< ద్వితీయోపదేశకాండమ 34 >

1 ఆ తరువాత మోషే మోయాబు మైదానాల నెబో కొండకు వెళ్ళాడు. యెరికోకు ఎదురుగా ఉన్న పిస్గా కొండ శిఖరం ఎక్కాడు. యెహోవా ఆ దేశం అంతటినీ మోషేకు చూపించాడు.
Тада изиђе Мојсије из поља моавског на гору Нава, на врх Фазге, која је према Јерихону; и показа му Господ сву земљу од Галада до Дана;
2 దాను వరకూ గిలాదు ప్రదేశాన్నీ, నఫ్తాలి ప్రాంతాన్నీ, ఎఫ్రాయీము మనష్షే ప్రాంతాన్ని, పశ్చిమ సముద్రం వరకూ యూదా ప్రాంతమంతా,
И сву земљу Нефталимову; и земљу Јефремову и Манасијину, и сву земљу Јудину до мора западног,
3 దక్షిణ దేశాన్నీ, ఈత చెట్లు ఉన్న యెరికో పట్టణం నుంచి సోయరు వరకూ ఉన్న మైదానాన్నీ అతనికి చూపించాడు.
И јужну страну, и равницу, долину под Јерихоном местом где има много палмових дрвета до Сигора.
4 యెహోవా అతనితో ఇలా చెప్పాడు. “నేను నీ సంతానానికి ఇస్తానని అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే. దాన్ని నీ కళ్ళారా చూడనిచ్చాను. అయితే నువ్వు నది దాటి అక్కడికి వెళ్లకూడదు.”
И рече му Господ: Ово је земља, за коју сам се заклео Авраму, Исаку и Јакову говорећи: Семену твом даћу је. Показах ти да је видиш очима својим, али у њу нећеш ући.
5 యెహోవా సేవకుడు మోషే యెహోవా మాట ప్రకారం మోయాబు దేశంలో చనిపోయాడు.
И умре онде Мојсије, слуга Господњи у земљи моавској по речи Господњој.
6 బేత్పయోరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతణ్ణి సమాధి చేశారు. అతని సమాధి ఎక్కడ ఉన్నదో ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదు.
А погребе га Господ у долини у земљи моавској према Вет-Фегору; и нико не дозна за гроб његов до данашњег дана.
7 మోషే చనిపోయినప్పుడు అతని వయసు 120 సంవత్సరాలు. అప్పటికి అతని కళ్ళు మసకబారలేదు. అతని బలం తగ్గలేదు.
И беше Мојсију сто и двадесет година кад умре, и не беху потамнеле очи његове нити га снага издала.
8 ఇశ్రాయేలు ప్రజలు మోయాబు మైదానాల్లో మోషే కోసం 30 రోజులపాటు దుఃఖించారు. తరువాత మోషే కోసం దుఃఖించిన రోజులు ముగిసాయి.
И плакаше синови Израиљеви за Мојсијем у пољу моавском тридесет дана; и прођоше плачни дани жалости за Мојсијем.
9 నూను కొడుకు యెహోషువ, జ్ఞానం కలిగిన ఆత్మతో నిండి ఉన్నాడు. ఎందుకంటే మోషే తన చేతులు అతని మీద ఉంచాడు. ఇశ్రాయేలు ప్రజలు అతని మాట విని, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు చేశారు.
А Исус син Навин беше пун духа мудрости, јер Мојсије беше метнуо на њ руке своје. И слушаше га синови Израиљеви, и творише као што заповеди Господ преко Мојсија.
10 ౧౦ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషేవంటి ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరూ లేరు. ఐగుప్తు దేశంలో ఫరోకూ అతని సేవకులందరికీ
Али не уста више пророк у Израиљу као Мојсије, ког Господ позна лицем к лицу,
11 ౧౧ అతని దేశమంతట్లో సూచక క్రియలనూ మహత్కార్యాలనూ చేయడానికి యెహోవా పంపిన ఇలాంటి ప్రవక్త ఎన్నడూ లేడు.
У свим знацима и чудесима, за која посла Господ да их учини у земљи мисирској на Фараону и на свим слугама његовим и на свој земљи његовој,
12 ౧౨ మహా బల ప్రభావాలతో ఇశ్రాయేలు ప్రజలందరి కళ్ళ ముందు, భయం గొలిపే పనులు చేసిన మోషే లాంటి ప్రవక్త ఇంతకుముందు ఎన్నడూ పుట్టలేదు.
И у свим делима крепке руке и у свим страхотама великим, које учини Мојсије пред свим Израиљем.

< ద్వితీయోపదేశకాండమ 34 >