみな食飮をなしその労苦によりて逸樂を得べきなり 是すなはち神の賜物たり
14 ౧౪ దేవుడు చేసే పనులన్నీ నిత్యమైనవి అని నాకు తెలుసు. దానికి మరి దేనినీ కలపలేము, దానినుండి దేనినీ తీయలేము. మానవులు తనలో భయభక్తులు కలిగి ఉండాలని దేవుడే ఈ విధంగా నియమించాడు.
我知る凡て神のなしたまふ事は限なく存せん 是は加ふべき所なく是は減すべきところ無し 神の之をなしたまふは人をしてその前に畏れしめんがためなり
15 ౧౫ గతంలో జరిగిందే ఇప్పుడూ జరుగుతుంది. తరవాత జరగబోయేది కూడా ఇంతకు ముందు జరిగిందే. మానవులు మర్మమైన సంగతులు వెదికేలా దేవుడు చేస్తాడు.
昔ありたる者は今もあり 後にあらん者は既にありし者なり 神はその遂やられし者を索めたまふ
16 ౧౬ అంతేగాక ఈ లోకంలో న్యాయతీర్పు జరిగించే స్థలాల్లో, నీతి ఉండాల్సిన స్థలాల్లో నాకు దుష్టత్వం కనిపించింది.
我また日の下を見るに審判をおこなふ所に邪曲なる事あり 公義を行ふところに邪曲なる事あり
17 ౧౭ “మంచివారికీ చెడ్డవారికీ వారి ప్రతి ప్రయత్నానికీ, పనికీ తగిన సమయంలో దేవుడే తీర్పు తీరుస్తాడు” అని నా హృదయంలో అనుకున్నాను.
我すなはち心に謂けらく神は義者と惡者とを鞫きたまはん 彼處において萬の事と萬の所爲に時あるなり
18 ౧౮ తాము జంతువుల్లాటి వారని మానవులు తెలుసుకోవాలని దేవుడు అలా చేస్తున్నాడని నేను అనుకున్నాను.
我また心に謂けらく是事あるは是世の人のためなり 即ち神は斯世の人を検して之にその獣のごとくなることを自ら暁らしめ給ふなり
19 ౧౯ ఎందుకంటే జంతువులకు జరుగుతున్నట్టే మనుషులకీ జరుగుతూ ఉంది. ఇద్దరి గతీ ఒక్కటే. జంతువులు చనిపోతాయి, మనుషులూ చనిపోతారు. జీవులన్నిటికీ ఒక్కటే ప్రాణం. జంతువుల కంటే మనుషులకు ఎక్కువేమీ లేదు. అంతా ఆవిరిలాగా నిష్ప్రయోజనం కదా!
世の人に臨むところの事はまた獣にも臨む この二者に臨むところの事は同一にして是も死ば彼も死るなり 皆同一の呼吸に依れり 人は獣にまさる所なし皆空なり
20 ౨౦ అంతా ఒక్క చోటికే వెళతారు. అంతా మట్టిలోనుండి పుట్టింది, ఆ మట్టిలోకే తిరిగి పోతుంది.
皆一の所に往く 皆塵より出で皆塵にかへるなり
21 ౨౧ మనుషుల ఆత్మ పరలోకానికి ఎక్కిపోతుందనీ జంతువుల ప్రాణం భూమిలోకి దిగిపోతుందనీ ఎవరికి తెలుసు?
誰か人の魂の上に昇り獣の魂の地にくだることを知ん
22 ౨౨ మనిషికి తన తరువాత ఏం జరగబోతున్నదో చూపించడానికి వారిని తిరిగి వెనక్కి తెచ్చేవాడు ఎవరున్నారు? కాబట్టి వారు తమ పనిలో సంతోషించడం కంటే శ్రేష్టమైంది వారికేమీ లేదని నేను తెలుసుకున్నాను. అదే వారు చేయవలసింది.
然ば人はその動作によりて逸樂をなすに如はなし 是その分なればなり 我これを見る その身の後の事は誰かこれを携へゆきて見さしむる者あらんや