< ద్వితీయోపదేశకాండమ 11 >
1 ౧ “కాబట్టి మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయనను అనుసరిస్తూ ఆయన కట్టడలనూ, విధులనూ, ఆజ్ఞలనూ అన్నివేళలా పాటించాలి.
Saa elsk da HERREN din Gud og hold hans Forskrifter, hans Anordninger, Lovbud og Bud alle Dage:
2 ౨ మీ దేవుడు యెహోవా పంపిన శిక్షను గురించీ ఆయన గొప్పతనం, ఆయన బాహుబలం, ఆయన ప్రభావం గురించీ తెలియని మీ పిల్లలతో చెప్పడం లేదని మీరు గ్రహించాలి.
jeg taler ikke til eders Børn, der ikke har oplevet det og set det; betænk derfor i Dag HERREN eders Guds Optugtelse, hans Storhed, hans stærke Haand og udstrakte Arm,
3 ౩ ఐగుప్తు రాజైన ఫరోకు, అతని రాజ్యమంతటికి ఆయన చేసిన సూచక క్రియలు, అద్భుత కార్యాలు,
hans Tegn og Gerninger, som han gjorde midt i Ægypten mod Farao, Ægypterkongen, og hele hans Land,
4 ౪ ఆయన ఐగుప్తు సైన్యానికి, వారి గుర్రాలకు, రథాలకు జరిగించినది మీరు చూశారు. వారు మిమ్మల్ని తరుముతున్నప్పుడు ఆయన ఎర్రసముద్రపు నీటిని వారి మీదకి ప్రవహించేలా చేసిన విషయం వారికి తెలియదు.
og hvad han gjorde ved Ægypternes Hærmagt, deres Heste og Vogne, som han, da de forfulgte eder, lod det røde Havs Vande skylle hen over og tilintetgjorde for stedse,
5 ౫ యెహోవా ఇప్పటి వరకూ వారిని నాశనం చేసినదీ మీరు ఇక్కడికి వచ్చేదాకా ఎడారిలో మీకోసం చేసినదీ వారు చూడలేదు.
og hvad han gjorde for eder i Ørkenen, lige til I kom til Stedet her,
6 ౬ అంతేకాదు, యెహోవా రూబేనీయుడైన ఏలీయాబు కొడుకులు దాతాను, అబీరాములకు చేసినదీ భూమి నోరు తెరచి వారిని, వారి ఇళ్ళను, గుడారాలను, వారికి ఉన్న సమస్తాన్నీ ఇశ్రాయేలు ప్రజలందరి మధ్య మింగివేసిన వైనం వారు చూడలేదు, వారికి తెలియదు.
og hvad han gjorde ved Datan og Abiram, Rubens Søn Eliabs Sønner, hvorledes Jorden aabnede sin Mund og slugte dem tillige med deres Huse og Telte og alt, hvad der var i Ledtog med dem, midt iblandt hele Israel!
7 ౭ యెహోవా చేసిన ఆ గొప్ప కార్యాలన్నీ మీ కళ్ళ ఎదుట చేసాడు కదా.
Thi med egne Øjne har I set al den Stordaad, HERREN har øvet!
8 ౮ కాబట్టి మీరు బలం తెచ్చుకుని నది దాటి వెళ్తున్న ఆ దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకోడానికీ,
Saa hold da alle de Bud, jeg i Dag paalægger dig, for at I kan vinde Styrke og komme og tage det Land i Besiddelse, som I skal over og tage i Besiddelse,
9 ౯ యెహోవా మీ పూర్వీకులకు, వారి సంతానానికి ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలో, అంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు దీర్ఘాయుష్షు కలిగి ఉండడానికి నేను ఈ రోజు మీకు ఆజ్ఞాపించే వాటన్నిటిని మీరు పాటించాలి.
og for at I kan faa et langt Liv paa den Jord, HERREN tilsvor eders Fædre at ville give dem og deres Afkom, et Land, der flyder med Mælk og Honning.
10 ౧౦ మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం మీరు విడిచి వచ్చిన ఐగుప్తు లాంటిది కాదు. అక్కడ మీరు విత్తనాలు చల్లి కూరమొక్కలకు చేసినట్టు మీ కాళ్లతో తోటకు నీరు కట్టారు.
Thi det Land, du skal ind og tage i Besiddelse, er ikke som Ægypten, hvorfra I drog ud! Naar du der havde saaet din Sæd, maatte du vande Landet med din Fod, som en Urtehave;
11 ౧౧ మీరు నది దాటి స్వాధీనం చేసుకోడానికి వెళ్తున్న ఈ దేశం కొండలు, లోయలు ఉన్న దేశం.
nej, det Land, I skal over og tage i Besiddelse, er et Land med Bjerge og Dale, der drikker Vand, naar Regnen falder fra Himmelen,
12 ౧౨ అది ఆకాశం నుండి కురిసే వర్షం నీరు తాగుతుంది. అది మీ దేవుడు యెహోవా తన దృష్టి ఉంచిన దేశం. ఆయన కనుదృష్టి సంవత్సరం ప్రారంభం నుండి అంతం వరకూ ఎల్లప్పుడూ దానిమీద ఉంటుంది.
et Land, som HERREN din Gud har Omhu for, og som HERREN din Guds Øjne stadig hviler paa, fra Aarets Begyndelse og til dets Slutning.
13 ౧౩ కాబట్టి మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయనను సేవించాలి. ఈ రోజు నేను మీకిచ్చే ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని పాటిస్తే,
Og hvis I nu lyder mine Bud, som jeg i Dag paalægger eder, saa I elsker HERREN eders Gud og tjener ham af hele eders Hjerte og hele eders Sjæl,
14 ౧౪ మీ దేశానికి వర్షం, అంటే తొలకరి, కడవరి వానలు వాటి కాలంలో కురుస్తాయి. అందువలన మీరు మీ ధాన్యాన్నీ ద్రాక్షారసాన్నీ నూనెనూ పోగు చేసుకుంటారు.
saa vil jeg give eders Land dets Regn i rette Tid, baade Tidligregn og Sildigregn, saa du kan høste dit Korn, din Most og din Olie;
15 ౧౫ మీరు తిని తృప్తిపొందుతారు. ఆయన మీ పశువుల కోసం మీ పొలాల్లో గడ్డి మొలిపిస్తాడు.
og jeg vil give Græs paa din Mark til dit Kvæg; og du skal spise dig mæt.
16 ౧౬ మీ హృదయం మోసపోయి, మీరు దారి తప్పి ఇతర దేవుళ్ళను పూజించి, వాటికి మొక్కకుండా జాగ్రత్త వహించండి.
Men vogt eder, at ikke eders Hjerte daares, saa I falder fra og dyrker andre Guder og tilbeder dem;
17 ౧౭ లేకపోతే యెహోవా మీమీద కోపపడి ఆకాశాన్ని మూసివేస్తాడు. అప్పుడు వాన కురవదు, భూమి పండదు. యెహోవా మీకిస్తున్న ఆ మంచి దేశంలో నివసించకుండా మీరు త్వరగా నాశనమైపోతారు.
thi da vil HERRENS Vrede blusse op imod eder, og han vil lukke Himmelen, saa der ikke falder Regn, og Jorden ikke giver Grøde, og I skal hurtigt udryddes af det herlige Land, HERREN vil give eder.
18 ౧౮ కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయాల్లో, మనస్సుల్లో ఉంచుకోండి. వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకోండి. వాటిని మీ నుదిటి మీద బాసికాలుగా ఉండనివ్వండి.
I skal lægge eder disse mine Ord paa Hjerte og Sinde, binde dem som et Tegn om eders Haand og lade dem være et Erindringsmærke paa eders Pande,
19 ౧౯ మీరు మీ ఇంట్లో కూర్చున్నప్పుడు, దారిలో నడిచేటప్పుడు, నిద్రపోయే ముందు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడాలి, వాటిని మీ పిల్లలకు నేర్పించాలి.
og I skal lære eders Børn dem, idet I taler om dem, baade naar du sidder i dit Hus, og naar du vandrer paa Vejen, baade naar du lægger dig, og naar du staar op.
20 ౨౦ మీ ఇంటి గుమ్మాల మీద వాటిని రాయాలి.
Og du skal skrive dem paa Dørstolperne af dit Hus og paa dine Porte,
21 ౨౧ ఆ విధంగా చేస్తే యెహోవా మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలో మీరు జీవించే కాలం, మీ సంతతివారు జీవించే కాలం భూమిపై ఆకాశం ఉన్నంత కాలం విస్తరిస్తాయి.
for at I og eders Børn maa leve i det Land, HERREN tilsvor eders Fædre at ville give dem, saa længe Himmelen er over Jorden.
22 ౨౨ మీరు మీ దేవుడు యెహోవాను ప్రేమించి, ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయనకు కట్టుబడి, నేను మీకు ఆదేశించే ఈ ఆజ్ఞలన్నిటినీ జాగ్రత్తగా పాటించాలి.
Thi hvis I vogter vel paa alle disse Bud, som jeg i Dag paalægger eder at holde, saa I elsker HERREN eders Gud og vandrer paa alle hans Veje og hænger fast ved ham,
23 ౨౩ అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ జాతులన్నిటినీ వెళ్లగొడతాడు. మీరు మీకంటే బలమైన, గొప్ప జాతి ప్రజల దేశాలను స్వాధీనం చేసుకుంటారు.
saa skal HERREN drive alle disse Folk bort foran eder, og I skal underlægge eder Folk, der er større og mægtigere end I.
24 ౨౪ మీరు అడుగుపెట్టే ప్రతి స్థలం మీదవుతుంది. ఎడారి నుండి లెబానోను వరకూ, యూఫ్రటీసు నది నుండి పడమటి సముద్రం వరకూ మీ సరిహద్దుగా ఉంటుంది.
Hver Plet, eders Fodsaal betræder, skal tilhøre eder; fra Ørkenen til Libanon og fra den store Flod, Eufratfloden, til Havet i Vest skal eders Landemærker strække sig.
25 ౨౫ ఏ మానవుడూ మీ ఎదుట నిలవలేడు. ఆయన మీతో చెప్పినట్టు మీ దేవుడు యెహోవా మీరు అడుగుపెట్టే స్థలమంతటి మీదా మీరంటే భయం, వణుకు పుట్టిస్తాడు.
Ingen skal kunne holde Stand for eder; Skræk og Rædsel for eder skal HERREN eders Gud lade komme over hele det Land, I betræder, saaledes som han lovede eder.
26 ౨౬ చూడండి, ఈ రోజు నేను మీ ఎదుట దీవెననూ శాపాన్నీ ఉంచుతున్నాను.
Se, jeg forelægger eder i Dag Velsignelse og Forbandelse,
27 ౨౭ నేను మీకాజ్ఞాపించే మీ దేవుడు యెహోవా ఆజ్ఞలను మీరు విని, వాటిని పాటిస్తే దీవెన కలుగుతుంది.
Velsignelsen, hvis I lyder HERREN eders Guds Bud, som jeg i Dag paalægger eder,
28 ౨౮ మీరు వాటిని విని పాటించకుండా నేను మీకు ఆజ్ఞాపించే మార్గాన్ని విడిచిపెట్టి అప్పటివరకూ మీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తే మీకు శాపం కలుగుతుంది.
og Forbandelsen, hvis I ikke lyder HERREN eders Guds Bud, men viger bort fra den Vej, jeg i Dag foreskriver eder, for at holde eder til andre Guder, I ikke før kendte til.
29 ౨౯ కాబట్టి మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రప్పించిన తరువాత గెరిజీము కొండ మీద ఆ దీవెననూ ఏబాలు కొండ మీద ఆ శాపాన్నీ ప్రకటించాలి.
Og naar HERREN din Gud fører dig ind i det Land, du skal ind og tage i Besiddelse, saa skal du lægge Velsignelsen paa Garizims Bjerg og Forbandelsen paa Ebals Bjerg.
30 ౩౦ అవి యొర్దాను అవతల పడమటి వైపు మైదానం మార్గం వెనుక మోరేలోని సింధూరవృక్షాల పక్కన గిల్గాలు ఎదురుగా అరాబాలో నివసించే కనానీయుల దేశంలో ఉన్నాయి కదా.
De ligger jo hinsides Jordan, bag ved den, mod Vest, i de Kana'anæeres Land, der bor i Arabalavningen, lige over for Gilgal ved Sandsigerens Træ.
31 ౩౧ మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశాన్ని స్వాధీనం చేసుకోడానికి ఈ యొర్దాను నదిని దాటబోతున్నారు. మీరు దాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసిస్తారు.
Thi I staar jo nu i Begreb med at overskride Jordan for at gaa ind og tage det Land i Besiddelse, som HERREN eders Gud vil give eder. Naar I da har taget det i Besiddelse og bosat eder der,
32 ౩౨ ఈ రోజు నేను మీకు నియమించే కట్టడలు, విధులన్నిటిని మీరు పాటించాలి.”
skal I omhyggeligt handle efter alle de Anordninger og Lovbud, jeg i Dag forelægger eder!