< ద్వితీయోపదేశకాండమ 32 >
1 ౧ ఆకాశమా! నేను చెప్పేది విను! నన్ను మాట్లాడనియ్యి. భూగోళమా, నా నోటి మాటలు ఆలకించు.
蒼天,傾聽,我要發言;大地,聆聽我口要說的話!
2 ౨ నా ఉపదేశం వానలా కురుస్తుంది. నా మాటలు మంచు బిందువుల్లా, లేతగడ్డిపై పడే చినుకుల్లా, పచ్చికపై కురిసే చిరుజల్లులా, మొక్కలపై కురిసే జల్లులా ఉంటాయి.
願我的教訓如雨下降,我的言語似露滴落,像降在綠茵上的細雨,像落在青草上的甘霖!
3 ౩ నేను యెహోవా పేరును ప్రకటిస్తాను. మన దేవునికి ఘనత ఆపాదించండి.
因為我要宣揚上主的名,請讚頌我們的天主!
4 ౪ ఆయన మనకు ఆశ్రయ దుర్గం. ఆయన పని పరిపూర్ణం. ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన పక్షపాతం చూపని దేవుడు. ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు.
他是磐石,他的作為完美無比;他的行徑公平正直,他是忠實無妄的天主,公義而又正直。
5 ౫ వారు తమను తాము చెడగొట్టుకున్నారు. వారు ఆయన సంతానం కారు. వారు దోషులు, మూర్ఖులైన వక్రతరం.
那不堪稱為子女的,自趨墮落,背叛了他,實在是個邪惡敗壞的世代!
6 ౬ బుద్ధి, ఇంగితం లేని మనుషులారా, యెహోవాకు ఇదా మీరిచ్చే కానుక? ఆయన మీ తండ్రి కాడా? ఆయనే గదా మిమ్మల్ని పుట్టించి స్థిరపరచింది?
愚昧無知的人民,你們就這樣報答上主嗎﹖他不是生育你,創造你,使你生存的大父嗎﹖
7 ౭ గతించిన కాలాన్ని గుర్తుకు తెచ్చుకోండి. తరతరాల సంవత్సరాల సంగతులను తలపోయండి. మీ తండ్రిని అడుగు, అతడు నీకు చూపిస్తాడు. పెద్దలను అడుగు, వాళ్ళు నీకు చెబుతారు.
你回想往古的時日,思念歷代的歲月;問你的父親,問你的長輩,他必給你講述;
8 ౮ మహోన్నతుడు ప్రజలకు వారి వారి వారసత్వాలను పంచి ఇచ్చినప్పుడు, మానవ జాతులను వేరు పరచినపుడు, ఇశ్రాయేలు ప్రజల లెక్క ప్రకారం ప్రజలకు హద్దులు నియమించాడు.
當至高者為民族分配產業時,分佈人的子孫時,按照天使的數目,為萬民劃定了疆界;
9 ౯ యెహోవా వంతు ఆయన ప్రజలే. ఆయన వారసత్వం యాకోబు సంతానమే.
但雅各伯是上主所保留的一分,以色列成為他特有的產業。
10 ౧౦ ఆయన ఆ ప్రజను ఎడారి ప్రదేశంలో కనుగొన్నాడు. బీడు భూమిలో, భీకరమైన శబ్దాలు ఉన్న నిర్జన ప్రదేశంలో అతణ్ణి రక్షించి ఆదుకున్నాడు. తన కనుపాపలా అతణ్ణి కాపాడాడు.
上主在曠野之地,在野獸咆哮的原野,發見了他,遂將他抱起,加以撫育,加以保護,有如自己的眼珠。
11 ౧౧ గద్ద తన గూడు రేపి తన పిల్లలపై ఎగురుతూ రెక్కలు చాపుకుని ఆ పిల్లలను రెక్కల మీద మోసినట్టు యెహోవా చేశాడు.
老鷹怎樣守候自己的窩巢,飛翔在幼雛之上,上主也怎樣伸展雙翅,把他背在自己的翼上。
12 ౧౨ యెహోవా ఒక్కడే ఆ ప్రజలకు దారి చూపుతున్నాడు. వేరే దేవుళ్ళెవరూ ఆయనకు సాటిరారు.
上主獨自領導了他,他旁邊並沒有外邦的神祇。
13 ౧౩ లోకంలో ఉన్నత స్థలాలపై ఆ ప్రజలను ఎక్కించాడు. పొలాల పంటలు వారికి తినిపించాడు. కొండబండల తేనెతో, చెకుముకి రాతిబండ నూనెతో వారిని తృప్తిపరిచాడు.
上主使他馳騁於高原之上,以田間的出產養育他,使他享受巖穴間的蜜,堅石中的油,
14 ౧౪ ఆవు మజ్జిగను, గొర్రెల, మేకల పాలనూ, గొర్రెపిల్లల కొవ్వునూ, బాషాను పొట్టేళ్లను, మేకపోతులనూ, శ్రేష్ఠమైన గోదుమ పిండినీ మీకిచ్చాడు. మంచి ద్రాక్షరసంతో చేసిన మద్యం మీరు తాగారు.
牛酪和羊乳,肥美的羔羊和公羊,巴商的公牛與山羊,以及上等的麥麵;並以葡萄美酒作你的飲品。
15 ౧౫ యెషూరూను కొవ్వి కాలు దువ్వాడు, మీరు కొవ్వుతో బలిసి మొద్దులాగా అయ్యారు. యెషూరూను తనను పుట్టించిన దేవుణ్ణి వదిలేశాడు. తన రక్షణ శిలను నిరాకరించాడు.
雅各伯吃肥了,耶叔戎吃胖了,會踢人了。──的確,你胖了,肥了,飽滿了。──他遂拋棄了造他的天主,輕視了救他的磐石。
16 ౧౬ వారు ఇతర దేవుళ్ళను అనుసరించి ఆయనకు రోషం పుట్టించారు. అసహ్యమైన విగ్రహాలు పెట్టుకుని ఆయనకు కోపం తెప్పించారు.
他們以邪神的敬禮激起他的妒火,以可憎惡的事物,惹他動怒;
17 ౧౭ వారు దేవత్వం లేని దయ్యాలకు బలులు అర్పించారు. తమకు తెలియని దేవుళ్ళకూ, కొత్తగా పుట్టుకొచ్చిన దేవుళ్ళకూ, మీ పితరులు భయపడని దేవుళ్ళకూ బలులర్పించారు.
他們所祭祀的是邪神,而非真神,是向來所不認識的神,是近來新興,你們的祖先所不敬畏的神。
18 ౧౮ నీకు తండ్రి లాంటి బండను వదిలేశావు, నిన్ను కన్న దేవుణ్ణి మరిచావు.
你忽略了那生你的磐石,忘記了那使你出世的天主。
19 ౧౯ యెహోవా దీన్ని చూసి వాళ్ళని వదిలేశాడు, తన కొడుకులూ కూతుర్లూ ఆయన్నలా రేపారు.
上主一見,大為震怒,遂拋棄了自己的子女,
20 ౨౦ ఆయనిలా అన్నాడు. “వారికి నా ముఖాన్ని దాచు కుంటాను. వాళ్ళ అంతం ఎలా ఉంటుందో చూస్తాను. వాళ్ళు మొండి తరం, విశ్వసనీయత లేని పిల్లలు.
說我要掩面不顧他們,要看他們的結局如何;這實在是敗壞的一代,毫無信實的子女。
21 ౨౧ దేవుడు కాని దానితో వాళ్ళు నాకు రోషం తెప్పించారు. తమ పనికిమాలిన విగ్రహాలతో నాకు కోపం తెప్పించారు. ప్రజలు కాని వారిని చూసి వారు అసూయ పడేలా చేస్తాను. తెలివిలేని రాజ్యాన్ని చూసి వారికి కోపం వచ్చేలా చేస్తాను.
他們以虛妄之神,激起我的怒火,以虛無之物,惹我動怒;我也要以那不成子民的人激起他們的妒火,以愚昧的民族惹他們發怒。
22 ౨౨ నా కోపాగ్ని రగులుకుంది. పాతాళ అగాధం వరకూ అది మండుతుంది. భూమినీ దాని పంటనూ అది కాల్చేస్తుంది. పర్వతాల పునాదులను రగులబెడుతుంది. (Sheol )
我的怒火一燃起,必燒到陰府的深底,吞滅大地及其出產,焚毀山岳的基礎。 (Sheol )
23 ౨౩ వారిపై విపత్తుల సమూహం తెప్పిస్తాను. వారి మీదికి నా బాణాలు వదులుతాను.
我要將災禍不斷加在他們身上,向他們射盡我的箭矢。
24 ౨౪ వారు కరువుతో అల్లాడతారు. ఒళ్ళు కాలే మంటతో, పెను నాశనంతో క్షీణిస్తారు. దుమ్ములో పాకే వాటి విషాన్నీ అడివి జంతువుల కోరలనూ వారిమీదికి రప్పిస్తాను.
他們必因饑餓而衰弱,必為熱症、毒疫所消滅;我還使尖牙的野獸和土中爬行的毒蟲傷害他們。
25 ౨౫ బయట కత్తి చావు తెస్తుంది. పడక గదుల్లో భయం పీడిస్తుంది. యువకులూ, కన్యలూ, పసికందులూ, నెరిసిన వెంట్రుకలున్నవారూ నాశనం అవుతారు.
外有刀劍,內有恐怖,使少男少女,乳兒白頭,同歸於盡。
26 ౨౬ వాళ్ళను చాలా దూరం విసిరేస్తాను. వాళ్ళ జ్ఞాపకాలు మానవ జాతిలో లేకుండా తుడిచేస్తాను.
我原想粉碎他們,將他們的記念由人間消滅;
27 ౨౭ కానీ అలా ఎందుకు చెయ్యలేదంటే, వాళ్ళ విరోధులు రెచ్చిపోతారేమో, వాళ్ళ విరోధులు అపార్థం చేసుకుని, ‘పైచెయ్యి మనదే, ఇది చేసింది యెహోవా కాదు’ అంటారేమో.”
但我怕仇人自誇,怕敵人誤會說:「是我的手得勝了,而不是上主行了這一切。」
28 ౨౮ ఇశ్రాయేలు తెలివిలేని ప్రజ. వాళ్ళలో వివేకమే లేదు.
他們原是無謀的民族,沒有一點見識。
29 ౨౯ వారికి జ్ఞానముంటే, దీన్ని వాళ్ళు అర్థం చేసుకుంటే, వాళ్లకు రాబోయే ఆపద గమనించుకుంటే,
如果他們有點智慧,定會明瞭此事,看清未來的局勢。
30 ౩౦ వారి ఆశ్రయదుర్గం వారిని అమ్మి వేయకపోతే, యెహోవా వారిపై మనకు విజయాన్నివ్వకపోతే, ఒకడు వేయి మందిని ఎలా తరుముతాడు? పదివేల మందిని ఇద్దరు ఎలా పారదోలతారు?
「若不是他們的磐石出賣了他們,上主放棄了他們一人怎能追擊一千,兩人怎能打跑一萬﹖」
31 ౩౧ మన శత్రువుల బండ మన ఆశ్రయదుర్గం లాంటిది కాదు. మన శత్రువులే దీనికి సాక్షులు.
連我們的仇人也承認,他們的磐石不如我們的磐石。
32 ౩౨ వారి ద్రాక్షచెట్టు సొదొమ ద్రాక్ష చెట్టు నుంచి వచ్చింది. అది గొమొర్రా పొలాల్లోనిది. వారి ద్రాక్షపళ్ళు విషపు ద్రాక్షపళ్ళు. వాటి గెలలు చేదు.
誠然,他們的葡萄秧,出自索多瑪的葡萄園,來在哈摩辣的田園;他們的葡萄是毒葡萄,粒粒葡萄皆酸苦。
33 ౩౩ వారి ద్రాక్షారసం పాము విషం. నాగుపాముల క్రూర విషం.
他們的酒是蛇的毒汁,是蝮蛇的猛烈毒液。
34 ౩౪ ఇది నా రహస్య ఆలోచన కాదా? నా ఖజానాల్లో భద్రంగా లేదా?
這事豈不是貯藏在我身旁,封閉在我府庫裏﹖
35 ౩౫ వారి కాలు జారే కాలంలో పగ తీర్చే పని నాదే. ప్రతిఫలమిచ్చేది నేనే. వారి ఆపద్దినం దగ్గర పడింది. వారి అంతం త్వరగా వస్తుంది.
等到他們失足之時,我必復仇報復;他們滅亡的日子確已臨近,給他們預定的命運就要來到。
36 ౩౬ బానిస గానీ, స్వతంత్రుడు గానీ, మరెవరూ మిగలకపోతే, వారికి ఆధారం లేనప్పుడు చూసి, తన సేవకులకు జాలి చూపిస్తాడు, తన ప్రజలకు యెహోవా నిర్ణయం చేస్తాడు.
因為上主要衛護自己的人民,憐恤自己的僕人。當他看見他們的能力已逝,奴隸與自由人已到絕境,
37 ౩౭ అప్పుడాయన వారి దేవుళ్ళు ఎక్కడ? వాళ్ళు నమ్ముకున్న బండ ఏది?
必問說:「他們的神祇在那裏,他們投靠的磐石究在何處﹖
38 ౩౮ వారికి ఆధారం లేనప్పుడు చూసి, వారి నైవేద్యాల కొవ్వు తిని, వారి పానీయార్పణ ద్రాక్షారసాన్ని తాగిన వారి దేవుళ్ళు ఎక్కడ? వారు లేచి మీకు సాయపడనివ్వండి. వారినే మిమ్మల్ని కాపాడనివ్వండి.
一向吃他們祭牲脂肪的,喝他們奠祭酒漿的,都在那裏﹖讓他們起來援助你們罷! 讓他們做你們的保障罷!
39 ౩౯ చూడండి. నేనే, నేను మాత్రమే దేవుణ్ణి. నేను తప్ప మరో దేవుడు లేడు. చంపేది నేనే, బతికించేది నేనే. దెబ్బ కొట్టేది నేనే, బాగు చేసేది నేనే. నా చేతిలో నుంచి విడిపించేవాడెవడూ లేడు.
現在你們應認清,只有我是「那一位,」除我以外沒有別神;我使人死,也使人活;我擊傷人,也加以治療;誰也不能由我手中救出。
40 ౪౦ ఆకాశం వైపు నా చెయ్యెత్తి నేనెప్పటికీ జీవిస్తున్నట్టుగా పని చేస్తాను.
我向天舉手宣誓:我生活至於永遠!
41 ౪౧ నేను తళతళలాడే నా కత్తి నూరి, నా చెయ్యి న్యాయం తీర్చడం మొదలెడితే, నా శత్రువులకు ప్రతీకారం చేస్తాను. నన్ను ద్వేషించే వారికి ప్రతిఫలమిస్తాను.
我一磨亮我的刀劍,我一掌握裁判權,必向我的敵人雪恨,對恨我的人報復。
42 ౪౨ నా బాణాలు రక్తంతో మత్తెక్కి పోయేలా చేస్తాను. నా కత్తి, మాంసం భక్షిస్తుంది! చచ్చిన వారి రక్తాన్నీ, బందీల రక్తాన్నీ, శత్రువు అధికారులనూ అవి తింటాయి.
我要使我的箭矢醉飲鮮血,使我的刀劍吞食血肉:陣亡和俘虜的鮮血,仇敵將領的頭顱。」
43 ౪౩ ఇతర రాజ్యాల ప్రజలారా, దేవుని ప్రజలతో ఆనందించండి. వధకు గురి అయిన తన సేవకుల రక్తానికి ఆయన పగ తీరుస్తాడు. తన విరోధులకు ప్రతీకారం చేస్తాడు. తన దేశం కోసం, తన ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు.
萬國,你們應向他的百姓祝賀! 因為上主必為自己的僕人報血仇,向仇敵報復,聖潔自己的土地和百姓。
44 ౪౪ మోషే, నూను కొడుకు యెహోషువ ఈ పాటలోని పదాలన్నీ ప్రజలకు పాడి వినిపించారు.
梅瑟和農的兒子若蘇厄前來,將這篇詩歌的話朗誦給百姓聽。
45 ౪౫ మోషే ఈ పాట ఇశ్రాయేలు ప్రజల కోసం పాడి ముగించాడు.
梅瑟向全以色列人一朗誦完了,
46 ౪౬ తరువాత అతడు వారితో ఇలా చెప్పాడు, దీనికి మీరే సాక్ష్యం. ఈ రోజు నేను పలికిన మాటలన్నీ మీ మనస్సుల్లో నింపుకుని, ఈ ధర్మశాస్త్ర ప్రమాణాలన్నీ అనుసరించి నడుచుకోవాలని మీ సంతానానికి ఆజ్ఞాపించాలి.
就對他們說:「你們應把我今日警告你們的一切話記在心內,好吩咐你們的子孫,謹守遵行這法律上的一切話。
47 ౪౭ ఇవి మీకు నిష్ఫలమైన మాటలు కావు, ఇవి మీకు జీవదాయకమైనవి. మీరు యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబోతున్న దేశంలో దీన్ని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులవుతారు.
因為這為你們不是空洞的話,而是關係你們的生命;由於遵守這話,你們纔能在過約但河後所要佔領的地上,長久居留。」
48 ౪౮ అదే రోజు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, యెరికో ఎదుట ఉన్న మోయాబు దేశంలోని అబారీం అనే ఈ పర్వతం,
上主就在當天對梅瑟說:「
49 ౪౯ అంటే నెబో కొండ ఎక్కు. నేను ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇస్తున్న కనాను దేశాన్ని నువ్వు చూస్తావు.
你到摩阿布去,上這座阿巴陵山,即面對耶里哥的乃波山上去,觀看我要給以色列子民作產業的客納罕地。
50 ౫౦ నీ సోదరుడు అహరోను, హోరు కొండ మీద చనిపోయి తమ పితరుల దగ్గరికి చేరినట్టు, నువ్వు ఎక్కబోతున్న కొండ మీద చనిపోయి, నీ పితరుల దగ్గరికి వెళ్తావు.
你要死在你所上的山上,歸到你本族那裏,像你哥哥亞郎死在曷爾山,歸到他本族那裏一樣。
51 ౫౧ ఎందుకంటే, మీరు సీను ఎడారిలో కాదేషు మెరీబా నీళ్ల దగ్గర ఇశ్రాయేలు ప్రజల మధ్య నన్ను ఘనపరచక ఇశ్రాయేలు ప్రజల మధ్య నా మీద తిరుగుబాటు చేశారు.
因為你們在親曠野,卡德士的默黎巴水邊,在以色列子民中對我失信,沒有在他們中尊我為聖;
52 ౫౨ నువ్వు ఆ దేశాన్ని దూరం నుంచి చూస్తావు. నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న ఆ దేశంలో నువ్వు అడుగుపెట్టవు.
為此,我賜給以色列子民的地方,你只可由對面眺望,卻不能進去。」