< ద్వితీయోపదేశకాండమ 33 >

1 దేవుని సేవకుడు మోషే చనిపోయేముందు ఇశ్రాయేలు ప్రజలను ఇలా దీవించాడు. యెహోవా సీనాయి పర్వతం నుంచి బయలుదేరాడు
하나님의 사람 모세가 죽기 전에 이스라엘 자손을 위하여 축복함이 이러하니라
2 శేయీరు నుంచి వారికి ఉదయించాడు. ఆయన పారాను పర్వతం నుంచి ప్రకాశించాడు వేలాది వేల పవిత్రులతో ఆయన వచ్చాడు. ఆయన కుడివైపు మెరుపులు మెరుస్తున్నాయి.
일렀으되 여호와께서 시내에서 오시고 세일산에서 일어나시고 바란산에서 비취시고 일만 성도 가운데서 강림하셨고 그 오른손에는 불 같은 율법이 있도다
3 నిజంగా ఆయన ఆ ప్రజలను ప్రేమిస్తాడు. ఆయన పరిశుద్ధులంతా నీ చేతిలో ఉన్నారు, వారు నీ పాదాల దగ్గర వంగి నీ మాటలు విన్నారు.
여호와께서 백성을 사랑하시나니 모든 성도가 그 수중에 있으며 주의 발 아래에 앉아서 주의 말씀을 받는도다
4 మోషే మనకు ధర్మశాస్త్రాన్ని బోధించాడు, యాకోబు సమాజానికి అది వారసత్వం.
모세가 우리에게 율법을 명하였으니 곧 야곱의 총회의 기업이로다
5 అప్పుడు ప్రజల అధికారులూ ఇశ్రాయేలు గోత్రాలవారూ ఒకచోట చేరితే యెహోవా యెషూరూనులో రాజయ్యాడు.
여수룬에 왕이 있었으니 곧 백성의 두령이 모이고 이스라엘 모든 지파가 함께 한 때에로다
6 రూబేను చావకూడదు. బతకాలి. అయితే వారు కొద్ది మంది మాత్రమే.
르우벤은 살고 죽지 아니하고 그 인수가 적지 않기를 원하도다
7 యూదా గురించి మోషే ఇలా పలికాడు, యెహోవా, యూదా ప్రజల మనవి విని, మళ్ళీ అతన్ని తన ప్రజల దగ్గరికి చేర్చు. అతని కోసం పోరాడు. అతని శత్రువులకు విరోధంగా అతనికి సహాయం చెయ్యి
유다에 대한 축복은 이러하니라 일렀으되 여호와여! 유다의 음성을 들으시고 그 백성에게로 인도하시오며 그 손으로 자기를 위하여 싸우게 하시고 주께서 도우사 그로 그 대적을 치게 하시기를 원하나이다
8 లేవీ గురించి మోషే ఇలా పలికాడు, నీ తుమ్మీము, నీ ఊరీము నీ భక్తుడి కోసం ఉన్నాయి. మస్సాలో నువ్వు అతణ్ణి పరీక్షించావు. మెరీబా నీళ్ల దగ్గర అతనితో నువ్వు పోరాడావు.
레위에 대하여는 일렀으되 주의 둠밈과 우림이 주의 경건한 자에게 있도다 주께서 그를 맛사에서 시험하시고 므리바 물 가에서 그와 다투셨도다
9 నేను వాళ్ళని చూడలేదు, అని తన తండ్రి గురించి, తన తల్లి గురించి అన్నవాడు అతడు. తన సోదరులను లెక్క చెయ్యలేదు. తన సొంత కొడుకులను పట్టించుకోలేదు. ఎందుకంటే అతడు నీ మాటలను భద్రం చేశాడు. నీ నిబంధన పాటించాడు.
그는 그 부모에게 대하여 이르기를 내가 그들을 보지 못하였다 하며 그 형제들을 인정치 아니하며 그 자녀를 알지 아니한 것은 주의 말씀을 준행하고 주의 언약을 지킴을 인함이로다
10 ౧౦ అతడు యాకోబుకు నీ విధులనూ, ఇశ్రాయేలుకు నీ ధర్మశాస్త్రాన్నీ నేర్పిస్తాడు. అతడు నీ ఎదుట సాంబ్రాణి వేస్తాడు. నీ బలిపీఠం మీద సర్వాంగబలి అర్పిస్తాడు.
주의 법도를 야곱에게, 주의 율법을 이스라엘에게 가르치며 주 앞에 분향하고 온전한 번제를 주의 단 위에 드리리로다
11 ౧౧ యెహోవా, అతని ఆధిపత్యాలను దీవించు, అతడు చేసే పనులను అంగీకరించు. అతనికి విరోధంగా లేచే వారి, అతన్ని ద్వేషించేవారి నడుములు విరగ్గొట్టు. వాళ్ళు మళ్ళీ లేవరు.
여호와여! 그 재산을 풍족케 하시고 그 손의 일을 받으소서! 그를 대적하여 일어나는 자와 미워하는 자의 허리를 꺽으사 다시 일어나지 못하게 하옵소서!
12 ౧౨ బెన్యామీను గురించి మోషే ఇలా పలికాడు, యెహోవాకు ప్రియుడు. ఆయన దగ్గర అతడు క్షేమంగా ఉంటాడు. రోజంతా యెహోవా అతనికి అండగా ఉంటాడు. అతడు యెహోవా భుజాల మధ్య నివసిస్తాడు.
베냐민에 대하여는 일렀으되 여호와의 사랑을 입은 자는 그 곁에 안전히 거하리로다 여호와께서 그를 날이 맞도록 보호하시고 그로 자기 어깨 사이에 처하게 하시리로다
13 ౧౩ యోసేపు గురించి మోషే ఇలా పలికాడు. యెహోవా అతని భూమిని దీవిస్తాడు ఆకాశం నుంచి వచ్చే శ్రేష్ఠమైన మంచుతో, కింద ఉన్న జలాగాధంతో,
요셉에 대하여는 일렀으되 원컨대 그 땅이 여호와께 복을 받아 하늘의 보물인 이슬과 땅 아래 저장한 물과
14 ౧౪ సూర్యుని వల్ల వచ్చే శ్రేష్ఠమైన పంటతో, నెలనెలా పండే శ్రేష్ఠమైన పండ్లతో,
태양이 결실케 하는 보물과 태음이 자라게 하는 보물과
15 ౧౫ పురాతన పర్వతాల శ్రేష్ఠ పదార్థాలతో, శాశ్వతమైన కొండల శ్రేష్ఠ పదార్థాలతో,
옛 산의 상품물과 영원한 작은 산의 보물과
16 ౧౬ భూమి ఇచ్చే శ్రేష్ఠ పదార్థాలతో, దాని సమృద్ధితో, పొదలో కనిపించిన వాడి దయ యోసేపు తల మీదికి వస్తుంది గాక. తన సోదరుల్లో రాకుమారుడి నుదిటి మీదకు అది వస్తుంది గాక.
땅의 보물과 거기 충만한 것과 가시떨기 나무 가운데 거하시던 자의 은혜로 인하여 복이 요셉의 머리에, 그 형제 중 구별한 자의 정수리에 임할지로다
17 ౧౭ తొలిచూలు ఎద్దు ఠీవి అతనికుంది. అతని కొమ్ములు అడవి ఎద్దు కొమ్ములు. వాటితో అతడు ప్రజలను భూదిగంతాలకు తోలివేస్తాడు. వీరంతా ఎఫ్రాయింకు చెందిన వేలమంది. మనష్షేకు చెందిన వేలమంది.
그는 첫 수송아지 같이 위엄이 있으니 그 뿔이 들소의 뿔 같도다 이것으로 열방을 받아 땅 끝까지 이르리니 곧 에브라임의 만민이요 므낫세의 천천이리로다
18 ౧౮ జెబూలూను గురించి మోషే ఇలా పలికాడు, జెబూలూనూ, నువ్వు బయలు దేరేటప్పుడు సంతోషించు. ఇశ్శాఖారూ, నువ్వు నీ గుడారాల్లో సంతోషించు.
스불론에 대하여는 일렀으되 스불론이여 너는 나감을 기뻐하라 잇사갈이여! 너는 장막에 있음을 즐거워하라!
19 ౧౯ వాళ్ళు ప్రజలను పర్వతాలకు పిలుస్తారు. అక్కడ సరైన బలులు అర్పిస్తారు. వారు సముద్రాల సమృద్ధినీ సముద్ర తీర ఇసుకలో దాగిన నిధులనూ తీస్తారు.
그들이 열국 백성을 불러 산에 이르게 하고 거기서 의로운 제사를 드릴 것이며 바다의 풍부한 것, 모래에 감추인 보배를 흡수하리로다
20 ౨౦ గాదు గురించి మోషే ఇలా పలికాడు. గాదు ప్రాంతాన్ని విశాలం చేసేవాడికి దీవెన. ఆ గోత్రం ఆడ సింహంలా పొంచి ఉంటుంది చేతిని, నడినెత్తిని చీల్చివేస్తుంది.
갓에 대하여는 일렀으되 갓을 광대케 하시는 자에게 찬송을 부를지어다! 갓이 암사자같이 엎드리고 팔과 정수리를 찢는도다
21 ౨౧ అతడు తనకోసం శ్రేష్ఠమైన భాగాన్ని చూసుకున్నాడు. నాయకుని భాగం అక్కడ కేటాయించబడింది. ప్రజల ప్రముఖులు సమకూడినప్పుడు, యెహోవా తీర్చిన న్యాయాన్ని అమలు చేశాడు. ఇశ్రాయేలు ప్రజల విషయం యెహోవా న్యాయ విధుల ప్రకారం జరిగించాడు.
그가 자기를 위하여 먼저 기업을 택하였으니 곧 법 세운 자의 분깃으로 예비된 것이로다 그가 백성의 두령들과 함께 와서 여호와의 공의와 이스라엘과 세우신 법도를 행하도다
22 ౨౨ దాను విషయం మోషే ఇలా పలికాడు, దాను సింహపు పిల్ల వంటిది అది బాషానునుంచి దూకుతుంది.
단에 대하여는 일렀으되 단은 바산에서 뛰어 나오는 사자의 새끼로다
23 ౨౩ నఫ్తాలి విషయం మోషే ఇలా పలికాడు. కనికరంతో సంతృప్తి నొందిన నఫ్తాలి, యెహోవా దీవెనతో నిండిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ ప్రాంతాలు నీ స్వాధీనం.
납달리에 대하여는 일렀으되 은혜가 족하고 여호와의 복이 가득한 납달리여! 너는 서방과 남방을 얻을지로다
24 ౨౪ ఆషేరు విషయం మోషే ఇలా పలికాడు, మిగిలిన కొడుకుల కంటే ఆషేరుకు ఎక్కువ దీవెన. తన సోదరుల కంటే ఎక్కువ కటాక్షం పొందుతాడు. తన పాదాలు ఒలీవ నూనెలో ముంచుతాడు
아셀에 대하여는 일렀으되 아셀은 다자한 복을 받으며 그 형제에게 기쁨이 되며 그 발이 기름에 잠길지로다
25 ౨౫ నీ కమ్ములు ఇనుపవీ, కంచువీ. నువ్వు బతికిన కాలమంతా నీకు భద్రతే.
네 문빗장은 철과 놋이 될 것이니 네 사는 날을 따라서 능력이 있으리로다
26 ౨౬ యెషూరూనూ, నీ దేవుణ్ణి పోలిన వాడెవడూ లేడు నీ సహాయానికి ఆకాశ వాహనుడుగా ఆయన వస్తాడు తన ఘనతతో మేఘాల్లో నుండి వస్తాడు.
여수룬이여! 하나님 같은 자 없도다 그가 너를 도우시려고 하늘을 타시고 궁창에서 위엄을 나타내시는도다
27 ౨౭ నిత్య దేవుడు నీకు ఆశ్రయం, శాశ్వతమైన హస్తాలు నీ కింద ఉన్నాయి. శత్రువును ఆయన నీ ఎదుట నుంచి గెంటి వేస్తాడు. నాశనం చెయ్యి! అంటాడు.
영원하신 하나님이 너의 처소가 되시니 그 영원하신 팔이 네 아래 있도다 그가 네 앞에서 대적을 쫓으시며 멸하라 하시도다
28 ౨౮ ఇశ్రాయేలు ప్రజలు భద్రంగా నివసిస్తారు. యాకోబు నివాసం సురక్షితం. ధాన్యం, కొత్త ద్రాక్షారసాలున్న దేశంలో అతనిపై ఆకాశం నిజంగా మంచు కురుస్తుంది.
이스라엘이 안전히 거하며 야곱의 샘은 곡식과 새 포도주의 땅에 홀로 있나니 곧 그의 하늘이 이슬을 내리는 곳에로다
29 ౨౯ ఇశ్రాయేలూ! మీరెంత ధన్యులు! యెహోవా రక్షించిన ప్రజలారా, మీలాంటి వారెవరు? ఆయనే మిమ్మల్ని కాపాడే డాలు వంటివాడు, ఆయన మీకు ఘనమైన కత్తి వంటివాడు. నీ శత్రువులు వణుకుతూ నీకు లోబడతారు నువ్వు వారి ఎత్తయిన స్థలాలను తొక్కుతావు.
이스라엘이여! 너는 행복자로다! 여호와의 구원을 너같이 얻은 백성이 누구뇨 그는 너를 돕는 방패시요 너의 영광의 칼이시로다 네 대적이 네게 복종하리니 네가 그들의 높은 곳을 밟으리로다

< ద్వితీయోపదేశకాండమ 33 >