< ద్వితీయోపదేశకాండమ 12 >
1 ౧ “మీరు స్వాధీనం చేసుకోడానికి మీ పూర్వీకుల దేవుడు యెహోవా మీకిచ్చిన దేశంలో మీ జీవితకాలమంతా మీరు పాటించాల్సిన కట్టడలు, విధులు ఇవి.
“(I will now tell you again/These, [again], are) the rules and regulations that you must faithfully obey in the land that Yahweh, the God whom our ancestors [worshiped], is giving to you to occupy. You must obey these laws all the time that you are alive.
2 ౨ మీరు స్వాధీనం చేసుకోబోయే జాతుల ప్రజలు గొప్ప పర్వతాల మీదా మెట్టల మీదా పచ్చని చెట్ల కిందా ఎక్కడెక్కడ వారి దేవుళ్ళను పూజించారో ఆ స్థలాలన్నిటినీ మీరు పూర్తిగా ధ్వంసం చేయాలి.
You must destroy all the places where the people-groups that you will expel worship their gods, on the tops of mountains and hills and under big green trees.
3 ౩ వారి హోమపీఠాలను కూలదోసి, వారి విగ్రహాలను పగలగొట్టాలి. వారి దేవతా స్తంభాలను అగ్నితో కాల్చివేసి, వారి దేవుళ్ళ ప్రతిమలను కూల్చి వెయ్యాలి. ఆ స్థలం లో వాటి పేర్లు కూడా లేకుండా నాశనం చేయాలి.
You must tear down their altars and smash their sacred pillars. Completely burn the statues of their goddess Asherah in fires, and chop down their wooden idols, in order that no one will ever worship them [MTY] in those places again.
4 ౪ వారు తమ దేవుళ్ళను ఆరాధించినట్టు మీరు యెహోవాను అరాధించకూడదు.
“Do not worship Yahweh like [the people in Canaan worship their gods].
5 ౫ మీ దేవుడు యెహోవా మీ గోత్రాలన్నిటిలో నుండి తన పేరుకు నివాసస్థానంగా ఏర్పాటు చేసుకునే స్థలాన్ని వెదికి అక్కడికి మీరు యాత్రలు చేస్తూ ఉండాలి.
Instead, you must go to the place that Yahweh will choose. It will be in the area where one of your tribes will live. That is where you must go to worship Yahweh.
6 ౬ మీ హోమ బలులు, అర్పణ బలులు, మీ దశమభాగాలు, ప్రతిష్టిత నైవేద్యాలు, మొక్కుబడి అర్పణలు, స్వేచ్ఛార్పణలు, పశువులు, మేకల్లో తొలిచూలు పిల్లలు, వీటన్నిటినీ అక్కడికే తీసుకురావాలి.
That is the place where you must bring your sacrifices that will be completely burned on the altar, and your other sacrifices, (your tithes/ten percent of all of your crops), other offerings that you decide to give, and the firstborn animals from your cattle and sheep.
7 ౭ అక్కడే మీరు, మీ దేవుడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి ఇచ్చిన మీ కుటుంబాలు యెహోవా సన్నిధిలో భోజనం చేసి మీ పనులన్నిటిలో సంతోషించాలి.
There, in the presence of Yahweh our God, who has [greatly] blessed you, you and your families will eat the good things that you have worked to produce, and you will be happy.
8 ౮ ఈ రోజు మనమిక్కడ చేస్తున్నట్టు మీలో ప్రతివాడూ తనకిష్టమైనట్టు చేయకూడదు.
“[When you are in that land], you must not do some of the things that we have been doing. Until now, you have all been worshiping [Yahweh] the way you wanted to,
9 ౯ నీ దేవుడు యెహోవా మీకిస్తున్న విశ్రాంతిని, స్వాస్థ్యాన్ని మీరింతకు ముందు పొందలేదు.
because you have not yet arrived in the land which Yahweh is giving to you, where you will be able to live peacefully.
10 ౧౦ మీరు యొర్దాను దాటి మీ దేవుడు యెహోవా మీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశంలో స్థిరపడిన తరువాత ఆయన మీ చుట్టూ ఉన్న శత్రువులందరి నుండి మీకు విశ్రాంతినిచ్చి నెమ్మది కలిగిస్తాను.
But when you cross the Jordan [River], you will start to live in the land that Yahweh our God is giving to you. He will protect you from all your enemies that will surround you, and you will live peacefully/safely.
11 ౧౧ నేను మీకు ఆజ్ఞాపించేవాటన్నిటిననీ, అంటే మీ హోమ బలులు, బలులు, దశమ భాగాలు, ప్రతిష్ఠిత నైవేద్యాలు, మీరు యెహోవాకు చేసే శ్రేష్ఠమైన మొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన పేరుకు నివాసంగా ఏర్పాటు చేసుకునే స్థలానికే మీరు తీసుకురావాలి.
“Yahweh will choose one place where he wants you to worship him. That is the place to which you must bring all the offerings that I command you to bring: The sacrifices that must be completely burned [on the altar], your other sacrifices, other offerings that you yourselves decide to give, (your tithes/ten percent of all your crops), and all the special offerings that you will solemnly promise to give to Yahweh.
12 ౧౨ మీరు, మీ కొడుకులు, కూతుళ్ళు, దాసులు, దాసీలు, మీలో స్వాస్థ్యం లేకుండా మీ ఇళ్ళలో ఉండే లేవీయులు మీ దేవుడు యెహోవా సన్నిధిలో సంతోషించాలి.
Rejoice there in the presence of Yahweh, along with your children, your male and female servants, and the descendants of Levi who live in your towns. Do not forget that the descendants of Levi will not have their own land, like you will have.
13 ౧౩ మీరు చూసిన ప్రతి స్థలంలో మీ దహనబలులు అర్పించకూడదు.
Be sure that you do not offer sacrifices anywhere you want to.
14 ౧౪ కేవలం యెహోవా మీ గోత్రాల్లో ఒకదాని మధ్య ఏర్పాటు చేసుకునే స్థలంలోనే మీ హోమబలులు అర్పించి నేను మీకు ఆజ్ఞాపించే సమస్తాన్నీ అక్కడే జరిగించాలి.
You must offer them only in the place that Yahweh will choose for you, in an area that belongs to one of your tribes. That is the only place where he wants you to offer sacrifices that will be completely burned [on the altar], and to do the other things that I am commanding you to do [when you worship him].
15 ౧౫ అయితే మీ దేవుడు యెహోవా మిమ్మల్ని దీవించిన కొలది మీ ఇళ్ళలో మీకిష్టమైన దాన్ని చంపి తినవచ్చు. పవిత్రులైనా, అపవిత్రులైనా ఎర్రజింకను, చిన్న దుప్పిని తినవచ్చు.
“However, you will be permitted to kill and eat the meat of your animals in the places where you live. As often as you want to, you may eat the meat of the animals that Yahweh our God will bless you by giving them to you. Those who have done things that cause them to become unacceptable to God and those who have not done things like that may all eat that meat, just like you would eat the meat of a deer or an antelope.
16 ౧౬ వాటి రక్తం మాత్రం తినకూడదు. దాన్ని నీళ్లలాగా నేల మీద పారబోయాలి.
But you must not eat the blood [of any animals]; you must let the blood drain onto the ground [before you cook the meat].
17 ౧౭ మీ ధాన్యంలో, ద్రాక్షారసంలో, నూనెలో, దశమ భాగం, మీ ఆవులు, గొర్రెలు, మేకల్లో తొలిచూలు పిల్లల్లో, మీరు చేసే మొక్కుబళ్లలో స్వేచ్ఛార్పణలు, ప్రతిష్ఠార్పణలు మీ ఇంట్లో తినకూడదు.
In the places where you live, you must not eat the things that you are offering [to Yahweh]: You must not eat the (tithes/ten percent) of your grain or of your wine, or of your [olive] oil, or the firstborn of your cattle and sheep, or the offerings that you yourselves decide to give to Yahweh, or any other offerings.
18 ౧౮ వాటిని మీ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసుకునే స్థలం లోనే మీరు, మీ కొడుకులు, కూతుళ్ళు దాసదాసీలు, మీ ఇంట్లో ఉండే లేవీయులు, అందరూ మీ యెహోవా దేవుని సన్నిధిలో తిని, మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో సంతోషించాలి.
Instead, you and your children and your male and female servants and the descendants of Levi who live in your towns must go to the place that he has chosen and eat those things there in the presence of Yahweh. And you should rejoice in the presence of Yahweh about everything that you do.
19 ౧౯ మీరు మీ దేశంలో జీవించిన కాలమంతటిలో లేవీయులను విడిచిపెట్టకూడదు.
Be sure that you take care of the descendants of Levi all during the time that you live in your land.
20 ౨౦ మీ దేవుడు యెహోవా తాను మీ కిచ్చిన మాట ప్రకారం మీ సరిహద్దులను విశాలపరచిన తరువాత తప్పకుండా మాంసం తినాలని కోరుకుంటావు. అప్పుడు నీకిష్టమైన మాంసం తినవచ్చు.
“When Yahweh our God gives you much more land [than you will have when you first occupy it], which is what he has promised to do, and you say ‘I would like some meat to eat’ because you are craving/wanting some meat, you will be permitted to eat meat whenever you want to.
21 ౨౧ నీ దేవుడు యెహోవా తన సన్నిధిని నిలిపి ఉంచడానికి ఎన్నుకున్న స్థలం మీకు దూరంగా ఉన్నట్లయితే,
If the place that Yahweh our God chooses to be the place for you to worship him is far [from where you live], you are permitted to kill some of your cattle or sheep that Yahweh has given to you, and you may eat that meat at the places where you live, just like I have told you to do.
22 ౨౨ యెహోవా మీకిచ్చిన ఆవుల్లో గాని, గొర్రెలు, మేకల్లో గాని దేనినైనా నేను మీకాజ్ఞాపించినట్టు చంపి నీ ఇంట్లో తినవచ్చు. జింకను, దుప్పిని తిన్నట్టుగానే దాన్ని తినవచ్చు. పవిత్రులు, అపవిత్రులు అనే భేదం లేకుండ ఎవరైనా తినవచ్చు.
Those who have done things that cause them to become unacceptable to God, and those who have not done things like that, are all permitted to all eat that meat, just like you would eat the meat of a deer or an antelope.
23 ౨౩ అయితే వాటి రక్తాన్ని మాత్రం తినకూడదు, జాగ్రత్త సుమా. ఎందుకంటే రక్తమే ప్రాణం. మాంసంతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు.
But be sure that you do not eat the blood [of any animal], because it is the blood that sustains life in living beings, and so you must not eat the life along with the meat.
24 ౨౪ మీరు దాన్ని తినకుండా భూమి మీద నీళ్లలాగా పారబోయాలి.
Do not eat the blood; instead, let it drain onto the ground.
25 ౨౫ మీరు దాన్ని తినకుండా యెహోవా దృష్టికి ఇష్టమైనదాన్ని చేసినందుకు మీకు, మీ సంతానానికి మేలు కలుగుతుంది.
If you obey this command and do what Yahweh says is right [for you to do], things will go well for you and for your descendants.
26 ౨౬ మీకు నియమించిన ప్రతిష్టితార్పణలు, మొక్కుబడులను మాత్రం యెహోవా ఏర్పాటు చేసుకున్న స్థలానికే మీరు తీసుకువెళ్ళాలి.
“But the sacred offerings that Yahweh has told you to give and the other offerings that you yourselves decide to give, you must take to the place that Yahweh will choose.
27 ౨౭ మీ దహనబలులనూ వాటి రక్తమాంసాలనూ మీ దేవుడు యెహోవా బలిపీఠం మీద అర్పించాలి. మీ బలుల రక్తాన్ని మీ దేవుడు యెహోవా బలిపీఠం మీద పోయాలి. వాటి మాంసం మీరు తినాలి.
You must offer there the sacrifices that will be completely burned [on Yahweh’s altar]. You must also offer there the sacrifices from which you may eat some of meat after you [kill the animals and] drain out the blood and some of it is thrown on the [sides of the] altar.
28 ౨౮ నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఈ మాటలన్నిటినీ మీరు జాగ్రత్తగా విని పాటిస్తే మీ దేవుడైన యెహోవా దృష్టికి మంచిదాన్నీ, యుక్తమైనదాన్నీ మీరు చేసినందుకు మీకు, మీ తరువాత మీ సంతతి వారికి ఎల్లప్పుడూ సుఖశాంతులు కలుగుతాయి.
Faithfully obey all these things that I have commanded you. If you do that, things will go well forever for you and your descendants, because you will be doing what Yahweh our God says is right [for you to do] and what pleases him.
29 ౨౯ మీరు స్వాధీనం చేసుకోడానికి వెళ్తున్న దేశ ప్రజలను మీ యెహోవా దేవుడు మీ ఎదుట నుండి నాశనం చేసిన తరువాత, మీరు ఆ దేశంలో నివసించేటప్పుడు, మీరు వారిని అనుసరించాలనే శోధనలో చిక్కుకోవద్దు.
“When you enter the land that you will occupy, as you advance, Yahweh our God will get rid of the people-groups that live there.
30 ౩౦ ఈ ప్రజలు తమ దేవుళ్ళను పూజిస్తున్నట్టే మేము కూడా వారి దేవుళ్ళను పూజిస్తాము అనుకోకుండా జాగ్రత్తగా ఉండాలి.
After he does that, be sure that you do not [worship the gods] that they have been worshiping, because if you do that, you will be caught in the same trap [that they were caught in] [MET]. Do not ask anyone about those gods, saying, ‘Tell me how they worshiped their gods, in order that I can [worship them] also.’
31 ౩౧ వారు తమ దేవుళ్ళకు చేసిన విధంగా మీరు మీ దేవుడైన యెహోవా విషయంలో చేయవద్దు. ఎందుకంటే వారు తమ దేవుళ్ళకు చేసేదంతా యెహోవా ద్వేషిస్తాడు. అవి ఆయనకు హేయం. వారు తమ దేవుళ్ళ పేరట తమ కొడుకులనూ, కూతుళ్ళనూ అగ్నిగుండంలో కాల్చివేస్తారు.
Do not try to worship Yahweh our God like they have worshiped their gods, because when they worship them, they do disgusting things, things that Yahweh hates. [The worst thing that they do is] that they sacrifice their own children and burn them [on their altars].
32 ౩౨ నేను మీకాజ్ఞాపిస్తున్న ప్రతి మాటను మీరు పాటించాలి. దానిలో ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు.”
“Be sure to do everything that I have commanded you to do. Do not add anything to these commands, and do not take anything away from them.”