< ద్వితీయోపదేశకాండమ 31 >
1 ౧ మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఈ విధంగా మాట్లాడిన తరువాత మళ్ళీ ఈ మాటలు చెప్పాడు, “నాకు ఇప్పుడు 120 ఏళ్ళు.
Tad Mozus nogāja un runāja šos vārdus uz visu Israēli,
2 ౨ ఇకనుంచి నేను అటూ ఇటూ వస్తూ పోతూ ఉండలేను. యెహోవా నాతో ఈ యొర్దాను నది దాటకూడదు అని చెప్పాడు.
Un uz tiem sacīja: šodien es esmu simts un divdesmit gadus vecs; es nevarēšu vairs ne iziet ne ieiet, un Tas Kungs uz mani sacījis: tev nebūs iet pāri pār šo Jardāni.
3 ౩ మీ యెహోవా దేవుడు మీకు ముందుగా దాటిపోయి ఈ రాజ్యాలను మీ ఎదుట ఉండకుండా నాశనం చేస్తాడు. మీరు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. యెహోవా చెప్పినట్టుగా యెహోషువ మీకు ముందుగా దాటిపోతాడు.
Tas Kungs, tavs Dievs, Tas ies pats tavā priekšā pāri, Tas izdeldēs šīs tautas tavā priekšā, ka tu tās iemanto; Jozuas, tas ies pāri tavā priekšā, kā Tas Kungs runājis.
4 ౪ యెహోవా నాశనం చేసిన అమోరీయుల రాజులు సీహోను, ఓగుకూ, వారి దేశాలకూ ఏమి జరిగించాడో అలానే వారికీ చేస్తాడు.
Un Tas Kungs viņiem darīs, kā Viņš darījis Sihonam un Ogam, Amoriešu ķēniņiem, un viņu zemei, ko Viņš izdeldējis.
5 ౫ మీరు వాళ్ళతో యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోవా మీ చేతికి వారిని అప్పగిస్తాడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతా వారిపట్ల చెయ్యండి.
Kad nu Tas Kungs tos nodos jūsu priekšā, tad jums tiem būs darīt pēc visām pavēlēm, ko es jums esmu pavēlējis.
6 ౬ నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. భయపడవద్దు. వాళ్ళను చూసి కంగారు పడవద్దు. మీతో వచ్చేవాడు మీ యెహోవా దేవుడే. ఆయన మిమ్మల్ని వదిలిపెట్టడు, మర్చిపోడు.”
Esat stipri un turat drošu prātu, nebīstaties un nebaiļojaties priekš viņiem, jo Tas Kungs, tavs Dievs, Tas tev iet līdz; Viņš tevi neatstās, nedz tevi pametīs.
7 ౭ మోషే యెహోషువను పిలిచి, “నువ్వు నిబ్బరంగా, ధైర్యంగా నిలబడు. యెహోవా ఈ ప్రజలకిస్తానని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశానికి నువ్వు వీరితోబాటు వెళ్లి దాన్ని వారికి స్వాధీనం చెయ్యాలి.
Un Mozus aicināja Jozua un sacīja uz viņu visa Israēla priekšā: esi stiprs un turi drošu prātu, jo tu ieiesi ar šiem ļaudīm tai zemē, ko Tas Kungs viņu tēviem ir zvērējis, viņiem dot, un tev to būs viņiem izdalīt.
8 ౮ నీకు ముందుగా వెళ్ళేవాడు యెహోవాయే. ఆయన నీతో ఉంటాడు. ఆయన నిన్ను వదిలిపెట్టడు, మర్చిపోడు. భయపడవద్దు. వాళ్ళను చూసి దిగులు పడవద్దు” అని ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట అతనితో చెప్పాడు.
Tas Kungs, Tas iet tavā priekšā, Viņš būs ar tevi, Viņš tevi neatstās, nedz tevi pametīs, nebīsties un nebaiļojies.
9 ౯ మోషే ఈ ధర్మశాస్త్రాన్ని రాసి, యెహోవా నిబంధన మందసాన్ని యాజకులైన లేవీయులకూ ఇశ్రాయేలీయుల పెద్దలందరికీ ఇచ్చాడు.
Un Mozus uzrakstīja to bauslību un to deva tiem priesteriem, Levja dēliem, kas nesa Tā Kunga derības šķirstu, un visiem Israēla vecajiem.
10 ౧౦ మోషే వారికిలా ఆజ్ఞాపించాడు, “ప్రతి ఏడవ సంవత్సరంలో అంటే అప్పులు రద్దు చేసే ఆ నిర్ణీత గడువు సంవత్సరంలో పర్ణశాలల పండగ సమయంలో
Un Mozus tiem pavēlēja un sacīja: ik septītā gadā, atlaišanas gada laikā, lieveņu svētkos,
11 ౧౧ మీ దేవుడైన యెహోవా ఎన్నుకున్న స్థలంలో ఇశ్రాయేలు ప్రజలంతా ఆయన ఎదుట కనబడాలి. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట ఈ ధర్మశాస్త్రాన్ని చదివి వారికి వినిపించాలి.
Kad viss Israēls nāks rādīties Tā Kunga, tava Dieva, priekšā, tai vietā, ko Viņš izredzēs, tad tev šo bauslību būs priekšā lasīt visam Israēlim viņu ausīs.
12 ౧౨ మీ యెహోవా దేవునికి భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నిటినీ విని, వాటి ప్రకారం నడుచుకునేలా ప్రజలను సమకూర్చాలి. పురుషులనూ స్త్రీలనూ పిల్లలనూ మీ పట్టణాల్లో ఉన్న పరదేశులను పోగు చెయ్యాలి.
Sapulcini tos ļaudis, vīrus un sievas un bērniņus un savus piedzīvotājus, kas tavos vārtos, lai tie dzird un mācās un bīstas To Kungu, jūsu Dievu, un tur un dara visus šīs bauslības vārdus,
13 ౧౩ అలా చేస్తే, ఆ వాక్యాలు ఎరగనివారి పిల్లలు వాటిని విని, మీరు స్వాధీనం చేసుకోడానికి యొర్దాను నది దాటబోతున్న దేశంలో మీరు జీవించే రోజులన్నీ మీ యెహోవా దేవునికి భయపడడం నేర్చుకుంటారు.”
Un lai viņu bērni, kas to nezina, dzird un mācās bīties To Kungu, jūsu Dievu, visu to laiku, kamēr jūs dzīvosiet tai zemē, ko iemantot jūs ejat pār Jardāni.
14 ౧౪ యెహోవా, మోషేతో ఇలా చెప్పాడు. “చూడు. నువ్వు తప్పకుండా చనిపోయే రోజు వస్తుంది. నువ్వు యెహోషువను పిలిచి నేనతనికి ఆజ్ఞలు ఇవ్వడానికి సన్నిధి గుడారంలో నిలబడండి.”
Un Tas Kungs sacīja uz Mozu: redzi, tavs laiks ir klāt, ka jāmirst; aicini Jozua, un ejat saiešanas teltī, lai Es viņam pavēlu. Tad Mozus un Jozuas gāja un nostājās saiešanas teltī.
15 ౧౫ మోషే, యెహోషువలు సన్నిధి గుడారంలో నిలబడ్డారు. యెహోవా మేఘస్తంభంలో నుండి గుడారం దగ్గర కనిపించాడు. ఆ మేఘస్తంభం గుడారపు ద్వారం పైగా నిలిచింది.
Tad Tas Kungs tai teltī parādījās padebeša stabā, un tas padebeša stabs stāvēja saiešanas telts durvīs.
16 ౧౬ యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “చూడు. నువ్వు చనిపోయి నీ పితరుల దగ్గరికి చేరుకోబోతున్నావు. ఈ ప్రజలు బయలుదేరి ఏ దేశ ప్రజల మధ్య ఉండబోతున్నారో ఆ ప్రజల మధ్య, ఆ అన్య దేవుళ్ళను అనుసరించి వ్యభిచారుల్లా ప్రవర్తిస్తారు. నన్ను విడిచిపెట్టి నేను వారితో చేసిన నిబంధన మీరతారు.
Un Tas Kungs sacīja uz Mozu: redzi, tu dusēsi pie saviem tēviem, un šie ļaudis celsies un maukos pakaļ tās zemes svešiem dieviem, kur tie nāks dzīvot, un atstās Mani un atmetīs Manu derību, ko Es ar tiem esmu derējis,
17 ౧౭ అప్పుడు వారిమీద నా కోపం రేగుతుంది. నేను వాళ్ళని వదిలిపెడతాను. వారికి నా ముఖం చాటు చేస్తాను. వాళ్ళు నాశనమైపోతారు. ఎన్నో విపత్తులూ కష్టాలూ వాళ్లకు సంభవిస్తాయి. ఆ సమయంలో వాళ్ళు, మన దేవుడు మన మధ్య లేనందువల్లనే మనకు ఈ విపత్తులు వచ్చాయి గదా! అనుకుంటారు.
Tai dienā Mana bardzība pret tiem iedegsies, un Es tos atstāšu un paslēpšu Savu vaigu no viņiem, ka tie top aprīti, un daudz ļaunuma un daudz bēdu viņiem uzies, ka tie tai dienā sacīs: vai šis ļaunums man nav uzgājis tāpēc, ka mans Dievs nav mūsu vidū?
18 ౧౮ వాళ్ళు ఇతర దేవుళ్ళ వైపు తిరిగి, చేసిన దుర్మార్గమంతటిబట్టి ఆ రోజు నేను తప్పకుండా వారికి నా ముఖం చాటు చేస్తాను.
Bet Es paslēpšu Savu vaigu tai dienā visa ļaunuma dēļ, ko tie ir darījuši, nogriezdamies pie citiem dieviem.
19 ౧౯ కాబట్టి మీరు ఈ పాట రాసి ఇశ్రాయేలు ప్రజలకు నేర్పండి. ఈ పాట ఇశ్రాయేలు ప్రజల మీద నీకు సాక్ష్యంగా ఉండేలా దాన్ని వారికి కంఠస్తం అయ్యేలా నేర్పించండి.
Un nu uzrakstiet sev šo dziesmu un māci to Israēla bērniem un ieliec to viņu mutē, ka šī dziesma Man ir par liecību pret Israēla bērniem.
20 ౨౦ నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని నడిపించిన తరువాత వారు తిని తాగి తృప్తిపొంది అహంకారం తెచ్చుకుంటారు. ఇతర దేవుళ్ళ వైపు తిరిగి వాటిని పూజించి నన్ను విడిచిపెట్టి నా నిబంధన మీరతారు.
Jo Es tos ievedīšu tai zemē, ko esmu zvērējis viņu tēviem, kur piens un medus tek, un kad tie ēdīs un būs paēduši un paliks trekni, tad tie nogriezīsies pie citiem dieviem un tiem kalpos un Mani apkaitinās un atmetīs Manu derību.
21 ౨౧ ఎన్నో ఆపదలూ కష్టాలూ వారికి సంభవిస్తాయి. అప్పుడు ఈ పాట వారి ఎదుట సాక్షిగా నిలబడి సాక్ష్యమిస్తూ ఉంటుంది. ఆ పాట మరచిపోకుండా ఉండేలా వారి సంతానానికి కంఠోపాఠంగా ఉంటుంది. ఎందుకంటే, నేను ప్రమాణం చేసిన దేశంలో వాళ్ళను నడిపించక ముందే, ఈనాడే వాళ్ళు జరిగించే ఆలోచన నాకు తెలుసు” అన్నాడు.
Un kad daudz ļaunuma un daudz bēdu tiem uzies, tad šī dziesma tiem atbildēs un būs par liecību, jo tā netaps aizmirsta viņu dzimuma mutē. Jo Es zinu viņu domas, kas tiem jau šodien ir, pirms Es tos esmu ievedis tai zemē, ko tiem esmu zvērējis.
22 ౨౨ మోషే ఆ రోజు ఈ పాట రాసి ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించాడు.
Tad Mozus uzrakstīja šo dziesmu tai dienā un to mācīja Israēla bērniem.
23 ౨౩ యెహోవా నూను కొడుకు యెహోషువకు ఇలా చెప్పాడు. “నువ్వు నిబ్బరంగా ధైర్యంగా ఉండు. నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి నువ్వు వాళ్ళని నడిపించాలి. నేను నీకు తోడుగా ఉంటాను.”
Un Viņš pavēlēja Jozuam, Nuna dēlam, un sacīja: esi stiprs un turi drošu prātu, jo tu ievedīsi Israēla bērnus tai zemē, ko Es viņiem esmu zvērējis, un Es būšu ar tevi.
24 ౨౪ మోషే ధర్మశాస్త్ర వాక్యాలన్నీ గ్రంథంలో పూర్తిగా రాయడం ముగించిన తరువాత
Un kad Mozus bija pabeidzis līdz pat galam sarakstīt šās bauslības vārdus grāmatā,
25 ౨౫ యెహోవా నిబంధన మందసాన్ని మోసే లేవీయులను చూసి మోషే ఇలా ఆజ్ఞాపించాడు, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకుని మీ యెహోవా దేవుని నిబంధన మందసం పక్కన ఉంచండి.
Tad Mozus pavēlēja tiem Levitiem, kas Tā Kunga derības šķirstu nesa, sacīdams:
26 ౨౬ అది అక్కడ మీ మీద సాక్షిగా ఉంటుంది.
Ņemiet šo bauslības grāmatu un noliekat to blakām Tā Kunga, sava Dieva, derības šķirstam, lai viņa tur ir par liecību pret tevi.
27 ౨౭ మీ తిరుగుబాటుతత్వం, మీ తలబిరుసుతనం నాకు తెలుసు. ఇవ్వాళ నేను ఇంకా జీవించి మీతో కలిసి ఉండగానే మీరు యెహోవా మీద తిరుగుబాటు చేశారు.
Jo es pazīstu tavu nepaklausību un tavu stūrgalvību. Redzi, šodien kamēr es vēl esmu dzīvs jūsu vidū, jūs esat neklausīgi pret To Kungu, - cik vairāk, kad es būšu nomiris!
28 ౨౮ నేను చనిపోయిన తరువాత ఇంకా ఎక్కువ తిరుగుబాటు చేస్తారు కదా! మీ గోత్రాల పెద్దలందరినీ, మీ అధికారులనూ నా దగ్గరికి తీసుకురండి. ఆకాశాన్నీ భూమినీ వారిమీద సాక్ష్యంగా పెట్టి నేనీ మాటలను వాళ్ళు వినేలా చెబుతాను.
Sapulcējiet pie manis visus savus cilšu vecajus un savus priekšniekus, lai es runāju šos vārdus priekš viņu ausīm un pret tiem piesaucu par lieciniekiem debesis un zemi.
29 ౨౯ ఎందుకంటే నేను చనిపోయిన తరువాత మీరు పూర్తిగా చెడిపోయి నేను మీరు పాటించాలని ఆజ్ఞాపించిన మార్గం తప్పిపోతారని నాకు తెలుసు. ఆయన దృష్టిలో చెడ్డగా ప్రవర్తించి, మీరు చేసే పనులతో యెహోవాకు కోపం పుట్టిస్తారు. రాబోయే రోజుల్లో విపత్తులు మీకు కలుగుతాయి.
Jo es zinu, ka pēc manas nāves jūs visai(pilnīgi) apgrēkosities un atkāpsities no tā ceļa, ko es jums esmu pavēlējis; tad jums tas ļaunums uzies nākamā laikā, kad jūs darīsiet, kas ļauns Tā Kunga acīs, viņu apkaitinādami ar savu rokas darbu.
30 ౩౦ తరువాత మోషే ఇశ్రాయేలు ప్రజలు వింటుండగా ఈ పాట పూర్తిగా పాడి వినిపించాడు.
Tad Mozus runāja priekš visas Israēla draudzes ausīm šīs dziesmas vārdus līdz pat galam.