< ద్వితీయోపదేశకాండమ 4 >
1 ౧ కాబట్టి ఇశ్రాయేలు ప్రజలారా, మీరు జీవించి మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకిస్తున్న దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకోవడానికి పాటించాల్సిన నియమాలు, కట్టడలు నేను మీకు బోధిస్తున్నాను. వినండి.
Afei, Israel montie mmara ne nhyehyɛeɛ a merebɛkyerɛkyerɛ mo yi yie. Monni so na moanya nkwa, na moatumi akɔ asase a Awurade mo agyanom Onyankopɔn de rema mo no so na moatena hɔ.
2 ౨ యెహోవా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మీకందిస్తున్నాను. వాటిని పాటించడంలో నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనినీ కలపకూడదు, దానిలో నుండి దేనినీ తీసివేయకూడదు.
Mommfa bi nka ho, na monnyi biribiara nso mfiri mmara a Awurade mo Onyankopɔn de ama me sɛ memfa mma mo no mu, na mmom monni so.
3 ౩ బయల్పెయోరు విషయంలో యెహోవా చేసినదాన్ని మీరు కళ్ళారా చూశారు కదా. బయల్పెయోరును వెంబడించిన ప్రతి పురుషుడినీ మీ యెహోవా దేవుడు మీ మధ్య ఉండకుండాా నాశనం చేశాడు.
Mode mo ani hunuu deɛ Awurade yɛɛ mo wɔ Baal-peor no. Ɔsɛee nnipa pii a na wɔsom abosom no.
4 ౪ యెహోవా దేవుణ్ణి హత్తుకొన్న మీరంతా ఈ రోజు వరకూ జీవించి ఉన్నారు.
Nanso, wɔn a na wɔdi Awurade mo Onyankopɔn nokorɛ nyinaa da so te ase bɛsi ɛnnɛ.
5 ౫ యెహోవా దేవుడు నాకు ఆజ్ఞాపించిన విధంగా మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీరు పాటించాల్సిన కట్టడలను, విధులను మీకు నేర్పాను.
Sɛ moduru asase a mobɛtena so no so a, yeinom ne mmara a ɛsɛ sɛ modi so. Ɛfiri Awurade, yɛn Onyankopɔn, nkyɛn. Ɔde ama me sɛ memfa mma mo.
6 ౬ ఈ కట్టడలన్నిటినీ మీరు అంగీకరించి వాటిని అనుసరించాలి. వాటిని గూర్చి విన్న ప్రజల దృష్టికి అదే మీ జ్ఞానం, అదే మీ వివేకం. వారు మిమ్మల్ని చూసి “నిజంగా ఈ గొప్ప జాతి జ్ఞానం, వివేచన గల ప్రజలు” అని చెప్పుకుంటారు.
Sɛ modi so a, ɛbɛma mo agye nim wɔ adwene ne nyansa mu. Na sɛ aman a wɔatwa mo ho ahyia no te saa mmara yi a, wɔbɛteam sɛ, “Ɔman bɛn na wɔwɔ nyansa ne adwene sɛ Israel!”
7 ౭ ఎందుకంటే మనం ఆయనకు మొర పెట్టిన ప్రతిసారీ మన యెహోవా దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జాతికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు?
Ɔman kɛseɛ bɛn na ɛwɔ onyame a ɔbɛn wɔn pɛɛ te sɛ Awurade, yɛn Onyankopɔn, a yɛfrɛ no a ɔgye yɛn so yi?
8 ౮ ఈ రోజు నేను మీకు అప్పగిస్తున్న ఈ ధర్మశాస్త్రమంతటిలో ఉన్న కట్టడలు, నీతివిధులు కలిగి ఉన్న గొప్ప జనమేది?
Na ɔman bɛn na ɛwɔ edin sei a ɛwɔ mmara pa te sɛ saa mmara yi a mede rema mo ɛnnɛ yi?
9 ౯ అయితే మీరు జాగ్రత్తపడాలి. మీరు కళ్ళారా చూసిన వాటిని మరచిపోకుండా ఉండేలా, అవి మీ జీవితమంతా మీ హృదయాల్లో నుండి తొలగిపోకుండేలా, మీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోండి. మీ కొడుకులకు, వారి కొడుకులకు వాటిని నేర్పించండి.
Monhwɛ yie! Monhwɛ yie pa ara na mo werɛ amfiri deɛ moahunu sɛ Awurade yɛ ma mo. Sɛ mote ase yi, mommma saa nsɛm yi mfiri mo adwene mu da! Na monhwɛ nso sɛ mo mma ne mo nananom nso bɛte.
10 ౧౦ మీరు హోరేబులో మీ యెహోవా దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నప్పుడు ఆయన, “నా దగ్గరికి ప్రజలను సమావేశపరచు. వారు ఆ దేశంలో నివసించే రోజులన్నీ నాకు భయపడడం నేర్చుకుని, తమ పిల్లలకు నేర్పేలా వారికి నా మాటలు వినిపిస్తాను అని ఆయన నాతో చెప్పాడు.”
Ka kyerɛ wɔn, ne titire no, ɛda a mokɔgyinaa Awurade mo Onyankopɔn anim wɔ bepɔ Horeb a ɔka kyerɛɛ me sɛ, “Frɛ ɔmanfoɔ no wɔ mʼanim na mɛkyerɛ wɔn deɛ wɔnyɛ no. Sɛ ɛba saa a, wɔbɛsua sɛdeɛ wɔbɛdi me ni berɛ dodoɔ a wɔte ase no, na ɛnam so ma wɔatumi akyerɛ wɔn mma mmara no.”
11 ౧౧ అప్పుడు మీరు దగ్గరకి వచ్చి ఆ కొండ కింద నిలబడ్డారు. చీకటి, మేఘం, గాఢాంధకారం కమ్మి ఆ కొండ ఆకాశం వరకూ అగ్నితో మండుతుండగా
Mobɛgyina bɛnee bepɔ no ayaase ɛberɛ a na bepɔ no rehye no. Egyaframa no tu kɔɔ soro a omununkum ne esum kabii aduru no.
12 ౧౨ యెహోవా ఆ అగ్నిలో నుండి మీతో మాట్లాడాడు. మీరు ఆ మాటలు విన్నారు గాని ఏ రూపాన్నీ చూడలేదు, స్వరం మాత్రమే విన్నారు.
Na Awurade kasa faa ogya no mu kyerɛɛ mo. Motee nsɛm no, nanso moanhunu no. Ɛnne kɛkɛ na ɛbaeɛ.
13 ౧౩ మీరు పాటించడానికి ఆయన విధించిన నిబంధనను, అంటే పది ఆజ్ఞలను మీకు తెలిపే రెండు రాతి పలకల మీద వాటిని రాశాడు.
Ɔdaa nʼapam a ɔkyerɛɛ mo sɛ monni so no adi; mmaransɛm edu a ɔtwerɛɛ guu aboɔ ɛpono mmienu so no.
14 ౧౪ అప్పుడు మీరు నది దాటి స్వాధీనం చేసుకోబోయే దేశంలో పాటించాల్సిన కట్టడలు, విధులను మీకు నేర్పమని యెహోవా నాకు ఆజ్ఞాపించాడు.
Saa ɛberɛ no na Awurade hyɛɛ me sɛ memfa mmara a ɛsɛ sɛ modi so wɔ asase a morebɛhyɛne so akɔtena so no mma mo.
15 ౧౫ హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల్లో నుండి మీతో మాట్లాడిన రోజు మీరు ఏ స్వరూపాన్నీ చూడలేదు.
Monhwɛ yie! Ɛberɛ a Awurade kasa faa ogya mu kyerɛɛ mo firi bepɔ Horeb so no, moanhunu no.
16 ౧౬ కాబట్టి మీరు భూమి మీద ఉన్న ఏ జంతువు గాని,
Ɛno enti, Monnnaadaa mo ho nyɛ mfoni hunu bi wɔ mo tirim sɛ ɔyɛ ɔbaa anaa ɔbarima,
17 ౧౭ ఆకాశంలో ఎగిరే రెక్కలున్న ఏ పక్షి గాని,
aboa anaa anomaa,
18 ౧౮ నేలమీద పాకే ఏ పురుగు గాని, భూమి కింద ఉన్న నీళ్లలో ఏ చేప గాని, ఆడదైనా మగదైనా ఎలాటి ప్రతిమను ఏ స్వరూపంలోనైనా విగ్రహాన్ని మీ కోసం చేసుకుని చెడిపోకుండేలా జాగ్రత్త పడండి.
aboa a ɔwea fam anaa nsuomnam.
19 ౧౯ ఆకాశం వైపు చూసి సూర్య చంద్ర నక్షత్రాలను, ఇంకా ఆకాశ సైన్యాలను చూసి మైమరచిపోయి మీ యెహోవా దేవుడు ఆకాశమంతటి కింద ఉన్న మనుషులందరి కోసం ఏర్పాటు చేసిన వాటికి నమస్కరించి, వాటిని పూజించకుండేలా మీరు ఎంతో జాగ్రత్త వహించండి.
Na sɛ mohwɛ ewiem na mohunu owia, ɔsrane ne nsoromma a, mma wɔnntwetwe mo nkɔsom wɔn. Awurade, mo Onyankopɔn, yɛɛ saa ewiem abɔdeɛ yi maa nnipa a wɔwɔ asase so nyinaa.
20 ౨౦ యెహోవా మిమ్మల్ని తీసుకుని ఈ రోజులాగా మీరు తనకు స్వంత ప్రజలుగా ఉండడానికి, ఇనపకొలిమి లాంటి ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించాడు.
Na mo deɛ, Awurade yii mo firii dadeɛ fononoo mu wɔ Misraim sɛ mommɛyɛ nʼadedifoɔ sɛdeɛ mote ɛnnɛ yi.
21 ౨౧ యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి, నేను ఈ యొర్దాను దాటకూడదనీ మీ యెహోవా దేవుడు స్వాస్థ్యంగా మీకిస్తున్న ఈ మంచి దేశంలో ప్రవేశింపకూడదనీ ఆజ్ఞాపించాడు.
Mo enti, Awurade bo fuu me yie. Ɔkaa ntam sɛ, merentwa Asubɔnten Yordan nkɔ asase pa a Awurade, mo Onyankopɔn, de rema mo sɛ mo agyapadeɛ sononko no so da.
22 ౨౨ కాబట్టి నేను ఈ యొర్దాను దాటకుండా ఈ దేశంలోనే చనిపోతాను. మీరు దాటి ఆ మంచి దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు.
Ɛwom sɛ mobɛtwa Yordan akɔtena hɔ asase no so, na me deɛ, mɛwu wɔ asuo no fa ha.
23 ౨౩ మీ దేవుడు యెహోవా మీకు ఏర్పరచిన నిబంధనను మరచి, మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన ప్రకారం ఎలాంటి రూపంతోనైనా విగ్రహాన్ని చేసుకోకుండేలా జాగ్రత్తపడండి.
Enti, monhwɛ yie na moammu apam a Awurade, mo Onyankopɔn, ne mo ayɛ no so. Sɛ moyɛ abosom sɛso biara a mo Awurade mo Onyankopɔn abra mo no a, na ɛkyerɛ sɛ, moabu apam no so.
24 ౨౪ ఎందుకంటే మీ దేవుడు యెహోవా దహించే అగ్ని, రోషం గల దేవుడు.
Awurade, mo Onyankopɔn, yɛ Onyame ninkunfoɔ ne ogya a ɔhye adeɛ Onyankopɔn.
25 ౨౫ మీరు పిల్లలను, వారు తమ పిల్లలను కని ఆ దేశంలో చాలా కాలం నివసించిన తరువాత మీరు చెడిపోయి, ఎలాంటి రూపంతోనైనా విగ్రహాలు చేసుకుని మీ యెహోవా దేవునికి కోపం పుట్టించి, ఆయన ఎదుట చెడు జరిగినప్పుడు
Moawowo mma ne mmanana akyi, na moatena asase no so akyɛre no, sɛ bɔne fa mo na moyɛ ohoni bi nam so yɛ bɔne wɔ Awurade mo Onyankopɔn ani so nam so hyɛ no Abufuo a,
26 ౨౬ మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబోయే దేశంలో ఉండకుండాా త్వరలోనే పూర్తిగా నాశనమై పోతారని భూమ్యాకాశాలను మీమీద సాక్షులుగా ఉంచుతున్నాను. ఆ దేశంలో ఎక్కువ రోజులు నిలబడకుండా మీరు పూర్తిగా నాశనమైపోతారు.
mefrɛ ɔsoro ne fam sɛ mʼadansefoɔ de tia mo saa ɛda yi sɛ, ntɛm so, mobɛhye afiri asase a moretwam wɔ so akɔ Yordan akɔfa no so. Morentena hɔ nkyɛ na wɔasɛe mo pasapasa.
27 ౨౭ అంతేగాక యెహోవా మిమ్మల్ని వివిధ జాతుల మధ్యకు చెదరగొడతాడు. ఆయన మిమ్మల్ని ఎక్కడికి తోలివేస్తాడో అక్కడి ప్రజల్లో మీరు కొద్దిమందిగా మిగిలి ఉంటారు.
Na Awurade bɛbɔ mo apansam aman mu a mo mu kakra bi na wɔbɛtena ase.
28 ౨౮ అక్కడ మీరు మనుష్యులు చేతితో చేసిన కర్ర, రాతి దేవుళ్ళను పూజిస్తారు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు.
Ɛhɔ a ɛyɛ ahɔhosase no so na mobɛsom ahoni a wɔde nnua ne aboɔ na ayɛ, anyame a wɔnhunu adeɛ na wɔnte asɛm na wɔnnidi nte hwa no.
29 ౨౯ అయితే అక్కడ నుండి మీ దేవుడు యెహోవాను మీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో వెతికితే, ఆయన మీకు ప్రత్యక్షమౌతాడు.
Ɛhɔ na mobɛpere bio ahwehwɛ Awurade mo Onyankopɔn. Na sɛ mode mo akoma ne mo kra nyinaa hwehwɛ no a, mobɛhunu no.
30 ౩౦ ఈ సంగతులన్నీ జరిగి మీకు బాధ కలిగినప్పుడు చివరి రోజుల్లో మీరు మీ యెహోవా దేవుని వైపు చూసి ఆయన మాటకు లోబడినప్పుడు
Sɛ ɔhaw bi to mo na yeinom nyinaa ba mo so a, akyire no, mobɛsane akɔ Awurade mo Onyankopɔn nkyɛn na moayɛ ɔsetie ama no.
31 ౩౧ మీ దేవుడు యెహోవా కనికరం గలవాడు కాబట్టి మీ చెయ్యి విడవడు, మిమ్మల్ని నాశనం చేయడు. తాను మీ పూర్వీకులతో చేసిన నిబంధన వాగ్దానాన్ని మరచిపోడు.
Ɛfiri sɛ, mo Awurade mo Onyankopɔn no yɛ mmɔborɔhunu Onyankopɔn. Ɔrennya mo na ɔrensɛe mo anaa ne werɛ remfiri apam a ɔne mo agyanom pameeɛ a ɔkaa ntam sii so no.
32 ౩౨ దేవుడు భూమి మీద మానవుణ్ణి సృష్టించింది మొదలు, మీ కంటే ముందటి రోజుల్లో ఆకాశం ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకూ ఇలాటి గొప్ప కార్యం జరిగిందా? దీనిలాంటి వార్త వినబడిందా? అని అడుగు.
Hwehwɛ abakɔsɛm mu firi ɛberɛ a Onyankopɔn bɔɔ nnipa wɔ asase so bɛsi ɛnnɛ yi. Afei, hwehwɛ firi ɔsoro ano kɔsi ɔsoro ano. Hwɛ sɛ biribi kɛseɛ a ɛte sɛ yei asi pɛn anaasɛ woate biribi saa pɛn?
33 ౩౩ మీలా దేవుని స్వరం అగ్నిలో నుండి మాట్లాడడం విని మరి ఏ ప్రజలైనా జీవించారా?
Ɔman bi ate Onyankopɔn nne sɛ ɔrekasa afiri ogya mu sɛdeɛ moteeɛ na wɔda so te ase yi anaa?
34 ౩౪ మీ యెహోవా దేవుడు ఐగుప్తులో మా కళ్ళ ఎదుట చేసిన వాటన్నిటి ప్రకారం ఏ దేవుడైనా సరే, కష్టాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, యుద్ధం, బాహుబలం, చాచిన చేయి, మహా భయంకర కార్యాలు, వీటన్నిటితో ఎప్పుడైనా వచ్చి ఒక ప్రజలోనుండి తనకోసం ఒక జాతి ప్రజని తీసుకోడానికి ప్రయత్నించాడా?
Onyame foforɔ bi nam ɔgye a ɔnam amanehunu, nsɛnkyerɛnneɛ a ɛyɛ nwanwa, ɔko, tumidie ne ahodwiredeɛ so agye ɔman bi afiri ɔman foforɔ bi nsam afa sɛ ne dea anaa? Nanso, saa na Awurade, mo Onyankopɔn, yɛ maa mo wɔ Misraim a mo ani hunuiɛ.
35 ౩౫ అయితే యెహోవాయే దేవుడనీ, ఆయన తప్ప మరొకడు లేడనీ మీరు తెలుసుకొనేలా అది మీకు చూపించాడు.
Ɔdaa yeinom nyinaa adi kyerɛɛ mo sɛdeɛ ɛbɛyɛ a mobɛhunu sɛ Awurade yɛ Onyankopɔn a nʼakyi obi nni hɔ.
36 ౩౬ మీకు బోధించడానికి ఆయన ఆకాశం నుండి తన స్వరాన్ని వినిపించాడు. భూమి మీద తన గొప్ప అగ్నిని మీకు చూపినప్పుడు ఆ అగ్నిలో నుండి ఆయన మాటలు మీరు విన్నారు.
Ɔmaa motee ne nne firi soro nam so tenetenee mo so. Ɔmaa mohunuu ne ogya fadum wɔ asase so, ɛnna motee ne nne firii ogya no mfimfini.
37 ౩౭ ఆయన మీ పూర్వీకుల్ని ప్రేమించాడు కాబట్టి వారి తరువాత వారి సంతానాన్ని ఏర్పరచుకున్నాడు.
Esiane sɛ na ɔpɛ mo agyanom asɛm, na ɔpɛɛ sɛ ɔhyira wɔn asefoɔ enti na ɔno ara nam ne tumi kɛseɛ so yii mo firii Misraim no.
38 ౩౮ మీకంటే బలమైన గొప్ప జాతుల ప్రజలను మీ ఎదుట నుండి వెళ్లగొట్టి మిమ్మల్ని ప్రవేశపెట్టి ఆయన ఈ రోజు జరుగుతున్నట్టు వారి దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇవ్వడానికి మీకు తోడుగా ఉండి ఐగుప్తు నుండి తన మహాబలంతో మిమ్మల్ని బయటికి రప్పించాడు.
Ɔpamoo saa aman yi a na wɔn ho yɛ den sene mo wɔ mo anim sɛdeɛ mobɛba wɔn asase so abɛdi so sɛdeɛ ɛte ɛnnɛ yi.
39 ౩౯ కాబట్టి, పైన ఆకాశంలో, కింద భూమిపైనా యెహోవాయే దేవుడనీ, మరొక దేవుడు లేడనీ ఈరోజు గ్రహించండి.
Enti, monkae na momma no ntim mo akoma mu: Awurade yɛ Onyankopɔn wɔ ɔsoro ne asase so, na onyame bi nka ne ho bio!
40 ౪౦ అంతే గాక మీకు, మీ తరువాత మీ సంతానానికి సుఖశాంతులు కలగడానికి మీ యెహోవా దేవుడు ఎప్పటికీ మీకిస్తున్న దేశంలో మీకు దీర్ఘాయువు కలిగేలా నేను మీకాజ్ఞాపిస్తున్న ఆయన కట్టడలను, ఆజ్ఞలను మీరు పాటించాలి.
Sɛ moyɛ ɔsetie ma mmara no ne ahyɛdeɛ no a mede bɛma mo ɛnnɛ no a, ɛbɛsi mo ne mo mma yie. Mobɛnyini akyɛre wɔ asase a Awurade mo Onyankopɔn de rema mo afebɔɔ no so.
41 ౪౧ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కాక, అనాలోచితంగా తన పొరుగువాణ్ణి చంపినప్పుడు
Afei, Mose yii nkuropɔn mmiɛnsa bi wɔ Yordan apueeɛ fam
42 ౪౨ అతడు పారిపోడానికి మోషే తూర్పు దిక్కున, యొర్దాను ఇవతల మూడు పట్టణాలను ఎన్నిక చేశాడు. అలాటి వ్యక్తి ఎవరైనా ఉంటే అతడు పారిపోయి ఆ పట్టణాల్లో ప్రవేశించి జీవించవచ్చు.
a, sɛ ɛba sɛ obi akum obi a wanhyɛ da na ɔnni onipa ko no ho menasepɔ bi a, ɔtumi dwane kɔ hɔ kɔbɔ ne ho adwaa.
43 ౪౩ అవేవంటే, రూబేనీయులకు మైదాన దేశపు ఎడారిలోని బేసెరు, గాదీయులకు గిలాదులో ఉన్న రామోతు, మనష్షీయులకు బాషానులో ఉన్న గోలాను.
Ɔyii Beser a ɛda ɛserɛ ne asase tata so no maa Rubenfoɔ. Ɔde Ramot a ɛwɔ Gilead no maa Gadfoɔ ɛnna ɔde Golan a ɛwɔ Basan no nso maa Manase abusuakuo.
44 ౪౪ ఇదీ మోషే ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రం.
Yeinom ne mmara a Mose de maa Israelfoɔ no.
45 ౪౫ ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికి వస్తున్నప్పుడు
Israelfoɔ no firii Misraim no, yeinom ne akwankyerɛ, mmara ne ahyɛdeɛ a Mose de maa wɔn
46 ౪౬ యొర్దాను ఇవతల బేత్పయోరు ఎదుటి లోయలో హెష్బోనులో, సీహోను రాజుగా పాలించే అమోరీయుల దేశంలో
ɛberɛ a wɔduruu bɔnhwa a ɛbɛn Bet-Peor a ɛda Asubɔnten Yordan apueeɛ fam. Kane no, na Amorifoɔ na wɔte asase yi so ɛberɛ a wɔn ɔhene Sihon a ɔfiri Hesbon di adeɛ. Mose ne Israelfoɔ firi Misraim ɛreba no, wɔsɛe ɔhene yi ne nkurɔfoɔ.
47 ౪౭ మోషే ఇశ్రాయేలు ప్రజలకు నియమించిన శాసనాలు, కట్టడలు, న్యాయ విధులు ఇవి.
Wɔfaa nʼasase no sane faa Basanhene Og asase nso kaa ho. Saa ahemfo baanu yi na wɔyɛ Amorifoɔ ahemfo a wɔte Yordan apueeɛ.
48 ౪౮ మోషే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వస్తూ ఆ సీహోనును చంపి అతని దేశాన్నీ యొర్దాను ఇవతల తూర్పు దిక్కున ఉన్న బాషాను రాజు ఓగు పాలించే దేశాన్నీ అర్నోను లోయలో ఉన్న అరోయేరు మొదలు హెర్మోను అనే సీయోను కొండ వరకూ ఉన్న అమోరీయుల ఇద్దరు రాజుల దేశాన్ని,
Saa asase yi na ɛfiri Aroer a ɛda Arnon subɔnhwa ano kɔsi Sion bepɔ, a wɔfrɛ no Hermon no ho.
49 ౪౯ పిస్గా ఊటలకు కిందుగా అరాబా సముద్రం వరకూ తూర్పు దిక్కున యొర్దాను అవతల ఆరాబా ప్రదేశమంతటినీ స్వాధీనం చేసుకున్నారు.
Israelfoɔ no sane faa nsaase a ɛfiri Araba ɛpo no ano kɔsi bepɔ Pisga ase.