< ద్వితీయోపదేశకాండమ 29 >
1 ౧ యెహోవా హోరేబులో ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన కాకుండా ఆయన మోయాబు దేశంలో వారితో చెయ్యమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన మాటలు ఇవే.
To su riječi Saveza što ga propisa Jahve Mojsiju da ga sklopi s Izraelcima u zemlji moapskoj, povrh Saveza što ga je s njima sklopio na Horebu.
2 ౨ మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చి వారితో ఇలా చెప్పాడు. “యెహోవా మీ కళ్ళ ఎదుట ఐగుప్తు దేశంలో ఫరోకు, అతని సేవకులందరికీ అతని దేశమంతటికీ చేసినదంతా,
Mojsije sazva sav Izrael pa im reče: “Vidjeli ste na rođene oči sve što je Jahve učinio u zemlji egipatskoj faraonu, svim službenicima njegovim i svoj zemlji njegovoj:
3 ౩ అంటే తీవ్రమైన ఆ బాధలూ సూచకక్రియలూ, అద్భుత కార్యాలూ మీరు చూశారు.
velike kušnje što su ih vidjele tvoje oči, silne znakove i čudesa!
4 ౪ అయినప్పటికీ గ్రహించే హృదయాన్నీ చూసే కళ్ళనూ వినే చెవులనూ ఇప్పటికీ యెహోవా మీకు ఇవ్వలేదు.
Ali vam ne dade Jahve do danas razuma da shvatite, očiju da vidite ni ušiju da čujete.
5 ౫ నేను మీ దేవుడనైన యెహోవాను అని మీరు తెలుసుకొనేలా 40 ఏళ్ళు నేను మిమ్మల్ని ఎడారిలో నడిపించాను. మీ దుస్తులు మీ ఒంటి మీద పాతబడలేదు. మీ చెప్పులు మీ కాళ్ల కింద అరిగిపోలేదు.
Vodio sam vas pustinjom četrdeset godina; odjeća se na vama nije izderala niti su se sandale na vašim nogama raskidale.
6 ౬ మీరు రొట్టెలు తినలేదు, ద్రాక్షారసం గానీ, మద్యం గానీ తాగలేదు.
Kruha niste jeli; vina ni drugoga opojnog pića niste pili, da biste znali da sam ja Jahve, Bog vaš.
7 ౭ మీరు ఈ ప్రాంతానికి చేరినప్పుడు హెష్బోను రాజు సీహోను, బాషాను రాజు ఓగు మనపై దండెత్తినప్పుడు
Kad stigoste na novo mjesto, Sihon, kralj hešbonski, i Og, kralj bašanski, iziđoše pred nas u boj, ali smo ih potukli.
8 ౮ మనం వారిని హతమార్చి వాళ్ళ దేశాలను స్వాధీనం చేసుకుని రూబేను, గాదు, మనష్షే అర్థగోత్రాల వాళ్లకు వారసత్వంగా ఇచ్చాము.
Zauzeli smo njihovu zemlju te je predali u baštinu Rubenovcima, Gadovcima i polovini plemena Manašeova.
9 ౯ కాబట్టి మీరు చేసేదంతా సవ్యంగా జరిగేలా ఈ నిబంధన కట్టడలు పాటించి, వాటి ప్రకారం ప్రవర్తించండి.
Držite i vršite riječi ovog Saveza da uspijevate u svemu što poduzmete.
10 ౧౦ మీరంతా ఈ రోజు మీ దేవుడైన యెహోవా ఎదుట నిలబడ్డారు. ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతివాడూ,
Danas stojite svi pred Jahvom, Bogom svojim: vaši plemenski glavari, vaše starješine i vaši nadglednici, svi muževi Izraela,
11 ౧౧ అంటే మీ నాయకులూ, గోత్రాల ప్రజలూ, పెద్దలూ, అధికారులూ, పిల్లలూ, మీ భార్యలూ మీ శిబిరంలో ఉన్న పరదేశులూ, కట్టెలు నరికేవాడు మొదలుకుని మీకు నీళ్లు తోడేవారి వరకూ అందరూ ఇక్కడ నిలబడ్డారు.
djeca vaša, žene vaše i došljak koji je u tvome taboru - od onoga koji ti siječe drva do onoga koji ti nosi vodu -
12 ౧౨ మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించినట్టు, మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన విధంగా
da stupite u Savez s Jahvom, Bogom svojim, u Savez zakletvom potvrđen, što ga Jahve, Bog tvoj, danas s tobom sklapa
13 ౧౩ ఈ రోజు మిమ్మల్ని తన స్వంత ప్రజగా నియమించుకుని తానే మీకు దేవుడుగా ఉండాలని మీ దేవుడైన యెహోవా సంకల్పించాడు. ఈనాడు మీకు నియమిస్తున్న మీ దేవుడైన యెహోవా నిబంధనలో, ఆయన ప్రమాణం చేసిన దానిలో మీరు పాలు పొందడానికి ఇక్కడ నిలబడ్డారు.
da danas od tebe učini svoj narod i da ti on bude Bog, kako ti je rekao i kako se zakleo tvojim ocima: Abrahamu, Izaku i Jakovu.
14 ౧౪ నేను ఈ నిబంధన, ఈ ప్రమాణం చేసేది మీతో మాత్రమే కాదు, ఇక్కడ మనతో, మన దేవుడైన యెహోవా ఎదుట నిలబడిన వాళ్ళతో
I ne sklapam danas ovaj Savez sa zakletvom samo s vama
15 ౧౫ ఇక్కడ ఈ రోజు మనతో కూడ కలవని వారితో కూడా చేస్తున్నాను.
nego i sa svakim koji danas stoji ovdje s nama pred Jahvom, Bogom našim, i sa svakim koji danas nije ovdje s nama.
16 ౧౬ మనం ఐగుప్తు దేశంలో ఎలా నివసించామో, మీరు దాటి వచ్చిన ప్రజల మధ్యనుంచి మనమెలా దాటివచ్చామో మీకు తెలుసు.
Sami znate kako smo boravili u zemlji egipatskoj i kako smo prošli posred naroda kroz koje ste morali proći.
17 ౧౭ వారి నీచమైన పనులూ, కర్ర, రాయి, వెండి, బంగారంతో చేసిన విగ్రహాలను మీరు చూశారు.
Vidjeli ste njihove rugobe, njihove kumire od drveta i kamena, srebra i zlata što ih imaju.
18 ౧౮ ఆ దేశాల ప్రజల దేవుళ్ళను పూజించడానికి మన దేవుడైన యెహోవా దగ్గర నుంచి తొలగే హృదయం, మీలో ఏ పురుషునికీ ఏ స్త్రీకీ ఏ కుటుంబానికీ ఏ గోత్రానికీ ఉండకూడదు. అలాంటి చేదైన విషం పుట్టించే మూలాధారం మీమధ్య ఉండకూడదు.
Neka ne bude među vama čovjeka ni žene, roda ni plemena kojemu bi se srce danas odvratilo od Jahve, Boga našega, pa da ide iskazivati štovanje bogovima onih naroda. Neka ne bude među vama korijena koji rađa otrovom i pelinom.
19 ౧౯ అలాంటివాడు ఈ శిక్ష విధులు విన్నప్పుడు, తన హృదయంలో తనను తాను పొగడుకుంటూ ‘నేను నా హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాను, నాకు క్షేమమే కలుగుతుంది’ అనుకుంటాడు.
Neka se nitko, čuvši riječi ovog prokletstva, ne nada blagoslovu kazujući u svome srcu: 'Bit će mi dobro ako poživim i po prohtjevima srca svoga. Nek' povodanj utaži žeđ!'
20 ౨౦ యెహోవా అలాంటివాణ్ణి క్షమించడు. యెహోవా కోపం, రోషం అతని మీద రగులుకుంటుంది. ఈ గ్రంథంలో రాసి ఉన్న శాపాలన్నీ వాడికి ప్రాప్తిస్తాయి. యెహోవా అతని పేరు ఆకాశం కింద ఉండకుండాా తుడిచి వేస్తాడు.
Takvome neće Jahve nikad oprostiti, nego će se gnjev i ljubomornost Jahvina izliti na tog čovjeka, tako da će se sve prokletstvo zapisano u ovoj knjizi na nj oboriti te će Jahve izbrisati ime njegovo pod nebom.
21 ౨౧ ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్న నిబంధన శాపాలన్నిటి ప్రకారం శిక్షించడానికి యెహోవా ఇశ్రాయేలు ప్రజల గోత్రాలన్నిటిలో నుంచి అతణ్ణి వెళ్ళ గొట్టేస్తాడు.
Prema svim prokletstvima ovog Saveza, zapisanima u knjizi ovoga Zakona, Jahve će ga odstraniti, na njegovu propast, od svih plemena izraelskih.
22 ౨౨ కాబట్టి రాబోయే తరం వారు, మీ తరువాత పుట్టే మీ సంతానం, చాలా దూరం నుంచి వచ్చే పరాయి దేశీయులు మీ దేశానికి యెహోవా రప్పించిన తెగుళ్లనూ రోగాలనూ చూస్తారు.
Kasniji naraštaj, sinovi vaši poslije vas, i stranci koji dođu iz daleke zemlje, kad vide zla ove zemlje i bolesti što će ih Jahve pustiti na nju, reći će:
23 ౨౩ యెహోవా తన కోపోద్రేకంతో నాశనం చేసిన సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయీము పట్టణాలవలె ఆ ప్రాంతాలన్నీ గంధకంతో, ఉప్పుతో చెడిపోయి, విత్తనాలు మొలకెత్తకుండా, పంటలు పండకపోవడం చూసి,
'Sva je zemlja njegova samo sumpor i sol; niti se što sije niti što klija; nikakva travka na njoj ne raste; jednaka je srušenoj Sodomi i Gomori, Admi i Sebojimu, što ih Jahve sruši u svojoj ljutini i gnjevu.'
24 ౨౪ వారు యెహోవా ఈ దేశాన్ని ఎందుకిలా చేశాడు? ఇంత తీవ్రమైన కోపానికి కారణం ఏమిటి? అని చెప్పుకుంటారు.
I svi će narodi pitati: 'Zašto učini Jahve ovako ovoj zemlji? Kakva je morala biti žestina toga silnoga gnjeva?'
25 ౨౫ అప్పుడు ప్రజలు ఇలా చెబుతారు. ‘వారి పితరుల దేవుడు యెహోవా ఐగుప్తు దేశం నుంచి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు లక్ష్యపెట్టలేదు.
Onda će im se reći: 'Jer su ostavili Savez što ga je Jahve, Bog otaca njihovih, bio sklopio s njima kad ih je izveo iz zemlje egipatske;
26 ౨౬ తమకు తెలియని అన్య దేవుళ్ళను, మొక్కవద్దని యెహోవా వారికి చెప్పిన దేవుళ్ళకు మొక్కి, పూజించారు.
i jer su otišli da iskazuju štovanje drugim bogovima i njima se klanjali, bogovima kojih nisu poznavali i kojih im on nije odredio.
27 ౨౭ కాబట్టి ఈ గ్రంథంలో రాసిన శిక్షలన్నీ ఈ దేశం మీదికి రప్పించడానికి దాని మీద యెహోవా కోపాగ్ని రగులుకుంది.
Zato se Jahvin gnjev izlio na ovu zemlju i palo na nju sve prokletstvo zapisano u ovoj knjizi.
28 ౨౮ యెహోవా తన తీవ్రమైన కోపాగ్నితో, ఉగ్రతతో వాళ్ళను తమ దేశం నుంచి పెళ్ళగించి, వేరొక దేశానికి వెళ్లగొట్టాడు. ఇప్పటి వరకూ వాళ్ళు అక్కడే ఉండిపోయారు.’
Jahve ih je iščupao iz njihove zemlje u ljutini, srdžbi i velikom gnjevu te ih bacio u drugu zemlju. Tako je i danas.'
29 ౨౯ రహస్యంగా ఉండే విషయాలన్నీ మన దేవుడు యెహోవాకు చెందుతాయి. అయితే మనం ఈ ధర్మశాస్త్ర విధులన్నిటి ప్రకారం నడుచుకోవడానికి మనకు వెల్లడైన సంగతులు మాత్రం ఎప్పటికీ మనకూ, మన సంతానానికీ చెందుతాయి.”
Što je sakriveno, pripada Jahvi, Bogu našemu, a objava nama i sinovima našim zauvijek da vršimo sve riječi ovoga Zakona.