< ద్వితీయోపదేశకాండమ 2 >
1 ౧ అప్పుడు యెహోవా నాతో చెప్పిన విధంగా మనం తిరిగి ఎర్రసముద్రం దారిలో ఎడారి గుండా చాలా రోజులు శేయీరు కొండ చుట్టూ తిరిగాం.
以後,我們照上主對我吩咐,的轉向紅海出發,往曠野進行,我們圍著色依爾山地繞行了很久。
2 ౨ యెహోవా నాకు ఇలా చెప్పాడు. “మీరు ఈ కొండ చుట్టూ తిరిగింది చాలు,
那時上主對我說:「
3 ౩ ఉత్తరం వైపుకు వెళ్ళండి. నువ్వు ప్రజలతో ఇలా చెప్పు.
你們繞行這山地已夠久了,如今該轉向北方。
4 ౪ ‘శేయీరులో నివసించే ఏశావు సంతానమైన మీ సోదరుల సరిహద్దులు దాటి వెళ్లబోతున్నారు, వారు మీకు భయపడతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి.
你吩咐人民說:你們要經過你們的兄弟厄撒烏子孫所住的色依爾地區;他們必畏懼你們,但你們卻應小心,
5 ౫ వారితో కలహం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఏశావుకు శేయీరును స్వాస్థ్యంగా ఇచ్చింది నేనే. వారి భూమిలోనిది ఒక్క అడుగైనా మీకియ్యను.
不要與他們挑戰,因為他們的地,連腳掌那麼大的一塊地,我也沒有給你們,因為我已將色依爾山地給了厄撒烏作產業。
6 ౬ మీరు డబ్బులిచ్చి వారి దగ్గర ఆహారం కొని తినవచ్చు. డబ్బులిచ్చి నీళ్లు కొని తాగవచ్చు.’
你們應用錢向他們買糧吃,用錢向他們買水喝。
7 ౭ ఎందుకంటే మీ చేతి పని అంతటినీ మీ యెహోవా దేవుడు ఆశీర్వదించాడు. ఈ గొప్ప ఎడారిలో నువ్వు ఈ నలభై సంవత్సరాలు తిరిగిన సంగతి ఆయనకు తెలుసు. ఆయన మీకు తోడుగా ఉన్నాడు, మీకేమీ తక్కువ కాదు.”
的確,上主你的天主祝福了你所作的一切,護衛你經過了這遼闊的曠野,這四十年來,上主你的天主常與你同在,使你什麼也不曾缺少。」
8 ౮ అప్పుడు శేయీరులో నివసించే ఏశావు సంతానమైన మన సోదరులను విడిచి, ఏలతు, ఎసోన్గెబెరు, అరాబా దారిలో మనం ప్రయాణించాం.
於是我們繞過了我們的兄弟厄撒烏的子孫所住的色依爾,沿阿辣巴路到了厄拉特,和厄茲雍革貝爾,然後轉向摩阿布曠野進發。
9 ౯ మనం తిరిగి మోయాబు ఎడారి మార్గంలో వెళుతుండగా యెహోవా నాతో ఇలా అన్నాడు. “మోయాబీయులను బాధ పెట్టవద్దు. వారితో యుద్ధం చేయొద్దు. లోతు సంతానానికి ఆర్ దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాను. వారి భూమిలో దేనినీ నీ స్వంతానికి ఇవ్వను.”
那時上主對我說:「不要擾亂摩阿布人,不要與他們挑戰,他們的土地我一點也不會給你作產業,因為我已將阿爾給了羅特子孫作產業。 [
10 ౧౦ గతంలో ఏమీయులు ఆ ప్రాంతాల్లో ఉండేవారు. వారు అనాకీయుల్లాగా పొడవైనవారు, బలవంతులైన గొప్ప ప్రజ. అనాకీయుల్లాగా వారిని కూడా “రెఫాయీయులు” అని పిలిచారు.
原先住在那裏的,是強大眾多,身材魁偉像阿納克人的厄明民族。
11 ౧౧ మోయాబీయులు వారికి “ఏమీయులు” పేరు పెట్టారు.
他們像阿納克人一樣,也算是勒法因人,但摩阿布人卻稱他們為厄明人。
12 ౧౨ పూర్వకాలంలో హోరీయులు శేయీరులో నివసించారు. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశంలో చేసినట్టు ఏశావు సంతానం హోరీయుల దేశాన్ని స్వాధీనం చేసుకుని వారిని చంపి వారి దేశంలో నివసించారు.
同樣,在色依爾原先住有曷黎人;但厄撒烏的子孫侵佔了他們的產業,消滅了他們,住在他們境內,就如以色列人對上主賜給他們作產業的土地所做的一樣。]
13 ౧౩ “ఇప్పుడు మీరు లేచి జెరెదు వాగు దాటండి” అని యెహోవా ఆజ్ఞాపించగా మనం జెరెదు వాగు దాటాం.
你們現在起身,過則勒得溪。」我們就過了則勒得溪。
14 ౧౪ మనం కాదేషు బర్నేయ నుండి బయలుదేరి జెరెదు వాగు దాటే వరకూ మనం ప్రయాణించిన కాలం 38 సంవత్సరాలు. యెహోవా వారితో శపథం చేసినట్టు అప్పటికి ఆ తరంలో యుద్ధం చేయగల మనుషులందరూ గతించిపోయారు.
從離開卡德士巴爾乃亞到我們過則勒得溪所用的時間,共計三十八年,直到能作戰的那一代,照上主對他們所起的誓,由營中完全消滅。
15 ౧౫ అంతే కాదు, వారు గతించే వరకూ ఆ తరం వారిని చంపడానికి యెహోవా హస్తం వారికి విరోధంగా ఉంది.
實在是上主的手攻擊了他們,使他們由營中完全消滅。
16 ౧౬ ఈ విధంగా సైనికులైన వారంతా చనిపోయి గతించిన తరువాత యెహోవా నాకు ఇలా చెప్పాడు,
所有的戰士由民中死盡以後,
17 ౧౭ “ఈ రోజు నువ్వు మోయాబుకు సరిహద్దుగా ఉన్న ఆర్ దేశాన్ని దాటబోతున్నావు.
上主吩咐我說:「
18 ౧౮ అమ్మోనీయుల పక్కగా వెళ్ళేటప్పుడు వారిని బాధించవద్దు.
你今天路過摩阿布的領土,即阿爾,
19 ౧౯ వారితో యుద్ధం చేయొద్దు. ఎందుకంటే లోతు సంతానానికి దాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాను. కాబట్టి వారి దేశంలో భూమిని నీకు ఏ మాత్రం ఇవ్వను.”
就要面臨阿孟子民;但不要擾亂他們,不要與他們挑戰,阿孟子民的土地我一點也不會給你作產業,因為我已將這地給了羅特子孫作產業。 [
20 ౨౦ దాన్ని కూడా రెఫాయీయుల దేశం అని పిలిచారు. పూర్వం రెఫాయీయులు అందులో నివసించారు. అమ్మోనీయులు వారిని “జంజుమీయులు” అనేవారు.
這地也算是勒法因人地,勒法因人先前住在那裏,阿孟人稱他們為「匝默組明。」
21 ౨౧ వారు అనాకీయుల్లాగా పొడవైన వారు, బలవంతులైన గొప్ప ప్రజలు. అయితే యెహోవా అమ్మోనీయుల ఎదుట నుండి వారిని వెళ్లగొట్టడం వలన అమ్మోనీయులు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ నివసించారు.
他們像阿納克人一樣,是強大眾多,身材魁偉的民族;但上主卻由阿孟人面前消滅了他們,使阿孟人佔有他們的產業,住在他們境內,
22 ౨౨ ఆయన శేయీరులో నివసించే ఏశావు సంతానం కోసం వారి ఎదుట నుండి హోరీయులను నశింపజేశాడు కాబట్టి వారు హోరీయుల దేశాన్ని స్వాధీనం చేసుకుని ఈ రోజు వరకూ అక్కడ నివసిస్తున్నారు.
正如上主為住在色依爾的厄撒烏子孫所做的一樣:即由他們面前消滅了曷黎人,使厄撒烏的子孫佔有他們的產業,住在他們的境內,直到今日。
23 ౨౩ గాజా వరకూ ఉన్న గ్రామాల్లో నివసించిన ఆవీయులను కఫ్తోరు నుండి వచ్చిన కఫ్తోరీయులు నాశనం చేసి అక్కడ నివసించారు.
同樣,阿威人原先住在迦薩附近各村莊內,有加非托爾人由加非托爾來,將他們消滅,住在他們境內。]
24 ౨౪ “మీరు బయలుదేరి అర్నోను లోయ దాటండి. ఇదిగో అమోరీయుడు, హెష్బోను రాజు అయిన సీహోనునూ అతని దేశాన్నీ మీ చేతికి అప్పగించాను. అతనితో యుద్ధం చేసి దాన్ని ఆక్రమించుకోండి.
你們起身出發,過阿爾農河。看,我已將阿摩黎人赫市朋王息紅和他的土地交在你手中;進軍佔領,與他交戰。
25 ౨౫ ఈ రోజు ఆకాశం కింద ఉన్న జాతుల ప్రజలందరికీ నువ్వంటే భయం పుట్టించడం మొదలు పెడుతున్నాను. వారు మీ గురించిన సమాచారం విని నీ ఎదుట వణకి, కలవరపడతారు” అని యెహోవా నాతో చెప్పాడు.
從今日起,我要使天下萬民在你面前驚慌害怕,使他們一聽見你的消息就戰慄;一看見你的面目就發抖。」
26 ౨౬ అప్పుడు నేను కెదేమోతు ఎడారిలో నుండి హెష్బోను రాజు సీహోను దగ్గరికి దూతలను పంపి
我於是由刻德摩特曠野,派遣使者到赫市朋王息紅那裏,和平談判說:
27 ౨౭ “మమ్మల్ని నీ దేశం గుండా వెళ్ళనివ్వు. కుడి, ఎడమలకు తిరగకుండా దారిలోనే నడిచిపోతాము.
讓我從你國內經過,我只走大道,不偏右也不偏左。
28 ౨౮ నా దగ్గర సొమ్ము తీసుకుని తినడానికి ఆహార పదార్థాలు, తాగడానికి నీరు ఇవ్వు.
你按價錢賣給我糧吃,按價錢供給我水喝;只讓我步行過去,──
29 ౨౯ శేయీరులో ఏశావు సంతానమూ ఆర్ లో మోయాబీయులూ నాకు చేసినట్టు, మా దేవుడు యెహోవా మాకిస్తున్న దేశానికి వెళ్ళడానికి యొర్దాను నది దాటేవరకూ కాలి నడకతోనే మమ్మల్ని వెళ్లనివ్వు” అని శాంతికరమైన మాటలు పలికించాను.
如住在色依爾的厄撒烏子孫和住在阿爾的摩阿布人,對我所做的一樣,──好使我過約但河,進入上主我們的天主賜給我們的地方。
30 ౩౦ అయితే హెష్బోను రాజు సీహోను మనం తన దేశం గుండా వెళ్లడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ రోజు జరిగినట్టుగా మన చేతికి అతణ్ణి అప్పగించడం కోసం మీ యెహోవా దేవుడు అతని మనస్సును కఠినపరచి అతని హృదయాన్ని బండబారిపోయేలా చేశాడు.
但是赫市朋王息紅,不肯讓我們從他那裏經過,因為上主你的天主使他頑固,使他心硬,好將他交在你手中,就如今日一樣。
31 ౩౧ అప్పుడు యెహోవా “చూడు, సీహోనును అతని దేశాన్ని నీకు అప్పగిస్తున్నాను. అతని దేశాన్ని స్వాధీనం చేసుకోవడం మొదలు పెట్టు” అని నాతో చెప్పాడు.
上主對我說:看我已將息紅和他的土地交給了你,你應進軍佔領他的土地。」
32 ౩౨ సీహోనూ అతని ప్రజలంతా యాహసులో మనతో యుద్ధం చేయడానికి వచ్చారు.
那時息紅和他所有的民眾出來攻擊我們,在雅哈茲與我們交戰;
33 ౩౩ మన యెహోవా దేవుడు అతణ్ణి మనకప్పగించాడు కాబట్టి మనం అతన్నీ అతని కొడుకులనూ అతని ప్రజలందరినీ చంపివేశాం.
但上主我們的天主將他交給了我們,我們擊殺了他,他的兒子和他所有的人民。
34 ౩౪ అప్పుడున్న అతని పట్టణాలనూ, వాటిలోని స్త్రీ పురుషులనూ పిల్లలనూ ఏదీ మిగలకుండా నాశనం చేశాం.
同時我們也佔領了他所有的城邑,照毀滅律將全城破壞,不論男女或幼童,全都殺死,沒有留下一個,
35 ౩౫ కేవలం పశువులనూ ఆ పట్టణాల ఆస్తినీ దోచుకున్నాం.
只留下了牲畜和由佔領的城邑中所奪的財物,作我們的戰利品。
36 ౩౬ అర్నోను ఏటిలోయ ఒడ్డున ఉన్న అరోయేరు, ఆ లోయలో ఉన్న పట్టణం మొదలుపెట్టి గిలాదు వరకూ మనకు లొంగిపోని పట్టణం ఒక్కటి కూడా లేదు. మన దేవుడు అన్నిటినీ మనకి అప్పగించాడు.
由阿爾農谷邊的阿洛厄爾和谷中的城直到基肋阿得,沒有一座城不被我們攻下的,上主我們的天主將這一切全交給了我們,
37 ౩౭ అయితే అమ్మోనీయుల దేశానికైనా, యబ్బోకు నది లోయలోని ఏ ప్రాంతానికైనా ఆ కొండప్రాంతంలోని పట్టణాలకైనా మన యెహోవా దేవుడు వెళ్ళవద్దని చెప్పిన మరే స్థలానికైనా మీరు వెళ్ళలేదు.
只有阿孟子孫的土地,即雅波克河一帶和山地的城邑,你沒有進攻,全照上主我們的天主所吩咐的。