< ద్వితీయోపదేశకాండమ 19 >
1 ౧ “మీ యెహోవా దేవుడు ఎవరి దేశాన్ని మీకిస్తున్నాడో ఆ ప్రజలను యెహోవా దేవుడు నాశనం చేసిన తరువాత మీరు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుని, వారి పట్టణాల్లో వారి ఇళ్ళల్లో నివసించాలి.
Kadar je Gospod, tvoj Bog, iztrebil narode, katerih deželo ti daje Gospod, tvoj Bog in jih naslediš, prebivaš v njihovih mestih in v njihovih hišah,
2 ౨ మీరు స్వాధీనం చేసుకొనేలా యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మూడు పట్టణాలను వేరు పరచాలి.
si boš v sredi svoje dežele, ki ti jo Gospod, tvoj Bog, daje v last, oddvojil tri mesta.
3 ౩ మీరు స్వాధీనం చేసుకొనేలా యెహోవా దేవుడు మీకిస్తున్న దేశపు సరిహద్దుల్లో హంతకుడు పారిపోయి తల దాచుకోవడానికి మూడు పట్టణాలకు వెళ్ళే దారులను కొలిచి ఏర్పరచాలి.
Pripravil si boš pot in na tri dele razdelil pokrajine svoje dežele, ki ti jo daje Gospod, tvoj Bog, da jo podeduješ, da lahko vsak ubijalec pobegne tja.
4 ౪ హంతకుడు పారిపోయి బతకడానికి నియమించిన పద్ధతి ఏమిటంటే, ఒకడు అంతకు ముందు తన పక్కనున్న వాడి మీద పగ ఏమీ లేకుండా
In to je primer ubijalca, ki bo pobegnil tja, da bo lahko živel: ›Kdorkoli nevede ubije svojega bližnjega, ki ga v preteklem času ni sovražil,
5 ౫ పొరపాటున వాణ్ణి చంపితే, అంటే ఒకడు చెట్లు నరకడానికి వేరొక వ్యక్తితో అడవికి వెళ్ళి చెట్లు నరకడానికి తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు, గొడ్డలి పిడి ఊడి ఆ వ్యక్తికి తగిలి, వాడు చనిపోతే ఆ హంతకుడు ప్రాణం నిలుపుకునేందుకు వీటిలో ఎదో ఒక పట్టణానికి పారిపోవాలి.
kot ko gre mož s svojim bližnjim v gozd, da sekata les in njegova roka zamahne udarec s sekiro, da poseka drevo in glava zdrsne iz toporišča in pade na njegovega bližnjega, da ta umre, bo pobegnil v eno izmed teh mest in živel,
6 ౬ చనిపోయిన వాడి బంధువు కోపంతో హంతకుణ్ణి తరిమి, దారి చాలా దూరం గనక వాణ్ణి పట్టుకుని చంపకుండేలా వాడు ఇలా చెయ్యాలి. అతనికి ఆ వ్యక్తిపై గతంలో ఎలాంటి పగ లేదు కనుక అతడు మరణశిక్షకు పాత్రుడు కాక పోయినా ఇలా జరగవచ్చు.
da ne bi krvni maščevalec zasledoval ubijalca, medtem ko je njegovo srce vroče in ga dohitel, ker je dolga pot in ga ubil medtem ko ta ni bil vreden smrti, ker ga v preteklem času ni sovražil.
7 ౭ అందుచేత మూడు పట్టణాలను మీ కోసం ఏర్పరచుకోవాలని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను.
Zato ti zapovedujem, rekoč: ›Zase si boš oddvojil tri mesta.‹
8 ౮ యెహోవా దేవుడు మీ పూర్వీకులతో ప్రమాణం చేసినట్టు ఆయన మీ సరిహద్దులను విశాలపరచి, మీ పూర్వీకులకు ఇస్తానని చెప్పిన దేశాన్నంతా మీకిచ్చినప్పుడు మీరు యెహోవా దేవుణ్ణి గౌరవించాలి.
Če Gospod, tvoj Bog, poveča tvojo pokrajino, kakor je prisegel tvojim očetom in ti da vso deželo, ki jo je obljubil dati tvojim očetom;
9 ౯ ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించినట్టు ఎప్పుడూ ఆయన మార్గాల్లో నడవడానికి ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఈ మూడు పట్టణాలు కాక మరో మూడు పట్టణాలను ఏర్పాటు చేసుకోవాలి.
če boš ohranjal vse te zapovedi, ki ti jih ta dan zapovedujem, da jih izvršuješ, da ljubiš Gospoda, svojega Boga in da vedno hodiš po njegovih poteh, potem si boš poleg teh treh dodal še tri mesta,
10 ౧౦ ఎవరినైనా హత్య చేశామన్న నేరారోపణ మీ మీదికి రాకుండా ఉండేందుకు యెహోవా దేవుడు మీకు వారసత్వంగా ఇస్తున్న మీ దేశంలో నిర్దోషిని హత్య చేయకూడదు.
da nedolžna kri ne bo prelita v tvoji deželi, ki ti jo daje v dediščino Gospod, tvoj Bog in bi bila tako na tebi kri.
11 ౧౧ ఒకడు తన పొరుగువాడి మీద పగ పట్టి, అతని కోసం కాపు కాసి అతని మీద పడి వాడు చనిపోయేలా కొట్టి
Toda če katerikoli mož sovraži svojega bližnjega in nanj preži v zasedi in se dvigne zoper njega in ga smrtno udari, da ta umre in pobegne v eno izmed teh mest,
12 ౧౨ ఆ పట్టణాల్లో ఒక దానిలోకి పారిపోతే, ఆ ఊరిపెద్దలు మనుషులను పంపి అక్కడనుంచి వాణ్ణి రప్పించాలి. హత్య విషయం ప్రతీకారం చేసేవాడి చేతికి అతన్ని అప్పగించి చంపించాలి.
potem bodo starešine njegovega mesta poslali in ga dobili od tam in ga izročili v roko krvnega maščevalca, da bo ta lahko umrl.
13 ౧౩ అతడిపై కనికరం చూపించకూడదు. మీకు మేలు కలిగేలా ఇశ్రాయేలు ప్రజల మధ్యనుంచి నిర్దోషి ప్రాణం విషయంలో దోషాన్ని పరిహరించాలి.
Tvoje oko se ga ne bo usmililo, temveč boš iz Izraela odstranil krivdo nedolžne krvi, da bo lahko dobro s teboj.
14 ౧౪ మీరు స్వాధీనం చేసుకొనేలా యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మీకు వచ్చే మీ వారసత్వంలో పూర్వీకులు నియమించిన మీ పొరుగువాడి సరిహద్దు రాయిని తొలగించ కూడదు.
Ne boš odstranil mejnika svojega bližnjega, ki so ga od starih časov postavili v tvojo dediščino, ki jo boš podedoval v deželi, ki ti jo Gospod, tvoj Bog, daje v last.
15 ౧౫ ఒకడు జరిగించే పాపం, అపరాధం విషయంలో దాన్ని నిర్ధారించడానికి కేవలం ఒక్క వ్యక్తి సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోకూడదు. ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తుల సాక్ష్యం మీద ప్రతి దానినీ నిర్థారణ చేయాలి.
Ena priča se ne bo dvignila zoper človeka zaradi katerekoli krivičnosti ali zaradi kateregakoli greha, s katerimkoli grehom je grešil. Zadeva se bo potrdila pri ustih dveh prič ali pri ustih treh prič.
16 ౧౬ ఒక వ్యక్తిపై అబద్ద నేరం మోపి, అన్యాయ సాక్ష్యం చెబుతున్నట్టు అనిపిస్తే
Če kriva priča vstane zoper kateregakoli, da priča zoper njega to, kar je napačno,
17 ౧౭ ఆ వివాదం ఏర్పడిన ఇద్దరూ యెహోవా ఎదుట, అంటే అప్పుడు విధుల్లో ఉన్న యాజకుల ఎదుట, న్యాయాధిపతుల ఎదుట నిలబడాలి.
potem bosta oba človeka, med katerima je polemika, stala pred Gospodom, pred duhovniki in sodniki, ki bodo v tistih dneh
18 ౧౮ ఆ న్యాయాధిపతులు బాగా పరీక్షించిన తరువాత వాడి సాక్ష్యం అబద్ధసాక్ష్యమై తన సోదరుని మీద వాడు అబద్ధసాక్ష్యం చెప్పిన సంగతి వెల్లడైతే వాడు తన సోదరునికి చేయాలని కోరినది వాడి పట్ల జరిగించాలి.
in sodniki bodo naredili marljivo zasliševanje. Glej, če je priča kriva priča in je lažno pričevala zoper svojega brata,
19 ౧౯ ఆ విధంగా మీ మధ్యనుంచి చెడుతనాన్ని తొలగిస్తారు.
potem mu boste storili kakor je sam mislil storiti svojemu bratu. Tako boste izmed sebe iztrebili zlo.
20 ౨౦ ఇది తెలుసుకున్న మిగిలినవారు భయం వల్ల మీ దేశంలో అలాంటి దుర్మార్గపు పనులు జరిగించరు.
Tisti, ki preostanejo, bodo slišali in se bali in odslej med vami ne bodo več zagrešili nobenega takšnega zla.
21 ౨౧ దుష్ట కార్యాలు జరిగించే ఎవరిపైనా కనికరం చూపకూడదు. అలాంటివారి విషయంలో ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు నియమం పాటించాలి.”
Tvoje oko se ne bo usmililo, temveč bo življenje šlo za življenje, oko za oko, zob za zob, roka za roko, stopalo za stopalo.