< ద్వితీయోపదేశకాండమ 23 >
1 ౧ “చితికిన వృషణాలు ఉన్నవాళ్ళు, లేదా పురుషాంగం కోసిన వాళ్ళు యెహోవా సమాజంలో చేరకూడదు. వ్యభిచారం వలన పుట్టినవాడు యెహోవా సమాజంలో చేరకూడదు.
Ɔbarima a wɔasa no anaa wɔatwa ne barima atwene no mmma Awurade badwa ase.
2 ౨ అతని పదవ తరం వరకూ ఎవరూ యెహోవా సమాజంలో చేరకూడదు.
Wɔn a wɔyɛ mpena mma ne wɔn asefoɔ kɔsi awoɔ ntoatoasoɔ a ɛtɔ so edu no mmma Awurade badwa ase.
3 ౩ అమ్మోనీయులు, మోయాబీయులు యెహోవా సమాజంలో చేరకూడదు. వారి పదవ తరం వరకూ ఎవరూ యెహోవా సమాజంలో చేరకూడదు.
Amonfoɔ anaa Moabfoɔ anaa sɛ wɔn asefoɔ kɔsi awoɔ ntoatoasoɔ edu no mu biara mmma Awurade badwa ase.
4 ౪ ఎందుకంటే మీరు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు ప్రయాణ మార్గంలో వాళ్ళు భోజనాలు తీసుకువచ్చి మిమ్మల్ని కలుసుకోలేదు. ఆరాము నహారాయీములో ఉన్న పెతోరు నుంచి మిమ్మల్ని శపించడానికి మీకు విరోధంగా బెయోరు కొడుకు బిలాముకు బహుమతులు ఇచ్చి పిలిపించారు.
Saa aman yi annye mo, amma mo aduane anaa sɛ nsuo ɛberɛ a mofiri Misraim reba no. Mmom, wɔkɔbɔɔ Beor babarima Balaam a ɔfiri Petor a ɛwɔ Mesopotamia paa sɛ ɔmmɛdome mo.
5 ౫ అయితే మీ దేవుడైన యెహోవా బిలాము మాట అంగీకరించలేదు. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ప్రేమించాడు కనుక మీకోసం ఆ శాపాలను ఆశీర్వాదాలుగా మార్చాడు.
Nanso Awurade, mo Onyankopɔn, antie Balaam. Ɔdanee nnome no ma ɛyɛɛ nhyira maa mo, ɛfiri sɛ, Awurade mo Onyankopɔn dɔ mo.
6 ౬ మీరు జీవించే కాలమంతా వారి క్షేమం గురించి గానీ, వాళ్లకు శాంతి సమకూరాలని గానీ ఎన్నటికీ పట్టించుకోవద్దు.
Na sɛ mote ase yi, mommmoa Amonfoɔ ne Moabfoɔ ɛkwan biara so da biara da.
7 ౭ ఎదోమీయులు మీ సోదరులు కనుక వాళ్ళను ద్వేషించవద్దు. ఐగుప్తు దేశంలో మీరు పరదేశీయులుగా ఉన్నారు, కనుక ఐగుప్తీయులను ద్వేషించవద్దు.
Monnkyiri Edomfoɔ anaa Misraimfoɔ, ɛfiri sɛ, Edomfoɔ yɛ mo nuanom na motenaa Misraimfoɔ nso mu sɛ ahɔhoɔ.
8 ౮ వారి సంతానంలో మూడవ తరం వారు యెహోవా సమాజంలో చేరవచ్చు.
Misraimfoɔ awoɔ ntoatoasoɔ mmiɛnsa a wɔne mo firii Misraim no bɛkɔ Awurade badwa ase.
9 ౯ మీ సేన శత్రువులతో యుద్ధానికి బయలుదేరేటప్పుడు ప్రతి చెడ్డపనికీ దూరంగా ఉండాలి.
Sɛ mokɔ ɔko de tia mo atamfoɔ a, montwe mo ho mfiri deɛ ɛho nte biara ho.
10 ౧౦ రాత్రి జరిగినదాని వలన మైలపడినవాడు మీలో ఉంటే వాడు శిబిరం వెలుపలికి వెళ్లిపోవాలి.
Sɛ ɔbarima bi ho gu fi ɛsiane anadwo mu ahobaa a, ɛsɛ sɛ ɔfiri atenaeɛ hɔ kɔtena baabi ɛda mu no nyinaa.
11 ౧౧ అతడు శిబిరంలో చేరకూడదు. సాయంత్రం అతడు నీళ్లతో స్నానం చేసి పొద్దుపోయిన తరువాత శిబిరంలో చేరవచ్చు.
Ɛduru anwummerɛ a, ɛsɛ sɛ ɔdware na owia kɔtɔ a, ɔnsane mmra atenaeɛ hɔ.
12 ౧౨ శిబిరం బయట మల విసర్జనకు మీకు ఒక చోటుండాలి.
Montwa baabi a mobɛgya mo anan wɔ asraafoɔ atenaeɛ hɔ.
13 ౧౩ మీ ఆయుధాలు కాకుండా ఒక పార మీ దగ్గరుండాలి. నువ్వు మల విసర్జనకు వెళ్ళేటప్పుడు దానితో తవ్వి వెనక్కి తిరిగి నీ మలాన్ని కప్పేయాలి.
Mo mu biara mfa sofi nka ne nneɛma ho. Ɛberɛ biara a mobɛgya mo anan no, momfa sofi no ntu amena na monkata agyanan no so.
14 ౧౪ మీ యెహోవా దేవుడు మిమ్మల్ని విడిపించడానికి, మీ శత్రువులను మీకు అప్పగించడానికి మీ శిబిరంలో తిరుగుతూ ఉంటాడు. కాబట్టి మీ శిబిరాన్ని పవిత్రంగా ఉంచాలి. లేకపోతే ఆయన మీలో ఏదైనా అసహ్యమైన దాన్ని చూసి మిమ్మల్ని వదిలేస్తాడేమో.
Ɛsɛ sɛ asraafoɔ atenaeɛ hɔ yɛ kronkron, ɛfiri sɛ, Awurade, mo Onyankopɔn, nam mo atenaeɛ no so bɔ mo ho ban, na moadi mo atamfoɔ so nkonim. Ɛnsɛ sɛ ɔhunu animguasedeɛ biara wɔ mo mu; sɛ ɛba saa a, ɔbɛdane nʼakyi akyerɛ mo.
15 ౧౫ తన యజమాని దగ్గర నుంచి తప్పించుకుని మీ దగ్గరికి వచ్చిన సేవకుణ్ణి వాడి యజమానికి అప్పగించకూడదు.
Sɛ ɛba sɛ nkoa dwane firi wɔn wuranom nkyɛn na wɔba mo nkyɛn bɛgye wɔn ho dwanekɔbea a, mommpam wɔn mma wɔnnsane wɔn akyi.
16 ౧౬ అతడు తన ఇష్టప్రకారం మీ గ్రామాల్లోని ఒకదాన్లో తాను ఏర్పరచుకున్న చోట మీతో కలిసి మీ మధ్య నివసించాలి. మీరు అతణ్ణి అణచివేయకూడదు.
Momma wɔntena mo mu wɔ kuro biara a wɔpɛ so a monnnyɛ wɔn aniɛyaadeɛ.
17 ౧౭ ఇశ్రాయేలు కుమార్తెల్లో ఎవరూ వేశ్యలుగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారుల్లో ఎవరూ పురుష సంపర్కులుగా ఉండకూడదు.
Ɛnsɛ sɛ Israelni barima anaa ɔbaa yɛ no ho hyiadan mu odwamanfoɔ.
18 ౧౮ పురుష సంపర్కం వల్ల గానీ పడుపు సొమ్ము వల్ల గానీ వచ్చే ధనాన్ని మొక్కుబడిగా మీ దేవుడైన యెహోవా ఇంటికి తీసుకురాకూడదు. ఎందుకంటే ఆ రెండూ మీ దేవుడైన యెహోవాకు అసహ్యం.
Mommfa afɔrebɔdeɛ anaa adenya bi a ɛfiri odwamanfoɔ nkyɛn, sɛ ɔyɛ ɔbarima anaa ɔbaa, mma Awurade mo Onyankopɔn fie, ɛfiri sɛ, ɛyɛ Awurade mo Onyankopɔn akyiwadeɛ.
19 ౧౯ మీరు వెండిని గానీ, ఆహారపదార్ధాలు గానీ వడ్డీకి ఇచ్చే మరి దేనినైనా తోటి ఇశ్రాయేలు ప్రజలకు వడ్డీకి ఇవ్వకూడదు.
Bosea a mobɔ mo yɔnko Israelni no, sɛ ɛyɛ sika, aduane anaa biribi foforɔ no, monnnye ho mfɛntom.
20 ౨౦ పరదేశులకు వడ్డీకి అప్పు ఇవ్వవచ్చు. మీ దేవుడైన యెహోవా మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీ ప్రయత్నాలన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదించేలా నీ తోటి ఇశ్రాయేలు ప్రజలకు దేనినీ వడ్డీకి ఇవ్వకూడదు.
Motumi gye bosea ho mfɛntom firi ahɔhoɔ nkyɛn, na ɛnyɛ Israelfoɔ nkyɛn, sɛdeɛ Awurade, mo Onyankopɔn, bɛhyira mo wɔ biribiara a moyɛ mu wɔ asase a morekɔ so akɔfa no.
21 ౨౧ మీరు మీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న తరువాత ఆ మొక్కుబడిని చెల్లించే విషయంలో ఆలస్యం చేయకూడదు. మీ దేవుడైన యెహోవా అది చెల్లించడం జరగాలని చూస్తాడు. అలా చేయకపోతే అది మీకు పాపంగా పరిణమిస్తుంది.
Sɛ mohyɛ Awurade mo Onyankopɔn bɔ a, biribiara a mohyɛɛ no ho bɔ no, monyɛ no ntɛm so. Ɛfiri sɛ, Awurade, mo Onyankopɔn hwehwɛ sɛ, ɛbɔ a moahyɛ no no, mobɛdi so ntɛm so. Sɛ moanyɛ a, mobɛdi ho fɔ.
22 ౨౨ ఎలాంటి మొక్కులు మొక్కుకోకుండా ఉండడం పాపం అనిపించుకోదు.
Nanso, sɛ moanhyɛ biribiara ho bɔ a, monyɛɛ bɔne biara.
23 ౨౩ మీ నోటి వెంబడి వచ్చే మాట నెరవేర్చుకోవాలి. మీ దేవుడైన యెహోవాకు స్వేచ్ఛగా మొక్కుకుంటే మీరు మీ నోటితో పలికినట్టుగా అర్పించాలి.
Na sɛ wo ara wofiri wo pɛ mu hyɛ bɔ a, hwɛ yie na di asɛm a woaka no so, ɛfiri sɛ, Awurade, mo Onyankopɔn na woahyɛ no bɔ no.
24 ౨౪ మీరు మీ పొరుగువాడి ద్రాక్షతోటకు వెళ్ళేటప్పుడు మీ కిష్టమైనన్ని ద్రాక్షపండ్లు తినవచ్చు గానీ మీ సంచిలో వేసుకోకూడదు.
Wotumi di bobe aba dodoɔ biara wɔ wo yɔnko bobe turom nanso, mfa bi ngu kɛntɛn mu nkɔ.
25 ౨౫ మీ పొరుగువాడి పంట చేలోకి వెళ్ళేటప్పుడు మీ చేతితో వెన్నులు తుంచుకోవచ్చు గానీ మీ పొరుగువాడి పంటచేలో కొడవలి వెయ్యకూడదు.”
Saa ara na mobɛtumi de mo nsa apempan aburoo mmɛtem kakra wɔ mo yɔnko afuom, nanso ɛnsɛ sɛ mode sekan twa.