< ద్వితీయోపదేశకాండమ 18 >
1 ౧ “యాజకులుగా నియమితులైన లేవీయులకు, అంటే లేవీగోత్రం వారికి ఇశ్రాయేలు ప్రజలతో భాగం గానీ, వారసత్వపు హక్కు గానీ ఉండవు. వారు యెహోవాకు దహనబలిగా అర్పించే వాటినే తింటారు.
“The priests and the Levites, and all who are from the same tribe, shall have no portion or inheritance with the rest of Israel. For they shall eat the sacrifices of the Lord and his oblations.
2 ౨ వారి సోదరులతో వారికి వారసత్వం ఉండదు. యెహోవా వారితో చెప్పినట్టు ఆయనే వారి వారసత్వం.
And they shall receive nothing else from the possession of their brothers. For the Lord himself is their inheritance, just as he said to them.
3 ౩ ఎవరైనా ఎద్దును గానీ, గొర్రెను గానీ, మేకను గానీ బలిగా అర్పించినప్పుడు అర్పించిన వాటి కుడి జబ్బ, రెండు దవడలు, పొట్ట భాగం యాజకులకు ఇవ్వాలి.
This shall be the recompense for the priests from the people, and from those who offer victims, whether they will immolate an ox or a sheep. They shall give to the priest the shoulder and the breast,
4 ౪ ధాన్యంలో, ద్రాక్షారసంలో, నూనెలో ప్రథమ ఫలం యాజకునికి ఇవ్వాలి. గొర్రెల బొచ్చు కత్తిరింపులో మొదటి భాగం యాజకునికి ఇవ్వాలి.
the first-fruits of grain, wine, and oil, and a portion of the wool from the shearing of the sheep.
5 ౫ యెహోవా పేరున నిలబడి ఎప్పుడూ సేవ చేయడానికి మీ గోత్రాలన్నిటిలో అతణ్ణి, అతని సంతానాన్నీ మీ యెహోవా దేవుడు ఎన్నుకున్నాడు.
For the Lord your God himself has chosen him out of all your tribes, so that he may stand and minister to the name of the Lord, him and his sons, forever.
6 ౬ ఒక లేవీయుడు ఇశ్రాయేలు దేశంలో తాను నివసిస్తున్న ఒక ఊరిలో నుంచి యెహోవా ఏర్పరచుకునే చోటుకు వచ్చేందుకు ఆసక్తి కనపరిస్తే
If a Levite departs from one of the cities, throughout all of Israel, in which he lives, and if he wills and desires to go to the place which the Lord will choose,
7 ౭ అక్కడ యెహోవా ఎదుట నిలబడే లేవీయుల్లాగే అతడు తన యెహోవా దేవుని పేరున సేవ చేయవచ్చు.
he shall minister in the name of the Lord his God, as do all his brothers, the Levites, who will be standing at that time in the sight of the Lord.
8 ౮ తన పిత్రార్జితాన్ని అమ్మగా వచ్చినది కాక, ఇతరుల్లాగే అతడు వంతు పొందాలి.
He shall receive the same portion of food as the rest also receive, besides that which is due to him in his own city, by succession from his fathers.
9 ౯ మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మీరు ప్రవేశించిన తరువాత ఆ ప్రజల నీచమైన పనులను మీరు చేయడానికి నేర్చుకోకూడదు.
When you will have entered into the land which the Lord your God will give to you, be careful that you are not willing to imitate the abominations of those nations.
10 ౧౦ తన కొడుకుని గానీ కూతుర్ని గానీ మంటల్లోనుంచి దాటించేవాణ్ణి, శకునం చెప్పే సోదెగాణ్ణి, మేఘ శకునాలూ సర్ప శకునాలూ చెప్పేవాణ్ణి, చేతబడి చేసేవాణ్ణి, మాంత్రికుణ్ణి, ఇంద్రజాలకుణ్ణి,
Do not let there be found among you one who would purify his son or daughter by leading them through fire, nor one who consults seers, nor one who observes dreams or omens. Do not let there be found among you one who practices the occult,
11 ౧౧ ఆత్మలను సంప్రదించేవాణ్ణి, దయ్యాలను సంప్రదించే వాణ్ణి మీమధ్య ఉండనివ్వకూడదు.
nor one who uses spells, nor one who consults demonic spirits, nor a diviner, nor one who seeks the truth from the dead.
12 ౧౨ వీటిని చేసే ప్రతివాడూ యెహోవాకు అసహ్యం. ఇలాంటి అసహ్యమైన వాటిని బట్టే మీ యెహోవా దేవుడు మీ ఎదుట నుంచి ఆ ప్రజలను వెళ్లగొట్టేస్తున్నాడు.
For the Lord abominates all these things. And, because of these wicked ways, he will destroy them at your arrival.
13 ౧౩ మీరు మీ యెహోవా దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి.
You shall be perfect and without blemish with the Lord your God.
14 ౧౪ మీరు స్వాధీనం చేసుకోబోయే ప్రజలు మేఘ శకునాలు చెప్పేవారి మాట, సోదె చెప్పేవారి మాట వింటారు. మీ యెహోవా దేవుడు అలా చేయడానికి మిమ్మల్ని అనుమతించలేదు.
These nations, whose land you shall possess, they listen to soothsayers and diviners. But you have been otherwise instructed by the Lord your God.
15 ౧౫ మీ యెహోవా దేవుడు మీ మధ్య నా వంటి ప్రవక్తను మీ సోదరుల్లోనుంచి మీ కోసం పుట్టిస్తాడు. ఆయన మాట మీరు వినాలి.
The Lord your God will raise up for you a PROPHET from your nation and from your brothers, similar to me. You shall listen to him,
16 ౧౬ హోరేబులో సమావేశమైన రోజున మీరు ‘మా యెహోవా దేవుని స్వరం మళ్ళీ మనం వినొద్దు, ఈ గొప్ప అగ్నిని ఇకనుంచి మనం చూడొద్దు. లేకపోతే మేమంతా చస్తాం’ అన్నారు.
just as you petitioned of the Lord your God at Horeb, when the assembly was gathered together, and you said: ‘Let me no longer hear the voice of the Lord my God, and let me no longer see this very great fire, lest I die.’
17 ౧౭ అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు. ‘వాళ్ళు చెప్పిన మాట బాగానే ఉంది.
And the Lord said to me: ‘They have spoken all these things well.
18 ౧౮ వాళ్ళ సోదరుల్లోనుంచి నీలాంటి ప్రవక్తను వారికోసం పుట్టిస్తాను. అతని నోట్లో నా మాటలు ఉంచుతాను. నేను అతనికి ఆజ్ఞాపించేదంతా అతడు వారితో చెబుతాడు.
I will raise up a prophet for them, from the midst of their brothers, similar to you. And I will place my words in his mouth, and he will speak to them all the things that I will instruct him.
19 ౧౯ అతడు నా పేరుతో చెప్పే నా మాటలను విననివాణ్ణి నేను శిక్షిస్తాను.
But against anyone who is not willing to listen to his words, which he will speak in my name, I will stand forth as the avenger.
20 ౨౦ అయితే, ఏ ప్రవక్త అయినా అహంకారంతో, నేను చెప్పమని తనకాజ్ఞాపించని మాటను నా పేరున చెబితే, లేదా ఇతర దేవుళ్ళ పేరున చెబితే ఆ ప్రవక్త కూడా చావాలి.’
But if a prophet, having been corrupted by arrogance, chooses to speak, in my name, things which I did not instruct him to say, or to speak in the name of foreign gods, he shall be put to death.
21 ౨౧ ‘ఏదైనా ఒక సందేశం యెహోవా చెప్పింది కాదని మేమెలా తెలుసుకోగలం?’ అని మీరనుకుంటే,
But if, in silent thought, you respond: “How will I be able to recognize a word which the Lord has not spoken?”
22 ౨౨ ప్రవక్త యెహోవా పేరుతో చెప్పినప్పుడు ఆ మాట జరగకపోతే, ఎన్నటికీ నెరవేరకపోతే అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారంతోనే దాన్ని చెప్పాడు కాబట్టి దానికి భయపడవద్దు.”
you shall have this sign. If whatever that prophet predicts in the name of the Lord does not happen, then the Lord has not spoken it. Instead, the prophet has formed it through the swelling of his own mind. And for this reason, you shall not fear him.’”