< ద్వితీయోపదేశకాండమ 22 >
1 ౧ మీ సాటి పౌరుడి ఎద్దు, లేదా గొర్రె దారి తప్పిపోయి తిరగడం మీరు చూస్తే దాన్ని చూడనట్టు కళ్ళు మూసుకోకుండా తప్పకుండా దాని యజమాని దగ్గరికి మళ్లించాలి.
You must not watch your fellow Israelite's ox or his sheep go astray and hide yourself from them; you must surely bring them back to him.
2 ౨ మీ సహోదరుడు మీకు అందుబాటులో లేకపోయినా, అతడు మీకు తెలియకపోయినా దాన్ని మీ ఇంటికి తోలుకుపోవాలి. అతడు దాన్ని వెతికే వరకూ అది మీ దగ్గర ఉండాలి. అప్పుడు అతనికి దాన్ని తిరిగి అప్పగించాలి.
If your fellow Israelite is not near to you, or if you do not know him, then you must bring the animal home to your house, and it must be with you until he looks for it, and then you must restore it to him.
3 ౩ అతని గాడిద, దుస్తుల విషయంలో కూడా మీరు అలాగే చెయ్యాలి. మీ తోటి ప్రజలు పోగొట్టుకున్నది ఏదైనా మీకు దొరకితే దాన్ని గురించి అలాగే చెయ్యాలి. మీరు దాన్ని చూసీ చూడనట్టు ఉండకూడదు.
You must do the same with his donkey; you must do the same with his garment; you must do the same with every lost thing of your fellow Israelite's, anything that he has lost and you have found; you must not hide yourself.
4 ౪ మీ సాటి మనిషి గాడిద, ఎద్దు దారిలో పడి ఉండడం మీరు చూస్తే వాటిని చూడనట్టు కళ్ళు మూసుకోకూడదు. వాటిని లేపడానికి తప్పకుండా సాయం చెయ్యాలి.
You must not see your fellow Israelite's donkey or his ox fallen down in the road and hide yourself from them; you must surely help him to lift it up again.
5 ౫ ఏ స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు. పురుషుడు స్త్రీ వేషం ధరించకూడదు. అలా చేసేవారంతా మీ దేవుడైన యెహోవాకు అసహ్యులు.
A woman must not wear what pertains to a man, and neither must a man put on women's clothing; for whoever does these things is an abomination to Yahweh your God.
6 ౬ చెట్టు మీదగానీ, నేల మీదగానీ, దారిలోగానీ పక్షిగుడ్లు గానీ పిల్లలు గానీ ఉన్న గూడు మీకు కనబడితే తల్లి ఆ పిల్లల మీద గానీ, ఆ గుడ్ల మీద గానీ పొదుగుతూ ఉన్నప్పుడు ఆ పిల్లలతో పాటు తల్లిపక్షిని తీసుకోకూడదు.
If a bird's nest happens to be in front of you on the road, in any tree or on the ground, with young ones or eggs in it, and the mother sitting on the young or on the eggs, you must not take the mother along with the young.
7 ౭ మీకు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులయ్యేలా తప్పకుండా తల్లిని విడిచిపెట్టి పిల్లలను తీసుకోవచ్చు.
You must surely let the mother go, but the young you may take for yourself. Obey this command so that it may go well with you, and that you may prolong your days.
8 ౮ మీరు కొత్త ఇల్లు కట్టించుకొనేటప్పుడు ఇంటి పైకప్పు చుట్టూ పిట్టగోడ కట్టించాలి. అప్పుడు దాని మీద నుంచి ఎవరైనా పడిపోతే మీ ఇంటి మీద హత్యాదోషం ఉండదు.
When you build a new house, then you must make a railing for your roof so that you do not bring blood on your house if anyone falls from there.
9 ౯ మీ ద్రాక్షతోటలో రెండు రకాల విత్తనాలను విత్తకూడదు. అలా చేస్తే మీరు వేసిన పంట, ద్రాక్షతోట రాబడి మొత్తం, దేవాలయానికి ప్రతిష్టితమవుతుంది.
You must not plant your vineyard with two kinds of seed, so that the whole harvest is not confiscated by the holy place, the seed that you have sown and the yield of the vineyard.
10 ౧౦ ఎద్దునూ గాడిదనూ జతచేసి భూమిని దున్నకూడదు.
You must not plow with an ox and a donkey together.
11 ౧౧ ఉన్ని, జనపనారతో కలిపి నేసిన దుస్తులు ధరించకూడదు.
You must not wear fabric made of wool and linen together.
12 ౧౨ మీరు కప్పుకొనే మీ దుస్తుల నాలుగు అంచులకు అల్లికలు చేసుకోవాలి.
You must make yourself fringes on the four corners of the cloak with which you clothe yourself.
13 ౧౩ ఒకడు స్త్రీని పెళ్లి చేసుకుని ఆమెతో శారీరకంగా ఏకమైన తరువాత ఆమెను అనుమానించి
Suppose a man takes a wife, sleeps with her, and then hates her,
14 ౧౪ “ఈ స్త్రీని పెళ్ళి చేసుకుని ఈమె దగ్గరికి వస్తే ఈమెలో నాకు కన్యత్వం కనబడలేదు” అని నేరారోపణ చేసాడనుకోండి.
and then accuses her of shameful things and puts a bad reputation on her, and says, 'I took this woman, but when I came near to her, I found no proof of virginity in her.'
15 ౧౫ ఆ స్త్రీ తల్లిదండ్రులు పట్టణ ద్వారం దగ్గర ఉన్న ఆ ఊరి పెద్దల దగ్గరికి ఆ యువతి కన్యాత్వ నిదర్శనం చూపించాలి.
Then the father and mother of the girl must take proof of her virginity to the elders at the city gate.
16 ౧౬ అప్పుడు ఆ స్త్రీ తండ్రి “నా కూతుర్ని ఇతనికిచ్చి పెళ్ళిచేస్తే ఇతడు ‘ఈమెలో కన్యాత్వం కనబడలేదని’ అవమానించి ఆమె మీద నింద మోపాడు.
The girl's father must say to the elders, 'I gave my daughter to this man as a wife, and he hates her.
17 ౧౭ అయితే నా కూతురు కన్య అని రుజువు పరిచే నిదర్శనం ఇదే” అని పెద్దలతో చెప్పి, పట్టణపు పెద్దల ఎదుట ఆ వస్త్రం పరచాలి.
See, he has accused her of shameful things and said, “I did not find in your daughter the proof of virginity.” But here is the proof of my daughter's virginity.' Then they will spread the garment out before the elders of the city.
18 ౧౮ అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ వ్యక్తిని పట్టుకుని శిక్షించి, 100 వెండి నాణాలు అపరాధ రుసుం అతడి దగ్గర తీసుకుని ఆ స్త్రీ తండ్రికి చెల్లించాలి.
The elders of that city must take that man and punish him;
19 ౧౯ ఎందుకంటే అతడు ఇశ్రాయేలు కన్యను అవమానపరిచాడు. ఇకపై ఆమె అతనికి భార్యగా ఉంటుంది. అతడు తాను జీవించే కాలమంతా ఆమెను విడిచి పెట్టకూడదు.
and they must fine him one hundred shekels of silver, and give them to the father of the girl, because the man has caused a bad reputation for a virgin of Israel. She must be his wife; he may not send her away during all his days.
20 ౨౦ అయితే ఆ వ్యక్తి ఆరోపించిన నింద నిజమైనప్పుడు, అంటే ఆ కన్యలో కన్యాత్వం కనబడని పక్షంలో
But if this thing is true, that the proof of virginity was not found in the girl,
21 ౨౧ పెద్దలు ఆమె తండ్రి ఇంటికి ఆమెను తీసుకురావాలి. అప్పుడు ఆమె ఊరి ప్రజలు ఆమెను రాళ్లతో కొట్టి చావగొట్టాలి. ఎందుకంటే ఆమె తన పుట్టింట్లో వ్యభిచరించి ఇశ్రాయేలులో చెడ్డ పని చేసింది. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని మీ మధ్యనుంచి మీరు రూపుమాపుతారు.
then they must bring out the girl to the door of her father's house, and the men of her city must stone her to death with stones, because she has committed a disgraceful action in Israel, to act as a harlot in her father's house; and you will remove the evil from among you.
22 ౨౨ ఎవడైనా మరొకడి భార్యతో శారీరకంగా కలుస్తూ పట్టుబడితే వారిద్దరినీ, అంటే ఆ స్త్రీతో శారీరకంగా కలిసిన పురుషుడినీ, స్త్రీనీ చంపాలి. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని ఇశ్రాయేలులో నుంచి రూపుమాపుతారు.
If a man is found sleeping with a woman who is married to another man, then they must both die, the man who was sleeping with the woman and the woman herself; and you will remove the evil from among you.
23 ౨౩ కన్య అయిన స్త్రీ తనకు ప్రదానం జరిగిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో శారీరకంగా కలిస్తే
If there is a girl who is a virgin, engaged to a man, and another man finds her in the city and sleeps with her,
24 ౨౪ ఆ ఊరి ద్వారం దగ్గరికి వారిద్దరినీ తీసుకువచ్చి, ఆ స్త్రీ ఊరిలోని ప్రజలను పిలవనందుకు ఆమెనూ, తన పొరుగువాడి భార్యను అవమాన పరచినందుకు ఆ వ్యక్తినీ రాళ్లతో చావగొట్టాలి. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని మీలోనుంచి రూపుమాపాలి.
take both of them to the city gate, and stone them to death. You must stone the girl, because she did not cry out, even though she was in the city. You must stone the man, because he violated his neighbor's wife; and you will remove the evil from among you.
25 ౨౫ ప్రదానం జరిగిన కన్యను పొలంలో ఒకడు కలుసుకున్నప్పుడు అతడు ఆమెను బలవంతం చేసి, ఆమెతో శారీరకంగా కలిస్తే, ఆమెతో శారీరకంగా కలిసిన వాడు మాత్రమే చావాలి.
But if the man finds the engaged girl in the field, and if he seizes her and sleeps with her, then only the man who sleeps with her must die.
26 ౨౬ ఆ కన్యను ఏమీ చేయకూడదు, ఎందుకంటే ఆ కన్య మరణానికి గురి అయ్యేంత పాపం చేయలేదు. ఒకడు తన పొరుగు వాడి మీద పడి చంపేసినట్టే ఇది జరిగింది.
But to the girl you must do nothing; there is no sin worthy of death in the girl. For this case is like when a man attacks his neighbor and kills him.
27 ౨౭ అతడు ఆమెను పొలంలో కలుసుకుంటే ప్రదానం జరిగిన ఆ కన్య కేకలు వేసినప్పుడు ఆమెను కాపాడడానికి ఎవరూ లేరు.
For he found her in the field; the engaged girl cried out, but there was no one to save her.
28 ౨౮ ఒకడు ప్రదానం జరగని కన్యను పట్టుకుని ఆమెతో శారీరకంగా కలిసిన విషయం తెలిసినప్పుడు
If a man finds a girl who is a virgin but who is not engaged, and if he seizes her and sleeps with her, and if they are discovered,
29 ౨౯ ఆమెతో శారీరకంగా కలిసినవాడు ఆ కన్య తండ్రికి 50 వెండి నాణాలు చెల్లించి ఆమెను పెళ్లి చేసుకోవాలి. అతడు ఆమెను ఆవమానపరచాడు కాబట్టి అతడు జీవించినంత కాలం ఆమెను విడిచి పెట్టకూడదు.
then the man who slept with her must give fifty shekels of silver to the girl's father, and she must become his wife, because he has humiliated her. He may not send her away during all his days.
30 ౩౦ ఎవ్వరూ తన తండ్రి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోకూడదు. తన తండ్రికి అప్రతిష్ట కలిగించకూడదు.
A man must not take his father's wife as his own; he must not take away his father's marriage rights.