< ద్వితీయోపదేశకాండమ 18 >

1 “యాజకులుగా నియమితులైన లేవీయులకు, అంటే లేవీగోత్రం వారికి ఇశ్రాయేలు ప్రజలతో భాగం గానీ, వారసత్వపు హక్కు గానీ ఉండవు. వారు యెహోవాకు దహనబలిగా అర్పించే వాటినే తింటారు.
لاویان کهنه و تمامی سبط لاوی راحصه و نصیبی با اسرائیل نباشد.۱
2 వారి సోదరులతో వారికి వారసత్వం ఉండదు. యెహోవా వారితో చెప్పినట్టు ఆయనే వారి వారసత్వం.
پس ایشان در میان برادران خود نصیب نخواهندداشت. خداوند نصیب ایشان است، چنانکه به ایشان گفته است.۲
3 ఎవరైనా ఎద్దును గానీ, గొర్రెను గానీ, మేకను గానీ బలిగా అర్పించినప్పుడు అర్పించిన వాటి కుడి జబ్బ, రెండు దవడలు, పొట్ట భాగం యాజకులకు ఇవ్వాలి.
و حق کاهنان از قوم، یعنی از آنانی که قربانی، خواه از گاو و خواه از گوسفندمی گذرانند، این است که دوش و دو بنا گوش وشکنبه را به کاهن بدهند.۳
4 ధాన్యంలో, ద్రాక్షారసంలో, నూనెలో ప్రథమ ఫలం యాజకునికి ఇవ్వాలి. గొర్రెల బొచ్చు కత్తిరింపులో మొదటి భాగం యాజకునికి ఇవ్వాలి.
و نوبر غله و شیره وروغن خود و اول چین پشم گوسفند خود را به اوبده،۴
5 యెహోవా పేరున నిలబడి ఎప్పుడూ సేవ చేయడానికి మీ గోత్రాలన్నిటిలో అతణ్ణి, అతని సంతానాన్నీ మీ యెహోవా దేవుడు ఎన్నుకున్నాడు.
زیرا که یهوه، خدایت، او را از همه اسباطت برگزیده است، تا او و پسرانش همیشه بایستند و به نام خداوند خدمت نمایند.۵
6 ఒక లేవీయుడు ఇశ్రాయేలు దేశంలో తాను నివసిస్తున్న ఒక ఊరిలో నుంచి యెహోవా ఏర్పరచుకునే చోటుకు వచ్చేందుకు ఆసక్తి కనపరిస్తే
و اگر احدی از لاویان از یکی ازدروازه هایت از هر جایی در اسرائیل که در آنجاساکن باشد آمده، به تمامی آرزوی دل خود به مکانی که خداوند برگزیند، برسد،۶
7 అక్కడ యెహోవా ఎదుట నిలబడే లేవీయుల్లాగే అతడు తన యెహోవా దేవుని పేరున సేవ చేయవచ్చు.
پس به نام یهوه خدای خود، مثل سایر برادرانش از لاویانی که در آنجا به حضور خداوند می‌ایستند، خدمت نماید.۷
8 తన పిత్రార్జితాన్ని అమ్మగా వచ్చినది కాక, ఇతరుల్లాగే అతడు వంతు పొందాలి.
حصه های برابر بخورند، سوای آنچه ازارثیت خود بفروشد.۸
9 మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మీరు ప్రవేశించిన తరువాత ఆ ప్రజల నీచమైన పనులను మీరు చేయడానికి నేర్చుకోకూడదు.
چون به زمینی که یهوه، خدایت، به تومی دهد داخل شوی، یاد مگیر که موافق رجاسات آن امتها عمل نمایی.۹
10 ౧౦ తన కొడుకుని గానీ కూతుర్ని గానీ మంటల్లోనుంచి దాటించేవాణ్ణి, శకునం చెప్పే సోదెగాణ్ణి, మేఘ శకునాలూ సర్ప శకునాలూ చెప్పేవాణ్ణి, చేతబడి చేసేవాణ్ణి, మాంత్రికుణ్ణి, ఇంద్రజాలకుణ్ణి,
و در میان تو کسی یافت نشود که پسر یا دختر خود را از آتش بگذرانند، ونه فالگیر و نه غیب گو و نه افسونگر و نه جادوگر،۱۰
11 ౧౧ ఆత్మలను సంప్రదించేవాణ్ణి, దయ్యాలను సంప్రదించే వాణ్ణి మీమధ్య ఉండనివ్వకూడదు.
و نه ساحر و نه سوال کننده از اجنه و نه رمال ونه کسی‌که از مردگان مشورت می‌کند.۱۱
12 ౧౨ వీటిని చేసే ప్రతివాడూ యెహోవాకు అసహ్యం. ఇలాంటి అసహ్యమైన వాటిని బట్టే మీ యెహోవా దేవుడు మీ ఎదుట నుంచి ఆ ప్రజలను వెళ్లగొట్టేస్తున్నాడు.
زیرا هرکه این کارها را کند، نزد خداوند مکروه است وبه‌سبب این رجاسات، یهوه، خدایت، آنها را ازحضور تو اخراج می‌کند.۱۲
13 ౧౩ మీరు మీ యెహోవా దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి.
نزد یهوه، خدایت، کامل باش.۱۳
14 ౧౪ మీరు స్వాధీనం చేసుకోబోయే ప్రజలు మేఘ శకునాలు చెప్పేవారి మాట, సోదె చెప్పేవారి మాట వింటారు. మీ యెహోవా దేవుడు అలా చేయడానికి మిమ్మల్ని అనుమతించలేదు.
زیرا این امتهایی که تو آنها را بیرون می‌کنی به غیب گویان و فالگیران گوش می‌گیرند، و اما یهوه، خدایت، تو را نمی گذارد که چنین بکنی.۱۴
15 ౧౫ మీ యెహోవా దేవుడు మీ మధ్య నా వంటి ప్రవక్తను మీ సోదరుల్లోనుంచి మీ కోసం పుట్టిస్తాడు. ఆయన మాట మీరు వినాలి.
یهوه، خدایت، نبی‌ای را از میان تو ازبرادرانت، مثل من برای تو مبعوث خواهدگردانید، او را بشنوید.۱۵
16 ౧౬ హోరేబులో సమావేశమైన రోజున మీరు ‘మా యెహోవా దేవుని స్వరం మళ్ళీ మనం వినొద్దు, ఈ గొప్ప అగ్నిని ఇకనుంచి మనం చూడొద్దు. లేకపోతే మేమంతా చస్తాం’ అన్నారు.
موافق هر‌آنچه درحوریب در روز اجتماع از یهوه خدای خودمسالت نموده، گفتی: «آواز یهوه خدای خود رادیگر نشنوم، و این آتش عظیم را دیگر نبینم، مبادابمیرم.»۱۶
17 ౧౭ అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు. ‘వాళ్ళు చెప్పిన మాట బాగానే ఉంది.
و خداوند به من گفت: «آنچه گفتندنیکو گفتند.۱۷
18 ౧౮ వాళ్ళ సోదరుల్లోనుంచి నీలాంటి ప్రవక్తను వారికోసం పుట్టిస్తాను. అతని నోట్లో నా మాటలు ఉంచుతాను. నేను అతనికి ఆజ్ఞాపించేదంతా అతడు వారితో చెబుతాడు.
نبی‌ای را برای ایشان از میان برادران ایشان مثل تو مبعوث خواهم کرد، و کلام خود را به دهانش خواهم گذاشت و هر‌آنچه به اوامر فرمایم به ایشان خواهد گفت.۱۸
19 ౧౯ అతడు నా పేరుతో చెప్పే నా మాటలను విననివాణ్ణి నేను శిక్షిస్తాను.
و هر کسی‌که سخنان مرا که او به اسم من گوید نشنود، من ازاو مطالبه خواهم کرد.۱۹
20 ౨౦ అయితే, ఏ ప్రవక్త అయినా అహంకారంతో, నేను చెప్పమని తనకాజ్ఞాపించని మాటను నా పేరున చెబితే, లేదా ఇతర దేవుళ్ళ పేరున చెబితే ఆ ప్రవక్త కూడా చావాలి.’
و اما نبی‌ای که جسارت نموده، به اسم من سخن گوید که به گفتنش امرنفرمودم، یا به اسم خدایان غیر سخن گوید، آن نبی البته کشته شود.»۲۰
21 ౨౧ ‘ఏదైనా ఒక సందేశం యెహోవా చెప్పింది కాదని మేమెలా తెలుసుకోగలం?’ అని మీరనుకుంటే,
و اگر در دل خود گویی: «سخنی را که خداوند نگفته است، چگونه تشخیص نماییم.»۲۱
22 ౨౨ ప్రవక్త యెహోవా పేరుతో చెప్పినప్పుడు ఆ మాట జరగకపోతే, ఎన్నటికీ నెరవేరకపోతే అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారంతోనే దాన్ని చెప్పాడు కాబట్టి దానికి భయపడవద్దు.”
هنگامی که نبی به اسم خداوند سخن گوید، اگر آن چیز واقع نشود و به انجام نرسد، این امری است که خداوند نگفته است، بلکه آن نبی آن را از روی تکبر گفته است. پس از او نترس.۲۲

< ద్వితీయోపదేశకాండమ 18 >