< ద్వితీయోపదేశకాండమ 27 >
1 ౧ మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దలకు, ప్రజలకు ఇలా ఆజ్ఞాపించారు. “ఈరోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలన్నిటినీ పాటించాలి.
Moisés y los ancianos de Israel ordenaron al pueblo diciendo: “Guarden todo el mandamiento que hoy les ordeno.
2 ౨ మీ దేవుడైన యెహోవా మీకు అనుగ్రహిస్తున్న దేశంలో ప్రవేశించడానికి మీరు యొర్దాను నది దాటే రోజు మీరు పెద్ద రాళ్లను నిలబెట్టి వాటి మీద సున్నం పూయాలి.
El día en que pases el Jordán a la tierra que Yahvé vuestro Dios te da, levantarás grandes piedras y las cubrirás con yeso.
3 ౩ మీ పితరుల దేవుడు యెహోవా మీతో చెప్పిన ప్రకారం మీరు మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించడానికి మీరు నది దాటిన తరువాత ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నీ వాటి మీద రాయాలి.
En ellas escribirás todas las palabras de esta ley, cuando hayas pasado, para entrar en la tierra que Yahvé vuestro Dios te da, una tierra que fluye leche y miel, como Yahvé, el Dios de tus padres, te ha prometido.
4 ౪ మీరు ఈ యొర్దాను దాటిన తరువాత నేను ఈ రోజు మీకు ఆజ్ఞాపించినట్టుగా ఈ రాళ్లను ఏబాలు కొండ మీద నిలబెట్టి వాటి మీద సున్నం పూయాలి.
Cuando hayas cruzado el Jordán, colocarás estas piedras que hoy te ordeno en el monte Ebal, y las cubrirás con yeso.
5 ౫ అక్కడ మీ యెహోవా దేవునికి బలిపీఠం కట్టాలి. ఆ బలిపీఠాన్ని రాళ్లతో నిర్మించాలి. ఆ పని కోసం ఇనుప పనిముట్లు ఉపయోగించకూడదు.
Allí construirás un altar a Yahvé, tu Dios, un altar de piedras. No usarás ninguna herramienta de hierro en ellas.
6 ౬ చెక్కకుండా ఉన్న రాళ్లతో మీ యెహోవా దేవునికి బలిపీఠం కట్టి దాని మీద మీ దేవుడైన యెహోవాకు హోమబలులు అర్పించాలి.
Construirás el altar del Señor, tu Dios, con piedras sin cortar. En él ofrecerás holocaustos al Señor, tu Dios.
7 ౭ మీరు సమాధాన బలులు అర్పించి అక్కడ భోజనం చేసి మీ దేవుడైన యెహోవా ఎదుట సంతోషించాలి.
Sacrificarás ofrendas de paz y comerás en él. Te alegrarás ante el Señor, tu Dios.
8 ౮ ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నీ ఆ రాళ్ల మీద చాలా స్పష్టంగా రాయాలి.
Escribirás en las piedras todas las palabras de esta ley con toda claridad.”
9 ౯ మోషే, యాజకులైన లేవీయులూ ఇశ్రాయేలు ప్రజలందరితో ఇలా చెప్పారు, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మౌనంగా ఉండి మా మాటలు వినండి.
Moisés y los sacerdotes levitas hablaron a todo Israel diciendo: “¡Cállate y escucha, Israel! Hoy te has convertido en el pueblo de Yahvé, tu Dios.
10 ౧౦ ఈనాడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వంత ప్రజలయ్యారు. కాబట్టి మీ దేవుడైన యెహోవా మాటలు విని, ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ఆయన చట్టాలూ, ఆజ్ఞలూ పాటించాలి.
Por lo tanto, obedecerás la voz de Yahvé, tu Dios, y pondrás en práctica sus mandamientos y sus estatutos, que yo te ordeno hoy.”
11 ౧౧ ఆ రోజే మోషే ప్రజలకు ఇలా ఆజ్ఞాపించాడు, మీరు యొర్దాను దాటిన తరువాత, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, యోసేపు,
Ese mismo día Moisés ordenó al pueblo diciendo:
12 ౧౨ బెన్యామీను గోత్రాలవాళ్ళు ప్రజలకు దీవెన పలుకులు అందించడానికి గెరిజీము కొండ మీద నిలబడాలి.
“Estos se pondrán en el monte Gerizim para bendecir al pueblo, cuando hayáis cruzado el Jordán: Simeón, Leví, Judá, Isacar, José y Benjamín.
13 ౧౩ రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రాల వాళ్ళు శిక్షలు పలకడానికి ఏబాలు కొండ మీద నిలబడాలి.
Estos estarán en el monte Ebal para la maldición: Rubén, Gad, Aser, Zabulón, Dan y Neftalí.
14 ౧౪ అప్పుడు లేవీయులు ఇశ్రాయేలు ప్రజలందరితో బిగ్గరగా ఇలా చెప్పాలి.” “యెహోవాకు అసహ్యం కలిగించే శిల్పి చేతులతో
Los levitas dirán en voz alta a todos los hombres de Israel:
15 ౧౫ మలిచిన విగ్రహాన్ని గానీ పోత విగ్రహాన్ని గానీ చేసుకుని దాన్ని రహస్య స్థలంలో నిలబెట్టేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు ప్రజలంతా “ఆమేన్” అనాలి.
‘Maldito el hombre que hace una imagen grabada o fundida, abominación a Yahvé, obra de las manos del artesano, y la coloca en secreto.’ Todo el pueblo responderá y dirá: “Amén”.
16 ౧౬ “తన తండ్రినిగానీ, తల్లినిగానీ అవమాన పరచేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
‘Maldito el que deshonra a su padre o a su madre’. Todo el pueblo dirá: “Amén”.
17 ౧౭ “తన పొరుగువాడి సరిహద్దు రాయిని తొలగించినవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
‘Maldito el que quita el mojón de su vecino’. Todo el pueblo dirá: “Amén”.
18 ౧౮ “గుడ్డివాణ్ణి దారి తప్పించేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
“Maldito el que extravía a los ciegos en el camino”. Todo el pueblo dirá: “Amén”.
19 ౧౯ “పరదేశికి గానీ, తండ్రి లేనివాడికి గానీ, విధవరాలికి గానీ అన్యాయపు తీర్పు తీర్చేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
‘Maldito el que niega la justicia al extranjero, al huérfano y a la viuda’. Todo el pueblo dirá: “Amén”.
20 ౨౦ “తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు, తన తండ్రి పడకను హేళన చేసినవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
‘Maldito el que se acuesta con la mujer de su padre, porque deshonra el lecho de su padre.’ Todo el pueblo dirá: “Amén”.
21 ౨౧ “ఏదైనా జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
‘Maldito sea el que se acueste con cualquier clase de animal’. Todo el pueblo dirá: “Amén”.
22 ౨౨ “తన సోదరితో, అంటే తన తండ్రి కూతురుతో గానీ, తన తల్లి కూతురుతో గానీ లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
‘Maldito el que se acueste con su hermana, con la hija de su padre o con la hija de su madre’. Todo el pueblo dirá: “Amén”.
23 ౨౩ “తన అత్తతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
‘Maldito el que se acuesta con su suegra’. Todo el pueblo dirá: “Amén”.
24 ౨౪ “రహస్యంగా తన పొరుగువాణ్ణి చంపేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
‘Maldito el que mata en secreto a su prójimo’. Todo el pueblo dirá: “Amén”.
25 ౨౫ “నిర్దోషి ప్రాణం తీయడానికి లంచం తీసుకునేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
‘Maldito el que acepta un soborno para matar a un inocente’. Todo el pueblo dirá: “Amén”.
26 ౨౬ “ఈ ధర్మశాస్త్రానికి సంబంధించిన విధులను పాటించకుండా వాటిని లక్ష్యపెట్టనివాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
‘Maldito el que no cumpla las palabras de esta ley poniéndolas en práctica. Todo el pueblo dirá: “Amén””.