< ప్రసంగి 11 >

1 నీ భోజనాన్ని నీళ్ల మీద వెయ్యి. చాలా రోజులకు మళ్ళీ అది నీకు దొరుకుతుంది.
Voye pen ou sou sifas dlo, e apre anpil jou, ou va twouve l.
2 దాన్ని ఏడు, ఎనిమిది మందితో పంచుకో. ఎందుకంటే భూమి మీద ఏ విపత్తులు వస్తున్నాయో నీకు తెలియదు.
Divize byen ou fè sèt, oswa uit menm; paske ou pa janm konnen ki malè k ap rive sou latè.
3 మబ్బుల నిండా నీరుంటే అవి భూమి మీద వాన కురిపించి ఖాళీ అయిపోతాయి. ఒక చెట్టు దక్షిణం వైపుకు పడినా ఉత్తరం వైపుకు పడినా అది పడిన చోటే ఉంటుంది.
Si nwaj yo plen, yo vide lapli sou latè; epi si yon bwa tonbe vè sid, oswa vè nò, kote li tonbe a, se la l ap kouche.
4 గాలిని లక్ష్యపెట్టేవాడు విత్తనాలు చల్లడు. మబ్బులను చూస్తూ ఉండేవాడు పంట కోయడు.
Sila ke veye van an p ap simen; ni sila ki veye syèl la p ap rekòlte.
5 స్త్రీ గర్భంలో పసికందు ఎముకలు ఎలా ఏర్పడతాయో, గాలి ఎక్కడ నుంచి వస్తుందో నీవెలా గ్రహించలేవో సమస్తాన్నీ సృష్టించిన దేవుని పనిని నువ్వు గ్రహించలేవు.
Menm jan ke ou pa konnen chemen van an, ni jan zo yo vin fòme nan vant a fanm ansent lan, se konsa ou pa konnen zèv Bondye ki fè tout bagay la.
6 ఉదయాన విత్తనం నాటు. సాయంత్రం వరకూ అవసరమైనంత మట్టుకు నీ చేతులతో పని చెయ్యి. ఏవి ఫలిస్తాయో, ఉదయమా, సాయంత్రమా లేక రెండూ ఒకేలా బాగుంటాయో నీకు తెలియదు.
Simen semans ou nan maten an; ni pa gaspiye tan nan aswè. Paske ou pa janm konnen si se nan maten oswa nan aswè semans lan ap reyisi; ni si se pa tou de k ap bon.
7 వెలుగు నిజంగా ఎంతో బాగుంటుంది. సూర్యోదయం చూడడం ఇంకా ఎంత బాగుంటుందో!
Limyè a byen bèl, e li bon pou zye wè solèy la.
8 ఎవడైనా చాలా కాలం బతికితే, ఆ రోజులన్నీ ఆనందంగా ఉండాలి. అయితే రాబోయే చీకటి రోజుల గురించి అతడు ఆలోచించాలి. అవి అనేకం ఉంటాయి. రాబోయేదంతా అదృశ్యమయ్యే ఆవిరే.
Anverite, si yon nonm ta viv anpil ane, kite li rejwi li nan yo tout; men pa kite l bliye jou tenèb yo, paske yo va anpil. Tout sa ki gen pou vini se vanite.
9 యువకా, నీ యువదశలో సంతోషంగా ఉండు. నీ యువదశలో మనసారా సంతోషించు. నీ మనస్సులోని కోరికల ప్రకారం, నీ కళ్ళు చూచే వాటన్నిటినీ అనుభవించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడని గుర్తుపెట్టుకో.
Rejwi jennonm, pandan jenès ou, e kite kè ou rete kontan pandan ane de laj jenès ou yo. Swiv sa ki atire kè ou ak dezi a zye ou, men konnen byen ke Bondye va rele ou nan jijman pou tout bagay sa yo.
10 ౧౦ నీ హృదయం నుంచి కోపాన్ని తోలివెయ్యి. నీ శరీరంలో వచ్చే ఎలాంటి నొప్పినైనా పట్టించుకోవద్దు. ఎందుకంటే యువదశ, దాని బలం ఆవిరి లాంటివే.
Pou sa, retire gwo doulè ak mechanste pou l pa nan kè ou, e fè mal rete lwen chè ou; paske jenès ak ane jenès yo va disparèt vit.

< ప్రసంగి 11 >