< ద్వితీయోపదేశకాండమ 3 >
1 ౧ మనం తిరిగి బాషాను దారిలో వెళ్తుండగా బాషాను రాజు ఓగు, అతని ప్రజలంతా ఎద్రెయీలో మనతో యుద్ధం చేయడానికి ఎదురుగా వచ్చారు.
Sedan vände vi oss åt annat håll och drogo upp åt Basan till. Och Og, konungen i Basan, drog med allt sitt folk ut i strid mot oss, till Edrei.
2 ౨ యెహోవా నాతో ఇలా అన్నాడు. “అతనికి భయపడ వద్దు. అతన్నీ అతని ప్రజలనూ అతని దేశాన్నీ నీ చేతికి అప్పగించాను. హెష్బోనులో అమోరీయుల రాజు సీహోనుకు చేసినట్టే ఇతనికి కూడా చేయాలి.”
Men HERREN sade till mig: "Frukta icke för honom, ty i din hand har jag givit honom och allt hans folk och honom på samma sätt som du gjorde med Sihon, amoréernas konung, som bodde i Hesbon."
3 ౩ ఆ విధంగా మన దేవుడు యెహోవా బాషాను రాజు ఓగును, అతని ప్రజలందరినీ మన చేతికి అప్పగించాడు. అతనికి ఎవ్వరూ మిగలకుండా అందరినీ హతం చేశాం.
Så gav HERREN, vår GUD, i vår hand också Og, konungen i Basan, och allt hans folk, och vi slogo honom och läto ingen av dem slippa undan.
4 ౪ ఆ కాలంలో అతని పట్టణాలన్నీ స్వాధీనం చేసుకున్నాం. మన స్వాధీనంలోకి రాని పట్టణం ఒక్కటీ లేదు. బాషానులో ఓగు రాజ్యం అర్గోబు ప్రాంతంలో ఉన్న 60 పట్టణాలు ఆక్రమించుకున్నాం.
Och vi intogo då alla hans städer, ingen stad fanns, som vi icke togo ifrån dem: sextio städer, hela landsträckan Argob, Ogs rike i Basan.
5 ౫ ఆ పట్టణాలన్నీ గొప్ప ప్రాకారాలు, ద్వారాలు, గడియలతో ఉన్న దుర్గాలు. అవిగాక ప్రాకారాలు లేని ఇంకా చాలా పట్టణాలు స్వాధీనం చేసుకున్నాం.
Alla dessa städer voro befästa med höga murar, med portar och bommar. Därtill kom en stor mängd småstäder.
6 ౬ మనం హెష్బోను రాజు సీహోనుకు చేసినట్టు వాటిని నిర్మూలం చేశాం. ప్రతి పట్టణంలోని స్త్రీ పురుషులనూ పిల్లలనూ నాశనం చేశాం.
Och vi gåvo dem till spillo, likasom vi hade gjort med Sihon, konungen i Hesbon; hela den manliga stadsbefolkningen gåvo vi till spillo, så ock kvinnor och barn.
7 ౭ వారి పశువులనూ ఆ పట్టణాల ఆస్తినీ దోచుకున్నాం.
Men all boskapen och rovet från städerna togo vi såsom byte.
8 ౮ ఆ కాలంలో అర్నోను లోయ నుండి హెర్మోను కొండ వరకూ, యొర్దాను అవతల ఉన్న దేశాన్ని ఇద్దరు అమోరీయుల రాజుల దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నాం.
Från amoréernas två konungar, som härskade på andra sidan Jordan, togo vi alltså då deras land, från bäcken Arnon ända till berget Hermon
9 ౯ సీదోనీయులు హెర్మోనును “షిర్యోను” అనేవారు. అమోరీయులు దాన్ని “శెనీరు” అనేవారు.
-- vilket av sidonierna kallas för Sirjon, men av amoréerna kallas för Senir --
10 ౧౦ మైదానంలోని పట్టాణాలన్నిటిని, బాషానులోని ఓగు రాజ్య పట్టణాలైన సల్కా, ఎద్రెయీ అనేవాటి వరకూ గిలాదు అంతటినీ బాషానునూ ఆక్రమించాం.
alla städerna på slätten och hela Gilead och hela Basan, ända till Salka och Edrei, städerna i Ogs rike, i Basan.
11 ౧౧ రెఫాయీయులలో బాషాను రాజు ఓగు మాత్రం మిగిలాడు. అతనిది ఇనుప మంచం. అది అమ్మోనీయుల రబ్బాలో ఉంది గదా? దాని పొడవు తొమ్మిది మూరలు, వెడల్పు నాలుగు మూరలు.
Ty Og, konungen i Basan, var den ende som fanns kvar av de sista rafaéerna; hans gravkista, gjord av basalt, finnes, såsom känt är, i Rabba i Ammons barns land; den är nio alnar lång och fyra alnar bred, alnen beräknad efter längden av en mans underarm.
12 ౧౨ అర్నోను లోయలో ఉన్న అరోయేరు పట్టణం నుండి గిలాదు కొండ ప్రాంతంలో సగమూ మనం అప్పుడు స్వాధీనం చేసుకొన్న దేశమూ దాని పట్టణాలూ రూబేనీయులకు, గాదీయులకు ఇచ్చాను.
När vi då hade intagit detta land, gav jag den del därav, som sträcker sig från Aroer vid bäcken Arnon, samt hälften av Gileads bergsbygd med dess städer åt rubeniterna och gaditerna.
13 ౧౩ ఓగు రాజుకు చెందిన బాషాను అంతటినీ, గిలాదులో మిగిలిన రెఫాయీయుల దేశమని పిలిచే బాషానునూ, అర్గోబు ప్రాంతమంతా మనష్షే అర్థ గోత్రానికి ఇచ్చాను.
Återstoden av Gilead och hela Basan, Ogs rike, gav jag åt ena hälften av Manasse stam, hela landsträckan Argob, hela Basan; detta kallas rafaéernas land.
14 ౧౪ మనష్షే కొడుకు యాయీరు గెషూరీయుల, మాయాకాతీయుల సరిహద్దుల వరకూ అర్గోబు ప్రాంతాన్ని పట్టుకుని, తన పేరును బట్టి వాటికి యాయీరు బాషాను గ్రామాలు అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకూ వాటి పేరు అదే.
Jair, Manasses son, fick hela landsträckan Argob, ända till gesuréernas och maakatéernas område, och efter sitt eget namn kallade han landet -- nämligen Basan -- för Jairs byar, såsom det heter ännu i dag.
15 ౧౫ మాకీరీయులకు గిలాదును ఇచ్చాను.
Och åt Makir gav jag Gilead.
16 ౧౬ గిలాదు నుండి అర్నోను లోయ మధ్య వరకూ, యబ్బోకు నది వరకూ, అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకూ రూబేనీయులకూ గాదీయులకూ ఇచ్చాను.
Och åt rubeniterna och gaditerna gav jag landet från Gilead ända till Arnons dal, till dalens mitt -- den utgjorde gränsen -- och till bäcken Jabbok, som är Ammons barns gräns,
17 ౧౭ ఇవి కాక, కిన్నెరెతు నుండి తూర్పున పిస్గా కొండ వాలుల కింద, ఉప్పు సముద్రం అని పిలిచే అరాబా సముద్రం దాకా వ్యాపించిన అరాబా ప్రాంతాన్ని, యొర్దాను లోయ మధ్యభూమిని, రూబేనీయులకూ గాదీయులకూ ఇచ్చాను.
vidare Hedmarken med Jordan, som utgör gränsen, från Kinneret ända till Pisgas sluttningar, på östra sidan.
18 ౧౮ అప్పుడు నేను మీతో “మీరు స్వాధీనం చేసుకోడానికి మీ దేవుడు యెహోవా ఈ దేశాన్ని మీకిచ్చాడు. మీలో యుద్ధవీరులంతా సిద్ధపడి మీ సోదరులైన ఇశ్రాయేలు ప్రజలతో కలిసి నది దాటి రావాలి.
Och jag bjöd eder på den tiden och sade: "HERREN, eder Gud, har givit eder detta land till besittning. Men nu skolen alla I som ären stridbara män draga väpnade åstad i spetsen för edra bröder, Israels barn.
19 ౧౯ యెహోవా మీకు విశ్రాంతినిచ్చినట్టు మీ సోదరులకు కూడా విశ్రాంతినిచ్చే వరకూ నేను మీకిచ్చిన పట్టణాల్లో నివసించాలి.
Allenast edra hustrur och barn och eder boskap -- jag vet ju att I haven mycken boskap -- må stanna kvar i de städer som jag har givit eder,
20 ౨౦ అంటే మీ యెహోవా దేవుడు యొర్దాను అవతల వారికి ఇస్తున్న దేశాన్ని వారు స్వాధీనం చేసుకునే వరకూ, మీ భార్యలు, మీ పిల్లలు, మీ మందలు నేను మీకిచ్చిన పట్టణాల్లో నివసించాలి. ఆ తరువాత మీరు మీ స్వాస్థ్యాలకు తిరిగి రావాలి అని మీకు ఆజ్ఞాపించాను. మీ మందలు చాలా ఎక్కువని నాకు తెలుసు” అన్నాను.
till dess att HERREN har låtit edra bröder komma till ro, såväl som eder, när också de hava tagit i besittning det land som HERREN, eder Gud, vill giva dem på andra sidan Jordan; sedan mån I vända tillbaka till de besittningar jag har givit eder, var och en till sin besittning."
21 ౨౧ ఆ సమయంలో నేను యెహోషువకు ఇలా ఆజ్ఞాపించాను. “మీ యెహోవా దేవుడు ఈ ఇద్దరు రాజులకు చేసినదంతా నువ్వు కళ్ళారా చూశావు గదా. నువ్వు వెళ్తున్న రాజ్యాలన్నిటికీ యెహోవా అదే విధంగా చేస్తాడు.
Och jag bjöd Josua på den tiden och sade: "Du har med egna ögon sett allt vad HERREN, eder Gud, har gjort med dessa två konungar. På samma sätt skall HERREN göra med alla riken där du drager fram.
22 ౨౨ మీ యెహోవా దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు కాబట్టి వారికి భయపడ వద్దు.”
Frukten icke för dem, ty HERREN, eder Gud, skall själv strida för eder."
23 ౨౩ ఆ రోజుల్లో నేను “యెహోవా, ప్రభూ, నీ మహిమనూ, నీ బాహుబలాన్నీ నీ దాసునికి చూపించడం ప్రారంభించావు.
Och på den tiden bad jag till HERREN och sade:
24 ౨౪ ఆకాశంలో గాని, భూమిపై గాని నువ్వు చేసే పనులు చేయగల దేవుడెవడు? నీ అంత పరాక్రమం చూపగల దేవుడెవడు?
"Herre, HERRE, du har begynt att låta sin tjänare se din storhet och din starka hand; ty vilken är den gud i himmelen eller på jorden, som kan göra sådana verk och sådana väldiga gärningar som du?
25 ౨౫ నేను అవతలికి వెళ్లి యొర్దాను అవతల ఉన్న ఈ మంచి దేశాన్ని, ఆ మంచి కొండ ప్రాంతాన్ని, ఆ లెబానోనును చూసేలా అనుగ్రహించు” అని యెహోవాను బతిమాలుకున్నాను.
Så låt mig nu få gå ditöver och se det goda landet på andra sidan Jordan, det goda berglandet där och Libanon."
26 ౨౬ యెహోవా మీ కారణంగా నా మీద కోపపడి నా మనవి వినలేదు. ఆయన నాతో ఇలా అన్నాడు. “చాలు. ఇంక ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు.
Men HERREN hade blivit förgrymmad på mig för eder skull och ville icke höra mig, utan sade till mig: "Låt det vara nog; tala icke vidare till mig om denna sak.
27 ౨౭ నువ్వు ఈ యొర్దాను దాటకూడదు. అయితే, పిస్గా కొండ ఎక్కి పడమటి వైపు, ఉత్తరం వైపు, దక్షిణం వైపు, తూర్పు వైపు తేరి చూడు.
Stig nu upp på toppen av Pisga, och lyft upp dina ögon mot väster och norr och söder och öster, och se med dina ögon; ty över denna Jordan skall du icke komma.
28 ౨౮ నీకు బదులుగా యెహోషువకు ఆజ్ఞాపించి, అతణ్ణి ప్రోత్సహించి, బలపరచు. అతడు ఈ ప్రజలను నడిపించి, నది దాటి, నువ్వు చూడబోయే దేశాన్ని వారు స్వాధీనపరచుకొనేలా చేస్తాడు.”
Och insätt Josua i hans ämbete, och styrk honom att vara frimodig och oförfärad; ty det är han som skall gå ditöver i spetsen för detta folk, och det är han som skall utskifta åt dem såsom arv det land du ser."
29 ౨౯ ఆ సమయంలో మనం బేత్పయోరు ఎదుట ఉన్న లోయలో ఉన్నాం.
Och så stannade vi i dalen mitt emot Bet-Peor.