< ద్వితీయోపదేశకాండమ 11 >

1 “కాబట్టి మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయనను అనుసరిస్తూ ఆయన కట్టడలనూ, విధులనూ, ఆజ్ఞలనూ అన్నివేళలా పాటించాలి.
“Tanrınız RAB'bi sevin. Uyarılarına, kurallarına, ilkelerine, buyruklarına her zaman uyun.
2 మీ దేవుడు యెహోవా పంపిన శిక్షను గురించీ ఆయన గొప్పతనం, ఆయన బాహుబలం, ఆయన ప్రభావం గురించీ తెలియని మీ పిల్లలతో చెప్పడం లేదని మీరు గ్రహించాలి.
Unutmayın ki, Tanrınız RAB'bin tedibini görüp yaşayanlar çocuklarınız değil, sizsiniz: Büyüklüğünü, güçlü elini, kudretini,
3 ఐగుప్తు రాజైన ఫరోకు, అతని రాజ్యమంతటికి ఆయన చేసిన సూచక క్రియలు, అద్భుత కార్యాలు,
belirtilerini, Mısır'da firavuna ve bütün ülkesine yaptıklarını;
4 ఆయన ఐగుప్తు సైన్యానికి, వారి గుర్రాలకు, రథాలకు జరిగించినది మీరు చూశారు. వారు మిమ్మల్ని తరుముతున్నప్పుడు ఆయన ఎర్రసముద్రపు నీటిని వారి మీదకి ప్రవహించేలా చేసిన విషయం వారికి తెలియదు.
Mısır ordusuna, atlarına, savaş arabalarına neler yaptığını; Mısırlılar sizi kovalarken onları nasıl Kamış Denizi'nin suları altında bıraktığını, onları nasıl yok ettiğini gördünüz.
5 యెహోవా ఇప్పటి వరకూ వారిని నాశనం చేసినదీ మీరు ఇక్కడికి వచ్చేదాకా ఎడారిలో మీకోసం చేసినదీ వారు చూడలేదు.
Buraya varıncaya dek RAB'bin çölde sizin için neler yaptığını;
6 అంతేకాదు, యెహోవా రూబేనీయుడైన ఏలీయాబు కొడుకులు దాతాను, అబీరాములకు చేసినదీ భూమి నోరు తెరచి వారిని, వారి ఇళ్ళను, గుడారాలను, వారికి ఉన్న సమస్తాన్నీ ఇశ్రాయేలు ప్రజలందరి మధ్య మింగివేసిన వైనం వారు చూడలేదు, వారికి తెలియదు.
Rubenoğulları'ndan Eliav'ın oğulları Datan'la Aviram'a neler ettiğini; bütün İsrail'in gözü önünde yerin nasıl yarıldığını, onları, ailelerini, çadırlarını ve onlara ait her canlıyı nasıl yuttuğunu gören çocuklarınız değil, sizsiniz.
7 యెహోవా చేసిన ఆ గొప్ప కార్యాలన్నీ మీ కళ్ళ ఎదుట చేసాడు కదా.
RAB'bin yaptığı bu büyük işlerin tümünü gören sizsiniz.
8 కాబట్టి మీరు బలం తెచ్చుకుని నది దాటి వెళ్తున్న ఆ దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకోడానికీ,
“Bugün size bildirdiğim buyrukların tümüne uyun ki, güçlü olasınız, mülk edinmek üzere Şeria Irmağı'ndan geçip ülkeyi ele geçiresiniz.
9 యెహోవా మీ పూర్వీకులకు, వారి సంతానానికి ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలో, అంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు దీర్ఘాయుష్షు కలిగి ఉండడానికి నేను ఈ రోజు మీకు ఆజ్ఞాపించే వాటన్నిటిని మీరు పాటించాలి.
RAB'bin ant içerek atalarınıza ve soylarına söz verdiği süt ve bal akan ülkede ömrünüz uzun olsun.
10 ౧౦ మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం మీరు విడిచి వచ్చిన ఐగుప్తు లాంటిది కాదు. అక్కడ మీరు విత్తనాలు చల్లి కూరమొక్కలకు చేసినట్టు మీ కాళ్లతో తోటకు నీరు కట్టారు.
Mülk edinmek için gideceğiniz ülke, çıkmış olduğunuz Mısır gibi değildir. Orada tohumunuzu eker, sebze bahçesi gibi zorlukla sulardınız.
11 ౧౧ మీరు నది దాటి స్వాధీనం చేసుకోడానికి వెళ్తున్న ఈ దేశం కొండలు, లోయలు ఉన్న దేశం.
Mülk edinmek üzere gideceğiniz ülkenin ise dağları, dereleri vardır. Toprağı gökten yağan yağmurla sulanır.
12 ౧౨ అది ఆకాశం నుండి కురిసే వర్షం నీరు తాగుతుంది. అది మీ దేవుడు యెహోవా తన దృష్టి ఉంచిన దేశం. ఆయన కనుదృష్టి సంవత్సరం ప్రారంభం నుండి అంతం వరకూ ఎల్లప్పుడూ దానిమీద ఉంటుంది.
Orası Tanrınız RAB'bin kayırdığı bir ülkedir. Tanrınız RAB orayı bütün yıl sürekli gözetir.
13 ౧౩ కాబట్టి మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయనను సేవించాలి. ఈ రోజు నేను మీకిచ్చే ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని పాటిస్తే,
“Tanrınız RAB'bi sevmek, bütün yüreğinizle, bütün canınızla O'na kulluk etmek için bugün size bildirdiğim buyruklara iyice kulak verirseniz,
14 ౧౪ మీ దేశానికి వర్షం, అంటే తొలకరి, కడవరి వానలు వాటి కాలంలో కురుస్తాయి. అందువలన మీరు మీ ధాన్యాన్నీ ద్రాక్షారసాన్నీ నూనెనూ పోగు చేసుకుంటారు.
RAB ülkenize ilk ve son yağmuru vaktinde yağdıracak. Öyle ki, tahılınızı, yeni şarabınızı, zeytinyağınızı toplayasınız.
15 ౧౫ మీరు తిని తృప్తిపొందుతారు. ఆయన మీ పశువుల కోసం మీ పొలాల్లో గడ్డి మొలిపిస్తాడు.
RAB tarlalarda hayvanlarınız için ot sağlayacak, siz de yiyip doyacaksınız.
16 ౧౬ మీ హృదయం మోసపోయి, మీరు దారి తప్పి ఇతర దేవుళ్ళను పూజించి, వాటికి మొక్కకుండా జాగ్రత్త వహించండి.
Sakının, ayartılıp yoldan çıkmayasınız; başka ilahlara tapmayasınız, önlerinde eğilmeyesiniz.
17 ౧౭ లేకపోతే యెహోవా మీమీద కోపపడి ఆకాశాన్ని మూసివేస్తాడు. అప్పుడు వాన కురవదు, భూమి పండదు. యెహోవా మీకిస్తున్న ఆ మంచి దేశంలో నివసించకుండా మీరు త్వరగా నాశనమైపోతారు.
Öyle ki, RAB size öfkelenmesin; yağmur yağmasın, toprak ürün vermesin diye gökleri kapamasın; size vereceği verimli ülkede çabucak yok olmayasınız.
18 ౧౮ కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయాల్లో, మనస్సుల్లో ఉంచుకోండి. వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకోండి. వాటిని మీ నుదిటి మీద బాసికాలుగా ఉండనివ్వండి.
“Bu sözlerimi aklınızda ve yüreğinizde tutun. Bir belirti olarak ellerinize bağlayın, alın sargısı olarak takın.
19 ౧౯ మీరు మీ ఇంట్లో కూర్చున్నప్పుడు, దారిలో నడిచేటప్పుడు, నిద్రపోయే ముందు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడాలి, వాటిని మీ పిల్లలకు నేర్పించాలి.
Onları çocuklarınıza öğretin. Evinizde otururken, yolda yürürken, yatarken, kalkarken onlardan söz edin.
20 ౨౦ మీ ఇంటి గుమ్మాల మీద వాటిని రాయాలి.
Evlerinizin kapı sövelerine, kentlerinizin kapılarına yazın.
21 ౨౧ ఆ విధంగా చేస్తే యెహోవా మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలో మీరు జీవించే కాలం, మీ సంతతివారు జీవించే కాలం భూమిపై ఆకాశం ఉన్నంత కాలం విస్తరిస్తాయి.
Öyle ki, RAB'bin atalarınıza vermeye söz verdiği topraklar üzerinde sizin de, çocuklarınızın da ömrü uzun olsun ve yeryüzünün üstünde gökler olduğu sürece orada yaşayasınız.
22 ౨౨ మీరు మీ దేవుడు యెహోవాను ప్రేమించి, ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయనకు కట్టుబడి, నేను మీకు ఆదేశించే ఈ ఆజ్ఞలన్నిటినీ జాగ్రత్తగా పాటించాలి.
“Uymanız için size bildirdiğim bu buyrukları eksiksiz yerine getirir, Tanrınız RAB'bi sever, yollarında yürür, O'na bağlı kalırsanız,
23 ౨౩ అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ జాతులన్నిటినీ వెళ్లగొడతాడు. మీరు మీకంటే బలమైన, గొప్ప జాతి ప్రజల దేశాలను స్వాధీనం చేసుకుంటారు.
RAB bu ulusların tümünü önünüzden kovacak. Sizden daha büyük, daha güçlü ulusların topraklarını mülk edineceksiniz.
24 ౨౪ మీరు అడుగుపెట్టే ప్రతి స్థలం మీదవుతుంది. ఎడారి నుండి లెబానోను వరకూ, యూఫ్రటీసు నది నుండి పడమటి సముద్రం వరకూ మీ సరిహద్దుగా ఉంటుంది.
Ayak basacağınız her yer sizin olacak. Sınırlarınız çölden Lübnan'a, Fırat Irmağı'ndan Akdeniz'e kadar uzanacak.
25 ౨౫ ఏ మానవుడూ మీ ఎదుట నిలవలేడు. ఆయన మీతో చెప్పినట్టు మీ దేవుడు యెహోవా మీరు అడుగుపెట్టే స్థలమంతటి మీదా మీరంటే భయం, వణుకు పుట్టిస్తాడు.
Hiç kimse size karşı koyamayacak. Tanrınız RAB, size verdiği söz uyarınca, ayak basacağınız her yere dehşetinizi, korkunuzu saçacaktır.
26 ౨౬ చూడండి, ఈ రోజు నేను మీ ఎదుట దీవెననూ శాపాన్నీ ఉంచుతున్నాను.
“Bakın, bugün önünüze kutsamayı ve laneti koyuyorum:
27 ౨౭ నేను మీకాజ్ఞాపించే మీ దేవుడు యెహోవా ఆజ్ఞలను మీరు విని, వాటిని పాటిస్తే దీవెన కలుగుతుంది.
Bugün size bildirdiğim Tanrınız RAB'bin buyruklarına uyarsanız kutsanacaksınız.
28 ౨౮ మీరు వాటిని విని పాటించకుండా నేను మీకు ఆజ్ఞాపించే మార్గాన్ని విడిచిపెట్టి అప్పటివరకూ మీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తే మీకు శాపం కలుగుతుంది.
Ama Tanrınız RAB'bin buyruklarını dinlemez, bilmediğiniz başka ilahların ardınca giderek bugün size buyurduğum yoldan saparsanız, lanete uğrayacaksınız.
29 ౨౯ కాబట్టి మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రప్పించిన తరువాత గెరిజీము కొండ మీద ఆ దీవెననూ ఏబాలు కొండ మీద ఆ శాపాన్నీ ప్రకటించాలి.
Tanrınız RAB mülk edinmek için gideceğiniz ülkeye sizi götürdüğünde, Gerizim Dağı'nda kutsama yapacak, Eval Dağı'nda lanet okuyacaksınız.
30 ౩౦ అవి యొర్దాను అవతల పడమటి వైపు మైదానం మార్గం వెనుక మోరేలోని సింధూరవృక్షాల పక్కన గిల్గాలు ఎదురుగా అరాబాలో నివసించే కనానీయుల దేశంలో ఉన్నాయి కదా.
Bu iki dağ Şeria Irmağı'nın karşı yakasında, yolun batısında, Arava'da oturan Kenanlılar ülkesinde, Gilgal karşısında, More meşeliği yanındadır.
31 ౩౧ మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశాన్ని స్వాధీనం చేసుకోడానికి ఈ యొర్దాను నదిని దాటబోతున్నారు. మీరు దాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసిస్తారు.
Tanrınız RAB'bin size vereceği ülkeyi mülk edinmek için Şeria Irmağı'ndan geçmek üzeresiniz. Orayı ele geçirip yerleştiğinizde,
32 ౩౨ ఈ రోజు నేను మీకు నియమించే కట్టడలు, విధులన్నిటిని మీరు పాటించాలి.”
bugün size bildirdiğim bütün kurallara, ilkelere uymaya dikkat edin.”

< ద్వితీయోపదేశకాండమ 11 >